కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • దానియేలు 5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

దానియేలు విషయసూచిక

      • బెల్షస్సరు రాజు విందు (1-4)

      • గోడమీద చేతి రాత (5-12)

      • రాత భావాన్ని చెప్పమని దానియేలును అడగడం (13-25)

      • భావం: బబులోను కూలిపోతుంది (26-31)

దానియేలు 5:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 7:1; 8:1
  • +యెష 21:5; యిర్మీ 51:39

దానియేలు 5:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:15; 2ది 36:18; ఎజ్రా 1:7; యిర్మీ 52:19; దాని 1:1, 2

దానియేలు 5:6

అధస్సూచీలు

  • *

    లేదా “రాజు రూపం మారిపోయింది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 21:2, 3

దానియేలు 5:7

అధస్సూచీలు

  • *

    అంటే, సోదె, జ్యోతిష్యం చెప్పడంలో నైపుణ్యం ఉన్న గుంపు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:2; 4:6
  • +ఆది 41:39, 42; ఎస్తే 8:15
  • +దాని 2:6, 48

దానియేలు 5:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:27; 4:7

దానియేలు 5:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:1, 7

దానియేలు 5:11

అధస్సూచీలు

  • *

    లేదా “సమర్థుడైన వ్యక్తి.”

  • *

    అంటే, సోదె, జ్యోతిష్యం చెప్పడంలో నైపుణ్యం ఉన్న గుంపు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:8, 9
  • +దాని 2:47, 48

దానియేలు 5:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “ముడుల్ని విప్పే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:7; 4:8
  • +దాని 1:17, 20; 6:3

దానియేలు 5:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:11, 14
  • +దాని 1:3, 6; 2:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 14

దానియేలు 5:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:17, 20

దానియేలు 5:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 47:12, 13; దాని 2:10, 11

దానియేలు 5:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “ముడుల్ని విప్పగలవని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:28
  • +దాని 2:6

దానియేలు 5:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017),

    9/2017, పేజీ 1

దానియేలు 5:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:37, 38

దానియేలు 5:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:9; దాని 3:4, 5; 4:22
  • +దాని 2:12; 3:6, 29

దానియేలు 5:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 14:13, 14; దాని 4:30

దానియేలు 5:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:31-35

దానియేలు 5:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:29
  • +దాని 5:2, 3
  • +కీర్త 115:4-7; యెష 46:6, 7
  • +కీర్త 104:29

దానియేలు 5:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 5:5

దానియేలు 5:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:11; యిర్మీ 25:12; 27:6, 7; 50:1, 2; 51:11

దానియేలు 5:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 1:1, 2; యెష 21:2; 45:1; యిర్మీ 50:9; దాని 6:28; 9:1

దానియేలు 5:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 5:7, 16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017),

    9/2017, పేజీ 1

దానియేలు 5:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 21:9; యిర్మీ 51:8, 31, 39, 57

దానియేలు 5:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 6:1; 9:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 6/2017, పేజీ 1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

దాని. 5:1దాని 7:1; 8:1
దాని. 5:1యెష 21:5; యిర్మీ 51:39
దాని. 5:22రా 25:15; 2ది 36:18; ఎజ్రా 1:7; యిర్మీ 52:19; దాని 1:1, 2
దాని. 5:6యెష 21:2, 3
దాని. 5:7దాని 2:2; 4:6
దాని. 5:7ఆది 41:39, 42; ఎస్తే 8:15
దాని. 5:7దాని 2:6, 48
దాని. 5:8దాని 2:27; 4:7
దాని. 5:9యెష 13:1, 7
దాని. 5:11దాని 4:8, 9
దాని. 5:11దాని 2:47, 48
దాని. 5:12దాని 1:7; 4:8
దాని. 5:12దాని 1:17, 20; 6:3
దాని. 5:132రా 24:11, 14
దాని. 5:13దాని 1:3, 6; 2:25
దాని. 5:14దాని 1:17, 20
దాని. 5:15యెష 47:12, 13; దాని 2:10, 11
దాని. 5:16దాని 2:28
దాని. 5:16దాని 2:6
దాని. 5:18దాని 2:37, 38
దాని. 5:19యిర్మీ 25:9; దాని 3:4, 5; 4:22
దాని. 5:19దాని 2:12; 3:6, 29
దాని. 5:20యెష 14:13, 14; దాని 4:30
దాని. 5:21దాని 4:31-35
దాని. 5:23యిర్మీ 50:29
దాని. 5:23దాని 5:2, 3
దాని. 5:23కీర్త 115:4-7; యెష 46:6, 7
దాని. 5:23కీర్త 104:29
దాని. 5:24దాని 5:5
దాని. 5:26యెష 13:11; యిర్మీ 25:12; 27:6, 7; 50:1, 2; 51:11
దాని. 5:28ఎజ్రా 1:1, 2; యెష 21:2; 45:1; యిర్మీ 50:9; దాని 6:28; 9:1
దాని. 5:29దాని 5:7, 16
దాని. 5:30యెష 21:9; యిర్మీ 51:8, 31, 39, 57
దాని. 5:31దాని 6:1; 9:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
దానియేలు 5:1-31

దానియేలు

5 బెల్షస్సరు రాజు+ తన ప్రముఖుల్లో వెయ్యిమందికి ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు, అతను వాళ్ల ముందు ద్రాక్షారసం తాగుతున్నాడు.+ 2 అతను తాగిన మత్తులో, తన తండ్రైన నెబుకద్నెజరు యెరూషలేము ఆలయంలో నుండి తీసుకొచ్చిన బంగారు, వెండి పాత్రల్ని+ తెమ్మని ఆజ్ఞాపించాడు. రాజు, అతని ప్రముఖులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు ఆ పాత్రల్లో తాగడం కోసం వాటిని తెప్పించాడు. 3 అప్పుడు వాళ్లు యెరూషలేములో ఉన్న దేవుని మందిరంలోని పవిత్ర స్థలంలో నుండి తెచ్చిన బంగారు పాత్రల్ని అక్కడికి తీసుకొచ్చారు. రాజు, అతని ప్రముఖులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు వాటిలో తాగారు. 4 వాళ్లు ద్రాక్షారసం తాగి, బంగారంతో, వెండితో, రాగితో, ఇనుముతో, చెక్కతో, రాయితో చేయబడిన దేవుళ్లను స్తుతించారు.

5 ఆ క్షణంలోనే మనిషి చేతి వేళ్లు కనబడి, దీపస్తంభానికి ఎదురుగా రాజభవనం గోడమీద రాయడం మొదలుపెట్టాయి; ఆ చెయ్యి రాస్తుండగా రాజు దాన్ని చూస్తున్నాడు. 6 అప్పుడు రాజు ముఖం పాలిపోయింది,* అతని ఆలోచనలు అతన్ని భయపెట్టాయి; అతని కాళ్లు బలహీనమై,+ అతని మోకాళ్లు ఒకదానితో ఒకటి కొట్టుకోవడం మొదలుపెట్టాయి.

7 దాంతో రాజు సోదె చెప్పేవాళ్లను, కల్దీయుల్ని,* జ్యోతిష్యుల్ని పిలిపించమని బిగ్గరగా చెప్పాడు.+ అప్పుడు రాజు బబులోనులోని జ్ఞానులతో ఇలా అన్నాడు: “ఎవరైతే ఈ రాతను చదివి, దాని భావం నాకు చెప్తారో అతనికి ఊదారంగు వస్త్రం తొడిగించబడుతుంది, అతని మెడలో బంగారు హారం వేయబడుతుంది;+ రాజ్యంలో అతను మూడో పాలకునిగా పరిపాలిస్తాడు.”+

8 అప్పుడు రాజుకు చెందిన జ్ఞానులందరూ రాజు దగ్గరికి వచ్చారు, కానీ వాళ్లు ఆ రాతను చదవలేకపోయారు, దాని భావాన్ని చెప్పలేకపోయారు.+ 9 దాంతో బెల్షస్సరు రాజు చాలా భయపడ్డాడు, అతని ముఖం పాలిపోయింది; అతని ప్రముఖులు కూడా కలవరపడ్డారు.+

10 రాజు, అతని ప్రముఖులు అన్న మాటల గురించి విని రాణి విందుశాలలోకి వచ్చింది. ఆమె ఇలా అంది: “రాజా, నువ్వు కలకాలం జీవించాలి. నీ ముఖం ఎందుకు పాలిపోయింది? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. 11 నీ రాజ్యంలో ఒక మనిషి* ఉన్నాడు, అతనిలో పవిత్ర దేవుళ్ల శక్తి ఉంది. నీ తండ్రి రోజుల్లో, అతనికి జ్ఞానం, లోతైన అవగాహన, దేవుళ్లకు ఉన్నలాంటి తెలివి ఉందని గమనించారు.+ నీ తండ్రైన నెబుకద్నెజరు రాజు అతన్ని ఇంద్రజాలం చేసే పూజారులకు, సోదె చెప్పేవాళ్లకు, కల్దీయులకు,* జ్యోతిష్యులకు పైన అధిపతిగా నియమించాడు;+ అవును రాజా, నీ తండ్రే ఆ పని చేశాడు. 12 రాజు బెల్తెషాజరు అని పేరు పెట్టిన దానియేలుకు+ కలల భావం చెప్పే, పొడుపు కథల్ని వివరించి చెప్పే, చిక్కు సమస్యల్ని పరిష్కరించే* అసాధారణ శక్తి, జ్ఞానం, లోతైన అవగాహన ఉన్నాయి.+ కాబట్టి దానియేలును పిలిపించు, అతను నీకు దాని భావం చెప్తాడు.”

13 కాబట్టి దానియేలును రాజు ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు రాజు దానియేలుతో ఇలా అన్నాడు: “రాజైన నా తండ్రి యూదా నుండి బందీగా తీసుకొచ్చిన+ దానియేలు+ నువ్వేనా? 14 నీలో దేవుళ్ల శక్తి ఉందనీ నీకు జ్ఞానం, లోతైన అవగాహన, అసాధారణ తెలివితేటలు ఉన్నాయనీ+ నేను విన్నాను. 15 ఈ రాతను చదివి, దాని భావం నాకు చెప్పడానికి జ్ఞానులు, సోదె చెప్పేవాళ్లు నా ముందుకు తీసుకురాబడ్డారు; కానీ వాళ్లు ఈ సందేశ భావాన్ని నాకు చెప్పలేకపోయారు.+ 16 అయితే నువ్వు భావాల్ని చెప్పగలవని,+ చిక్కు సమస్యల్ని పరిష్కరించగలవని* నీ గురించి విన్నాను. ఇప్పుడు నువ్వు ఈ రాతను చదివి, దాని భావం నాకు చెప్పగలిగితే నీకు ఊదారంగు వస్త్రం తొడిగించబడుతుంది, నీ మెడలో బంగారు హారం వేయబడుతుంది, రాజ్యంలో నువ్వు మూడో పాలకునిగా పరిపాలిస్తావు.”+

17 అప్పుడు దానియేలు రాజుతో ఇలా చెప్పాడు: “నీ బహుమానాలు నీ దగ్గరే ఉంచుకో, నీ కానుకల్ని వేరేవాళ్లకు ఇవ్వు. అయితే నేను ఈ రాతను రాజుకు చదివి వినిపిస్తాను, దాని భావం తెలియజేస్తాను. 18 రాజా, సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరుకు రాజ్యాన్ని, గొప్పతనాన్ని, ఘనతను, వైభవాన్ని ఇచ్చాడు.+ 19 ఆయన నీ తండ్రికి గొప్పతనం ఇచ్చాడు కాబట్టి అన్నిదేశాల, భాషల ప్రజలు అతని ముందు భయంతో వణికిపోయేవాళ్లు.+ నీ తండ్రి ఎవర్ని కావాలనుకుంటే వాళ్లను చంపాడు, లేదా బ్రతకనిచ్చాడు; ఎవర్ని కావాలనుకుంటే వాళ్లను గొప్పచేశాడు, లేదా అవమానించాడు.+ 20 కానీ అతను ఎప్పుడైతే తన హృదయంలో గర్వించి, మొండివాడై అహంకారంగా ప్రవర్తించాడో,+ అప్పుడు అతను తన రాజ్య సింహాసనం మీద నుండి తొలగించబడ్డాడు, అతని ఘనత అతని దగ్గర నుండి తీసేయబడింది. 21 అతను మనుషుల మధ్య నుండి వెళ్లగొట్టబడ్డాడు, అతని హృదయం జంతువు హృదయంలా తయారైంది, అతను అడవి గాడిదలతోపాటు నివసించాడు. అతను ఎద్దులా గడ్డి తిన్నాడు, అతని శరీరం ఆకాశ మంచుకు తడిసింది. మనుషుల రాజ్యం మీద సర్వోన్నతుడైన దేవుడు పరిపాలకుడనీ, ఆయన ఎవర్ని కావాలనుకుంటే వాళ్లను దానిమీద నియమిస్తాడనీ అతను తెలుసుకునే వరకు అలా జరిగింది.+

22 “కానీ బెల్షస్సరూ, అతని కుమారుడివైన నువ్వు ఇదంతా తెలిసి కూడా నిన్ను నువ్వు తగ్గించుకోలేదు. 23 బదులుగా, పరలోక ప్రభువుకు వ్యతిరేకంగా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు,+ నువ్వు ఆయన మందిరంలోని పాత్రల్ని తెప్పించుకున్నావు.+ నువ్వు, నీ ప్రముఖులు, నీ భార్యలు, నీ ఉపపత్నులు వాటిలో ద్రాక్షారసం తాగి వెండితో, బంగారంతో, రాగితో, ఇనుముతో, చెక్కతో, రాయితో చేసిన దేవుళ్లను, అంటే ఏమీ చూడలేని, ఏమీ వినలేని, ఏమీ తెలియని దేవుళ్లను+ స్తుతించారు. కానీ నీ ఊపిరి, నీ మార్గాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో ఆ దేవుణ్ణి+ నువ్వు మహిమపర్చలేదు. 24 అందుకే దేవుడు ఒక చేతిని పంపించి, ఈ రాతను రాయించాడు.+ 25 రాయబడిన రాత ఇదే: మెనే, మెనే, టెకేల్‌, పార్సీన్‌.

26 “ఆ మాటల భావం ఇది: మెనే, అంటే దేవుడు నీ రాజ్య పరిపాలన రోజుల్ని లెక్కపెట్టి, వాటిని ముగించాడు.+

27 “టెకేల్‌, అంటే దేవుడు నిన్ను త్రాసులో తూచి, నువ్వు తక్కువగా ఉన్నట్టు గమనించాడు.

28 “పెరేస్‌, అంటే నీ రాజ్యం విభజించబడి మాదీయులకు, పారసీకులకు ఇవ్వబడుతుంది.”+

29 అప్పుడు బెల్షస్సరు ఆజ్ఞ ఇవ్వడంతో దానియేలుకు ఊదారంగు వస్త్రాన్ని ధరింపజేసి, అతని మెడలో బంగారు హారం వేశారు; అతను రాజ్యంలో మూడో పాలకుడు అవుతాడని చాటించారు.+

30 ఆ రాత్రే కల్దీయుల రాజు బెల్షస్సరు చంపబడ్డాడు.+ 31 ఆ రాజ్యాన్ని మాదీయుడైన దర్యావేషు+ పొందాడు, అప్పుడు అతని వయసు దాదాపు 62 సంవత్సరాలు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి