కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 33
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • దేవుని గద్దింపు సందేశం (1-6)

      • పాలెం బయట ప్రత్యక్ష గుడారం (7-11)

      • యెహోవా మహిమను చూస్తానని మోషే ​అడగడం (12-23)

నిర్గమకాండం 33:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:7; 26:3

నిర్గమకాండం 33:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:34
  • +ద్వితీ 7:1, 22; యెహో 24:11

నిర్గమకాండం 33:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 8:7-9
  • +నిర్గ 32:9; ద్వితీ 9:6; అపొ 7:51
  • +నిర్గ 32:10; సం 16:21

నిర్గమకాండం 33:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:9; ద్వితీ 9:6; అపొ 7:51
  • +సం 16:45

నిర్గమకాండం 33:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “తీసేశారు.”

నిర్గమకాండం 33:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 18:25, 26; సం 27:1-5

నిర్గమకాండం 33:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 13:21; కీర్త 99:7
  • +సం 11:16, 17; 12:5

నిర్గమకాండం 33:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 33:22, 23; సం 12:8; ద్వితీ 34:10; యోహా 1:18; 6:46; అపొ 7:38
  • +నిర్గ 17:9; 24:13
  • +సం 11:28; ద్వితీ 1:38; యెహో 1:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 83

    కావలికోట,

    3/15/2004, పేజీ 27

    12/1/2002, పేజీ 10

    10/1/1997, పేజీలు 4-5

నిర్గమకాండం 33:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “నువ్వు నాకు పేరుతో తెలుసు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 10/2020, పేజీ 3

నిర్గమకాండం 33:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 25:4; 27:11; 86:11; 119:33; యెష 30:21
  • +ద్వితీ 9:26

నిర్గమకాండం 33:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 13:21; 40:34; యెహో 1:5, 17; యెష 63:9
  • +యెహో 21:44; 23:1

నిర్గమకాండం 33:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:13, 14
  • +ద్వితీ 4:34; 2స 7:23; కీర్త 147:20

నిర్గమకాండం 33:17

అధస్సూచీలు

  • *

    అక్ష., “నువ్వు నాకు పేరుతో తెలుసు.”

నిర్గమకాండం 33:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:13; 6:3; 34:6
  • +రోమా 9:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2019, పేజీ 26

    కావలికోట,

    2/1/1991, పేజీ 4

నిర్గమకాండం 33:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 12-13

    కావలికోట,

    6/15/1999, పేజీలు 19-20

నిర్గమకాండం 33:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 1:18

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 33:1ఆది 12:7; 26:3
నిర్గ. 33:2నిర్గ 32:34
నిర్గ. 33:2ద్వితీ 7:1, 22; యెహో 24:11
నిర్గ. 33:3ద్వితీ 8:7-9
నిర్గ. 33:3నిర్గ 32:9; ద్వితీ 9:6; అపొ 7:51
నిర్గ. 33:3నిర్గ 32:10; సం 16:21
నిర్గ. 33:5నిర్గ 34:9; ద్వితీ 9:6; అపొ 7:51
నిర్గ. 33:5సం 16:45
నిర్గ. 33:7నిర్గ 18:25, 26; సం 27:1-5
నిర్గ. 33:9నిర్గ 13:21; కీర్త 99:7
నిర్గ. 33:9సం 11:16, 17; 12:5
నిర్గ. 33:11నిర్గ 33:22, 23; సం 12:8; ద్వితీ 34:10; యోహా 1:18; 6:46; అపొ 7:38
నిర్గ. 33:11నిర్గ 17:9; 24:13
నిర్గ. 33:11సం 11:28; ద్వితీ 1:38; యెహో 1:1
నిర్గ. 33:13కీర్త 25:4; 27:11; 86:11; 119:33; యెష 30:21
నిర్గ. 33:13ద్వితీ 9:26
నిర్గ. 33:14నిర్గ 13:21; 40:34; యెహో 1:5, 17; యెష 63:9
నిర్గ. 33:14యెహో 21:44; 23:1
నిర్గ. 33:16సం 14:13, 14
నిర్గ. 33:16ద్వితీ 4:34; 2స 7:23; కీర్త 147:20
నిర్గ. 33:19నిర్గ 3:13; 6:3; 34:6
నిర్గ. 33:19రోమా 9:15
నిర్గ. 33:23యోహా 1:18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 33:1-23

నిర్గమకాండం

33 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించిన ఈ ప్రజల్ని తీసుకొని ఇక్కడి నుండి బయల్దేరు. ‘నీ సంతానానికి* దీన్ని ఇస్తాను’ అని ఏ దేశం గురించైతే నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేశానో అక్కడికి ప్రయాణించు.+ 2 నేను నా దూతను నీకు ముందుగా పంపించి+ కనానీయుల్ని, అమోరీయుల్ని, హిత్తీయుల్ని, పెరిజ్జీయుల్ని, హివ్వీయుల్ని, యెబూసీయుల్ని తరిమేస్తాను.+ 3 మీరు లేచి పాలుతేనెలు ప్రవహించే దేశానికి వెళ్లండి.+ మీరు తలబిరుసు ప్రజలు+ కాబట్టి దారిలో మిమ్మల్ని సమూలంగా నాశనం చేయకుండా ఉండేలా నేను మీతోపాటు రాను.”+

4 ప్రజలు ఆ కఠినమైన మాటను విన్నప్పుడు దుఃఖపడడం మొదలుపెట్టారు; వాళ్లలో ఒక్కరు కూడా తమ ఆభరణాలు వేసుకోలేదు. 5 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘మీరు తలబిరుసు ప్రజలు.+ నేను ఒక్క క్షణంలో మీ మధ్య నుండి వెళ్లి, మిమ్మల్ని సమూలంగా నాశనం చేయగలను.+ కాబట్టి నేను మీ విషయంలో ఏంచేయాలో ఆలోచించే వరకు మీ ఆభరణాలు వేసుకోకండి.’ ” 6 అలా, హోరేబు పర్వతం దగ్గర నుండి ఇశ్రాయేలీయులు ఆభరణాలు వేసుకోవడం మానేశారు.*

7 అప్పుడు మోషే తన డేరాను తీసుకొని దాన్ని పాలెం బయట, అంటే పాలేనికి కాస్త దూరంలో వేసుకున్నాడు. అతను దాన్ని ప్రత్యక్ష గుడారం అని పిలిచాడు. యెహోవా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని అనుకునేవాళ్లు+ పాలెం బయట ఉన్న ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్లేవాళ్లు. 8 మోషే ఆ గుడారం దగ్గరికి వెళ్లగానే ప్రజలందరూ లేచి తమతమ డేరాల బయట నిలబడి, అతను గుడారం లోపలికి వెళ్లేవరకు అతన్నే చూస్తూ ఉండేవాళ్లు. 9 మోషే గుడారం లోపలికి వెళ్లగానే మేఘస్తంభం+ దిగివచ్చి, దేవుడు మోషేతో మాట్లాడుతుండగా అది ఆ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరే నిలిచివుండేది.+ 10 మేఘస్తంభం ఆ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర నిలిచివుండడం చూసినప్పుడు ప్రజలందరూ లేచి, ప్రతీ ఒక్కరు తమతమ డేరా ప్రవేశ ద్వారం దగ్గర వంగి నమస్కారం చేసేవాళ్లు. 11 ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడినట్టుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు.+ అతను పాలేనికి తిరిగొచ్చినప్పుడు నూను కుమారుడూ, మోషే పరిచారకుడూ సేవకుడూ+ అయిన యెహోషువ+ మాత్రం ఆ గుడారం దగ్గరే ఉండేవాడు.

12 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “ఇదిగో నువ్వు, ‘ఈ ప్రజల్ని నడిపించు’ అని నాతో అంటున్నావు, కానీ నాతోపాటు ఎవర్ని పంపిస్తావో నువ్వు నాకు తెలియజేయలేదు. పైగా, ‘నేను నిన్ను ఎంచుకున్నాను,* నువ్వు నా దృష్టిలో అనుగ్రహం పొందావు’ అని చెప్పావు. 13 నేను నీ దృష్టిలో అనుగ్రహం పొందివుంటే, దయచేసి నీ మార్గాలు నాకు తెలియజేయి.+ అప్పుడు నేను నిన్ను తెలుసుకొని, ఇలాగే నీ దృష్టిలో అనుగ్రహం పొందుతూ ఉంటాను. ఈ జనం నీ ప్రజలే అన్న విషయం గురించి కూడా ఆలోచించు.”+ 14 కాబట్టి ఆయన, “స్వయంగా నేనే నీతో వస్తాను,+ నీకు విశ్రాంతినిస్తాను”+ అన్నాడు. 15 అప్పుడు మోషే ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వే స్వయంగా మాతో రాకపోతే గనుక, మమ్మల్ని ఇక్కడి నుండి ముందుకు నడిపించకు. 16 నేను, అలాగే నీ ప్రజలు నీ దృష్టిలో అనుగ్రహం పొందామనే విషయం ఎలా తెలుస్తుంది? నువ్వు మాతోపాటు వస్తేనే కదా?+ అప్పుడే భూమ్మీదున్న ప్రజలందరిలో నేను, నీ ప్రజలు ప్రత్యేకమైన వాళ్లుగా ఉంటాం.”+

17 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు మనవి చేసినట్టే నీ కోసం ఈ పని కూడా చేస్తాను. ఎందుకంటే నువ్వు నా దృష్టిలో అనుగ్రహం పొందావు; అంతేకాదు, నువ్వు నాకు బాగా తెలుసు.”* 18 అప్పుడతను, “దయచేసి నీ మహిమను నాకు చూపించు” అన్నాడు. 19 కానీ ఆయన ఇలా అన్నాడు: “నేను నా మంచితనం అంతా నీ ముఖం ముందు నుండి వెళ్లేలా చేస్తాను, యెహోవా అనే నా పేరును నీ ముందు ప్రకటిస్తాను;+ నేను ఎవరిమీద అనుగ్రహం చూపించాలనుకుంటానో వాళ్లమీద అనుగ్రహం చూపిస్తాను, ఎవరిమీద కరుణ చూపించాలనుకుంటానో వాళ్లమీద కరుణ చూపిస్తాను.”+ 20 అయితే ఆయన, “నువ్వు నా ముఖాన్ని చూడలేవు, ఎందుకంటే ఏ మనిషీ నన్ను చూసి బ్రతకలేడు” అన్నాడు.

21 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “ఇదిగో ఇక్కడ నాకు దగ్గరగా ఒక స్థలం ఉంది. నువ్వు ఆ బండమీద నిలబడు. 22 నా మహిమ దాటివెళ్తున్నప్పుడు నేను నిన్ను ఆ బండ సందులో ఉంచుతాను, నేను దాటివెళ్లే వరకు నా చేతితో నిన్ను కప్పుతాను. 23 తర్వాత నా చేతిని తీసేస్తాను, అప్పుడు నువ్వు నా వెనక భాగాన్ని చూస్తావు. కానీ నా ముఖం నీకు కనిపించదు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి