కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • అబ్రాము లోతును కాపాడడం (1-16)

      • మెల్కీసెదెకు అబ్రామును దీవించడం (17-24)

ఆదికాండం 14:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:9, 10
  • +ఆది 14:17
  • +ఆది 10:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2001, పేజీ 23

    తేజరిల్లు!,

    3/8/1992, పేజీ 12

ఆదికాండం 14:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:19; 13:12
  • +ఆది 13:10, 12
  • +ద్వితీ 29:23

ఆదికాండం 14:3

అధస్సూచీలు

  • *

    అంటే, మృత సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 14:10
  • +సం 34:2, 12

ఆదికాండం 14:4

అధస్సూచీలు

  • *

    ఇక్కడ “వీళ్లు” అనే మాట 2వ వచనంలో ప్రస్తావించిన ఐదుగురు రాజుల్ని సూచిస్తుండవచ్చు.

ఆదికాండం 14:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 2:10, 11

ఆదికాండం 14:6

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 2:12
  • +ఆది 36:8

ఆదికాండం 14:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 20:1
  • +ఆది 36:12; 1స 15:2
  • +2ది 20:2
  • +ఆది 10:15, 16

ఆదికాండం 14:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 14:1, 2

ఆదికాండం 14:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 14:16

ఆదికాండం 14:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 19:1

ఆదికాండం 14:13

అధస్సూచీలు

  • *

    లేదా “డేరాల్లో నివసిస్తున్నాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 13:18
  • +ఆది 14:24

ఆదికాండం 14:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “సహోదరుణ్ణి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:27
  • +న్యా 18:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2010, పేజీలు 3-4

    5/15/2004, పేజీలు 26-27

    8/15/2001, పేజీలు 23-24

ఆదికాండం 14:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:18

ఆదికాండం 14:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 7:1, 2
  • +కీర్త 110:4; హెబ్రీ 6:20
  • +కీర్త 83:18; హెబ్రీ 5:5, 10

ఆదికాండం 14:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 7:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 9/2019, పేజీ 1

ఆదికాండం 14:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 14:13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 14:1ఆది 10:9, 10
ఆది. 14:1ఆది 14:17
ఆది. 14:1ఆది 10:22
ఆది. 14:2ఆది 10:19; 13:12
ఆది. 14:2ఆది 13:10, 12
ఆది. 14:2ద్వితీ 29:23
ఆది. 14:3ఆది 14:10
ఆది. 14:3సం 34:2, 12
ఆది. 14:5ద్వితీ 2:10, 11
ఆది. 14:6ద్వితీ 2:12
ఆది. 14:6ఆది 36:8
ఆది. 14:7సం 20:1
ఆది. 14:7ఆది 36:12; 1స 15:2
ఆది. 14:72ది 20:2
ఆది. 14:7ఆది 10:15, 16
ఆది. 14:9ఆది 14:1, 2
ఆది. 14:11ఆది 14:16
ఆది. 14:12ఆది 19:1
ఆది. 14:13ఆది 13:18
ఆది. 14:13ఆది 14:24
ఆది. 14:14ఆది 11:27
ఆది. 14:14న్యా 18:29
ఆది. 14:172స 18:18
ఆది. 14:18హెబ్రీ 7:1, 2
ఆది. 14:18కీర్త 110:4; హెబ్రీ 6:20
ఆది. 14:18కీర్త 83:18; హెబ్రీ 5:5, 10
ఆది. 14:20హెబ్రీ 7:4
ఆది. 14:24ఆది 14:13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 14:1-24

ఆదికాండం

14 ఆ రోజుల్లో అమ్రాపేలు షీనారుకు+ రాజుగా, అర్యోకు ఎల్లాసరుకు రాజుగా, కదొర్లాయోమెరు+ ఏలాముకు+ రాజుగా, తిదాలు గోయీముకు రాజుగా ఉన్నారు. 2 వీళ్లు సొదొమ+ రాజు బెరాతో, గొమొర్రా+ రాజు బిర్షాతో, అద్మా రాజు షినాబుతో, సెబోయీము+ రాజు షెమేబెరుతో, బెల (అంటే, సోయరు) రాజుతో యుద్ధం చేశారు. 3 వీళ్లంతా సిద్దీము లోయలో+ అంటే ఉప్పు సముద్రం*+ దగ్గర తమ సైన్యాలతో కలుసుకున్నారు.

4 వీళ్లు* 12 ఏళ్లపాటు కదొర్లాయోమెరు రాజుకు లోబడి ఉన్నారు, కానీ 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. 5 కాబట్టి 14వ సంవత్సరంలో కదొర్లాయోమెరు రాజు, అతనితో ఉన్న రాజులు వచ్చి అష్తారోత్‌-కర్నాయిములో రెఫాయీయులను, హాములో జూజీయులను, షావే-కిర్యతాయిములో ఏమీయులను+ ఓడించారు. 6 అలాగే, హోరీయులతో+ వాళ్ల కొండైన శేయీరు+ నుండి ఎడారి* దగ్గరున్న ఏల్పారాను వరకు యుద్ధం చేసి వాళ్లను ఓడించారు. 7 తర్వాత వాళ్లు వెనక్కి తిరిగి ఏన్మిష్పతుకు అంటే కాదేషుకు+ వచ్చి, అమాలేకీయుల+ ప్రాంతమంతటినీ, అలాగే హససోన్‌-తామారులో+ నివసిస్తున్న అమోరీయులను+ జయించారు.

8 ఆ సమయంలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయీము రాజు, బెల (అంటే, సోయరు) రాజు బయల్దేరి సిద్దీము లోయలో యుద్ధ పంక్తులు తీరి, వాళ్లతో 9 అంటే ఏలాము రాజు కదొర్లాయోమెరుతో, గోయీము రాజు తిదాలుతో, షీనారు రాజు అమ్రాపేలుతో, ఎల్లాసరు రాజు అర్యోకుతో యుద్ధం చేశారు.+ అలా ఆ ఐదుగురు రాజులు, ఈ నలుగురు రాజులతో యుద్ధం చేశారు. 10 సిద్దీము లోయ అంతా తారు గుంటలతో నిండిపోయి ఉంది. సొదొమ, గొమొర్రా రాజులు పారిపోవడానికి ప్రయత్నించి వాటిలో పడిపోయారు, మిగిలినవాళ్లు కొండ ప్రాంతానికి పారిపోయారు. 11 గెలిచినవాళ్లు సొదొమ, గొమొర్రా ప్రజల వస్తువులన్నిటినీ, వాళ్ల ఆహారమంతటినీ తీసుకొని తమ దారిన వెళ్లిపోయారు.+ 12 వాళ్లు వెళ్తూవెళ్తూ సొదొమలో నివసిస్తున్న అబ్రాము సహోదరుని కుమారుడైన లోతును,+ అతని వస్తువుల్ని కూడా తీసుకొని వెళ్లారు.

13 ఆ తర్వాత, వాళ్ల నుండి తప్పించుకున్న ఒకతను హెబ్రీయుడైన అబ్రాము దగ్గరికి వచ్చి జరిగింది చెప్పాడు. ఆ సమయంలో అబ్రాము అమోరీయుడైన మమ్రేకు చెందిన మహా వృక్షాల దగ్గర నివసిస్తున్నాడు.*+ ఈ మమ్రేకు ఎష్కోలు, ఆనేరు+ అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. వీళ్లు అబ్రాముతో సంధి చేసుకున్నవాళ్లు. 14 తన బంధువును*+ బందీగా తీసుకెళ్లారని అబ్రాము విన్నప్పుడు, యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన తన మనుషుల్ని అంటే, తన ఇంట్లో పుట్టి పెరిగిన 318 మంది సేవకుల్ని వెంటబెట్టుకొని ఆ రాజుల్ని పట్టుకోవడానికి దాను+ వరకు వెళ్లాడు. 15 రాత్రిపూట అతను తన బలగాల్ని గుంపులుగా విడగొట్టాడు; అతను, అతని సేవకులు ఆ రాజుల మీద దాడిచేసి వాళ్లను ఓడించారు. తర్వాత అతను దమస్కుకు ఉత్తరాన ఉన్న హోబా వరకు వాళ్లను తరిమాడు. 16 అతను తన బంధువైన లోతును, అతని వస్తువుల్ని, అలాగే మిగతా వస్తువులన్నిటినీ, స్త్రీలను, ఇతర ప్రజల్ని వెనక్కి తీసుకొచ్చాడు.

17 అబ్రాము కదొర్లాయోమెరును, అతనితో పాటు ఉన్న రాజుల్ని ఓడించి తిరిగొచ్చినప్పుడు, సొదొమ రాజు అబ్రామును కలవడానికి షావే లోయకు అంటే ‘రాజు లోయకు’+ వచ్చాడు. 18 అప్పుడు షాలేము రాజైన+ మెల్కీసెదెకు+ రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకొచ్చాడు, అతను సర్వోన్నత దేవుని యాజకుడు.+

19 అతను అబ్రామును దీవిస్తూ ఇలా అన్నాడు:

“ఆకాశాన్ని, భూమిని సృష్టించిన సర్వోన్నత దేవుడు అబ్రామును దీవించాలి;

20 నీ శత్రువుల్ని నీ చేతికి అప్పగించిన సర్వోన్నత దేవునికి స్తుతి కలగాలి!”

అప్పుడు అబ్రాము తన దగ్గరున్న ప్రతీదానిలో పదోవంతును అతనికి ఇచ్చాడు.+

21 ఆ తర్వాత సొదొమ రాజు అబ్రాముతో, “ప్రజల్ని నాకు ఇచ్చేసి, వస్తువుల్ని నువ్వు తీసుకో” అన్నాడు. 22 కానీ అబ్రాము సొదొమ రాజుతో ఇలా అన్నాడు: “ఆకాశాన్ని, భూమిని సృష్టించిన సర్వోన్నత దేవుడైన యెహోవా ముందు చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. 23 దారం పోగు దగ్గర నుండి చెప్పుల తాడు వరకు నీకు చెందిందేదీ నేను తీసుకోను. ‘నేనే అబ్రామును ధనవంతుణ్ణి చేశాను’ అని నువ్వు చెప్పకుండా ఉండేలా నీదేదీ నేను తీసుకోను. 24 ఇప్పటికే ఈ యువకులు తిన్నది తప్ప నేను ఇంకేమీ తీసుకోను. అయితే నాతో వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రేలను+ మాత్రం వాళ్ల భాగం వాళ్లను తీసుకోనివ్వు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి