కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 31
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • యాకోబు రహస్యంగా కనానుకు ​బయల్దేరడం (1-18)

      • లాబాను యాకోబును కలవడం (19-35)

      • యాకోబు లాబానుతో ఒప్పందం ​చేసుకోవడం (36-55)

ఆదికాండం 31:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:33

ఆదికాండం 31:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:27

ఆదికాండం 31:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:15; 32:9; 35:27

ఆదికాండం 31:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:27
  • +ఆది 48:15

ఆదికాండం 31:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:29, 30

ఆదికాండం 31:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:32

ఆదికాండం 31:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:39

ఆదికాండం 31:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 29:25; 31:39

ఆదికాండం 31:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “అభిషేకించావు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:8, 9; 35:15
  • +ఆది 28:18, 22
  • +ఆది 35:14; 37:1

ఆదికాండం 31:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:41; హోషే 12:12

ఆదికాండం 31:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:1
  • +ఆది 31:3

ఆదికాండం 31:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 33:13

ఆదికాండం 31:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:42, 43
  • +ఆది 35:27

ఆదికాండం 31:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:14
  • +ఆది 35:2; యెహో 24:2

ఆదికాండం 31:21

అధస్సూచీలు

  • *

    అంటే, యూఫ్రటీసు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:18
  • +సం 32:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీ 1840

ఆదికాండం 31:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 4/2020, పేజీ 2

ఆదికాండం 31:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:20; హోషే 12:12
  • +ఆది 20:3
  • +కీర్త 105:15

ఆదికాండం 31:27

అధస్సూచీలు

  • *

    అంటే, గిలకల తప్పెట.

  • *

    ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

ఆదికాండం 31:28

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారుల్ని.”

ఆదికాండం 31:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:24

ఆదికాండం 31:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:19; 35:2

ఆదికాండం 31:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 46:18, 25

ఆదికాండం 31:35

అధస్సూచీలు

  • *

    లేదా “రుతుస్రావ సమయంలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 15:19
  • +ఆది 31:19

ఆదికాండం 31:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:27

ఆదికాండం 31:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 17:34

ఆదికాండం 31:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 47:9

ఆదికాండం 31:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:7

ఆదికాండం 31:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:13; 31:29
  • +ఆది 31:53
  • +ఆది 31:24

ఆదికాండం 31:45

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:18

ఆదికాండం 31:46

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 4/2020, పేజీ 1

ఆదికాండం 31:47

అధస్సూచీలు

  • *

    “సాక్ష్యపు కుప్ప” అనే అర్థమున్న అరామిక్‌ పదం.

  • *

    “సాక్ష్యపు కుప్ప” అనే అర్థమున్న హీబ్రూ పదం.

ఆదికాండం 31:48

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:22, 23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    4/2020, పేజీ 4

ఆదికాండం 31:49

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    4/2020, పేజీ 4

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 4/2020, పేజీ 1

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 4/2020, పేజీ 1

ఆదికాండం 31:52

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:44, 45

ఆదికాండం 31:53

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:1, 7
  • +ఆది 31:42

ఆదికాండం 31:55

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారుల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:28
  • +ఆది 24:59, 60
  • +ఆది 27:43; 28:2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 31:1ఆది 30:33
ఆది. 31:2ఆది 30:27
ఆది. 31:3ఆది 28:15; 32:9; 35:27
ఆది. 31:5ఆది 30:27
ఆది. 31:5ఆది 48:15
ఆది. 31:6ఆది 30:29, 30
ఆది. 31:8ఆది 30:32
ఆది. 31:10ఆది 30:39
ఆది. 31:12ఆది 29:25; 31:39
ఆది. 31:13ఆది 12:8, 9; 35:15
ఆది. 31:13ఆది 28:18, 22
ఆది. 31:13ఆది 35:14; 37:1
ఆది. 31:15ఆది 31:41; హోషే 12:12
ఆది. 31:16ఆది 31:1
ఆది. 31:16ఆది 31:3
ఆది. 31:17ఆది 33:13
ఆది. 31:18ఆది 30:42, 43
ఆది. 31:18ఆది 35:27
ఆది. 31:19ఆది 31:14
ఆది. 31:19ఆది 35:2; యెహో 24:2
ఆది. 31:21ఆది 15:18
ఆది. 31:21సం 32:1
ఆది. 31:24ఆది 25:20; హోషే 12:12
ఆది. 31:24ఆది 20:3
ఆది. 31:24కీర్త 105:15
ఆది. 31:29ఆది 31:24
ఆది. 31:30ఆది 31:19; 35:2
ఆది. 31:33ఆది 46:18, 25
ఆది. 31:35లేవీ 15:19
ఆది. 31:35ఆది 31:19
ఆది. 31:38ఆది 30:27
ఆది. 31:391స 17:34
ఆది. 31:40ఆది 47:9
ఆది. 31:41ఆది 31:7
ఆది. 31:42ఆది 28:13; 31:29
ఆది. 31:42ఆది 31:53
ఆది. 31:42ఆది 31:24
ఆది. 31:45ఆది 28:18
ఆది. 31:48ఆది 31:22, 23
ఆది. 31:52ఆది 31:44, 45
ఆది. 31:53ఆది 17:1, 7
ఆది. 31:53ఆది 31:42
ఆది. 31:55ఆది 31:28
ఆది. 31:55ఆది 24:59, 60
ఆది. 31:55ఆది 27:43; 28:2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
  • 55
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 31:1-55

ఆదికాండం

31 లాబాను కుమారులు, “యాకోబు మన తండ్రికి చెందిన ప్రతీది తీసేసుకున్నాడు, మన తండ్రికి చెందిన వాటితోనే ఈ ఆస్తంతా కూడబెట్టుకున్నాడు”+ అని అనుకుంటున్నారని కొంతకాలానికి యాకోబు విన్నాడు. 2 యాకోబు లాబాను ముఖం చూసినప్పుడు, తన విషయంలో లాబాను వైఖరి ఒకప్పటిలా లేదని గమనించాడు.+ 3 చివరికి, యెహోవా యాకోబుతో ఇలా అన్నాడు: “నువ్వు నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగెళ్లు.+ ఎప్పటిలానే నేను నీకు తోడుగా ఉంటాను.” 4 అప్పుడు యాకోబు, పచ్చిక మైదానంలో ఉన్న తన మంద దగ్గరికి రమ్మని రాహేలుకు, లేయాకు కబురు పంపాడు. 5 యాకోబు వాళ్లతో ఇలా అన్నాడు:

“నా విషయంలో మీ నాన్న వైఖరి మారిపోయిందని+ నేను గమనించాను, కానీ నా తండ్రి ఆరాధించిన దేవుడు ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నాడు.+ 6 నేను నా శక్తినంతా ఉపయోగించి మీ నాన్నకు సేవ చేశానని మీకు బాగా తెలుసు.+ 7 మీ నాన్న నన్ను మోసం చేయడానికి ప్రయత్నించాడు, పదిసార్లు నా జీతం మార్చాడు; కానీ దేవుడు అతన్ని నాకు హాని చేయనివ్వలేదు. 8 అతను, ‘మచ్చలు ఉన్నవి నీ జీతం’ అని చెప్పినప్పుడు మందంతటికీ మచ్చలు ఉన్న పిల్లలే పుట్టాయి; ‘చారలు ఉన్నవి నీ జీతం’ అని చెప్పినప్పుడు మందంతటికీ చారలు ఉన్న పిల్లలే పుట్టాయి.+ 9 అలా దేవుడు మీ నాన్న పశువుల్ని అతని దగ్గర నుండి తీసేసి నాకు ఇస్తూ ఉన్నాడు. 10 ఒకసారి మందలోని జంతువులు జతకట్టే సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో చారలు, మచ్చలు, పొడలు ఉన్న మేకపోతులు మందతో జతకట్టడం చూశాను.+ 11 ఆ కలలో సత్యదేవుని దూత నన్ను, ‘యాకోబూ!’ అని పిలిచాడు. దానికి నేను, ‘చెప్పు ప్రభువా’ అన్నాను. 12 అప్పుడు ఆ దూత ఇలా అన్నాడు: ‘దయచేసి నీ తల ఎత్తి చూడు, మందతో జతకడుతున్న మేకపోతులన్నిటికీ చారలు, మచ్చలు, పొడలు ఉన్నాయి. లాబాను నీకు చేస్తున్నదంతా నేను చూశాను.+ 13 బేతేలు+ దగ్గర నీకు కనిపించిన సత్యదేవుణ్ణి నేనే; అక్కడ నువ్వు ఒక రాయిని స్మారక చిహ్నంగా నిలబెట్టి దానిమీద తైలం పోశావు,* అక్కడే నాతో ప్రమాణం చేశావు.+ ఇప్పుడు నువ్వు లేచి, ఈ దేశం నుండి బయల్దేరి నీ స్వదేశానికి తిరిగెళ్లు.’ ”+

14 అప్పుడు రాహేలు, లేయా యాకోబుతో ఇలా అన్నారు: “మా నాన్న ఇంట్లో మాకు వారసత్వంగా రావాల్సిన వాటా ఇంకేమైనా మిగిలి ఉందా? 15 అతను మమ్మల్ని అమ్మేసి, వచ్చిన డబ్బంతా తనే వాడుకుంటూ మమ్మల్ని పరదేశులుగా చూడట్లేదా?+ 16 దేవుడు మా నాన్న నుండి తీసేసుకున్న సంపదలన్నీ మనవి, మన పిల్లలవి.+ కాబట్టి, దేవుడు నీకు చెప్పిన ప్రతీది చేయి.”+

17 అప్పుడు యాకోబు లేచి తన పిల్లల్ని, భార్యల్ని ఒంటెల మీదికి ఎక్కించి,+ 18 తన మందంతటినీ తోలుకుంటూ, పద్దనరాములో తాను సంపాదించుకున్న వస్తువులన్నిటినీ,+ పశువుల్ని తీసుకొని కనాను దేశంలో ఉన్న తన తండ్రి ఇస్సాకు దగ్గరికి బయల్దేరాడు.+

19 లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్లినప్పుడు, రాహేలు తన తండ్రికి చెందిన+ గృహదేవతల విగ్రహాల్ని+ దొంగిలించింది. 20 అంతేకాదు, యాకోబు తెలివిగా ప్రవర్తించి అరామీయుడైన లాబానుకు చెప్పకుండా పారిపోయాడు. 21 అతను పారిపోయి, తనకున్న వాటన్నిటితో నది*+ దాటాడు. ఆ తర్వాత అతను గిలాదు కొండ ప్రాంతం+ వైపుగా ప్రయాణించాడు. 22 మూడో రోజున, యాకోబు పారిపోయాడన్న విషయం ఎవరో లాబానుకు చెప్పారు. 23 కాబట్టి అతను తన బంధువుల్ని వెంటబెట్టుకొని యాకోబును వెతుక్కుంటూ ఏడురోజులు ప్రయాణం చేశాడు. చివరికి, గిలాదు కొండ ప్రాంతం దగ్గర యాకోబు వాళ్లకు కనిపించాడు. 24 దేవుడు ఆ రాత్రి అరామీయుడైన లాబానుకు+ కలలో కనిపించి+ ఇలా అన్నాడు: “మంచేగానీ, చెడేగానీ నువ్వు యాకోబుతో ఏమి మాట్లాడినా జాగ్రత్తగా ఉండు.”+

25 యాకోబు ఆ కొండ మీద డేరా వేసుకున్నాడు. లాబాను కూడా తన బంధువులతో కలిసి గిలాదు కొండ ప్రాంతంలో డేరాలు వేసుకున్నాడు. అప్పుడు లాబాను యాకోబు దగ్గరికి వెళ్లి, 26 అతనితో ఇలా అన్నాడు: “నువ్వు చేసిందేంటి? నన్ను ఎందుకు మోసం చేశావు? నా కూతుళ్లను కత్తితో చెరపట్టుకుపోయినట్టు ఎందుకు తీసుకుపోయావు? 27 నన్ను మోసం చేసి, నాకు ఒక్కమాట కూడా చెప్పకుండా, రహస్యంగా ఎందుకు పారిపోయావు? నువ్వు నాకు చెప్పివుంటే, నేను సంబరాలు జరిపి, కంజీరను,* వీణను* వాయిస్తూ పాటలతో నిన్ను సాగనంపేవాణ్ణి. 28 కానీ నువ్వు నా మనవళ్లను-మనవరాళ్లను,* కూతుళ్లను ముద్దుపెట్టుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. నువ్వు తెలివితక్కువ పని చేశావు. 29 నేను తలచుకుంటే నీకు హాని చేయగలను, కానీ నీ తండ్రి ఆరాధించిన దేవుడు నిన్న రాత్రి కలలో నాతో మాట్లాడి, ‘మంచేగానీ, చెడేగానీ నువ్వు యాకోబుతో ఏమి మాట్లాడినా జాగ్రత్తగా ఉండు’ అని చెప్పాడు.+ 30 నువ్వు నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని ఎప్పటినుండో కోరుకుంటున్నావు కాబట్టి నా దగ్గర నుండి వచ్చేశావు సరే, కానీ నా గృహదేవతల్ని ఎందుకు దొంగిలించావు?”+

