కీర్తనలు
దావీదు శ్రావ్యగీతం.
నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ నీతిని బట్టి నాకు జవాబివ్వు.
2 నీ సేవకుణ్ణి నీ న్యాయపీఠం ముందుకు తీసుకురాకు,
ఎందుకంటే, బ్రతికున్న వాళ్లెవ్వరూ నీ ముందు నీతిమంతులుగా ఉండలేరు.+
3 శత్రువు నన్ను తరుముతున్నాడు;
అతను నా ప్రాణాన్ని నేలలోకి తొక్కేశాడు.
చాలాకాలం క్రితం చనిపోయినవాళ్లలా నన్ను చీకట్లో నివసించేలా చేశాడు.
5 నేను పాత రోజుల్ని గుర్తుచేసుకుంటున్నాను;
నీ కార్యాలన్నిటి గురించి ధ్యానిస్తున్నాను.+
నీ చేతి పనిని ఆత్రుతతో పరిశీలిస్తున్నాను.*
6 నీ వైపు నా చేతులు చాపుతున్నాను;
ఎండిన భూమి వర్షం కోసం తపించినట్టు నేను నీ కోసం తపిస్తున్నాను.+ (సెలా)
8 ఉదయం నీ విశ్వసనీయ ప్రేమను నన్ను చూడనివ్వు,
నేను నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను.
నేను నడవాల్సిన మార్గాన్ని నాకు తెలియజేయి,+
నేను నీ వైపే తిరుగుతున్నాను.
9 యెహోవా, నా శత్రువుల నుండి నన్ను కాపాడు.
నిన్నే నేను ఆశ్రయించాను.+
నీ పవిత్రశక్తి మంచిది;
అది సమతలంగా ఉన్న నేలమీద* నన్ను నడిపించాలి.
11 యెహోవా, నీ పేరు కోసం నన్ను సజీవంగా ఉంచు.
నీ నీతిని బట్టి కష్టాల్లో నుండి నన్ను కాపాడు.+