కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ద్వితీయోపదేశకాండం విషయసూచిక

      • మతభ్రష్టుల్ని ఏమి చేయాలి (1-18)

ద్వితీయోపదేశకాండం 13:3

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 8:19; యిర్మీ 27:9
  • +ద్వితీ 8:2
  • +ద్వితీ 6:5; 10:12; మత్త 22:37

ద్వితీయోపదేశకాండం 13:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 10:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2002, పేజీలు 16-17

ద్వితీయోపదేశకాండం 13:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:20
  • +ద్వితీ 17:2, 3, 7; 1కొ 5:13

ద్వితీయోపదేశకాండం 13:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:4; 2పే 2:1

ద్వితీయోపదేశకాండం 13:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 1:8

ద్వితీయోపదేశకాండం 13:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:20; 32:27; సం 25:5
  • +ద్వితీ 17:2, 3, 7

ద్వితీయోపదేశకాండం 13:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:2, 27

ద్వితీయోపదేశకాండం 13:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:13; 1తి 5:20

ద్వితీయోపదేశకాండం 13:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 19:15; 1తి 5:19

ద్వితీయోపదేశకాండం 13:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:4, 5; 2ది 28:6
  • +నిర్గ 22:20

ద్వితీయోపదేశకాండం 13:17

అధస్సూచీలు

  • *

    లేదా “నిషేధం ద్వారా పవిత్రపర్చబడిన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 6:18
  • +ఆది 22:15, 17; 26:3, 4

ద్వితీయోపదేశకాండం 13:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 6:18

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ద్వితీ. 13:3యెష 8:19; యిర్మీ 27:9
ద్వితీ. 13:3ద్వితీ 8:2
ద్వితీ. 13:3ద్వితీ 6:5; 10:12; మత్త 22:37
ద్వితీ. 13:4ద్వితీ 10:20
ద్వితీ. 13:5ద్వితీ 18:20
ద్వితీ. 13:5ద్వితీ 17:2, 3, 7; 1కొ 5:13
ద్వితీ. 13:61రా 11:4; 2పే 2:1
ద్వితీ. 13:8గల 1:8
ద్వితీ. 13:9నిర్గ 22:20; 32:27; సం 25:5
ద్వితీ. 13:9ద్వితీ 17:2, 3, 7
ద్వితీ. 13:10లేవీ 20:2, 27
ద్వితీ. 13:11ద్వితీ 17:13; 1తి 5:20
ద్వితీ. 13:14ద్వితీ 19:15; 1తి 5:19
ద్వితీ. 13:15ద్వితీ 17:4, 5; 2ది 28:6
ద్వితీ. 13:15నిర్గ 22:20
ద్వితీ. 13:17యెహో 6:18
ద్వితీ. 13:17ఆది 22:15, 17; 26:3, 4
ద్వితీ. 13:18ద్వితీ 6:18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ద్వితీయోపదేశకాండం 13:1-18

ద్వితీయోపదేశకాండం

13 “ఒకవేళ నీ మధ్య ఒక ప్రవక్త గానీ, కలలు కని భవిష్యత్తు చెప్పేవాడు గానీ పుట్టుకొచ్చి, ఒక సూచన ఇవ్వడమో, భవిష్యత్తు చెప్పడమో చేశాడనుకో. 2 అతను ఇచ్చిన సూచన గానీ భవిష్యత్తు గురించి అతను చెప్పిన మాట గానీ నిజంగానే జరిగి, ‘వేరే దేవుళ్లను’ అంటే నీకు తెలియని దేవుళ్లను ‘అనుసరిద్దాం, పూజిద్దాం రా’ అని అతను నీతో అంటుంటే, 3 నువ్వు ఆ ప్రవక్త మాటల్ని, ఆ కలలు కనేవాడి మాటల్ని వినకూడదు.+ ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు;+ మీరు మీ దేవుడైన యెహోవాను నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* ప్రేమిస్తున్నారో లేదో+ ఆయన తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. 4 మీరు మీ దేవుడైన యెహోవానే అనుసరించాలి, ఆయనకే భయపడాలి, ఆయన ఆజ్ఞల్నే పాటించాలి, ఆయన మాటే వినాలి; మీరు ఆయన్నే సేవించాలి, ఆయన్నే అంటిపెట్టుకొని ఉండాలి.+ 5 అయితే ఆ ప్రవక్తను, కలలు కనేవాణ్ణి చంపేయాలి.+ ఎందుకంటే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చి, దాస్య గృహం నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవాకు ఎదురుతిరిగేలా అతను మిమ్మల్ని ప్రేరేపించాడు. మీరు నడవాలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన మార్గం నుండి అతను మిమ్మల్ని పక్కకు మళ్లించడానికి ప్రయత్నించాడు. నువ్వు నీ మధ్య నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి.+

6 “నీ తోడబుట్టినవాడు గానీ, నీ కుమారుడు గానీ, నీ కూతురు గానీ, నీ ప్రియమైన భార్య గానీ, నీ ప్రాణ స్నేహితుడు గానీ, ‘మనం వేరే దేవుళ్లను పూజిద్దాం పద’ అంటూ రహస్యంగా నిన్ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారనుకో;+ నీకు గానీ, నీ పూర్వీకులకు గానీ తెలియని దేవుళ్లను, 7 అంటే దగ్గరి ప్రాంతాల్లోని జనాల దేవుళ్లను గానీ, దూర ప్రాంతాల్లోని జనాల దేవుళ్లను గానీ, ఆ దేశంలో ఈ కొన నుండి ఆ కొన వరకు నీ చుట్టూ ఉన్న జనాల దేవుళ్లను పూజిద్దామంటూ నిన్ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారనుకో, 8 నువ్వు అతనికి లొంగిపోకూడదు, అతని మాట వినకూడదు,+ అతని మీద జాలి గానీ కనికరం గానీ చూపించకూడదు, అతన్ని కాపాడకూడదు. 9 బదులుగా నువ్వు అతన్ని ఖచ్చితంగా చంపేయాలి.+ అతన్ని చంపడానికి మొట్టమొదటిగా నీ చెయ్యే అతని మీదికి లేవాలి, ఆ తర్వాతే మిగతా ప్రజలందరి చేతులు లేవాలి.+ 10 నువ్వు అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి;+ ఎందుకంటే అతను, దాస్య గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన నీ దేవుడైన యెహోవా నుండి నిన్ను పక్కకు మళ్లించడానికి ప్రయత్నించాడు. 11 అప్పుడు ఇశ్రాయేలీయులంతా దాని గురించి విని, భయపడతారు; వాళ్లు నీ మధ్య ఇంకెప్పుడూ ఇలాంటి చెడ్డపనేదీ చేయరు.+

12 “నువ్వు స్వాధీనం చేసుకోవడానికి నీ దేవుడైన యెహోవా నీకు ఇవ్వబోయే నగరాల్లోని ఒక దానిలో ఎవరైనా ఇలా అనడం నువ్వు విన్నావనుకో, 13 ‘కొంతమంది పనికిరానివాళ్లు మీ మధ్య పుట్టుకొచ్చి, “మనం వేరే దేవుళ్లను పూజిద్దాం పద” అంటూ మీకు తెలియని దేవుళ్లను పూజించేలా తమ నగరవాసుల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.’ 14 అప్పుడు నువ్వు ఆ విషయాన్ని నిర్ధారించడానికి పూర్తిగా దర్యాప్తు చేయించాలి, విచారణ జరిపించాలి;+ ఆ హేయమైన పని నీ మధ్య నిజంగా జరిగిందని తేలితే, 15 నువ్వు తప్పకుండా ఆ నగరవాసుల్ని ఖడ్గంతో చంపేయాలి.+ ఆ నగరాన్ని, పశువులతో సహా అందులోని సమస్తాన్ని ఖడ్గంతో పూర్తిగా నాశనం చేయాలి.+ 16 తర్వాత నువ్వు ఆ నగరంలోని దోపుడుసొమ్ము అంతటినీ నగరం నడివీధిలోకి తీసుకొచ్చి, ఆ నగరాన్ని అగ్నితో కాల్చేయాలి. దాని దోపుడుసొమ్ము నీ దేవుడైన యెహోవాకు దహనబలి అవుతుంది. ఆ నగరం ఎప్పటికీ శిథిలాల దిబ్బగా ఉంటుంది. దాన్ని మళ్లీ ఎన్నడూ తిరిగి కట్టకూడదు. 17 నాశనం కోసం ప్రత్యేకించబడిన* వాటిలో నుండి దేన్నీ నువ్వు తీసుకోకూడదు.+ అప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి పక్కకుమళ్లి, నీ మీద కరుణను, కనికరాన్ని చూపిస్తాడు; ఆయన నీ పూర్వీకులకు ప్రమాణం చేసినట్టే నువ్వు ఎక్కువమంది అయ్యేలా చేస్తాడు.+ 18 నేడు నేను నీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటినీ పాటించడం ద్వారా నువ్వు నీ దేవుడైన యెహోవాకు లోబడాలి. అలా నువ్వు నీ దేవుడైన యెహోవా దృష్టిలో సరైనది చేస్తావు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి