యోబు
34 ఎలీహు ఇంకా ఇలా అన్నాడు:
2 “తెలివిగల వాళ్లారా, నా మాటలు వినండి;
జ్ఞానంగల వాళ్లారా, నేను చెప్పేది ఆలకించండి.
3 నాలుక* ఆహారాన్ని రుచి చూసినట్టే,
చెవి మాటల్ని పరీక్షిస్తుంది.
4 ఏది సరైనదో, ఏది మంచిదో మనం పరిశీలించి తెలుసుకుందాం.
5 యోబు ఇలా అన్నాడు: ‘నేను నిర్దోషిని,
అయినా దేవుడు నాకు న్యాయం చేయలేదు.+
6 నాకు రాబోయే తీర్పు విషయంలో నేను అబద్ధాలాడతానా?
ఏ తప్పూ చేయకపోయినా నాకు మానని గాయం అయ్యింది.’+
7 యోబు లాంటి మనిషి ఎవరైనా ఉన్నారా?
అతను అవమానాల్ని నీళ్లలా తాగుతున్నాడు.
8 అతను తప్పుచేసే వాళ్లతో ఉంటున్నాడు,
దుష్టులతో సహవాసం చేస్తున్నాడు.
9 అతను ఇలా అన్నాడు: ‘దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించడం వల్ల
మనిషికి ప్రయోజనం ఉండదు.’+
10 కాబట్టి అవగాహన గలవాళ్లారా, నేను చెప్పేది వినండి:
సత్యదేవుడు చెడుగా ప్రవర్తించడం,
సర్వశక్తిమంతుడు తప్పుచేయడం అసాధ్యం!+
11 ఆయన వాళ్లవాళ్ల పనుల్ని బట్టి మనుషులకు ప్రతిఫలం ఇస్తాడు,+
వాళ్ల మార్గాల పర్యవసానాల్ని వాళ్లు అనుభవించేలా చేస్తాడు.
13 ఆయనకు భూమ్మీద అధికారం ఇచ్చింది ఎవరు?
లోకమంతటి మీద ఆయన్ని నియమించింది ఎవరు?
14 ఒకవేళ ఆయన వాళ్ల మీద దృష్టిపెట్టి,
వాళ్ల జీవశక్తిని,* ఊపిరిని వెనక్కి తీసేసుకుంటే,+
15 మనుషులంతా ఒక్కపెట్టున తుడిచిపెట్టుకుపోతారు,
మానవజాతి తిరిగి మట్టికి చేరుకుంటుంది.+
16 కాబట్టి నీకు అవగాహన ఉంటే, దీనిమీద మనసుపెట్టు;
నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు.
17 న్యాయాన్ని ద్వేషించే వ్యక్తి పరిపాలన చేయగలడా?
నీతిగా నడుచుకునే శక్తిమంతుని మీద నువ్వు నేరం మోపుతావా?
18 రాజుతో, ‘నువ్వు పనికిమాలినవాడివి’ అని,
ప్రముఖులతో, ‘మీరు దుష్టులు’ అని అంటావా?+
19 దేవుడు అధిపతుల పట్ల పక్షపాతం చూపించడు,
పేదవాళ్ల కన్నా ధనవంతుల్ని ఎక్కువగా చూడడు,+
ఎందుకంటే వాళ్లంతా ఆయన చేతుల పనే.+
20 వాళ్లు అర్ధరాత్రి+ హఠాత్తుగా చనిపోతారు;+
భయంకరంగా వణికిపోతూ ప్రాణాలు విడుస్తారు;
చివరికి శక్తిమంతులు కూడా నశించిపోతారు, కానీ మనుషుల చేతుల్లో కాదు.+
21 ఎందుకంటే, దేవుని కళ్లు మనుషుల మార్గాల మీద ఉన్నాయి,+
వాళ్ల అడుగులన్నిటినీ ఆయన గమనిస్తున్నాడు.
23 తీర్పు కోసం తన ముందుకు రావడానికి
దేవుడు ఏ మనిషికీ ఒక నియమిత సమయం పెట్టలేదు.
24 విచారణ చేయాల్సిన అవసరం లేకుండానే ఆయన శక్తిమంతుల్ని నాశనం చేస్తాడు,
వాళ్ల స్థానంలో వేరేవాళ్లను నియమిస్తాడు.+
25 ఎందుకంటే, వాళ్లు ఏం చేస్తున్నారో ఆయనకు తెలుసు;+
రాత్రివేళ ఆయన వాళ్లను పడగొడతాడు, వాళ్లు నాశనమౌతారు.+
26 అందరూ చూస్తుండగా, వాళ్ల చెడుతనాన్ని బట్టి ఆయన వాళ్లను శిక్షిస్తాడు.+
27 ఎందుకంటే, వాళ్లు ఆయన్ని అనుసరించడం మానేశారు,+
ఆయన మార్గాల్లో దేన్నీ వాళ్లు పట్టించుకోరు;+
28 వాళ్ల వల్ల పేదవాళ్లు ఆయనకు మొరపెడుతున్నారు,
ఆయన ఆ నిస్సహాయుల మొర వింటాడు.+
29 దేవుడు మౌనంగా ఉన్నప్పుడు, ఎవరు ఆయన్ని తప్పుపట్టగలరు?
ఆయన తన ముఖం దాచుకున్నప్పుడు, ఎవరు ఆయన్ని చూడగలరు?
అది ఒక దేశమైనా, మనిషైనా అంతే.
30 భక్తిహీనులు* పరిపాలించకుండా ఉండాలని,+
వాళ్లు ప్రజల కోసం ఉచ్చులు పన్నకుండా ఉండాలని ఆయన అలా చేస్తాడు.
31 దేవునితో ఎవరైనా ఇలా అంటారా:
‘నేను ఏ తప్పూ చేయకపోయినా నాకు శిక్షపడింది;+
32 నేను చూడలేకపోయిన దాని గురించి నాకు బోధించు;
నేను ఏదైనా తప్పు చేసివుంటే, దాన్ని మళ్లీ చేయను.’
33 నువ్వు ఆయన తీర్పును తిరస్కరించినప్పుడు, నీ ఇష్టాయిష్టాల ప్రకారం ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వాలా?
నువ్వే తేల్చుకో.
నీకు బాగా తెలిసిందే చెప్పు.
34 అవగాహన గలవాళ్లు, నా మాటలు వింటున్న తెలివిగలవాళ్లు ఎవరైనా నాతో ఇలా అంటారు:
35 ‘యోబు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు,+
అతని మాటల్లో లోతైన అవగాహన లేదు.’
36 యోబు పూర్తిగా పరీక్షించబడాలి,*
ఎందుకంటే, అతను దుష్టుల్లో ఒకడిలా జవాబిస్తున్నాడు!