కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • దర్శనంలో యెహెజ్కేలును యెరూషలేముకు తీసుకెళ్లడం (1-4)

      • ఆలయంలో అసహ్యమైన వాటిని చూడడం (5-18)

        • స్త్రీలు తమ్మూజు గురించి ఏడ్వడం (14)

        • పురుషులు సూర్యునికి నమస్కారం చేయడం (16)

యెహెజ్కేలు 8:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2018, పేజీ 3

యెహెజ్కేలు 8:2

అధస్సూచీలు

  • *

    వెండిబంగారాల మిశ్రమ లోహం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 7:9
  • +యెహె 1:4, 27

యెహెజ్కేలు 8:3

అధస్సూచీలు

  • *

    ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పవిత్రశక్తిని గానీ ఒక దేవదూతను గానీ సూచించవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 20:2; యెహె 9:2
  • +ద్వితీ 32:16

యెహెజ్కేలు 8:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:34
  • +యెహె 1:27, 28

యెహెజ్కేలు 8:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/1993, పేజీ 27

యెహెజ్కేలు 8:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 26:4, 6
  • +2ది 36:14

యెహెజ్కేలు 8:10

అధస్సూచీలు

  • *

    ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:10
  • +నిర్గ 20:4, 5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/1993, పేజీ 27

యెహెజ్కేలు 8:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 22:3, 4; 25:22; యిర్మీ 26:24
  • +యెహె 16:17, 18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/1993, పేజీ 27

యెహెజ్కేలు 8:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 29:15; యెహె 9:9

యెహెజ్కేలు 8:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/1993, పేజీ 28

యెహెజ్కేలు 8:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:14

యెహెజ్కేలు 8:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 4:9
  • +ద్వితీ 4:19; 2రా 17:16; యిర్మీ 8:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/1993, పేజీ 28

యెహెజ్కేలు 8:17

అధస్సూచీలు

  • *

    విగ్రహారాధనలో ఉపయోగించే కొమ్మను సూచిస్తుందని తెలుస్తోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 21:16; యిర్మీ 19:4; యెహె 9:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/1993, పేజీ 28

యెహెజ్కేలు 8:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 5:11; 7:9
  • +యెష 1:15; మీకా 3:4

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 8:2దాని 7:9
యెహె. 8:2యెహె 1:4, 27
యెహె. 8:3యిర్మీ 20:2; యెహె 9:2
యెహె. 8:3ద్వితీ 32:16
యెహె. 8:4నిర్గ 40:34
యెహె. 8:4యెహె 1:27, 28
యెహె. 8:6యిర్మీ 26:4, 6
యెహె. 8:62ది 36:14
యెహె. 8:10లేవీ 11:10
యెహె. 8:10నిర్గ 20:4, 5
యెహె. 8:112రా 22:3, 4; 25:22; యిర్మీ 26:24
యెహె. 8:11యెహె 16:17, 18
యెహె. 8:12యెష 29:15; యెహె 9:9
యెహె. 8:152ది 36:14
యెహె. 8:162ది 4:9
యెహె. 8:16ద్వితీ 4:19; 2రా 17:16; యిర్మీ 8:1, 2
యెహె. 8:172రా 21:16; యిర్మీ 19:4; యెహె 9:9
యెహె. 8:18యెహె 5:11; 7:9
యెహె. 8:18యెష 1:15; మీకా 3:4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 8:1-18

యెహెజ్కేలు

8 ఆరో సంవత్సరం, ఆరో నెల, ఐదో రోజున నేను నా ఇంట్లో కూర్చొని ఉన్నాను, యూదా పెద్దలు నా ముందు కూర్చొని ఉన్నారు, అప్పుడు సర్వోన్నత ప్రభువైన యెహోవా చెయ్యి అక్కడ నన్ను పట్టుకుంది. 2 నేను చూస్తుండగా, అగ్ని లాంటి ఆకారం నాకు కనిపించింది; ఆయన నడుము నుండి కింది వరకు అగ్నిలా కనిపించింది,+ నడుము నుండి పైవరకు మెరుస్తున్న లోహంలా* ప్రకాశవంతంగా కనిపించింది.+ 3 తర్వాత ఆయన, చెయ్యిలా కనిపించినదాన్ని చాపి, నా జుట్టు పట్టుకున్నాడు, అప్పుడు ఒక శక్తి* నన్ను భూమ్యాకాశాల మధ్యకు ఎత్తి దేవుని దర్శనాల ద్వారా యెరూషలేముకు తీసుకొచ్చింది; ఆలయానికి ఉత్తరం వైపున్న లోపలి ద్వార ప్రవేశం దగ్గరికి,+ రోషం పుట్టించే రోష విగ్రహం ఉన్న చోటికి+ తీసుకొచ్చింది. 4 ఇదిగో! ఇశ్రాయేలు దేవుని మహిమ అక్కడ ఉంది,+ అది నేను లోయ మైదానంలో చూసిన మహిమలా ఉంది.+

5 అప్పుడు ఆయన నాతో, “మానవ కుమారుడా, దయచేసి తల ఎత్తి ఉత్తరం వైపు చూడు” అని అన్నాడు. నేను తల ఎత్తి ఉత్తరం వైపు చూశాను; ఇదిగో అక్కడ, అంటే బలిపీఠం ద్వారానికి ఉత్తరం వైపున ప్రవేశ మార్గంలో ఆ రోష విగ్రహం ఉంది. 6 ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నేను నా పవిత్రమైన స్థలం నుండి దూరంగా వెళ్లేలా+ ఇశ్రాయేలు ఇంటివాళ్లు ఇక్కడ ఎలాంటి ఘోరమైన, అసహ్యమైన పనులు చేస్తున్నారో+ చూస్తున్నావు కదా? అయితే ఇంతకన్నా ఘోరమైన, అసహ్యమైన వాటిని నువ్వు చూస్తావు.”

7 తర్వాత ఆయన నన్ను ప్రాంగణం ప్రవేశం దగ్గరికి తీసుకొచ్చాడు, నేను చూసినప్పుడు గోడలో ఒక రంధ్రం కనిపించింది. 8 ఆయన, “మానవ కుమారుడా, దయచేసి ఆ రంధ్రాన్ని పెద్దది చేయి” అని నాతో అన్నాడు. నేను ఆ రంధ్రాన్ని పెద్దది చేశాను, అప్పుడు నాకు ఒక ప్రవేశ మార్గం కనిపించింది. 9 ఆయన నాతో ఇలా అన్నాడు: “నువ్వు లోపలికి వెళ్లి, వాళ్లు ఇక్కడ చేస్తున్న అసహ్యమైన చెడ్డపనుల్ని చూడు.” 10 కాబట్టి నేను లోపలికి వెళ్లి చూశాను, అప్పుడు నాకు పాకే జీవుల, హేయమైన జంతువుల+ అన్నిరకాల రూపాలు, ఇశ్రాయేలు ఇంటివాళ్ల అసహ్యమైన విగ్రహాలన్నీ*+ కనిపించాయి; అవి చుట్టూ గోడ మీద చెక్కి ఉన్నాయి. 11 ఇశ్రాయేలు ఇంటివాళ్ల 70 మంది పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు, వాళ్లలో షాఫాను+ కుమారుడైన యజన్యా కూడా ఉన్నాడు. ప్రతీ ఒక్కరి చేతిలో ఒక ధూపపాత్ర ఉంది, పరిమళ ధూపం పొగ పైకి లేస్తూ ఉంది.+ 12 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్ల పెద్దల్లో ప్రతీ ఒక్కరు చీకట్లో, తమ విగ్రహాలు ఉన్న లోపలి గదుల్లో ఏంచేస్తున్నారో చూస్తున్నావా? వాళ్లు, ‘యెహోవా మమ్మల్ని చూడట్లేదు. యెహోవా దేశాన్ని విడిచిపెట్టేశాడు’ అని చెప్పుకుంటున్నారు.”+

13 ఆయన నాతో ఇంకా ఇలా అన్నాడు: “వాళ్లు చేస్తున్న ఇంతకన్నా ఘోరమైన, అసహ్యమైన పనుల్ని నువ్వు చూస్తావు.” 14 ఆయన నన్ను యెహోవా మందిర ఉత్తర ద్వార ప్రవేశం దగ్గరికి తీసుకొచ్చాడు, అక్కడ కొంతమంది స్త్రీలు కూర్చొని తమ్మూజు దేవుడి గురించి ఏడ్వడం నేను చూశాను.

15 ఆయన నాతో ఇంకా ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నువ్వు దీన్ని చూస్తున్నావు కదా? ఇంతకన్నా ఘోరమైన, అసహ్యమైన వాటిని నువ్వు చూస్తావు.”+ 16 అప్పుడు ఆయన నన్ను యెహోవా మందిర లోపలి ప్రాంగణానికి+ తీసుకొచ్చాడు. అక్కడ యెహోవా ఆలయ ప్రవేశం దగ్గర, వసారాకీ బలిపీఠానికీ మధ్య సుమారు 25 మంది పురుషులు ఉన్నారు; వాళ్ల వీపులు యెహోవా ఆలయం వైపుకు, వాళ్ల ముఖాలు తూర్పు వైపుకు తిరిగివున్నాయి; వాళ్లు తూర్పున ఉన్న సూర్యునికి వంగి నమస్కారం చేస్తున్నారు.+

17 ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నువ్వు ఇది చూస్తున్నావు కదా? యూదా ఇంటివాళ్లు ఈ అసహ్యమైన పనులు చేయడం, దేశాన్ని దౌర్జన్యంతో నింపేయడం,+ నాకు కోపం తెప్పిస్తూ ఉండడం అంత చిన్న విషయమా? ఇదిగో, వాళ్లు నా ముక్కు దగ్గరికి కొమ్మను* తెస్తున్నారు. 18 కాబట్టి నేను తీవ్రమైన కోపంతో చర్య తీసుకుంటాను. నా కన్ను జాలిపడదు, నేను కనికరపడను.+ వాళ్లు నా చెవుల్లో ఎంత గట్టిగా మొరపెట్టినా నేను వినను.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి