కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 29
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • యాజకుల్ని ప్రతిష్ఠించడం (1-37)

      • ప్రతీరోజు అర్పించే అర్పణ (38-46)

నిర్గమకాండం 29:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:1

నిర్గమకాండం 29:2

అధస్సూచీలు

  • *

    వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.

నిర్గమకాండం 29:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:26

నిర్గమకాండం 29:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 26:36; లేవీ 8:2, 3
  • +లేవీ 8:6; హెబ్రీ 10:22

నిర్గమకాండం 29:5

అధస్సూచీలు

  • *

    లేదా “అల్లిన దట్టీని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:4; లేవీ 8:7; 16:4
  • +నిర్గ 28:8

నిర్గమకాండం 29:6

అధస్సూచీలు

  • *

    లేదా “పవిత్రమైన కిరీటాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:36; 39:30; లేవీ 8:9

నిర్గమకాండం 29:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:23-25
  • +లేవీ 8:12; కీర్త 133:2; యెష 61:1; అపొ 10:38

నిర్గమకాండం 29:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:40

నిర్గమకాండం 29:9

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్ల చేతుల్ని అధికారంతో నింపాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:1-3, 40, 43; 40:15
  • +నిర్గ 28:41

నిర్గమకాండం 29:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:14-17

నిర్గమకాండం 29:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:3

నిర్గమకాండం 29:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 27:2
  • +లేవీ 4:7

నిర్గమకాండం 29:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:17
  • +లేవీ 4:8-10

నిర్గమకాండం 29:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:4; 8:18-21

నిర్గమకాండం 29:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 9:22

నిర్గమకాండం 29:17

అధస్సూచీలు

  • *

    ఇది మోకాలు కింది భాగాన్ని సూచిస్తోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:13

నిర్గమకాండం 29:18

అధస్సూచీలు

  • *

    లేదా “శాంతపర్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 8:21

నిర్గమకాండం 29:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:22-24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2020, పేజీ 7

నిర్గమకాండం 29:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:23-25
  • +లేవీ 8:30

నిర్గమకాండం 29:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:9, 10
  • +లేవీ 8:22, 25-28

నిర్గమకాండం 29:23

అధస్సూచీలు

  • *

    వడ ఆకారంలో ఉన్న రొట్టె.

నిర్గమకాండం 29:25

అధస్సూచీలు

  • *

    లేదా “శాంతపర్చే.”

నిర్గమకాండం 29:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:29; కీర్త 99:6

నిర్గమకాండం 29:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:22

నిర్గమకాండం 29:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 7:34; 10:14
  • +లేవీ 7:11, 14

నిర్గమకాండం 29:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:4
  • +సం 20:26

నిర్గమకాండం 29:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:35

నిర్గమకాండం 29:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:31

నిర్గమకాండం 29:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 9:13

నిర్గమకాండం 29:33

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్ల చేతుల్ని అధికారంతో నింపి.”

  • *

    లేదా “అపరిచితులు,” అంటే, అహరోను వంశస్థులు కానివాళ్లు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 22:10; సం 3:10

నిర్గమకాండం 29:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:32

నిర్గమకాండం 29:35

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్ల చేతుల్ని అధికారంతో నింపడానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:4, 33

నిర్గమకాండం 29:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:26, 28; లేవీ 8:11; సం 7:1

నిర్గమకాండం 29:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:10

నిర్గమకాండం 29:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 2:4; హెబ్రీ 7:27; 10:11

నిర్గమకాండం 29:39

అధస్సూచీలు

  • *

    అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 28:4-6

నిర్గమకాండం 29:40

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక ఈఫా 22 లీటర్లతో (13 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

  • *

    అప్పట్లో ఒక హిన్‌ 3.67 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.

నిర్గమకాండం 29:41

అధస్సూచీలు

  • *

    అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

  • *

    లేదా “శాంతపర్చే.”

నిర్గమకాండం 29:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 25:22; లేవీ 1:1; సం 17:4

నిర్గమకాండం 29:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:34; సం 12:5; 1రా 8:11

నిర్గమకాండం 29:44

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 22:9

నిర్గమకాండం 29:45

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 25:8; లేవీ 26:12; జెక 2:11; 2కొ 6:16

నిర్గమకాండం 29:46

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 29:1ద్వితీ 17:1
నిర్గ. 29:3లేవీ 8:26
నిర్గ. 29:4నిర్గ 26:36; లేవీ 8:2, 3
నిర్గ. 29:4లేవీ 8:6; హెబ్రీ 10:22
నిర్గ. 29:5నిర్గ 28:4; లేవీ 8:7; 16:4
నిర్గ. 29:5నిర్గ 28:8
నిర్గ. 29:6నిర్గ 28:36; 39:30; లేవీ 8:9
నిర్గ. 29:7నిర్గ 30:23-25
నిర్గ. 29:7లేవీ 8:12; కీర్త 133:2; యెష 61:1; అపొ 10:38
నిర్గ. 29:8నిర్గ 28:40
నిర్గ. 29:9నిర్గ 28:1-3, 40, 43; 40:15
నిర్గ. 29:9నిర్గ 28:41
నిర్గ. 29:10లేవీ 8:14-17
నిర్గ. 29:11లేవీ 4:3
నిర్గ. 29:12నిర్గ 27:2
నిర్గ. 29:12లేవీ 4:7
నిర్గ. 29:13లేవీ 3:17
నిర్గ. 29:13లేవీ 4:8-10
నిర్గ. 29:15లేవీ 1:4; 8:18-21
నిర్గ. 29:16హెబ్రీ 9:22
నిర్గ. 29:17లేవీ 1:13
నిర్గ. 29:18ఆది 8:21
నిర్గ. 29:19లేవీ 8:22-24
నిర్గ. 29:21నిర్గ 30:23-25
నిర్గ. 29:21లేవీ 8:30
నిర్గ. 29:22లేవీ 3:9, 10
నిర్గ. 29:22లేవీ 8:22, 25-28
నిర్గ. 29:26లేవీ 8:29; కీర్త 99:6
నిర్గ. 29:27నిర్గ 29:22
నిర్గ. 29:28లేవీ 7:34; 10:14
నిర్గ. 29:28లేవీ 7:11, 14
నిర్గ. 29:29నిర్గ 28:4
నిర్గ. 29:29సం 20:26
నిర్గ. 29:30లేవీ 8:35
నిర్గ. 29:31లేవీ 8:31
నిర్గ. 29:321కొ 9:13
నిర్గ. 29:33లేవీ 22:10; సం 3:10
నిర్గ. 29:34లేవీ 8:32
నిర్గ. 29:35లేవీ 8:4, 33
నిర్గ. 29:36నిర్గ 30:26, 28; లేవీ 8:11; సం 7:1
నిర్గ. 29:37నిర్గ 40:10
నిర్గ. 29:382ది 2:4; హెబ్రీ 7:27; 10:11
నిర్గ. 29:39సం 28:4-6
నిర్గ. 29:42నిర్గ 25:22; లేవీ 1:1; సం 17:4
నిర్గ. 29:43నిర్గ 40:34; సం 12:5; 1రా 8:11
నిర్గ. 29:44లేవీ 22:9
నిర్గ. 29:45నిర్గ 25:8; లేవీ 26:12; జెక 2:11; 2కొ 6:16
నిర్గ. 29:46నిర్గ 20:2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 29:1-46

నిర్గమకాండం

29 “వాళ్లు నాకు యాజకులుగా సేవ చేసేలా వాళ్లను పవిత్రపర్చడానికి నువ్వు ఇలా చేయాలి: ఒక కోడెదూడను, ఏ దోషంలేని రెండు పొట్టేళ్లను+ తీసుకోవాలి. 2 అలాగే పులవని రొట్టెను, పులవని పిండితో చేసి నూనె కలిపిన భక్ష్యాల్ని,* పులవని పిండితో చేసి నూనె పూసిన అప్పడాల్ని తీసుకోవాలి. వాటిని నువ్వు మెత్తని గోధుమ పిండితో చేయాలి. 3 నువ్వు వాటిని గంపలో పెట్టి, గంపతోపాటు ఆ కోడెదూడను, రెండు పొట్టేళ్లను నా ముందుకు తీసుకురావాలి.+

4 “నువ్వు అహరోనును, అతని కుమారుల్ని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం+ దగ్గరికి తీసుకొచ్చి వాళ్లకు నీళ్లతో స్నానం చేయించాలి.+ 5 తర్వాత నువ్వు ఆ వస్త్రాల్ని+ తీసుకొని అందులోని చొక్కాను, ఏఫోదు లోపల వేసుకునే చేతుల్లేని నిలువుటంగీని, ఏఫోదును, వక్షపతకాన్ని అహరోనుకు తొడిగి, ఆ ఏఫోదు కదలకుండా ఉండేలా దాని దట్టీని* అతని నడుము చుట్టూ కట్టాలి.+ 6 అలాగే అతని తలమీద తలపాగా పెట్టి, సమర్పణకు గుర్తుగా ఉన్న పవిత్రమైన బంగారు రేకును* దానిమీద కట్టాలి.+ 7 అలాగే, అభిషేక తైలాన్ని+ తీసుకొని అతని తలమీద పోసి అతన్ని అభిషేకించాలి.+

8 “తర్వాత అతని కుమారుల్ని ముందుకు తీసుకొచ్చి, వాళ్లకు చొక్కాలు తొడిగి,+ 9 అహరోనుకు, అతని కుమారులకు నడుము చుట్టూ దట్టీలు కట్టాలి; అలాగే వాళ్లకు తలపాగాలు పెట్టాలి. అప్పుడు యాజకత్వం వాళ్లదౌతుంది, ఇది ఎప్పటికీ ఉండే శాసనం.+ అహరోను, అతని కుమారులు యాజకులుగా సేవ చేసేలా నువ్వు వాళ్లను ఈ విధంగా ప్రతిష్ఠించాలి.*+

10 “తర్వాత నువ్వు ఆ కోడెదూడను ప్రత్యక్ష గుడారం ముందుకు తీసుకురావాలి, అప్పుడు అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులు ఉంచుతారు.+ 11 నువ్వు ఆ కోడెదూడను ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా ముందు వధించు.+ 12 ఆ కోడెదూడ రక్తంలో కొంచెం నీ వేలితో తీసుకొని దాన్ని బలిపీఠం కొమ్ముల+ మీద పూసి, మిగతా రక్తమంతా బలిపీఠం అడుగుభాగం దగ్గర పోయి.+ 13 తర్వాత పేగుల మీదున్న కొవ్వంతటిని,+ కాలేయం మీదున్న కొవ్వును, రెండు మూత్రపిండాల్ని, వాటి మీదున్న కొవ్వును తీసుకొని బలిపీఠం నుండి పొగ పైకిలేచేలా దాన్ని కాల్చాలి.+ 14 అయితే ఆ కోడెదూడ మాంసాన్ని, దాని చర్మాన్ని, దాని పేడను పాలెం బయట కాల్చేయాలి. ఇది పాపపరిహారార్థ బలి.

15 “తర్వాత నువ్వు ఆ రెండు పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకో. అప్పుడు అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులు ఉంచాలి.+ 16 నువ్వు ఆ పొట్టేలును వధించి, దాని రక్తాన్ని తీసుకొని, బలిపీఠం నాలుగు వైపులా దాన్ని చిలకరించాలి.+ 17 ఆ పొట్టేలును ముక్కలుగా కోసి, దాని పేగుల్నీ కాళ్లనూ* కడిగి,+ ఆ ముక్కల్ని దాని తలతోపాటు చేర్చి పెట్టు. 18 నువ్వు ఆ పొట్టేలు మొత్తాన్ని తీసుకొని, బలిపీఠం నుండి పొగ పైకిలేచేలా దాన్ని కాల్చాలి. అది యెహోవాకు దహనబలి, ఇంపైన* సువాసన.+ ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ.

19 “తర్వాత నువ్వు రెండో పొట్టేలును తీసుకోవాలి. అప్పుడు అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులు ఉంచాలి.+ 20 నువ్వు ఆ పొట్టేలును వధించి, దాని రక్తంలో కొంచెం తీసుకొని అహరోను కుడిచెవి తమ్మెమీద, అతని కుమారుల కుడిచెవుల తమ్మెలమీద, వాళ్ల కుడిచేతి బొటనవేళ్ల మీద, వాళ్ల కుడికాళ్ల బొటనవేళ్ల మీద దాన్ని పూయాలి; అలాగే, బలిపీఠం నాలుగు వైపులా ఆ రక్తాన్ని చిలకరించాలి. 21 తర్వాత బలిపీఠం మీదున్న రక్తంలో కొంచెం, అభిషేక తైలంలో+ కొంచెం తీసుకొని అహరోను, అతని వస్త్రాలు, అతని కుమారులు, వాళ్ల వస్త్రాలు పవిత్రంగా ఉండేలా వాటిని అతని మీద, అతని వస్త్రాల మీద, అతని కుమారుల మీద, వాళ్ల వస్త్రాల మీద చిమ్మాలి.+

22 “తర్వాత నువ్వు ఆ పొట్టేలు కొవ్వును, దాని కొవ్విన తోకను, పేగుల మీదున్న కొవ్వును, కాలేయం మీదున్న కొవ్వును, రెండు మూత్రపిండాల్ని, వాటిమీద ఉన్న కొవ్వును,+ దాని కుడికాలును తీసుకో; ఎందుకంటే అది ప్రతిష్ఠాపన పొట్టేలు.+ 23 అలాగే, యెహోవా ముందున్న పులవని రొట్టెల గంపలో నుండి ఒక గుండ్రటి రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యాన్ని,* ఒక అప్పడాన్ని తీసుకో. 24 నువ్వు వాటన్నిటినీ అహరోను చేతుల్లో, అతని కుమారుల చేతుల్లో ఉంచి, వాటిని అల్లాడించే అర్పణగా యెహోవా ఎదుట ముందుకు, వెనుకకు కదిలించాలి. 25 తర్వాత నువ్వు వాటిని వాళ్ల చేతుల్లో నుండి తీసుకొని యెహోవా ముందు బలిపీఠం మీద, దహనబలి పైన వాటిని కాల్చాలి; అది ఆయనకు ఇంపైన* సువాసన. ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ.

26 “తర్వాత అహరోను కోసం అర్పించిన ప్రతిష్ఠాపన పొట్టేలు ఛాతి భాగాన్ని తీసుకొని+ దాన్ని అల్లాడించే అర్పణగా యెహోవా ఎదుట ముందుకు, వెనుకకు కదిలించాలి; ఆ భాగం నీది అవుతుంది. 27 అహరోను కోసం, అతని కుమారుల కోసం అర్పించిన అల్లాడించే అర్పణలోని ఛాతి భాగాన్నీ, ప్రతిష్ఠాపన పొట్టేలు నుండి తీసుకొని అల్లాడించిన పవిత్ర భాగంలోని కాలునూ నువ్వు పవిత్రపర్చాలి.+ 28 అది అహరోనుకు, అతని కుమారులకు చెందాలి; ఈ శాసనాన్ని ఇశ్రాయేలీయులు ఎప్పటికీ పాటించాలి. ఎందుకంటే అది పవిత్రమైన భాగం; అది ఇశ్రాయేలీయులు ఇవ్వాల్సిన పవిత్ర భాగం అవుతుంది.+ అది వాళ్లు తమ సమాధాన బలుల్లో నుండి యెహోవాకు ఇచ్చే పవిత్రమైన భాగం.+

29 “అహరోనుకు చెందిన పవిత్ర వస్త్రాల్ని+ అతని తర్వాత అతని కుమారులు ఉపయోగిస్తారు;+ వాళ్లు యాజకులుగా అభిషేకించబడి, ప్రతిష్ఠించబడినప్పుడు వాటిని ఉపయోగిస్తారు. 30 అతని తర్వాత అతని కుమారుల్లో ఎవరైతే యాజకుడు అయ్యి, పవిత్ర స్థలంలో సేవ చేయడానికి ప్రత్యక్ష గుడారంలోకి వస్తాడో అతను ఏడురోజుల పాటు వాటిని వేసుకుంటాడు.+

31 “నువ్వు ప్రతిష్ఠాపన పొట్టేలును తీసుకొని, దాని మాంసాన్ని పవిత్రమైన చోట ఉడకబెట్టాలి.+ 32 అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు మాంసాన్ని, ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరున్న గంపలోని రొట్టెను తింటారు.+ 33 వాళ్లను యాజకులుగా ప్రతిష్ఠించి* పవిత్రపర్చడానికి వేటితోనైతే ప్రాయశ్చిత్తం చేశారో వాటిని వాళ్లు తినాలి. అయితే వేరేవాళ్లు* ఎవ్వరూ వాటిని తినకూడదు, ఎందుకంటే అవి పవిత్రమైనవి.+ 34 ప్రతిష్ఠాపన బలి మాంసంలో, రొట్టెలో కొంచెమైనా ఉదయం వరకు మిగిలితే, ఆ మిగిలినదాన్ని నువ్వు అగ్నితో కాల్చేయాలి.+ దాన్ని తినకూడదు, ఎందుకంటే అది పవిత్రమైనది.

35 “నువ్వు అహరోనుకు, అతని కుమారులకు ఇలా చేయాలి. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారం చేయాలి. వాళ్లను యాజకులుగా ప్రతిష్ఠించడానికి* నువ్వు ఏడురోజులు తీసుకోవాలి.+ 36 నువ్వు ప్రాయశ్చిత్తం కోసం పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను ప్రతీరోజు అర్పించాలి. అలాగే బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేసి పాపం నుండి దాన్ని శుద్ధీకరించాలి, అలాగే దాన్ని పవిత్రపర్చడానికి దాన్ని అభిషేకించాలి.+ 37 బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నువ్వు ఏడురోజులు తీసుకోవాలి, అది అతి పవిత్రమైన బలిపీఠం అయ్యేలా దాన్ని పవిత్రపర్చాలి.+ ఆ బలిపీఠాన్ని ముట్టుకునే ఏ వ్యక్తయినా పవిత్రంగా ఉండాలి.

38 “నువ్వు బలిపీఠం మీద వీటిని అర్పించాలి: ఏడాది వయసున్న రెండు పొట్టేళ్లను ప్రతీరోజు అర్పించాలి, అలా ఎప్పటికీ చేయాలి.+ 39 ఉదయం ఒక పొట్టేలును, సంధ్య వెలుగు సమయంలో* ఒక పొట్టేలును అర్పించాలి.+ 40 ఈఫా కొలతలో* పదోవంతు మెత్తని పిండిని హిన్‌లో* నాలుగో వంతు దంచితీసిన నూనెతో కలపాలి. దాన్నీ, అలాగే పానీయార్పణగా ఒక హిన్‌లో నాలుగో వంతు ద్రాక్షారసాన్నీ తీసుకొని మొదటి పొట్టేలుతో పాటు అర్పించాలి. 41 నువ్వు రెండో పొట్టేలును సంధ్య వెలుగు సమయంలో* అర్పించాలి. దాన్ని కూడా ఉదయం అర్పించినట్టే ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు అర్పించాలి. ఇది నువ్వు యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన* సువాసన. 42 ఇది యెహోవా ముందు ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర మీరు తరతరాలపాటు క్రమంగా అర్పించాల్సిన దహనబలి. అక్కడ నేను మీకు కనిపించి మీతో మాట్లాడతాను.+

43 “నేను అక్కడ ఇశ్రాయేలీయులకు కనిపిస్తాను, నా మహిమ వల్ల ఆ చోటు పవిత్రమౌతుంది.+ 44 నేను ప్రత్యక్ష గుడారాన్ని, బలిపీఠాన్ని పవిత్రపరుస్తాను; అలాగే నాకు యాజకులుగా సేవచేసేలా అహరోనును, అతని కుమారుల్ని పవిత్రపరుస్తాను.+ 45 నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తాను, నేను వాళ్ల దేవుడిగా ఉంటాను.+ 46 వాళ్లమధ్య నివసించడానికి వాళ్లను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన వాళ్ల దేవుడైన యెహోవాను నేనే అని వాళ్లు తప్పకుండా తెలుసుకుంటారు.+ నేను వాళ్ల దేవుడైన యెహోవాను.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి