కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • ముగ్గురు దేవదూతలు అబ్రాహామును సందర్శించడం (1-8)

      • శారాకు కుమారుడు పుడతాడని వాగ్దానం; ఆమె నవ్వడం (9-15)

      • సొదొమ గురించి అబ్రాహాము ​వేడుకోవడం (16-33)

ఆదికాండం 18:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 13:18; 14:13
  • +ఆది 16:7; న్యా 13:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 83

    కావలికోట,

    10/1/1996, పేజీలు 11-12

ఆదికాండం 18:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 19:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/1996, పేజీలు 11-12

ఆదికాండం 18:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 83

    కావలికోట,

    10/1/1996, పేజీలు 12-13

ఆదికాండం 18:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 19:2; 24:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/1996, పేజీ 12

ఆదికాండం 18:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “మీ హృదయాన్ని బలపర్చుకొని.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/1996, పేజీ 12

ఆదికాండం 18:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “సీయ కొలతల.” అప్పట్లో ఒక సీయ 7.33 లీటర్లతో (దాదాపు 10 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/1996, పేజీ 12

ఆదికాండం 18:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/1996, పేజీ 12

ఆదికాండం 18:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 13:2

ఆదికాండం 18:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:15

ఆదికాండం 18:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:21; 21:2; రోమా 9:9

ఆదికాండం 18:11

అధస్సూచీలు

  • *

    అంటే, ఆమెకు రుతుస్రావం ఆగిపోయింది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:17
  • +రోమా 4:19

ఆదికాండం 18:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:11; 1పే 3:6

ఆదికాండం 18:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 40:29; మత్త 19:26; లూకా 1:36, 37

ఆదికాండం 18:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 13:12

ఆదికాండం 18:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 25:14; ఆమో 3:7

ఆదికాండం 18:18

అధస్సూచీలు

  • *

    లేదా “దీవెన సంపాదించుకుంటారు.” దానికోసం కష్టపడాల్సి ఉంటుందని ఇది సూచిస్తుండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:1-3; గల 3:14

ఆదికాండం 18:19

అధస్సూచీలు

  • *

    అక్ష., “తెలుసుకున్నాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2004, పేజీ 27

ఆదికాండం 18:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 13:13; యూదా 7
  • +2పే 2:7, 8

ఆదికాండం 18:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:5; నిర్గ 3:7, 8; కీర్త 14:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 202

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 3/2020, పేజీ 2

ఆదికాండం 18:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:11; 32:30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 83

ఆదికాండం 18:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 16:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/1994, పేజీలు 29-30

ఆదికాండం 18:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:10, 11; సామె 29:16; మలా 3:18; మత్త 13:49
  • +ద్వితీ 32:4
  • +యోబు 34:12; యెష 33:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 157

    కావలికోట (అధ్యయన),

    8/2022, పేజీలు 28-29

    కావలికోట (అధ్యయన),

    4/2017, పేజీలు 18-19

    కావలికోట,

    10/15/2010, పేజీ 6

    4/15/2010, పేజీ 14

    7/1/2009, పేజీ 14

    5/15/2004, పేజీ 5

    7/15/2003, పేజీలు 16-17

    8/15/1998, పేజీలు 12, 20

    6/15/1993, పేజీలు 15-16

ఆదికాండం 18:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 11/2023, పేజీ 2

ఆదికాండం 18:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:18; కీర్త 86:15

ఆదికాండం 18:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 203

ఆదికాండం 18:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 83

    సన్నిహితమవండి, పేజీ 203

    కావలికోట,

    9/15/1994, పేజీలు 29-30

ఆదికాండం 18:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 18:2, 22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 83

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 18:1ఆది 13:18; 14:13
ఆది. 18:1ఆది 16:7; న్యా 13:21
ఆది. 18:2ఆది 19:1
ఆది. 18:4ఆది 19:2; 24:32
ఆది. 18:8హెబ్రీ 13:2
ఆది. 18:9ఆది 17:15
ఆది. 18:10ఆది 17:21; 21:2; రోమా 9:9
ఆది. 18:11ఆది 17:17
ఆది. 18:11రోమా 4:19
ఆది. 18:12హెబ్రీ 11:11; 1పే 3:6
ఆది. 18:14యెష 40:29; మత్త 19:26; లూకా 1:36, 37
ఆది. 18:16ఆది 13:12
ఆది. 18:17కీర్త 25:14; ఆమో 3:7
ఆది. 18:18ఆది 12:1-3; గల 3:14
ఆది. 18:19ద్వితీ 4:9
ఆది. 18:20ఆది 13:13; యూదా 7
ఆది. 18:202పే 2:7, 8
ఆది. 18:21ఆది 11:5; నిర్గ 3:7, 8; కీర్త 14:2
ఆది. 18:22ఆది 31:11; 32:30
ఆది. 18:23సం 16:22
ఆది. 18:25కీర్త 37:10, 11; సామె 29:16; మలా 3:18; మత్త 13:49
ఆది. 18:25ద్వితీ 32:4
ఆది. 18:25యోబు 34:12; యెష 33:22
ఆది. 18:28సం 14:18; కీర్త 86:15
ఆది. 18:30నిర్గ 34:6
ఆది. 18:33ఆది 18:2, 22
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 18:1-33

ఆదికాండం

18 ఆ తర్వాత, అబ్రాహాము మిట్టమధ్యాహ్న సమయంలో మమ్రే మహా వృక్షాల+ దగ్గర తన డేరా ప్రవేశ ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా+ అతనికి కనిపించాడు. 2 అతను తల ఎత్తి చూసినప్పుడు కొంత దూరంలో ముగ్గురు మనుషులు కనిపించారు.+ అతను వాళ్లను చూడగానే, వాళ్లను కలవడానికి తన డేరా ప్రవేశ ద్వారం దగ్గర నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి, వాళ్లకు వంగి నమస్కారం చేశాడు. 3 తర్వాత అతను ఇలా అన్నాడు: “యెహోవా, నీ అనుగ్రహం నా మీద ఉంటే, దయచేసి నీ సేవకుణ్ణి దాటి వెళ్లకు. 4 కొన్ని నీళ్లు తెప్పిస్తాను, వాటితో మీ కాళ్లు కడుక్కొని,+ దయచేసి ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి. 5 మీరు మీ సేవకుని దగ్గరికి వచ్చారు కాబట్టి, నేను వెళ్లి కొంత ఆహారం తీసుకొస్తాను. మీరు సేదదీరి,* ఆ తర్వాత మీ దారిన వెళ్లొచ్చు.” అప్పుడు వాళ్లు, “సరే, అలాగే కానివ్వు” అన్నారు.

6 కాబట్టి అబ్రాహాము పరుగుపరుగున డేరాలో ఉన్న శారా దగ్గరికి వెళ్లి, “వెంటనే మూడు కొలతల* మెత్తని పిండి తీసుకొని, దాన్ని పిసికి, రొట్టెలు చేయి” అన్నాడు. 7 తర్వాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి, మంచి లేత దూడను తీసుకొచ్చి తన పనివాడికి ఇచ్చాడు. అతను త్వరత్వరగా దాన్ని కోసి, వండాడు. 8 ఆ తర్వాత అబ్రాహాము వెన్నను, పాలను, తాను వండించిన లేత దూడను తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టాడు. వాళ్లు తింటూ ఉండగా అతను వాళ్ల దగ్గరే చెట్టు కింద నిలబడి ఉన్నాడు.+

9 వాళ్లు అబ్రాహామును, “నీ భార్య శారా+ ఎక్కడుంది?” అని అడిగారు. అందుకతను, “ఇక్కడే డేరాలో ఉంది” అన్నాడు. 10 అప్పుడు వాళ్లలో ఒకరు, “నేను వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఖచ్చితంగా నీ దగ్గరికి తిరిగొస్తాను. ఇదిగో! అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు పుడతాడు”+ అన్నారు. శారా ఆ సమయంలో అతని వెనకున్న డేరా ద్వారం దగ్గర ఉండి వింటూ ఉంది. 11 అప్పటికి అబ్రాహాము, శారాలు చాలా ముసలివాళ్లు.+ శారాకు పిల్లల్ని కనే వయసు దాటిపోయింది.*+ 12 కాబట్టి శారా, “నేను ముసలిదాన్ని అయిపోయాను, నా ప్రభువు కూడా ముసలివాడైపోయాడు. ఇప్పుడు నిజంగా నాకు ఈ సంతోషం కలుగుతుందా?” అని అనుకుంటూ తనలో తాను నవ్వుకుంది.+ 13 తర్వాత యెహోవా అబ్రాహాముతో ఇలా అన్నాడు: “శారా ఎందుకు నవ్వింది? ‘నేను ముసలిదాన్ని కదా, నిజంగా నాకు పిల్లలు పుడతారా’ అని ఎందుకు అంది? 14 యెహోవాకు సాధ్యంకానిది అంటూ ఏదైనా ఉందా?+ వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను తిరిగొస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు.” 15 కానీ శారా భయపడి, “లేదు! నేను నవ్వలేదు” అంది. అప్పుడు ఆయన, “లేదు! నువ్వు నవ్వావు” అన్నాడు.

16 తర్వాత ఆ మనుషులు వెళ్లిపోవడానికి లేచారు, వాళ్లను సాగనంపడానికి అబ్రాహాము వాళ్లతోపాటే నడుస్తున్నాడు. అప్పుడు ఆ మనుషులు సొదొమ వైపు చూశారు.+ 17 యెహోవా ఇలా అన్నాడు: “నేను చేయబోయేదాన్ని అబ్రాహాముకు తెలీకుండా దాస్తానా?+ 18 ఖచ్చితంగా అబ్రాహాము బలమైన గొప్ప జనం అవుతాడు. భూమ్మీదున్న అన్నిదేశాల ప్రజలు అతని ద్వారా దీవించబడతారు.*+ 19 ఎందుకంటే సరైనది, న్యాయమైనది చేస్తూ యెహోవా మార్గంలో నడుస్తూ ఉండమని అబ్రాహాము తన కుమారులకు, తన ఇంటివాళ్లకు ఆజ్ఞాపించేలా నేను అతన్ని ఎంచుకున్నాను.*+ అప్పుడు యెహోవానైన నేను అబ్రాహాము విషయంలో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను.”

20 తర్వాత యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ, గొమొర్రాల పాపం చాలా భారంగా ఉంది.+ ఆ నగరాల గురించిన మొర నాకు చాలా బిగ్గరగా వినిపిస్తోంది.+ 21 నేను కిందికి వెళ్లి, నాకు వినబడిన మొర నిజమో కాదో, వాళ్ల పనులు నిజంగా అంత చెడ్డగా ఉన్నాయో లేదో చూస్తాను. నాకు అది తెలుసుకోవాలనుంది.”+

22 తర్వాత ఆ మనుషులు అక్కడి నుండి సొదొమ వైపు వెళ్లారు, కానీ యెహోవా+ అబ్రాహాముతోనే ఉండిపోయాడు. 23 అప్పుడు అబ్రాహాము ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “నువ్వు నిజంగా దుష్టులతో పాటు నీతిమంతుల్ని తుడిచిపెడతావా?+ 24 ఒకవేళ ఆ నగరంలో 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో. అప్పుడు కూడా నువ్వు వాళ్లను తుడిచిపెట్టేస్తావా? ఆ 50 మంది కోసం ఆ నగరాన్ని క్షమించవా? 25 నువ్వు ఎన్నడూ దుష్టునితో పాటు నీతిమంతున్ని చంపేయవు! అలాచేస్తే నీతిమంతునికి, దుష్టునికి దొరికే ప్రతిఫలం ఒక్కటే అవుతుంది.+ నువ్వు ఎన్నడూ అలా చేయవు.+ భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనది చేయడా?”+ 26 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ నగరంలో నాకు 50 మంది నీతిమంతులు కనిపిస్తే, వాళ్లకోసం నేను ఆ నగరాన్నంతా క్షమిస్తాను.” 27 కానీ అబ్రాహాము మళ్లీ ఇలా అన్నాడు: “ధూళిని, బూడిదను అయిన నేను యెహోవాతో మాట్లాడడానికి తెగిస్తున్నాను, దయచేసి నన్ను మాట్లాడనివ్వు. 28 ఒకవేళ 50 మంది నీతిమంతుల్లో ఒక ఐదుగురు తగ్గారనుకో. అలా ఐదుగురు తగ్గినందుకు మొత్తం నగరాన్ని నాశనం చేస్తావా?” దానికి దేవుడు, “నాకు అక్కడ 45 మంది కనిపించినా నేను దాన్ని నాశనం చేయను”+ అన్నాడు.

29 కానీ అబ్రాహాము మళ్లీ దేవునితో, “ఒకవేళ 40 మందే కనిపించారనుకో” అన్నాడు. దానికి దేవుడు, “ఆ 40 మంది కోసం నేను దాన్ని నాశనం చేయను” అన్నాడు. 30 అబ్రాహాము మళ్లీ మాట్లాడుతూ ఇలా అన్నాడు: “యెహోవా, దయచేసి కోపంతో మండిపడకుండా,+ నన్ను మాట్లాడనివ్వు. అక్కడ 30 మందే కనిపించారనుకో.” దానికి దేవుడు, “నాకు 30 మంది కనిపిస్తే, నేను దాన్ని నాశనం చేయను” అన్నాడు. 31 కానీ అబ్రాహాము మళ్లీ ఇలా అన్నాడు: “నేను యెహోవాతో మాట్లాడడానికి తెగిస్తున్నాను, దయచేసి నన్ను మాట్లాడనివ్వు. అక్కడ 20 మందే కనిపించారనుకో.” దానికి దేవుడు, “ఆ 20 మంది కోసం నేను దాన్ని నాశనం చేయను” అన్నాడు. 32 చివరిగా అబ్రాహాము ఇలా అన్నాడు: “యెహోవా, దయచేసి కోపంతో మండిపడకు, ఇంకొక్కసారి నన్ను మాట్లాడనివ్వు. అక్కడ పది మందే కనిపించారనుకో.” దానికి దేవుడు, “ఆ పది మంది కోసం నేను దాన్ని నాశనం చేయను” అన్నాడు. 33 అబ్రాహాముతో మాట్లాడడం అయిపోయినప్పుడు యెహోవా అక్కడి నుండి వెళ్లిపోయాడు,+ అబ్రాహాము తిరిగి తన డేరా దగ్గరికి వెళ్లిపోయాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి