కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 26
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • గెరారులో ఇస్సాకు, రిబ్కా (1-11)

        • దేవుని వాగ్దానం ఇస్సాకుతో ఖరారు (3-5)

      • బావుల గురించి గొడవ (12-25)

      • అబీమెలెకుతో ఇస్సాకు ఒప్పందం (26-33)

      • హిత్తీయులైన ఏశావు ఇద్దరు భార్యలు (34, 35)

ఆదికాండం 26:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:10

ఆదికాండం 26:3

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 20:1; హెబ్రీ 11:8, 9
  • +ఆది 12:7; 15:18
  • +ఆది 22:16-18; కీర్త 105:9-11; హెబ్రీ 6:13, 14

ఆదికాండం 26:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనాన్ని.”

  • *

    అక్ష., “విత్తనానికి.”

  • *

    అక్ష., “విత్తనం.”

  • *

    దానికోసం కష్టపడాల్సి ఉంటుందని ఇది సూచిస్తుండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:1, 5; హెబ్రీ 11:12
  • +ద్వితీ 34:4
  • +ఆది 12:1-3; అపొ 3:25; గల 3:8

ఆదికాండం 26:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:10, 23; 22:3, 12; హెబ్రీ 11:8; యాకో 2:21

ఆదికాండం 26:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 26:17

ఆదికాండం 26:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:11-13
  • +ఆది 24:16

ఆదికాండం 26:8

అధస్సూచీలు

  • *

    లేదా “రిబ్కాను కౌగిలించుకోవడం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 24:67

ఆదికాండం 26:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 20:11

ఆదికాండం 26:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:18
  • +ఆది 20:9

ఆదికాండం 26:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 24:34, 35

ఆదికాండం 26:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:16

ఆదికాండం 26:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:27, 30

ఆదికాండం 26:17

అధస్సూచీలు

  • *

    లేదా “వాగు దగ్గర.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:19; 20:1

ఆదికాండం 26:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:25
  • +ఆది 21:31

ఆదికాండం 26:19

అధస్సూచీలు

  • *

    లేదా “వాగు దగ్గర.”

ఆదికాండం 26:20

అధస్సూచీలు

  • *

    “గొడవ” అని అర్థం.

ఆదికాండం 26:21

అధస్సూచీలు

  • *

    “నిందారోపణ” అని అర్థం.

ఆదికాండం 26:22

అధస్సూచీలు

  • *

    “విశాలమైన స్థలాలు” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:5, 6; 28:1, 3

ఆదికాండం 26:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:31

ఆదికాండం 26:24

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:1; 28:13
  • +ఆది 15:1
  • +ఆది 17:19; కీర్త 105:9-11

ఆదికాండం 26:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:8, 9
  • +హెబ్రీ 11:9

ఆదికాండం 26:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:32

ఆదికాండం 26:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:22
  • +ఆది 21:27

ఆదికాండం 26:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:22-24

ఆదికాండం 26:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 26:18

ఆదికాండం 26:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 20:1

ఆదికాండం 26:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:2, 3

ఆదికాండం 26:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:46; 28:8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 26:1ఆది 12:10
ఆది. 26:3ఆది 20:1; హెబ్రీ 11:8, 9
ఆది. 26:3ఆది 12:7; 15:18
ఆది. 26:3ఆది 22:16-18; కీర్త 105:9-11; హెబ్రీ 6:13, 14
ఆది. 26:4ఆది 15:1, 5; హెబ్రీ 11:12
ఆది. 26:4ద్వితీ 34:4
ఆది. 26:4ఆది 12:1-3; అపొ 3:25; గల 3:8
ఆది. 26:5ఆది 17:10, 23; 22:3, 12; హెబ్రీ 11:8; యాకో 2:21
ఆది. 26:6ఆది 26:17
ఆది. 26:7ఆది 12:11-13
ఆది. 26:7ఆది 24:16
ఆది. 26:8ఆది 24:67
ఆది. 26:9ఆది 20:11
ఆది. 26:10ఆది 12:18
ఆది. 26:10ఆది 20:9
ఆది. 26:12ఆది 24:34, 35
ఆది. 26:14ఆది 12:16
ఆది. 26:15ఆది 21:27, 30
ఆది. 26:17ఆది 10:19; 20:1
ఆది. 26:18ఆది 21:25
ఆది. 26:18ఆది 21:31
ఆది. 26:22ఆది 17:5, 6; 28:1, 3
ఆది. 26:23ఆది 21:31
ఆది. 26:24ఆది 17:1; 28:13
ఆది. 26:24ఆది 15:1
ఆది. 26:24ఆది 17:19; కీర్త 105:9-11
ఆది. 26:25ఆది 12:8, 9
ఆది. 26:25హెబ్రీ 11:9
ఆది. 26:26ఆది 21:32
ఆది. 26:28ఆది 21:22
ఆది. 26:28ఆది 21:27
ఆది. 26:31ఆది 21:22-24
ఆది. 26:32ఆది 26:18
ఆది. 26:33న్యా 20:1
ఆది. 26:34ఆది 36:2, 3
ఆది. 26:35ఆది 27:46; 28:8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 26:1-35

ఆదికాండం

26 అబ్రాహాము రోజుల్లో వచ్చిన కరువు+ కాకుండా ఇంకో కరువు ఆ దేశంలో వచ్చింది. దాంతో ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గరికి వెళ్లాడు. 2 అప్పుడు యెహోవా ఇస్సాకుకు కనిపించి ఇలా అన్నాడు: “నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్లకు. నేను నీకు చూపించే దేశంలో నివసించు. 3 ఈ దేశంలో పరదేశిగా ఉండు,+ నేను ఎప్పటిలాగే నీకు తోడుగా ఉండి, నిన్ను ఆశీర్వదిస్తాను; ఎందుకంటే ఈ ప్రాంతాలన్నిటినీ నీకు, నీ సంతానానికి* ఇస్తాను;+ నేను నీ తండ్రి అబ్రాహాముకు ఒట్టేసి చేసిన ఈ ప్రమాణాన్ని నెరవేరుస్తాను:+ 4 ‘నేను నీ సంతానాన్ని* ఆకాశ నక్షత్రాలంతమంది అయ్యేలా చేస్తాను;+ నేను ఈ ప్రాంతాలన్నిటినీ నీ సంతానానికి* ఇస్తాను;+ నీ సంతానం* ద్వారా భూమ్మీద ఉన్న అన్నిదేశాల ప్రజలు దీవెన సంపాదించుకుంటారు.’*+ 5 ఎందుకంటే అబ్రాహాము నా మాట విన్నాడు; నేను కోరినవాటిని చేస్తూ, నా ఆజ్ఞల్ని, నా శాసనాల్ని, నా నియమాల్ని పాటిస్తూ వచ్చాడు.”+ 6 కాబట్టి ఇస్సాకు గెరారులోనే నివసిస్తూ ఉన్నాడు.+

7 ఆ ప్రాంతంలోని ప్రజలు తన భార్య గురించి అదేపనిగా అడుగుతున్నప్పుడు అతను, “ఈమె నా చెల్లెలు” అని చెప్పేవాడు.+ ఆమె తన భార్య అని చెప్పడానికి ఇస్సాకు భయపడ్డాడు. అతను, “రిబ్కా కోసం ఈ ప్రాంతంలోని ప్రజలు నన్ను చంపేస్తారేమో” అని అనుకున్నాడు. ఎందుకంటే రిబ్కా చాలా అందంగా ఉండేది.+ 8 కొన్నిరోజుల తర్వాత, ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీ గుండా బయటికి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరసాలాడడం* గమనించాడు.+ 9 వెంటనే అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, “నిజానికి ఆమె నీ భార్య! కానీ నువ్వు ‘ఆమె నా చెల్లెలు’ అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. అందుకు ఇస్సాకు, “ఆమె వల్ల నేను చనిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో అలా చెప్పాను”+ అన్నాడు. 10 కానీ అబీమెలెకు ఇలా అన్నాడు: “నువ్వు ఎందుకు ఇలా చేశావు?+ నా ప్రజల్లో ఎవరైనా ఇట్టే నీ భార్యతో పడుకొని ఉండేవాళ్లు; నువ్వు మాకు పాపాన్ని అంటగట్టి ఉండేవాడివి!”+ 11 ఆ తర్వాత అబీమెలెకు ప్రజలందరికీ ఇలా ఆజ్ఞాపించాడు: “ఎవరైనా ఇతని జోలికి, ఇతని భార్య జోలికి వెళ్తే వాళ్లకు ఖచ్చితంగా మరణశిక్ష పడుతుంది!”

12 ఇస్సాకు ఆ ప్రాంతంలో వ్యవసాయం మొదలుపెట్టాడు. ఆ ఏడాది అతను విత్తిన దానికి 100 రెట్లు రాబడి వచ్చింది, ఎందుకంటే యెహోవా అతన్ని దీవిస్తూ ఉన్నాడు.+ 13 అతను సంపన్నుడు అయ్యాడు, అంతకంతకూ వర్ధిల్లుతూ చాలా ధనవంతుడయ్యాడు. 14 అతను గొర్రెల మందల్ని, పశువుల మందల్ని, చాలామంది సేవకుల్ని సంపాదించుకున్నాడు.+ దాంతో ఫిలిష్తీయులు అతన్ని చూసి ఈర్ష్యపడడం మొదలుపెట్టారు.

15 కాబట్టి ఆ ఫిలిష్తీయులు, ఇస్సాకు తండ్రి అబ్రాహాము బ్రతికున్న రోజుల్లో అతని సేవకులు తవ్విన బావులన్నిటినీ+ మట్టితో పూడ్చేశారు. 16 అప్పుడు అబీమెలెకు ఇస్సాకుతో ఇలా అన్నాడు: “నువ్వు మా ప్రాంతం నుండి వెళ్లిపో. ఎందుకంటే నువ్వు మాకన్నా చాలా బలవంతుడివి అయ్యావు.” 17 కాబట్టి ఇస్సాకు అక్కడి నుండి వెళ్లిపోయి, గెరారు+ లోయలో* డేరాలు వేసుకొని అక్కడ నివసించడం మొదలుపెట్టాడు. 18 ఇస్సాకు తండ్రి అబ్రాహాము బ్రతికున్న రోజుల్లో అక్కడ తవ్వించిన బావుల్ని ఇస్సాకు మళ్లీ తవ్వించాడు; ఎందుకంటే అబ్రాహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు ఆ బావుల్ని పూడ్చేశారు.+ ఇస్సాకు ఆ బావులకు తన తండ్రి పెట్టిన పేర్లే  పెట్టాడు.+

19 ఇస్సాకు సేవకులు ఆ లోయలో* తవ్వుతున్నప్పుడు, వాళ్లకు ఒక మంచినీళ్ల ఊట కనిపించింది. 20 అప్పుడు గెరారులోని కాపరులు, “ఈ నీళ్లు మావి!” అని అంటూ ఇస్సాకు కాపరులతో గొడవకు దిగారు. వాళ్లు తనతో గొడవపడ్డారు కాబట్టి ఇస్సాకు ఆ ఊటకు ఏశెకు* అని పేరు పెట్టాడు. 21 ఇస్సాకు మనుషులు ఇంకో బావి తవ్వడం మొదలుపెట్టినప్పుడు దాని గురించి కూడా వాళ్లు గొడవకు దిగారు. అందుకే ఇస్సాకు దానికి శిత్నా* అని పేరు పెట్టాడు. 22 తర్వాత ఇస్సాకు అక్కడి నుండి వెళ్లిపోయి ఇంకో బావి తవ్వాడు. అయితే ఈసారి వాళ్లు దాని గురించి గొడవపడలేదు. కాబట్టి ఇస్సాకు దానికి రహెబోతు* అని పేరు పెట్టి ఇలా అన్నాడు: “ఇప్పుడు యెహోవా మనకు చాలా స్థలం ఇచ్చాడు, మనల్ని ఈ ప్రాంతంలో ఎక్కువమంది అయ్యేలా చేశాడు.”+

23 తర్వాత ఇస్సాకు అక్కడి నుండి బెయేర్షెబాకు+ వెళ్లాడు. 24 ఆ రాత్రి యెహోవా అతనికి కనిపించి ఇలా అన్నాడు: “నేను నీ తండ్రి అబ్రాహాముకు దేవుణ్ణి.+ భయపడకు,+ నేను నీకు తోడుగా ఉన్నాను; నా సేవకుడైన అబ్రాహామును బట్టి నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని* ఎక్కువమంది అయ్యేలా చేస్తాను.”+ 25 కాబట్టి అతను అక్కడ ఒక బలిపీఠం కట్టి, యెహోవా పేరును స్తుతించాడు.+ అక్కడ అతను తన డేరా వేసుకున్నాడు,+ అతని సేవకులు అక్కడే ఒక బావి తవ్వారు.

26 తర్వాత గెరారు నుండి అబీమెలెకు తన వ్యక్తిగత సలహాదారుడైన అహుజతుతో, తన సైన్యాధిపతి ఫీకోలుతో+ కలిసి ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. 27 అప్పుడు ఇస్సాకు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు నన్ను ద్వేషించి, మీ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు. ఇప్పుడెందుకు నా దగ్గరికి వచ్చారు?” 28 దానికి వాళ్లు ఇలా అన్నారు: “యెహోవా నీకు తోడుగా ఉన్నాడని+ మాకు స్పష్టంగా అర్థమైంది. అందుకే మేము ఇలా అనుకున్నాం: ‘మనం ఒక ప్రమాణం చేసుకొని, ఒప్పందం కుదుర్చుకుందాం.+ 29 అదేంటంటే, మేము నీకు ఏ హానీ చేయకుండా నిన్ను సమాధానంగా పంపించి, నీకు మంచే చేశాం కాబట్టి, నువ్వు కూడా మాకు ఏ హానీ చేయకూడదు. ఇప్పుడు నువ్వు యెహోవా చేత దీవించబడినవాడివి.’ ” 30 తర్వాత అతను వాళ్లకు విందు ఏర్పాటు చేశాడు, వాళ్లు తిని తాగారు. 31 వాళ్లు తెల్లవారుజామునే లేచి, ఒకరితో ఒకరు ఒట్టేసి ప్రమాణం చేసుకున్నారు.+ ఆ తర్వాత ఇస్సాకు వాళ్లను పంపించేశాడు, వాళ్లు అతని దగ్గర నుండి సమాధానంగా వెళ్లిపోయారు.

32 ఆ రోజు ఇస్సాకు సేవకులు వచ్చి, తాము తవ్విన బావిలో+ నీళ్లు పడ్డాయని అతనికి చెప్పారు. 33 కాబట్టి అతను దానికి షేబ అని పేరు పెట్టాడు. అందుకే నేటికీ ఆ నగరం పేరు బెయేర్షెబా.+

34 ఏశావుకు 40 ఏళ్లు వచ్చినప్పుడు, అతను హిత్తీయుడైన బేయేరీ కూతురు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కూతురు బాశెమతును పెళ్లి చేసుకున్నాడు.+ 35 వాళ్లు ఇస్సాకుకు, రిబ్కాకు ఎంతో మనోవేదన కలిగించారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి