సామెతలు
5 నా కుమారుడా, నేను చెప్పే తెలివిగల మాటల్ని శ్రద్ధగా ఆలకించు,
వివేచన గురించి నేను బోధించేవాటిని జాగ్రత్తగా విను.+
2 అప్పుడు నువ్వు నీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకుంటావు,
5 ఆమె పాదాలు మరణానికి దారితీస్తాయి.
ఆమె అడుగులు నేరుగా సమాధిలోకి* తీసుకెళ్తాయి.
6 జీవ మార్గం గురించి ఆమె ఏమాత్రం ఆలోచించదు.
ఆమె అడుగులు అటూఇటూ వెళ్తుంటాయి, కానీ ఆమె ఎక్కడికి వెళ్తుందో ఆమెకు తెలీదు.
7 కాబట్టి నా కుమారులారా, నా మాటలు వినండి,
నేను చెప్పేవాటి నుండి పక్కకు మళ్లకండి.
8 ఆమెకు చాలా దూరంగా ఉండు;
ఆమె ఇంటి వాకిలి దగ్గరికి కూడా వెళ్లకు.+
9 అలా వెళ్తే, నీ పేరు పాడౌతుంది,+
మిగతా జీవితమంతా కష్టాలు పడాల్సి వస్తుంది.+
10 నీ ఆస్తిపాస్తుల్ని* పరాయివాళ్లు తినేస్తారు,+
నీ కష్టార్జితం వేరేవాళ్ల ఇంటికి చేరుతుంది.
11 చివరిదశలో నీ బలం, నీ శరీరం క్షీణించినప్పుడు
నువ్వు వేదన పడతావు,+
12 నువ్వు ఇలా అనుకుంటావు: “అయ్యో, నేను క్రమశిక్షణను ఎందుకు అసహ్యించుకున్నాను?
నా హృదయం గద్దింపును ఎందుకు తిరస్కరించింది?
13 నా ఉపదేశకుల మాటల్ని నేను వినిపించుకోలేదు,
నా బోధకులు చెప్పింది పట్టించుకోలేదు.
17 అవి నీ కోసమే ఉండాలి,
పరాయివాళ్ల కోసం కాదు.+
ఆమె రొమ్ములవల్ల నువ్వు ఎల్లప్పుడూ తృప్తి పొందాలి.
నువ్వు ఎప్పుడూ ఆమె ప్రేమలో మునిగితేలాలి.+
22 దుష్టులు తమ తప్పుల్లోనే చిక్కుకుంటారు,
వాళ్ల పాపాలే తాళ్లలా వాళ్లను బంధిస్తాయి.+
23 క్రమశిక్షణ లేకపోవడంవల్ల వాళ్లు చనిపోతారు,
విపరీతమైన మూర్ఖత్వం వల్ల పక్కదారి పడతారు.