యోబు
31 “నేను నా కళ్లతో ఒప్పందం* చేసుకున్నాను.+
కన్యను నేనెలా తప్పుడు దృష్టితో చూడగలను?
2 అలా చూస్తే, పైనున్న దేవుని నుండి నేను పొందే ప్రతిఫలం ఏంటి?
ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తిమంతుడు నాకిచ్చే స్వాస్థ్యం ఏంటి?
3 తప్పుచేసేవాడి మీదికి ఆపద,
హానిచేసేవాళ్ల మీదికి విపత్తు వస్తుంది కదా.+
4 ఆయన నా దారుల్ని చూస్తున్నాడు,+
నా అడుగులన్నిటినీ లెక్కపెడుతున్నాడు.
5 నేనెప్పుడైనా అసత్య మార్గంలో* నడిచానా?
నా పాదాలు మోసం చేయడానికి పరుగెత్తాయా?+
7 నా అడుగులు సరైన దారి నుండి పక్కకు మళ్లితే,+
నా హృదయం నా కళ్లను అనుసరించి ఉంటే,+
నా చేతులు అపవిత్రమై ఉంటే,
8 నేను విత్తిన దాన్ని వేరేవాళ్లు తినాలి,+
నేను నాటే మొక్కలు* పెరికేయబడాలి.
9 నా హృదయం పర స్త్రీని కోరుకొని ఉంటే,+
నేను నా పొరుగువాని తలుపు దగ్గర కాచుకొని ఉంటే,+
10 నా భార్య వేరే అతని తిరుగలి విసరాలి,
వేరేవాళ్లు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవాలి.+
11 ఎందుకంటే అది అవమానకరమైన ప్రవర్తన,
న్యాయమూర్తుల చేత శిక్ష పొందాల్సిన తప్పు.+
12 మింగేసి, నాశనం చేసే అగ్నిలా+
అది నా పంట అంతటినీ వేర్లతో సహా దహించేస్తుంది.
13 నా సేవకులు, సేవకురాళ్లు నా మీద ఫిర్యాదు చేసినప్పుడు
నేను వాళ్లకు న్యాయం చేయకపోయుంటే,
ఆయన లెక్క అడిగినప్పుడు ఏం జవాబు చెప్పగలను?+
15 తల్లి గర్భంలో నన్ను తయారుచేసిన వ్యక్తే వాళ్లను కూడా తయారుచేశాడు కదా?+
పుట్టకముందు* మమ్మల్ని రూపొందించింది ఒక్కడే కదా?+
16 నేను పేదవాళ్లకు వాళ్లు కోరుకున్నది ఇవ్వకపోయుంటే,+
విధవరాలి కళ్లను క్షీణింపజేసివుంటే;+
17 నా ఆహారాన్ని అనాథలతో పంచుకోకుండా నేనొక్కడినే తినివుంటే;+
18 (ఎందుకంటే, నా బాల్యం నుండి అనాథ* నాతోపాటే పెరిగాడు, నేనే వాడికి తండ్రిలా ఉన్నాను,
నేను నా చిన్నప్పటి* నుండి విధవరాలికి* సహాయం చేస్తూ వచ్చాను.)
19 ఎవరైనా బట్టలు లేక చలిలో నశించిపోవడం గానీ,
పేదవాడికి కప్పుకోవడానికి ఏమీ లేకపోవడం గానీ చూసి నేను సహాయం చేయకపోయుంటే;+
20 అతను నా గొర్రెల ఉన్నితో వెచ్చదనం పొంది నన్ను దీవించకపోయుంటే;+
21 నగర ద్వారం+ దగ్గర నా సహాయం అవసరమైన* అనాథను
నేను బెదిరించివుంటే;+
22 నా భుజం పడిపోవాలి,
నా మోచేయి విరిగిపోవాలి.
23 ఎందుకంటే, నేను దేవుడు విపత్తు తెస్తాడని భయపడ్డాను,
నేను ఆయన ఘనత ముందు నిలబడలేకపోయాను.
24 నేను బంగారాన్ని నమ్ముకొనివుంటే,
‘నన్ను కాపాడేది నువ్వే!’ అని మేలిమి బంగారంతో అనివుంటే;+
25 నా గొప్ప సంపదల్ని బట్టి,
నేను సంపాదించిన విస్తారమైన ఆస్తుల్ని బట్టి గొప్పలు చెప్పుకొనివుంటే;+
చంద్రుడు తన వైభవంతో కదలడం గానీ చూసి+
27 నా హృదయం లోలోపల ప్రలోభానికి గురై,
వాటిని పూజిస్తూ నేను నా చేతిని ముద్దుపెట్టుకొని ఉంటే;+
28 అది న్యాయమూర్తుల చేత శిక్ష పొందాల్సిన తప్పు,
ఎందుకంటే, నేను పైనున్న సత్యదేవుణ్ణి తిరస్కరించినట్టే.
32 పరదేశులెవ్వరూ రాత్రి బయట గడపాల్సిన అవసరం రాలేదు;+
నేను ప్రయాణికుల కోసం నా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను.
33 నా వస్త్రపు జేబులో నా తప్పును దాచిపెట్టి,
వేరేవాళ్లలా నా అపరాధాల్ని కప్పిపుచ్చడానికి ఎప్పుడైనా ప్రయత్నించానా?+
34 పెద్ద గుంపుకు భయపడిపోయి,
లేక వేరే కుటుంబాలు నీచంగా చూస్తాయేమోనని బెదిరిపోయి,
ఏమీ మాట్లాడకుండా ఇంట్లోనే ఉండిపోయానా?
35 ఎవరైనా నా మాటలు వింటే బావుండు!+
నేను అన్న మాటలన్నీ నిజమని సంతకం పెడతాను.
సర్వశక్తిమంతుడు నాకు జవాబివ్వాలి!+
నన్ను నిందించే వ్యక్తి నా మీది ఆరోపణల్ని దస్తావేజులో రాస్తే బావుండు!
36 నేను దాన్ని నా భుజం మీద మోస్తాను,
నా తల మీద కిరీటంలా పెట్టుకుంటాను.
37 నేను వేసిన ప్రతీ అడుగుకు ఆయనకు లెక్క చెప్తాను;
అధిపతిలా ధైర్యంగా ఆయన ముందుకు వెళ్తాను.
38 నా భూమే నాకు వ్యతిరేకంగా మొరపెడితే,
దాని చాళ్లన్నీ కలిసి ఏడిస్తే;
39 నేను ఏమీ చెల్లించకుండానే దాని ఫలాన్ని తినివుంటే,+
లేదా దాని యజమానుల్ని బాధపెట్టి ఉంటే;+
40 గోధుమలకు బదులు ముళ్ల చెట్లు,
బార్లీకి బదులు దుర్వాసన వచ్చే కలుపు మొక్కలు మొలవాలి.”
ఇక్కడితో యోబు మాటలు పూర్తయ్యాయి.