కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • ఫిలిష్తీయులు మందసాన్ని స్వాధీనం చేసుకోవడం (1-11)

      • ఏలీ, అతని కుమారులు చనిపోవడం (12-22)

1 సమూయేలు 4:3

అధస్సూచీలు

  • *

    అక్ష., “యెహోవా మనల్ని ఎందుకు ఓడించాడు?”

  • *

    లేదా “నిబంధన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:15, 25; 32:30; న్యా 2:14
  • +2స 15:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2015, పేజీ 27

1 సమూయేలు 4:4

అధస్సూచీలు

  • *

    లేదా “మధ్య” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 25:18; సం 7:89; 2రా 19:15; కీర్త 80:1
  • +1స 2:12

1 సమూయేలు 4:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 14:25; 15:14

1 సమూయేలు 4:8

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 7:5; కీర్త 78:43, 51

1 సమూయేలు 4:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:48; న్యా 10:7; 13:1

1 సమూయేలు 4:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:14, 17; ద్వితీ 28:25; 1స 4:2

1 సమూయేలు 4:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 2:31, 34; 4:3, 17; కీర్త 78:61, 64

1 సమూయేలు 4:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 7:6

1 సమూయేలు 4:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 4:4

1 సమూయేలు 4:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 3:2

1 సమూయేలు 4:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 3:11
  • +1స 2:34
  • +1స 4:10, 11

1 సమూయేలు 4:21

అధస్సూచీలు

  • *

    “మహిమ ఎక్కడ?” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 78:61
  • +1స 14:3
  • +1స 2:32, 34; 4:5, 11

1 సమూయేలు 4:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 4:11; యిర్మీ 7:12

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 4:3ద్వితీ 28:15, 25; 32:30; న్యా 2:14
1 సమూ. 4:32స 15:25
1 సమూ. 4:4నిర్గ 25:18; సం 7:89; 2రా 19:15; కీర్త 80:1
1 సమూ. 4:41స 2:12
1 సమూ. 4:7నిర్గ 14:25; 15:14
1 సమూ. 4:8నిర్గ 7:5; కీర్త 78:43, 51
1 సమూ. 4:9ద్వితీ 28:48; న్యా 10:7; 13:1
1 సమూ. 4:10లేవీ 26:14, 17; ద్వితీ 28:25; 1స 4:2
1 సమూ. 4:111స 2:31, 34; 4:3, 17; కీర్త 78:61, 64
1 సమూ. 4:12యెహో 7:6
1 సమూ. 4:131స 4:4
1 సమూ. 4:151స 3:2
1 సమూ. 4:171స 3:11
1 సమూ. 4:171స 2:34
1 సమూ. 4:171స 4:10, 11
1 సమూ. 4:21కీర్త 78:61
1 సమూ. 4:211స 14:3
1 సమూ. 4:211స 2:32, 34; 4:5, 11
1 సమూ. 4:221స 4:11; యిర్మీ 7:12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 4:1-22

సమూయేలు మొదటి గ్రంథం

4 ఆయన సమూయేలు ద్వారా ఇశ్రాయేలు అంతటా మాట్లాడుతూ ఉన్నాడు.

తర్వాత ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్లారు; వాళ్లు ఎబెనెజరు పక్కన మకాం వేశారు, ఫిలిష్తీయులు ఆఫెకులో మకాం వేశారు. 2 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో పోరాడడానికి యుద్ధ పంక్తులు తీరారు; యుద్ధం ఘోరంగా జరగడంతో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతుల్లో ఓడిపోయారు, ఫిలిష్తీయులు యుద్ధభూమిలో దాదాపు 4,000 మందిని చంపారు. 3 ప్రజలు శిబిరంలోకి తిరిగొచ్చినప్పుడు, ఇశ్రాయేలు పెద్దలు ఇలా అన్నారు: “ఈ రోజు ఫిలిష్తీయుల చేతిలో యెహోవా మనల్ని ఎందుకు ఓడిపోనిచ్చాడు?*+ మనం షిలోహు నుండి యెహోవా ఒప్పంద* మందసాన్ని తీసుకొద్దాం;+ అప్పుడు అది మనతో ఉంటూ, మన శత్రువుల చేతుల్లో నుండి మనల్ని కాపాడుతుంది.” 4 కాబట్టి ప్రజలు కొంతమందిని షిలోహుకు పంపించారు; వాళ్లు కెరూబుల పైన* సింహాసనంలో కూర్చున్న+ సైన్యాలకు అధిపతైన యెహోవా ఒప్పంద మందసాన్ని అక్కడి నుండి తీసుకొచ్చారు. ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసు+ కూడా సత్యదేవుని ఒప్పంద మందసంతో పాటు ఉన్నారు.

5 యెహోవా ఒప్పంద మందసం శిబిరంలోకి రాగానే ఇశ్రాయేలీయులందరూ గట్టిగా కేకలు వేశారు, దాంతో భూమి కంపించింది. 6 ఆ కేకలు విన్నప్పుడు ఫిలిష్తీయులు, “హెబ్రీయుల శిబిరంలో ఎందుకంత గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి?” అని చెప్పుకున్నారు. యెహోవా మందసం శిబిరంలోకి వచ్చిందని తర్వాత వాళ్లకు తెలిసింది. 7 దాంతో ఫిలిష్తీయులు భయపడ్డారు; వాళ్లు, “దేవుడు శిబిరంలోకి వచ్చాడు!”+ అని చెప్పుకున్నారు; అప్పుడు వాళ్లు ఇలా అన్నారు: “ఇది మనకు అస్సలు మంచిది కాదు. గతంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు! 8 ఇది మనకు అస్సలు మంచిది కాదు! ఈ గొప్ప దేవుని చేతుల్లో నుండి మనల్ని ఎవరు రక్షిస్తారు? ఎడారిలో* అనేక రకాల తెగుళ్లతో ఐగుప్తును హతం చేసింది ఈ దేవుడే.+ 9 ఫిలిష్తీయులారా, మగవాళ్లలా ధైర్యంగా ఉండండి. అప్పుడే, హెబ్రీయులు మీకు సేవచేసినట్టు,+ మీరు వాళ్లకు సేవచేయకుండా ఉండగలుగుతారు; మగవాళ్లలా యుద్ధం చేయండి!” 10 దాంతో ఫిలిష్తీయులు యుద్ధం చేసి, ఇశ్రాయేలీయుల్ని ఓడించారు.+ అప్పుడు ఇశ్రాయేలీయుల్లో ప్రతీ ఒక్కరు తమతమ డేరాలకు పారిపోయారు. పెద్ద ఎత్తున వధ జరిగింది; ఇశ్రాయేలీయుల వైపు 30,000 మంది సైనికులు చనిపోయారు. 11 అంతేకాదు, ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నారు; ఏలీ ఇద్దరు కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులు చనిపోయారు.+

12 ఆ రోజు, బెన్యామీను గోత్రానికి చెందిన ఒకతను యుద్ధభూమి నుండి పరుగెత్తుకొని షిలోహుకు వచ్చాడు. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, అతని తలమీద దుమ్ము ఉంది.+ 13 అతను వచ్చినప్పుడు ఏలీ, దారిపక్కన ఒక పీఠం మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు; ఎందుకంటే సత్యదేవుని మందసం విషయంలో అతను ఎంతో ఆందోళన పడుతున్నాడు.+ ఆ వ్యక్తి నగరంలోకి వెళ్లి జరిగింది చెప్పాడు. అప్పుడు ఆ నగరంలోని వాళ్లందరూ బోరున ఏడ్వడం మొదలుపెట్టారు. 14 ఏలీ ఆ కేకలు విని, “ఏంటి గోలగోలగా ఉంది?” అని అడిగాడు. అప్పుడు అతను పరుగెత్తుకొచ్చి, జరిగింది ఏలీకి చెప్పాడు. 15 (ఏలీకి అప్పుడు 98 ఏళ్లు. అతని కళ్లు తిన్నగా చూస్తున్నాయి, కానీ అతనికి ఏమీ కనిపించడంలేదు.)+ 16 అతను ఏలీతో, “యుద్ధభూమి నుండి వచ్చింది నేనే! ఈ రోజే నేను యుద్ధభూమి నుండి పారిపోయి వచ్చాను” అన్నాడు. అప్పుడు ఏలీ అతన్ని, “నా కుమారుడా, ఏమి జరిగింది?” అని అడిగాడు. 17 ఆ వార్త తెచ్చిన వ్యక్తి ఇలా వివరించాడు: “ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయారు, ప్రజలు ఘోరంగా ఓడిపోయారు;+ నీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులు కూడా చనిపోయారు,+ సత్యదేవుని మందసం స్వాధీనం చేసుకోబడింది.”+

18 అతను సత్యదేవుని మందసం గురించి చెప్పగానే ఏలీ, ద్వారం పక్కనున్న తన పీఠం మీద నుండి వెనక్కి పడి, మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతను ముసలివాడు, పైగా చాలా లావుగా ఉండేవాడు; అతను ఇశ్రాయేలులో 40 సంవత్సరాలు న్యాయం తీర్చాడు. 19 అతని కోడలు, అంటే ఫీనెహాసు భార్య అప్పుడు గర్భవతి; ఆమె కాన్పు సమయం దగ్గరపడింది. సత్యదేవుని మందసం స్వాధీనం చేసుకోబడిందని, తన మామ, భర్త చనిపోయారని వినగానే ఆమెకు ఉన్నట్టుండి పురిటినొప్పులు మొదలయ్యాయి, ఆమె ప్రసవించింది. 20 ఆమె చనిపోతుండగా, ఆమె పక్కన నిలబడివున్న స్త్రీలు ఆమెతో, “భయపడొద్దు, నీకు కుమారుడు పుట్టాడు” అని చెప్పారు. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు, వాళ్ల మాటల్ని పట్టించుకోలేదు. 21 అయితే ఆమె, “ఇశ్రాయేలు మహిమ చెరలోకి తీసుకెళ్లబడింది”+ అంటూ ఆ బాబుకు ఈకాబోదు*+ అని పేరు పెట్టింది. సత్యదేవుని మందసం స్వాధీనం చేసుకోబడడాన్ని, తన మామ, తన భర్త చనిపోవడాన్ని+ సూచిస్తూ ఆమె ఆ మాట అంది. 22 ఆమె ఇలా అంది: “ఇశ్రాయేలు మహిమ చెరలోకి తీసుకెళ్లబడింది, ఎందుకంటే సత్యదేవుని మందసం స్వాధీనం చేసుకోబడింది.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి