కీర్తనలు
కృతజ్ఞతా శ్రావ్యగీతం.
100 భూమ్మీది సమస్త ప్రజలారా, విజయోత్సాహంతో కేకలు వేస్తూ యెహోవాను స్తుతించండి.+
2 సంతోషంతో యెహోవాను సేవించండి.+
ఆనందంతో కేకలు వేస్తూ ఆయన సన్నిధిలోకి రండి.
3 యెహోవాయే దేవుడని తెలుసుకోండి.*+
ఆయనే మనల్ని చేశాడు, మనం ఆయన వాళ్లం.*+
మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం.+
ఆయనకు కృతజ్ఞతలు తెలపండి; ఆయన పేరును స్తుతించండి.+