కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • పాపపరిహారార్థ బలి (1-35)

లేవీయకాండం 4:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 5:17; సం 15:27, 28

లేవీయకాండం 4:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:12; 21:10
  • +సం 12:1, 11
  • +హెబ్రీ 5:1-3; 7:27

లేవీయకాండం 4:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:25
  • +నిర్గ 29:10, 11

లేవీయకాండం 4:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:30

లేవీయకాండం 4:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:15, 16
  • +లేవీ 16:14, 19

లేవీయకాండం 4:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:10
  • +లేవీ 5:9

లేవీయకాండం 4:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 9:8, 10

లేవీయకాండం 4:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:3, 4

లేవీయకాండం 4:11

అధస్సూచీలు

  • *

    ఇది మోకాలు కింది భాగాన్ని సూచిస్తోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:14

లేవీయకాండం 4:12

అధస్సూచీలు

  • *

    లేదా “కొవ్వు బూడిదను,” అంటే, బలి ఇచ్చే జంతువుల కొవ్వులో నానిన బూడిదను.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:14, 17; హెబ్రీ 13:11

లేవీయకాండం 4:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 7:11
  • +సం 15:22-24

లేవీయకాండం 4:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 26:31; 40:21; హెబ్రీ 10:19, 20

లేవీయకాండం 4:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:1, 6
  • +నిర్గ 27:1; 40:6

లేవీయకాండం 4:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:16

లేవీయకాండం 4:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:30; లేవీ 16:17; సం 15:25; ఎఫె 1:7; హెబ్రీ 2:17

లేవీయకాండం 4:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:11, 12
  • +లేవీ 16:15; 1యో 2:1, 2

లేవీయకాండం 4:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 18:21

లేవీయకాండం 4:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:10, 11; 6:25; 7:2

లేవీయకాండం 4:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 9:8, 9; 16:18; హెబ్రీ 9:22
  • +లేవీ 8:15

లేవీయకాండం 4:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:3-5

లేవీయకాండం 4:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 15:27-29

లేవీయకాండం 4:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:10, 11; 6:25

లేవీయకాండం 4:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:25; 8:15; 9:8, 9; హెబ్రీ 9:22

లేవీయకాండం 4:31

అధస్సూచీలు

  • *

    లేదా “శాంతపర్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:3, 4
  • +లేవీ 3:16

లేవీయకాండం 4:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:10, 11

లేవీయకాండం 4:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:25; 16:18

లేవీయకాండం 4:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:13, 14; లేవీ 3:3, 4; 6:12; 9:8, 10
  • +సం 15:28; 1యో 1:7; 2:1, 2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 4:2లేవీ 5:17; సం 15:27, 28
లేవీ. 4:3లేవీ 8:12; 21:10
లేవీ. 4:3సం 12:1, 11
లేవీ. 4:3హెబ్రీ 5:1-3; 7:27
లేవీ. 4:4లేవీ 6:25
లేవీ. 4:4నిర్గ 29:10, 11
లేవీ. 4:5నిర్గ 30:30
లేవీ. 4:6లేవీ 8:15, 16
లేవీ. 4:6లేవీ 16:14, 19
లేవీ. 4:7నిర్గ 30:10
లేవీ. 4:7లేవీ 5:9
లేవీ. 4:9లేవీ 9:8, 10
లేవీ. 4:10లేవీ 3:3, 4
లేవీ. 4:11నిర్గ 29:14
లేవీ. 4:12లేవీ 8:14, 17; హెబ్రీ 13:11
లేవీ. 4:13యెహో 7:11
లేవీ. 4:13సం 15:22-24
లేవీ. 4:17నిర్గ 26:31; 40:21; హెబ్రీ 10:19, 20
లేవీ. 4:18నిర్గ 30:1, 6
లేవీ. 4:18నిర్గ 27:1; 40:6
లేవీ. 4:19లేవీ 3:16
లేవీ. 4:20నిర్గ 32:30; లేవీ 16:17; సం 15:25; ఎఫె 1:7; హెబ్రీ 2:17
లేవీ. 4:21లేవీ 4:11, 12
లేవీ. 4:21లేవీ 16:15; 1యో 2:1, 2
లేవీ. 4:22నిర్గ 18:21
లేవీ. 4:24లేవీ 1:10, 11; 6:25; 7:2
లేవీ. 4:25లేవీ 9:8, 9; 16:18; హెబ్రీ 9:22
లేవీ. 4:25లేవీ 8:15
లేవీ. 4:26లేవీ 3:3-5
లేవీ. 4:27సం 15:27-29
లేవీ. 4:29లేవీ 1:10, 11; 6:25
లేవీ. 4:30లేవీ 4:25; 8:15; 9:8, 9; హెబ్రీ 9:22
లేవీ. 4:31లేవీ 3:3, 4
లేవీ. 4:31లేవీ 3:16
లేవీ. 4:33లేవీ 1:10, 11
లేవీ. 4:34లేవీ 4:25; 16:18
లేవీ. 4:35నిర్గ 29:13, 14; లేవీ 3:3, 4; 6:12; 9:8, 10
లేవీ. 4:35సం 15:28; 1యో 1:7; 2:1, 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 4:1-35

లేవీయకాండం

4 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన పనుల్ని చేయడం ద్వారా ఎవరైనా అనుకోకుండా పాపం చేస్తే+ ఇలా చేయాలి:

3 “ ‘ఒకవేళ అభిషేకించబడిన యాజకుడు+ పాపం చేసి+ ప్రజల మీదికి దోషం తీసుకొస్తే, అతను తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏ లోపంలేని ఒక కోడెదూడను పాపపరిహారార్థ బలిగా యెహోవా దగ్గరికి తీసుకురావాలి.+ 4 అతను ఆ కోడెదూడను ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా ముందుకు తీసుకొచ్చి,+ దాని తలమీద చెయ్యి పెట్టి, యెహోవా ముందు దాన్ని వధించాలి.+ 5 తర్వాత, అభిషేకించబడిన ఆ యాజకుడు+ దాని రక్తంలో కొంచెం తీసుకొని ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్తాడు; 6 ఆ యాజకుడు తన వేలిని ఆ రక్తంలో ముంచి,+ కొంచెం రక్తాన్ని పవిత్ర స్థలంలోని తెర ఎదుట యెహోవా ముందు ఏడుసార్లు చిమ్ముతాడు.+ 7 యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా ముందున్న పరిమళ ధూపవేదిక కొమ్ముల మీద కూడా కొంత రక్తాన్ని చిమ్ముతాడు;+ తర్వాత అతను కోడెదూడ రక్తంలో మిగిలిన దాన్నంతటినీ ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరున్న దహనబలులు అర్పించే బలిపీఠం అడుగుభాగాన పోస్తాడు.+

8 “ ‘ఆ తర్వాత అతను పాపపరిహారార్థ బలి కోసం తెచ్చిన కోడెదూడ కొవ్వంతటినీ వేరుచేస్తాడు. పేగుల దగ్గరున్న కొవ్వును, పేగుల మీద పేరుకున్న కొవ్వును, 9 రెండు మూత్రపిండాల్ని, వాటిమీద తుంట్ల దగ్గరున్న కొవ్వును వేరుచేస్తాడు. మూత్రపిండాలతోపాటు కాలేయం మీదున్న కొవ్వును కూడా అతను వేరుచేస్తాడు.+ 10 సమాధానబలిగా అర్పించే కోడెదూడ నుండి వేటిని వేరుచేస్తారో, దీన్నుండి కూడా వాటినే వేరుచేయాలి.+ యాజకుడు దాన్ని దహనబలులు అర్పించే బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు.

11 “ ‘కానీ ఆ కోడెదూడ చర్మాన్ని, దాని మాంసాన్నంతటినీ, దాని తలను, కాళ్లను,* పేగుల్ని, దాని పేడను,+ 12 అంటే ఆ కోడెదూడలో మిగిలిన దాన్నంతటినీ పాలెం బయట బూడిదను* పారేసే శుభ్రమైన చోటికి తీసుకెళ్లాలి; అతను దాన్ని కట్టెల మీద మంటల్లో కాల్చేస్తాడు.+ బూడిదను పారేసే చోట దాన్ని కాల్చాలి.

13 “ ‘ఒకవేళ ఇశ్రాయేలీయుల సమాజమంతా అనుకోకుండా పాపం చేసి అపరాధులు అయ్యారనుకోండి.+ కానీ, చేయకూడదని యెహోవా తమకు ఆజ్ఞాపించిన పనిని చేశామని వాళ్లు గ్రహించలేదు.+ 14 అయితే, ఆ తర్వాత తాము చేసింది పాపమని వాళ్లకు తెలిసింది. అప్పుడు, వాళ్లు పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను ప్రత్యక్ష గుడారం ముందుకు తీసుకురావాలి. 15 ఇశ్రాయేలీయుల సమాజంలోని పెద్దలు యెహోవా ముందు ఆ కోడెదూడ తలమీద చేతులు పెడతారు. తర్వాత అది యెహోవా ముందు వధించబడుతుంది.

16 “ ‘అభిషేకించబడిన యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో కొంత ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొస్తాడు. 17 ఆ యాజకుడు తన వేలిని ఆ రక్తంలో ముంచి కొంచెం రక్తాన్ని తెర ఎదుట యెహోవా ముందు ఏడుసార్లు చిమ్ముతాడు.+ 18 తర్వాత అతను ప్రత్యక్ష గుడారంలో యెహోవా ముందున్న వేదిక+ కొమ్ముల మీద కొంత రక్తాన్ని చిమ్ముతాడు; ఆ తర్వాత మిగిలిన రక్తాన్నంతా ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరున్న దహనబలులు అర్పించే బలిపీఠం+ అడుగుభాగాన పోస్తాడు. 19 అతను దాని కొవ్వంతటినీ వేరుచేసి, బలిపీఠం మీద పొగ పైకిలేచేలా దాన్ని కాలుస్తాడు.+ 20 పాపపరిహారార్థ బలిగా తెచ్చిన మొదటి కోడెదూడ విషయంలో ఏమేమి చేశాడో, ఈ కోడెదూడ విషయంలో కూడా అలాగే చేయాలి. అతను దీని విషయంలో కూడా అలానే చేస్తాడు. యాజకుడు వాళ్లకోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు,+ వాళ్లు క్షమాపణ పొందుతారు. 21 ఈ కోడెదూడను కూడా పాలెం బయటికి తీసుకెళ్లాలి. అతను మొదటి కోడెదూడను కాల్చినట్టే దీన్ని కూడా కాల్చేస్తాడు.+ ఇది సమాజమంతటి కోసం అర్పించే పాపపరిహారార్థ బలి.+

22 “ ‘ప్రజల ప్రధానుల్లో+ ఒకరు, చేయకూడదని తన దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన పనుల్లో ఒకటి చేయడం ద్వారా అనుకోకుండా పాపం చేసి అపరాధి అయితే, 23 లేదా దేవుని ఆజ్ఞకు విరోధంగా పాపం చేశానని అతను గ్రహిస్తే, ఏ లోపంలేని ఒక మగ మేకపిల్లను అర్పణగా తీసుకురావాలి. 24 అతను ఆ మేకపిల్ల తల మీద చెయ్యి పెట్టి, యెహోవా ముందు దహనబలి జంతువును వధించే చోట దాన్ని వధిస్తాడు.+ ఇది పాపపరిహారార్థ బలి. 25 యాజకుడు ఆ పాపపరిహారార్థ బలి రక్తంలో కొంత తన వేలితో తీసుకొని దహనబలులు అర్పించే బలిపీఠం కొమ్ముల మీద చిమ్ముతాడు,+ మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగుభాగాన పోస్తాడు.+ 26 అతను సమాధానబలి కొవ్వును కాల్చినట్టే, దీని కొవ్వును కూడా బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు;+ యాజకుడు ఆ వ్యక్తి కోసం అతని పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు అతను క్షమాపణ పొందుతాడు.

27 “ ‘దేశ ప్రజల్లో ఎవరైనా, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన పనుల్లో ఒకటి చేయడం ద్వారా అనుకోకుండా పాపం చేసి అపరాధి అయితే,+ 28 లేదా తాను పాపం చేశానని అతను గ్రహిస్తే, తన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏ లోపంలేని ఒక ఆడ మేకపిల్లను అర్పణగా తీసుకురావాలి. 29 అతను పాపపరిహారార్థ బలి జంతువు తల మీద చెయ్యి పెట్టి, దహనబలి జంతువును వధించే చోటే+ పాపపరిహారార్థ బలి జంతువును కూడా వధిస్తాడు. 30 యాజకుడు దాని రక్తంలో కొంత తన వేలితో తీసుకొని దహనబలులు అర్పించే బలిపీఠం కొమ్ముల మీద చిమ్ముతాడు, మిగిలిన రక్తాన్నంతా బలిపీఠం అడుగుభాగాన పోస్తాడు.+ 31 సమాధానబలి జంతువు కొవ్వును వేరుచేసినట్టే,+ దీని కొవ్వంతటినీ+ అతను వేరుచేస్తాడు. యాజకుడు దాన్ని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు, అది యెహోవాకు ఇంపైన* సువాసన. యాజకుడు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, అతను క్షమాపణ పొందుతాడు.

32 “ ‘ఒకవేళ అతను పాపపరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను అర్పించాలనుకుంటే, ఏ లోపంలేని ఒక ఆడ గొర్రెపిల్లను తీసుకురావాలి. 33 అతను పాపపరిహారార్థ బలి జంతువు తల మీద చెయ్యి పెట్టి, దహనబలి జంతువును వధించే చోటే+ దాన్ని కూడా పాపపరిహారార్థ బలిగా వధిస్తాడు. 34 యాజకుడు పాపపరిహారార్థ బలి రక్తంలో కొంత తన వేలితో తీసుకొని దహనబలులు అర్పించే బలిపీఠం కొమ్ముల మీద చిమ్ముతాడు,+ మిగిలిన రక్తాన్నంతా బలిపీఠం అడుగుభాగాన పోస్తాడు. 35 సమాధానబలిగా అర్పించిన మగ గొర్రెపిల్ల కొవ్వును వేరుచేసినట్టే, దీని కొవ్వంతటినీ అతను వేరుచేస్తాడు. యాజకుడు దాన్ని బలిపీఠంపై యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల మీద పెట్టి, పొగ పైకిలేచేలా కాలుస్తాడు;+ యాజకుడు ఆ వ్యక్తి కోసం అతని పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు అతను క్షమాపణ పొందుతాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి