యోబు
2 ఎగతాళి చేసేవాళ్లు నన్ను చుట్టుముట్టారు,+
నా కన్ను వాళ్ల తిరుగుబాటు స్వభావాన్ని గమనిస్తోంది.
3 దేవా, దయచేసి నాకు సహాయం చేస్తానని* మాటివ్వు.
నువ్వు కాకపోతే ఇంకెవరు నాకు సహాయం చేస్తారు?*+
4 నువ్వు వాళ్ల హృదయానికి వివేచన దొరకకుండా చేశావు;+
అందుకే నువ్వు వాళ్లను హెచ్చించట్లేదు.
5 ఒకపక్క తన పిల్లల కళ్లు క్షీణిస్తూ ఉంటే,
అతను తన స్నేహితుల్ని వాటాలు తీసుకోమని అంటాడు.
7 బాధతో నా కంటిచూపు మందగిస్తోంది,+
నా కాళ్లూచేతులు చాలా సన్నబడ్డాయి.
8 అది చూసి నిజాయితీపరులు ఆశ్చర్యపోతున్నారు,
భక్తిహీనుల్ని* చూసి నిర్దోషులు కలవరపడుతున్నారు.
10 అయినా మీరంతా వచ్చి మీ వాదనను కొనసాగించవచ్చు,
ఎందుకంటే, మీలో తెలివిగలవాళ్లు ఒక్కరూ నాకు కనిపించలేదు.+
12 వాళ్లు రాత్రి స్థానంలో పగలును పెడుతూ,
‘కాసేపట్లో వెలుగు రాబోతుంది, ఎందుకంటే ఇప్పుడు చీకటిగా ఉంది కదా’ అంటారు.
14 గోతితో,* ‘నువ్వే నా తండ్రివి!’ అని,+
పురుగుతో, ‘నువ్వే నా తల్లివి, సహోదరివి!’ అని అంటాను.
15 నాకు ఇక ఆశ ఎక్కడుంది?+
నాకు మంచి జరుగుతుందని ఎవరికి అనిపిస్తుంది?