31 అందుకు యాకోబు లాబానుతో ఇలా అన్నాడు: “నువ్వు నీ కూతుళ్లను బలవంతంగా నా దగ్గర నుండి లాగేసుకుంటావని భయపడి నేను అలా వచ్చేశాను. 32 నీ గృహదేవతలు ఎవరి దగ్గరైనా దొరికితే, వాళ్లు బ్రతకరు. మన బంధువుల ముందు నా వస్తువులన్నీ గాలించి, నీవి ఏమైనా దొరికితే తీసేసుకో.” అయితే రాహేలు వాటిని దొంగిలించిన విషయం యాకోబుకు తెలీదు. 33 కాబట్టి లాబాను యాకోబు డేరాలోకి, లేయా డేరాలోకి, ఇద్దరు దాసురాళ్ల+ డేరాలోకి వెళ్లి వెదికాడు, కానీ అవి దొరకలేదు. తర్వాత అతను లేయా డేరాలో నుండి బయటికి వచ్చి రాహేలు డేరాలోకి వెళ్లాడు. 34 అయితే ఈలోగా రాహేలు ఆ గృహదేవతల విగ్రహాల్ని తీసుకొని ఒంటె జీనుకు ఉండే పెట్టెలో పెట్టి, దాని మీద కూర్చుంది. అప్పుడు లాబాను రాహేలు డేరా అంతా వెదికాడు కానీ అవి దొరకలేదు. 35 తర్వాత ఆమె వాళ్ల నాన్నతో, “నా ప్రభువా, నేను నీ ముందు లేచి నిలబడలేక పోతున్నందుకు కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను ఇప్పుడు కడగా* ఉన్నాను”+ అంది. కాబట్టి అతను జాగ్రత్తగా వెదికాడు, కానీ ఆ గృహదేవతల విగ్రహాలు+ అతనికి దొరకలేదు.

36 అప్పుడు యాకోబుకు కోపమొచ్చి లాబానును విమర్శిస్తూ ఇలా అన్నాడు: “నేను ఏం తప్పు చేశాను? నేను ఏ పాపం చేశానని నువ్వు ఇంత ఆవేశంగా నన్ను వెతుక్కుంటూ వచ్చావు? 37 నువ్వు నా సామానంతా వెదికావు కదా, నీ వస్తువులు ఏమైనా దొరికాయా? వాటిని తీసుకొచ్చి నా బంధువుల ముందు, నీ బంధువుల ముందు పెట్టు. వాళ్లే నీకూ నాకూ మధ్య న్యాయం చెప్తారు. 38 నేను నీ దగ్గరున్న ఈ 20 ఏళ్లలో నీ గొర్రెలకు, మేకలకు ఎన్నడూ గర్భపాతం కలగలేదు;+ నీ మందలోని పొట్టేళ్లను నేను ఎన్నడూ తినలేదు. 39 అడవి మృగాలు చీల్చేసిన ఏ జంతువునూ+ నేను నీ దగ్గరికి తీసుకురాలేదు. ఆ నష్టాన్ని నేనే భరించాను. ఒక జంతువును పగలు గానీ, రాత్రి గానీ ఎవరైనా దొంగిలిస్తే, నష్ట పరిహారం చెల్లించమని నువ్వు నన్ను అడిగేవాడివి. 40 పగటిపూట ఎండకు, రాత్రిపూట చలికి కృశించిపోయాను, నిద్ర ఉండేది కాదు.+ 41 అలా నీ ఇంట్లో 20 ఏళ్లు సేవచేశాను. 14 ఏళ్లు నీ ఇద్దరు కూతుళ్ల కోసం, 6 ఏళ్లు నీ మంద కోసం సేవచేశాను. నువ్వు నా జీతాన్ని పదిసార్లు మార్చావు.+ 42 ఒకవేళ నా తండ్రి దేవుడు,+ అంటే అబ్రాహాము సేవించిన దేవుడు, ఇస్సాకు భయపడే దేవుడు+ నా వైపు లేకపోయుంటే, ఇప్పుడు నువ్వు నన్ను వట్టి చేతులతో పంపించి ఉండేవాడివి. నేను పడిన బాధను, నా చేతుల కష్టాన్ని దేవుడు చూశాడు, అందుకే నిన్న రాత్రి నిన్ను గద్దించాడు.”+

43 అప్పుడు లాబాను యాకోబుతో ఇలా అన్నాడు: “వీళ్లు నా కూతుళ్లు, ఈ పిల్లలు నా పిల్లలు, ఈ మంద నా మంద; నువ్వు చూస్తున్న ప్రతీది నాది, నా కూతుళ్లది. అలాంటిది ఈ రోజు వీళ్లకు గానీ, వీళ్ల పిల్లలకు గానీ నేనెలా హాని చేయగలను? 44 రా, ఇప్పుడు మనిద్దరం ఒక ఒప్పందం చేసుకుందాం. అది మన మధ్య సాక్ష్యంగా ఉంటుంది.” 45 కాబట్టి యాకోబు ఒక రాయి తీసుకొని, దాన్ని స్మారక చిహ్నంగా నిలబెట్టాడు.+ 46 తర్వాత యాకోబు, “రాళ్లు తీసుకురండి!” అని తన బంధువులకు చెప్పాడు. వాళ్లు రాళ్లు తెచ్చి కుప్పగా వేశారు. తర్వాత వాళ్లు ఆ రాళ్లకుప్ప దగ్గర భోజనం చేశారు. 47 లాబాను ఆ చోటుకు యగర్‌శాహదూతా* అని పేరు పెట్టాడు, కానీ యాకోబు దానికి గలేదు* అని పేరు పెట్టాడు.

48 తర్వాత లాబాను, “ఈ రోజు మనిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఈ రాళ్లకుప్పే సాక్ష్యంగా ఉంటుంది” అన్నాడు. అందుకే యాకోబు దానికి గలేదు+ అని పేరు పెట్టాడు. 49 అంతేకాదు, దాన్ని కావలిబురుజు అని పిలిచాడు. ఎందుకంటే లాబాను ఇలా అన్నాడు: “మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నప్పుడు యెహోవాయే మనిద్దరి మధ్య కాపలాగా ఉంటాడు. 50 నువ్వు నా కూతుళ్లను బాధపెట్టినా, ఇంకా వేరే స్త్రీలను భార్యలుగా చేసుకున్నా, ఇది గుర్తుంచుకో: ఏ మనిషీ చూడకపోయినా, మనిద్దరి మధ్య సాక్షిగా ఉన్న దేవుడు చూస్తాడు.” 51 లాబాను యాకోబుతో ఇంకా ఇలా అన్నాడు: “ఇదిగో ఈ రాళ్లకుప్పనూ, మనిద్దరి మధ్య సాక్ష్యంగా ఉండడానికి నేను నిలబెట్టిన స్మారక చిహ్నాన్నీ చూడు. 52 నీకు హాని తలపెట్టడానికి నేనూ, నాకు హాని తలపెట్టడానికి నువ్వూ వీటిని దాటిరాము అనడానికి ఈ రాళ్లకుప్ప, ఈ స్మారక చిహ్నం సాక్ష్యంగా ఉంటాయి.+ 53 అబ్రాహాము దేవుడు,+ నాహోరు దేవుడు, వాళ్ల తండ్రి దేవుడు నీకూ నాకూ మధ్య న్యాయం తీర్చాలి.” అప్పుడు యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడే దేవుని+ ముందు ఒట్టేశాడు.

54 ఆ తర్వాత యాకోబు ఆ కొండ మీద ఒక బలి అర్పించి, రొట్టె తినడానికి తన బంధువుల్ని ఆహ్వానించాడు. వాళ్లు తిని, ఆ రాత్రి ఆ కొండ మీదే బస చేశారు. 55 అయితే, లాబాను తెల్లవారుజామునే లేచి, తన మనవళ్లను-మనవరాళ్లను,* తన కూతుళ్లను ముద్దు పెట్టుకొని+ వాళ్లను దీవించాడు.+ తర్వాత లాబాను అక్కడి నుండి బయల్దేరి తన ఇంటికి తిరిగెళ్లిపోయాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి