కీర్తనలు
బెన్యామీనీయుడైన కూషు మాటల్ని బట్టి దావీదు యెహోవాకు పాడిన శోకగీతం.
7 యెహోవా, నా దేవా, నిన్నే నేను ఆశ్రయించాను.+
నన్ను హింసిస్తున్న వాళ్లందరి నుండి నన్ను రక్షించు, నన్ను కాపాడు.+
2 లేకపోతే సింహంలా వాళ్లు నన్ను చీల్చి ముక్కలుముక్కలు చేస్తారు,+
నన్ను ఎత్తుకెళ్తారు, నన్ను రక్షించేవాళ్లెవ్వరూ ఉండరు.
3 యెహోవా, నా దేవా, ఈ విషయంలో నా తప్పు ఉంటే,
నేను అన్యాయం చేసివుంటే,
4 నాకు మేలు చేసే వ్యక్తికి నేను కీడు చేసివుంటే,+
ఏ కారణం లేకుండా నేను నా శత్రువును దోచుకొనివుంటే,*
5 శత్రువు నన్ను తరిమి పట్టుకోవాలి;
నన్ను నేల మీద పడేసి తొక్కాలి,
నా ఘనతను మట్టిలో కలిపేయాలి. (సెలా)
6 యెహోవా, కోపంగా లే;
నా శత్రువుల ఆగ్రహానికి వ్యతిరేకంగా నిలబడు;+
నాకు సహాయం చేయడానికి లే, న్యాయం జరిగేలా ఆదేశించు.+
7 దేశాల్ని నిన్ను చుట్టుముట్టనివ్వు;
అప్పుడు నువ్వు పైనుండి వాళ్లమీద చర్య తీసుకుంటావు.
8 దేశాల ప్రజలకు యెహోవా తీర్పు తీరుస్తాడు.+
యెహోవా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి
నాకు తీర్పు తీర్చు.+
9 దుష్టుల చెడ్డపనుల్ని అంతం చేయి.
అయితే నీతిమంతుల్ని సురక్షితంగా ఉంచు,+
ఎందుకంటే నువ్వు హృదయాల్ని,+ అంతరంగాన్ని* పరిశోధించే*+ నీతిగల దేవుడివి.+
10 దేవుడే నా డాలు,+ హృదయంలో నిజాయితీగల వాళ్లకు+ ఆయనే రక్షకుడు.
12 పశ్చాత్తాపపడనివాళ్ల+ విషయంలో తన కత్తికి పదునుపెడతాడు;+
తన విల్లును ఎక్కుపెట్టి దాన్ని సిద్ధంగా ఉంచుతాడు.+
13 ఆయన తన మారణాయుధాల్ని సిద్ధం చేస్తాడు;
తన అగ్ని బాణాల్ని సిద్ధం చేస్తాడు.+
14 కడుపులో దుష్టత్వాన్ని మోస్తున్న వ్యక్తిని చూడండి;
అతను కీడును గర్భం దాల్చి, అబద్ధాల్ని కంటాడు.+
15 అతను ఒక గుంటను తవ్వి, దాన్ని లోతుగా చేస్తాడు,
అతను తవ్విన గుంటలో అతనే పడిపోతాడు.+
16 అతను చేసే కీడు అతని తల మీదికే వస్తుంది;+
అతని దౌర్జన్యం అతని నడినెత్తి మీదికే వస్తుంది.