కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • మానవాళికి నిర్దేశాలు (1-7)

        • రక్తం గురించిన నియమం (4-6)

      • ఇంద్రధనుస్సు ఒప్పందం (8-17)

      • నోవహు వంశస్థుల గురించిన ​ప్రవచనాలు (18-29)

ఆదికాండం 9:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:28

ఆదికాండం 9:2

అధస్సూచీలు

  • *

    లేదా “అధికారం కింద ఉంచబడ్డాయి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:26; యాకో 3:7

ఆదికాండం 9:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1తి 4:3
  • +ఆది 1:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2004, పేజీలు 14-15

    తేజరిల్లు!,

    9/8/1997, పేజీలు 18-20

ఆదికాండం 9:4

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:17; 7:26; 17:10, 13; ద్వితీ 12:16, 23; అపొ 15:20, 29; 21:25
  • +లేవీ 17:11, 14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 41

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 39

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీ 90

    “దేవుని ప్రేమ”, పేజీ 85

    కావలికోట,

    6/15/2004, పేజీలు 14-15, 20

    4/1/1992, పేజీ 25

    రక్తము బ్రోషుర్‌, పేజీ 3

ఆదికాండం 9:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 4:8, 10; నిర్గ 21:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    “దేవుని ప్రేమ”, పేజీ 85

    కావలికోట,

    6/15/2004, పేజీ 15

    11/15/1995, పేజీ 10

    4/1/1992, పేజీ 25

    రక్తము బ్రోషుర్‌, పేజీ 3

ఆదికాండం 9:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:13; సం 35:30; మత్త 26:52
  • +ఆది 1:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2004, పేజీ 15

    11/15/1995, పేజీలు 10, 12

ఆదికాండం 9:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:28; 10:32

ఆదికాండం 9:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:15; యెష 54:9

ఆదికాండం 9:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 8:17

ఆదికాండం 9:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 8:21

ఆదికాండం 9:12

అధస్సూచీలు

  • *

    లేదా “సూచన.”

ఆదికాండం 9:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 8:21

ఆదికాండం 9:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2013, పేజీ 13

ఆదికాండం 9:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:12, 13

ఆదికాండం 9:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 5:32; 7:7; 10:1
  • +ఆది 10:6

ఆదికాండం 9:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:32

ఆదికాండం 9:25

అధస్సూచీలు

  • *

    అక్ష., “దాసాను దాసుడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:1
  • +యెహో 17:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2004, పేజీ 31

ఆదికాండం 9:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 1:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 29

ఆదికాండం 9:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/1998, పేజీ 29

ఆదికాండం 9:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 7:6

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 9:1ఆది 1:28
ఆది. 9:2ఆది 1:26; యాకో 3:7
ఆది. 9:31తి 4:3
ఆది. 9:3ఆది 1:29
ఆది. 9:4లేవీ 3:17; 7:26; 17:10, 13; ద్వితీ 12:16, 23; అపొ 15:20, 29; 21:25
ఆది. 9:4లేవీ 17:11, 14
ఆది. 9:5ఆది 4:8, 10; నిర్గ 21:12
ఆది. 9:6నిర్గ 20:13; సం 35:30; మత్త 26:52
ఆది. 9:6ఆది 1:27
ఆది. 9:7ఆది 1:28; 10:32
ఆది. 9:9ఆది 9:15; యెష 54:9
ఆది. 9:10ఆది 8:17
ఆది. 9:11ఆది 8:21
ఆది. 9:15ఆది 8:21
ఆది. 9:17ఆది 9:12, 13
ఆది. 9:18ఆది 5:32; 7:7; 10:1
ఆది. 9:18ఆది 10:6
ఆది. 9:19ఆది 10:32
ఆది. 9:25ద్వితీ 7:1
ఆది. 9:25యెహో 17:13
ఆది. 9:26న్యా 1:28
ఆది. 9:28ఆది 7:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 9:1-29

ఆదికాండం

9 దేవుడు నోవహును, అతని కుమారుల్ని దీవిస్తూ ఇలా అన్నాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి.+ 2 భూమ్మీదున్న ప్రతీ ప్రాణి, ఆకాశంలో ఎగిరే ప్రతీ ప్రాణి, నేలమీద కదిలే ప్రతీ ప్రాణి, సముద్రంలోని చేపలన్నీ మీకు భయపడతాయి, మీరంటే హడలిపోతాయి. ఇప్పుడు అవన్నీ మీ చేతికి అప్పగించబడ్డాయి.*+ 3 ప్రాణంతో కదిలే ప్రతీ జంతువు మీకు ఆహారంగా ఉంటుంది.+ పచ్చని కూరమొక్కల్ని ఇచ్చినట్టు వాటన్నిటినీ మీకు ఇస్తున్నాను.+ 4 అయితే, మాంసాన్ని దాని రక్తంతో తినకూడదు,+ ఎందుకంటే రక్తమే దాని ప్రాణం.*+ 5 అంతేకాదు మీ ప్రాణమైన రక్తం విషయంలో నేను మిమ్మల్ని లెక్క అడుగుతాను. ప్రతీ ప్రాణిని నేను లెక్క అడుగుతాను; ప్రతీ మనిషిని తన సహోదరుని ప్రాణం విషయంలో నేను లెక్క అడుగుతాను.+ 6 ఎవరైనా మనిషి రక్తాన్ని చిందిస్తే, వాళ్ల రక్తం కూడా మనిషి చేతనే చిందించబడుతుంది;+ ఎందుకంటే, దేవుడు మనిషిని తన పోలికలో తయారుచేశాడు.+ 7 మీరైతే పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమ్మీద విస్తరించండి.”+

8 తర్వాత దేవుడు నోవహుతో, అతని కుమారులతో ఇలా అన్నాడు: 9 “నేను ఇప్పుడు మీతో, మీ తర్వాత వచ్చే మీ సంతానంతో నా ఒప్పందం చేస్తున్నాను.+ 10 మీతో ఉన్న ప్రతీ ప్రాణితో, అంటే మీతో ఉన్న పక్షులతో, జంతువులతో, భూమ్మీది ప్రాణులన్నిటితో, ఓడలో నుండి బయటికి వచ్చిన వాటన్నిటితో+ నా ఒప్పందం చేస్తున్నాను. 11 అవును, నేను మీతో నా ఒప్పందం చేస్తున్నాను: ఇంకెప్పుడూ నేను జలప్రళయంతో ప్రాణులన్నిటినీ నాశనం చేయను, ఇంకెప్పుడూ జలప్రళయంతో భూమిని నాశనం చేయను.”+

12 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “మీతో, అలాగే మీతోపాటు ఉన్న ప్రతీ ప్రాణితో నేను చేస్తున్న ఒప్పందానికి గుర్తు* ఇదే. ఈ ఒప్పందం తరతరాలు నిలిచి ఉంటుంది. 13 నేను మేఘంలో నా ఇంద్రధనుస్సును పెడుతున్నాను. అది నాకు, భూమికి మధ్య ఒప్పందానికి గుర్తుగా ఉంటుంది. 14 నేను భూమ్మీదికి మేఘాన్ని తెచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఆ ఇంద్రధనుస్సు మేఘంలో కనిపిస్తుంది. 15 అప్పుడు నేను మీతో, ప్రతీ జాతికి చెందిన ప్రతీ ప్రాణితో చేసిన ఒప్పందాన్ని ఖచ్చితంగా గుర్తుచేసుకుంటాను; ఇంకెప్పుడూ నీళ్లు ప్రళయంగా మారి ప్రాణులన్నిటినీ నాశనం చేయవు.+ 16 మేఘంలో ఇంద్రధనుస్సు వస్తుంది, నేను ఖచ్చితంగా దాన్ని చూసి నాకూ, భూమ్మీదున్న ప్రతీ జాతికి చెందిన ప్రతీ ప్రాణికీ మధ్య ఉన్న శాశ్వత ఒప్పందాన్ని గుర్తుచేసుకుంటాను.”

17 దేవుడు మళ్లీ నోవహుతో, “నేను భూమ్మీదున్న ప్రాణులన్నిటితో చేస్తున్న ఒప్పందానికి గుర్తు ఇదే” అన్నాడు.+

18 ఓడలో నుండి బయటికి వచ్చిన నోవహు కుమారులు ఎవరంటే: షేము, హాము, యాపెతు.+ హాము ఆ తర్వాత కనానుకు తండ్రి అయ్యాడు.+ 19 వీళ్లు ముగ్గురు నోవహు కుమారులు; భూమ్మీద ఉన్న జనాభా అంతా వీళ్ల నుండే వచ్చి, ప్రపంచమంతటా విస్తరించింది.+

20 నోవహు వ్యవసాయం మొదలుపెట్టి, ద్రాక్షతోటను నాటాడు. 21 ఒకరోజు నోవహు ద్రాక్షారసం ఎక్కువగా తాగి, ఆ మత్తులో బట్టల్లేకుండా తన డేరాలో పడుకున్నాడు. 22 కనాను తండ్రి హాము తన తండ్రైన నోవహు బట్టల్లేకుండా ఉండడం చూసి, బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు చెప్పాడు. 23 అప్పుడు షేము, యాపెతు ఒక వస్త్రాన్ని తీసుకొని తమ ఇద్దరి భుజాల మీద పెట్టుకొని వెనక్కి నడుచుకుంటూ వెళ్లి, తమ తండ్రి వైపు చూడకుండా దాన్ని అతని మీద కప్పారు. తమ తండ్రి బట్టల్లేకుండా ఉండడాన్ని వాళ్లు చూడలేదు.

24 నోవహు ద్రాక్షారసం మత్తులో నుండి తేరుకొని, తన చిన్న కుమారుడు తనకు చేసినదాని గురించి తెలుసుకున్నప్పుడు, 25 ఇలా అన్నాడు:

“కనాను శాపగ్రస్తుడిగా ఉండాలి.+

అతను తన సహోదరులకు దాసుడు* అవ్వాలి.”+

26 నోవహు ఇంకా ఇలా అన్నాడు:

“షేము దేవుడైన యెహోవా స్తుతించబడాలి,

కనాను అతనికి దాసుడు అవ్వాలి.+

27 దేవుడు యాపెతుకు చాలా స్థలం ఇవ్వాలి,

అతను షేము డేరాల్లో నివసించాలి.

కనాను అతనికి కూడా దాసుడు అవ్వాలి.”

28 జలప్రళయం తర్వాత నోవహు 350 ఏళ్లు బ్రతికాడు.+ 29 అలా నోవహు మొత్తం 950 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి