కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 37
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • యోసేపు కలలు (1-11)

      • యోసేపు, అసూయపరులైన అతని ​సహోదరులు (12-24)

      • యోసేపును బానిసగా అమ్మేయడం (25-36)

ఆదికాండం 37:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 23:3, 4; 28:1, 4; హెబ్రీ 11:8, 9

ఆదికాండం 37:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:25; 46:19
  • +ఆది 35:25, 26
  • +ఆది 47:3

ఆదికాండం 37:3

అధస్సూచీలు

  • *

    లేదా “ఒక అందమైన పొడవాటి వస్త్రం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 2:1, 2

ఆదికాండం 37:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 37:19

ఆదికాండం 37:7

అధస్సూచీలు

  • *

    లేదా “ధాన్యపు వెన్నుల కట్టల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 42:6, 9

ఆదికాండం 37:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 45:8; 49:26

ఆదికాండం 37:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 44:14; 45:9

ఆదికాండం 37:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:9

ఆదికాండం 37:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 33:18

ఆదికాండం 37:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 23:19; 35:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ‘మంచి దేశము’, పేజీ 7

ఆదికాండం 37:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ‘మంచి దేశము’, పేజీ 7

ఆదికాండం 37:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 37:5

ఆదికాండం 37:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:3
  • +ఆది 9:5; నిర్గ 20:13

ఆదికాండం 37:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 4:8, 10; 42:22
  • +ఆది 42:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2020, పేజీ 2

ఆదికాండం 37:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 37:3

ఆదికాండం 37:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:12
  • +ఆది 43:11

ఆదికాండం 37:26

అధస్సూచీలు

  • *

    అక్ష., “అతని రక్తాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 4:8, 10

ఆదికాండం 37:27

అధస్సూచీలు

  • *

    అక్ష., “మాంసం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:9

ఆదికాండం 37:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:1, 2
  • +ఆది 40:15; 45:4; కీర్త 105:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ‘మంచి దేశము’, పేజీ 7

ఆదికాండం 37:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2020, పేజీ 2

ఆదికాండం 37:30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2020, పేజీ 2

ఆదికాండం 37:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 37:3

ఆదికాండం 37:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2010, పేజీ 15

ఆదికాండం 37:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2010, పేజీ 15

    6/1/1995, పేజీలు 7-8

ఆదికాండం 37:35

అధస్సూచీలు

  • *

    లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 42:38; 44:29; కీర్త 89:48; ప్రస 9:10; హోషే 13:14; అపొ 2:27; ప్రక 20:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1995, పేజీలు 7-8

ఆదికాండం 37:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 39:1
  • +ఆది 40:2, 3

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 37:1ఆది 23:3, 4; 28:1, 4; హెబ్రీ 11:8, 9
ఆది. 37:2ఆది 30:25; 46:19
ఆది. 37:2ఆది 35:25, 26
ఆది. 37:2ఆది 47:3
ఆది. 37:31ది 2:1, 2
ఆది. 37:5ఆది 37:19
ఆది. 37:7ఆది 42:6, 9
ఆది. 37:8ఆది 45:8; 49:26
ఆది. 37:9ఆది 44:14; 45:9
ఆది. 37:11అపొ 7:9
ఆది. 37:12ఆది 33:18
ఆది. 37:14ఆది 23:19; 35:27
ఆది. 37:19ఆది 37:5
ఆది. 37:21ఆది 49:3
ఆది. 37:21ఆది 9:5; నిర్గ 20:13
ఆది. 37:22ఆది 4:8, 10; 42:22
ఆది. 37:22ఆది 42:21
ఆది. 37:23ఆది 37:3
ఆది. 37:25ఆది 25:12
ఆది. 37:25ఆది 43:11
ఆది. 37:26ఆది 4:8, 10
ఆది. 37:27అపొ 7:9
ఆది. 37:28ఆది 25:1, 2
ఆది. 37:28ఆది 40:15; 45:4; కీర్త 105:17
ఆది. 37:32ఆది 37:3
ఆది. 37:35ఆది 42:38; 44:29; కీర్త 89:48; ప్రస 9:10; హోషే 13:14; అపొ 2:27; ప్రక 20:13
ఆది. 37:36ఆది 39:1
ఆది. 37:36ఆది 40:2, 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 37:1-36

ఆదికాండం

37 యాకోబు తన తండ్రి పరదేశిగా జీవించిన+ కనాను దేశంలోనే నివసించసాగాడు.

2 ఇది యాకోబు చరిత్ర.

యోసేపుకు+ 17 ఏళ్లున్నప్పుడు, అతను తన తండ్రి భార్యలైన బిల్హా, జిల్పాల కుమారులతో+ కలిసి మందను కాసేవాడు.+ ఒకసారి, అతను వచ్చి వాళ్లు చేస్తున్న చెడ్డపనుల గురించి తన తండ్రికి చెప్పాడు. 3 ఇశ్రాయేలు తన మిగతా కుమారులందరి+ కన్నా యోసేపును ఎక్కువగా ప్రేమించాడు, ఎందుకంటే యోసేపు అతని ముసలితనంలో పుట్టిన కుమారుడు. యోసేపు కోసం ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన అంగీ* కూడా తయారు చేయించాడు. 4 వాళ్ల నాన్న వాళ్లందరి కన్నా యోసేపునే ఎక్కువగా ప్రేమించడం చూసి అతని సహోదరులు అతన్ని ద్వేషించడం మొదలుపెట్టారు. దాంతో వాళ్లు యోసేపుతో సరిగ్గా మాట్లాడలేకపోయేవాళ్లు.

5 తర్వాత యోసేపుకు ఒక కల వచ్చింది, అతను దాని గురించి తన సహోదరులకు చెప్పాడు.+ దాంతో వాళ్లు అతన్ని ఇంకా ఎక్కువగా ద్వేషించారు. 6 అతను వాళ్లతో ఇలా అన్నాడు: “నాకు ఒక కల వచ్చింది, అదేంటో చెప్తాను దయచేసి వినండి. 7 మనమంతా పొలం మధ్యలో ఉండి పనల్ని* కడుతుండగా, నా పన లేచి నిటారుగా నిలబడింది. అప్పుడు మీ పనలన్నీ నా పన చుట్టూ చేరి, దానికి వంగి నమస్కారం చేశాయి.”+ 8 అతని సహోదరులు అతనితో, “అంటే నువ్వు నిజంగా మా మీద రాజువై, మాపై అధికారం చెలాయించబోతున్నావా?”+ అన్నారు. అతని కలల్ని బట్టి, మాటల్ని బట్టి వాళ్లు అతన్ని ఇంకా ఎక్కువగా ద్వేషించారు.

9 తర్వాత అతనికి ఇంకో కల వచ్చింది. అతను దాని గురించి తన సహోదరులకు చెప్తూ ఇలా అన్నాడు: “నాకు ఇంకో కల వచ్చింది. ఈసారి సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు వంగి నమస్కారం చేస్తున్నాయి.”+ 10 అతను ఆ కలను వాళ్ల నాన్నకు, సహోదరులకు చెప్పినప్పుడు, వాళ్ల నాన్న అతన్ని గద్దించి, “నీ కలకు అర్థమేంటి? నేను, మీ అమ్మ, నీ సహోదరులు నిజంగా నీ దగ్గరికి వచ్చి నీకు వంగి నమస్కారం చేస్తామా?” అన్నాడు. 11 అతని సహోదరులు అతని మీద అసూయపడ్డారు.+ వాళ్ల నాన్న మాత్రం ఆ మాటను మనసులో ఉంచుకున్నాడు.

12 ఒకసారి యోసేపు సహోదరులు షెకెముకు+ దగ్గర్లో వాళ్ల నాన్న మందను మేపడానికి వెళ్లారు. 13 తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో, “నీ సహోదరులు షెకెముకు దగ్గర్లో మందల్ని కాస్తున్నారు కదా? నిన్ను కూడా వాళ్ల దగ్గరికి పంపిస్తాను, రా” అన్నాడు. దానికి అతను, “నేను వెళ్లడానికి సిద్ధమే!” అన్నాడు. 14 కాబట్టి ఇశ్రాయేలు యోసేపుతో, “దయచేసి వెళ్లి, నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో, మంద ఎలా ఉందో చూసి వచ్చి నాకు చెప్పు” అన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు హెబ్రోను+ లోయ నుండి యోసేపును పంపించాడు. అతను షెకెము వైపుగా వెళ్లాడు. 15 కాసేపటికి అతను పొలంలో అటూఇటూ తిరగడం ఒకతను చూసి, “నువ్వు దేనికోసం వెతుకుతున్నావు?” అని అడిగాడు. 16 దానికి యోసేపు, “నేను నా సహోదరుల కోసం వెతుకుతున్నాను. దయచేసి, వాళ్లు మందల్ని ఎక్కడ కాస్తున్నారో చెప్పు” అన్నాడు. 17 అప్పుడు అతను, “వాళ్లు ఇక్కడి నుండి వెళ్లిపోయారు. ‘మనం దోతానుకు వెళ్దాం’ అని వాళ్లు చెప్పుకుంటుంటే నేను విన్నాను” అన్నాడు. కాబట్టి యోసేపు తన సహోదరుల కోసం ఆ దారిన వెళ్లాడు, చివరికి వాళ్లు దోతానులో అతనికి కనిపించారు.

18 అతను కొంతదూరంలో ఉన్నప్పుడు వాళ్లు అతన్ని చూసి, అతను వాళ్ల దగ్గరికి వచ్చేలోపే, అతన్ని చంపడానికి కుట్ర పన్నడం మొదలుపెట్టారు. 19 వాళ్లు ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు: “అదిగో! ఆ కలలు కనేవాడు వస్తున్నాడు.+ 20 రండి, ఇప్పుడు మనం వాణ్ణి చంపి, ఒక నీటి గుంటలో పారేద్దాం; తర్వాత, ఒక క్రూరమృగం వచ్చి వాణ్ణి మింగేసిందని చెప్దాం. అప్పుడు వాడి కలల సంగతి ఏమౌతుందో చూద్దాం.” 21 రూబేను+ ఆ మాట విన్నప్పుడు వాళ్ల నుండి అతన్ని తప్పించడానికి ప్రయత్నించాడు. అందుకే రూబేను, “మనం ఇతని ప్రాణాలు తీయొద్దు”+ అన్నాడు. 22 రూబేను వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు: “రక్తం చిందించకండి.+ ఎడారిలో ఉన్న ఈ నీటి గుంటలో అతన్ని పారేయండి, అంతేగానీ అతనికి హాని చేయకండి.”+ యోసేపును వాళ్ల నుండి తప్పించి తన తండ్రి దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రూబేను అలా అన్నాడు.

23 యోసేపు తన సహోదరుల దగ్గరికి వచ్చిన వెంటనే, వాళ్లు అతను వేసుకున్న ప్రత్యేకమైన అంగీని+ ఊడదీశారు. 24 తర్వాత వాళ్లు అతన్ని ఎత్తి ఒక నీటి గుంటలో పారేశారు. ఆ సమయంలో ఆ గుంట ఖాళీగా ఉంది, అందులో నీళ్లు లేవు.

25 తర్వాత వాళ్లు భోజనం చేయడానికి కూర్చున్నారు. వాళ్లు తల ఎత్తి చూసినప్పుడు, గిలాదు నుండి ఐగుప్తుకు వెళ్తున్న ఇష్మాయేలీయులైన+ వర్తకుల గుంపు ఒకటి కనిపించింది. వాళ్ల ఒంటెలు సువాసనగల జిగురును, సాంబ్రాణిని, గుగ్గిలం బెరడును+ మోసుకెళ్తున్నాయి. 26 అప్పుడు యూదా తన సహోదరులతో ఇలా అన్నాడు: “మన సహోదరుణ్ణి చంపి, ఆ విషయాన్ని*+ కప్పిపుచ్చడం వల్ల మనకేమి లాభం? 27 రండి, అతన్ని ఇష్మాయేలీయులకు అమ్మేద్దాం.+ మనం అతనికి హాని చేయొద్దు. ఎంతైనా, అతను మన సహోదరుడు, మన రక్తం.”* దాంతో వాళ్లు తమ సహోదరుడైన యూదా మాట విన్నారు. 28 మిద్యానీయులైన+ వర్తకులు అటుగా వచ్చినప్పుడు, వాళ్లు యోసేపును ఆ నీటి గుంటలో నుండి పైకి తీసి, 20 వెండి రూకలకు అతన్ని ఆ ఇష్మాయేలీయులకు అమ్మేశారు.+ ఆ వర్తకులు యోసేపును ఐగుప్తుకు తీసుకెళ్లిపోయారు.

29 తర్వాత రూబేను ఆ నీటి గుంట దగ్గరికి వచ్చి చూసేసరికి అందులో యోసేపు లేడు. దాంతో అతను తన బట్టలు చింపుకున్నాడు. 30 అతను తన సహోదరుల దగ్గరికి వచ్చి, “ఆ పిల్లవాడు అక్కడ లేడు! ఇప్పుడు నేను ఏమి చేయాలి?” అన్నాడు.

31 కాబట్టి వాళ్లు ఒక మేకపోతును వధించి, యోసేపు అంగీని ఆ రక్తంలో ముంచారు. 32 తర్వాత వాళ్లు ఆ ప్రత్యేకమైన అంగీని వాళ్ల నాన్న దగ్గరికి పంపించి, ఇలా చెప్పమన్నారు: “మాకు ఇది దొరికింది. దయచేసి, ఇది నీ కుమారుని అంగీనో కాదో చూడు.”+ 33 అప్పుడు యాకోబు దాన్ని పరిశీలనగా చూసి, “ఇది నా కుమారుని అంగీనే! ఒక క్రూరమృగం నా కుమారుని మీద పడి, అతన్ని చీల్చేసి ముక్కలుముక్కలు చేసివుంటుంది!” అన్నాడు. 34 వెంటనే యాకోబు తన బట్టలు చింపుకొని, నడుముకు గోనెపట్ట కట్టుకొని, తన కుమారుని గురించి చాలా రోజులు ఏడ్చాడు. 35 అతని కుమారులందరు, కూతుళ్లందరు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అతను ఓదార్పు పొందడానికి ఇష్టపడకుండా, “నేను ఇలాగే నా కుమారుని గురించి ఏడుస్తూ ఏడుస్తూ సమాధిలోకి*+ వెళ్లిపోతాను!” అనేవాడు. యోసేపు తండ్రి అతని గురించి ఏడుస్తూనే ఉన్నాడు.

36 తర్వాత మిద్యానీయులు యోసేపును ఐగుప్తులో పోతీఫరు అనే వ్యక్తికి అమ్మేశారు. అతను ఫరో ఆస్థాన అధికారి,+ రాజ సంరక్షకుల అధిపతి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి