కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • హెబ్రీయులు 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

హెబ్రీయులు విషయసూచిక

      • యేసు మోషే కన్నా గొప్పవాడు (1-6)

        • అన్నిటినీ కట్టింది దేవుడే (4)

      • విశ్వాసం లేకపోవడానికి సంబంధించిన హెచ్చరిక (7-19)

        • “ఈ రోజు మీరు ఆయన స్వరాన్ని వింటే” (7, 15)

హెబ్రీయులు 3:1

అధస్సూచీలు

  • *

    లేదా “పంపబడినవానిగా.”

  • *

    లేదా “ఒప్పుకునే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఫిలి 3:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీలు 11-12

హెబ్రీయులు 3:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 12:7
  • +యోహా 8:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీ 11

హెబ్రీయులు 3:3

అధస్సూచీలు

  • *

    అంటే, యేసు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 17:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీ 11

హెబ్రీయులు 3:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 6

    దేవుడు శ్రద్ధ కల్గియున్నాడా?, పేజీ 8

    కావలికోట,

    7/15/1998, పేజీ 11

    5/1/1998, పేజీలు 3-4

    “ఇదిగో” బ్రోషుర్‌, పేజీలు 9-10

హెబ్రీయులు 3:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీ 11

హెబ్రీయులు 3:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 2:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీలు 11-12

హెబ్రీయులు 3:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 23:2; అపొ 1:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీలు 12-13

హెబ్రీయులు 3:8

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 17:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీలు 12-13

హెబ్రీయులు 3:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 32:13; కీర్త 95:9

హెబ్రీయులు 3:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2011, పేజీలు 25-26

    7/15/1998, పేజీలు 12-13

హెబ్రీయులు 3:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:22, 23; కీర్త 95:7-11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2011, పేజీలు 25-26

హెబ్రీయులు 3:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 2:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 101

    కావలికోట,

    12/15/2013, పేజీ 9

    3/15/2010, పేజీలు 30-31

    7/15/1999, పేజీ 19

    7/15/1998, పేజీలు 9, 13-14

    1/1/1998, పేజీ 8

హెబ్రీయులు 3:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 95:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 101

    కావలికోట,

    1/1/1998, పేజీ 8

హెబ్రీయులు 3:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 2:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1996, పేజీలు 21-24

హెబ్రీయులు 3:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 95:7, 8

హెబ్రీయులు 3:16

అధస్సూచీలు

  • *

    లేదా “ఈజిప్టు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 17:1-3; సం 14:2, 4

హెబ్రీయులు 3:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:11; ద్వితీ 32:21
  • +సం 14:22, 23, 28-30; యూదా 5

హెబ్రీయులు 3:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీలు 16-17

హెబ్రీయులు 3:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 4:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1998, పేజీలు 16-17

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

హెబ్రీ. 3:1ఫిలి 3:14
హెబ్రీ. 3:2సం 12:7
హెబ్రీ. 3:2యోహా 8:29
హెబ్రీ. 3:3మత్త 17:1, 2
హెబ్రీ. 3:61పే 2:5
హెబ్రీ. 3:72స 23:2; అపొ 1:16
హెబ్రీ. 3:8నిర్గ 17:7
హెబ్రీ. 3:9సం 32:13; కీర్త 95:9
హెబ్రీ. 3:11సం 14:22, 23; కీర్త 95:7-11
హెబ్రీ. 3:12హెబ్రీ 2:1
హెబ్రీ. 3:13కీర్త 95:7
హెబ్రీ. 3:14ప్రక 2:10
హెబ్రీ. 3:15కీర్త 95:7, 8
హెబ్రీ. 3:16నిర్గ 17:1-3; సం 14:2, 4
హెబ్రీ. 3:17సం 14:11; ద్వితీ 32:21
హెబ్రీ. 3:17సం 14:22, 23, 28-30; యూదా 5
హెబ్రీ. 3:19హెబ్రీ 4:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
హెబ్రీయులు 3:1-19

హెబ్రీయులు

3 కాబట్టి, పరలోక పిలుపులో వంతు ఉన్న+ పవిత్ర సహోదరులారా, అపొస్తలుడిగా,* ప్రధానయాజకుడిగా మనం అంగీకరించే* యేసు గురించి ఆలోచించండి. 2 దేవుని ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్న మోషేలాగే+ యేసు కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు.+ 3 ఆయన* మోషే కన్నా ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడ్డాడు.+ ఎందుకంటే ఇంటి కన్నా ఇల్లు కట్టే వ్యక్తికే ఎక్కువ ఘనత కలుగుతుంది. 4 నిజమే, ప్రతీ ఇంటిని ఎవరో ఒకరు కడతారు; అయితే అన్నిటినీ కట్టింది దేవుడే. 5 మోషే ఒక సేవకుడిగా దేవుని ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నాడు; అది, ఆ తర్వాత దేవుడు చెప్పబోయేవాటికి సాక్ష్యంగా పనిచేసింది. 6 అయితే క్రీస్తు ఒక కుమారుడిగా దేవుని ఇంటిని చూసుకునే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. మనమే దేవుని ఇల్లు.+ కానీ మనం, మాట్లాడే విషయంలో మనకున్న ధైర్యాన్ని, మనం గొప్పగా చెప్పుకునే నిరీక్షణను అంతం వరకు చెక్కుచెదరకుండా కాపాడుకుంటేనే దేవుని ఇల్లుగా ఉంటాం.

7 కాబట్టి, పవిత్రశక్తి ద్వారా ఇలా చెప్పబడింది:+ “ఈ రోజు మీరు ఆయన స్వరాన్ని వింటే, 8 మీ పూర్వీకులు నాకు విపరీతమైన కోపం తెప్పించిన సందర్భంలో తమ హృదయాల్ని కఠినపర్చుకున్నట్టు మీ హృదయాల్ని కఠినపర్చుకోకండి. వాళ్లు ఎడారిలో* పరీక్ష రోజున తమ హృదయాల్ని కఠినపర్చుకున్నారు.+ 9 అక్కడే మీ పూర్వీకులు 40 ఏళ్లపాటు నేను చేసిన పనుల్ని చూసి కూడా నన్ను పరీక్షించారు, సవాలుచేశారు.+ 10 అందుకే ఆ తరంవాళ్లతో విసిగిపోయి నేను ఇలా అన్నాను: ‘వీళ్ల హృదయాలు ఎప్పుడూ పక్కదారి పడుతూ ఉంటాయి, వీళ్లు నా మార్గాల్ని తెలుసుకోలేదు.’ 11 కాబట్టి నేను కోపంతో, ‘వీళ్లు నా విశ్రాంతిలోకి ప్రవేశించరు’ అని ప్రమాణం చేశాను.”+

12 సహోదరులారా, జీవంగల దేవునికి దూరమవ్వడం వల్ల మీలో ఎవరి హృదయమైనా విశ్వాసంలేని దుష్ట హృదయంగా మారిపోయే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి;+ 13 బదులుగా, “ఈ రోజు”+ అనేది ఉన్నంతకాలం ప్రతీరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండండి. అప్పుడే, పాపానికున్న మోసకరమైన శక్తి వల్ల మీలో ఎవరి హృదయమూ కఠినమైపోకుండా ఉంటుంది. 14 మొదట్లో మనకున్న నమ్మకాన్ని చివరి వరకు దృఢంగా ఉంచుకుంటేనే, క్రీస్తు పొందిన దాన్ని మనం పొందుతాం.+ 15 లేఖనం చెప్పినట్టే, “ఈ రోజు మీరు ఆయన స్వరాన్ని వింటే, మీ పూర్వీకులు నాకు విపరీతమైన కోపం తెప్పించిన సందర్భంలో తమ హృదయాల్ని కఠినపర్చుకున్నట్టు మీ హృదయాల్ని కఠినపర్చుకోకండి.”+

16 ఆయన స్వరం విని కూడా ఆయనకు విపరీతమైన కోపం తెప్పించింది ఎవరు? మోషే నాయకత్వంలో ఐగుప్తు* నుండి బయటికి వచ్చిన వాళ్లందరూ కాదా?+ 17 దేవుడు 40 ఏళ్లపాటు ఎవరితో విసిగిపోయాడు?+ పాపం చేసినవాళ్లతో కాదా? వాళ్ల శవాలు ఎడారిలోనే రాలిపోయాయి.+ 18 తన విశ్రాంతిలోకి అడుగుపెట్టనివ్వనని ఆయన ఎవరితో ప్రమాణం చేశాడు? అవిధేయంగా ప్రవర్తించినవాళ్లతో కాదా? 19 కాబట్టి, విశ్వాసం లేకపోవడం వల్లే వాళ్లు ఆయన విశ్రాంతిలోకి అడుగుపెట్టలేకపోయారని+ మనకు అర్థమౌతుంది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి