కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • దానియేలు 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

దానియేలు విషయసూచిక

      • నెబుకద్నెజరు రాజును కలవరపెట్టిన కల (1-4)

      • జ్ఞానులెవ్వరూ కలను చెప్పలేకపోయారు (5-13)

      • దానియేలు దేవుని సహాయం కోరడం (14-18)

      • రహస్యాన్ని తెలియజేసినందుకు దేవుణ్ణి స్తుతించడం (19-23)

      • దానియేలు రాజుకు కలను చెప్పడం (24-35)

      • కల భావం (36-45)

        • రాజ్యం అనే రాయి ప్రతిమను నలగ్గొట్టడం (44, 45)

      • రాజు దానియేలును ఘనపర్చడం (46-49)

దానియేలు 2:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:4, 5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2007, పేజీ 18

దానియేలు 2:2

అధస్సూచీలు

  • *

    అంటే, సోదె, జ్యోతిష్యం చెప్పడంలో నైపుణ్యం ఉన్న గుంపు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:6, 7; 5:7, 8

దానియేలు 2:4

అధస్సూచీలు

  • *

    దానియేలు 2:4బి నుండి 7:28 వరకు మొదట్లో అరామిక్‌లో రాయబడింది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 18:26; ఎజ్రా 4:7; యెష 36:11

దానియేలు 2:5

అధస్సూచీలు

  • *

    లేదా “చెత్త కుప్పలుగా; పెంట కుప్పలుగా” అయ్యుంటుంది.

దానియేలు 2:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:48; 5:16, 29

దానియేలు 2:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:24

దానియేలు 2:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:9

దానియేలు 2:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2023, పేజీ 3

దానియేలు 2:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:28

దానియేలు 2:20

అధస్సూచీలు

  • *

    లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 29:11; యోబు 12:13; కీర్త 147:5; యిర్మీ 32:17-19

దానియేలు 2:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 1:7
  • +1స 2:7, 8; కీర్త 75:7; యిర్మీ 27:5; దాని 4:17
  • +సామె 2:6; ప్రస 2:26; యాకో 1:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2022, పేజీలు 14-16

    కావలికోట,

    9/15/1998, పేజీ 11

దానియేలు 2:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 33:3; 1కొ 2:10
  • +కీర్త 139:12; హెబ్రీ 4:13
  • +కీర్త 36:9; 112:4

దానియేలు 2:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:17; 2:28

దానియేలు 2:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:12, 14

దానియేలు 2:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:3, 6

దానియేలు 2:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:7
  • +ఆది 41:15

దానియేలు 2:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:10, 11

దానియేలు 2:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 40:8; దాని 1:17

దానియేలు 2:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:47

దానియేలు 2:31

అధస్సూచీలు

  • *

    లేదా “విగ్రహం.”

దానియేలు 2:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:37, 38; 7:4
  • +దాని 5:28; 7:5; 8:3, 20
  • +దాని 2:39; 7:6; 8:5, 21

దానియేలు 2:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 7:7, 19
  • +దాని 2:40-42

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    9/8/1992, పేజీలు 17-18

దానియేలు 2:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:44, 45

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    11/8/1992, పేజీ 22

దానియేలు 2:35

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

దానియేలు 2:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 28:14; దాని 5:18

దానియేలు 2:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 27:5-7
  • +దాని 2:32; 4:20-22

దానియేలు 2:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 45:1; యిర్మీ 51:28, 29; దాని 5:28
  • +దాని 7:6; 8:5, 21; 11:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2007, పేజీ 18

    తేజరిల్లు!,

    9/8/1992, పేజీలు 15-16

దానియేలు 2:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:33; 7:19, 23
  • +దాని 7:7

దానియేలు 2:41

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2023, పేజీ 11

    కావలికోట,

    6/15/2012, పేజీలు 15-16

    తేజరిల్లు!,

    9/8/1992, పేజీలు 17-18

దానియేలు 2:42

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2023, పేజీ 11

    కావలికోట,

    6/15/2012, పేజీలు 16, 19

    తేజరిల్లు!,

    9/8/1992, పేజీలు 17-18

దానియేలు 2:43

అధస్సూచీలు

  • *

    లేదా “మానవజాతి సంతానంతో,” అంటే సామాన్యులతో.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2023, పేజీ 11

    కావలికోట (అధ్యయన),

    7/2022, పేజీలు 5-6

    కావలికోట,

    6/15/2012, పేజీలు 16, 19

    తేజరిల్లు!,

    9/8/1992, పేజీలు 17-18

దానియేలు 2:44

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:10; కీర్త 2:6; మత్త 6:10; లూకా 22:29; యోహా 18:36; ప్రక 11:15; 20:6
  • +2స 7:13; యెష 9:7; దాని 7:13, 14
  • +దాని 4:17; 7:27
  • +కీర్త 2:7-9; 110:5, 6; ప్రక 19:15
  • +దాని 4:34; లూకా 1:31-33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 31

    మనం నేర్చుకోవచ్చు, పేజీ 87

    బైబిలు బోధిస్తోంది, పేజీ 81

    కావలికోట,

    9/15/2012, పేజీ 7

    8/15/2012, పేజీ 30

    6/15/2012, పేజీ 17

    10/15/2001, పేజీ 6

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీ 91

    జీవిత సంకల్పము, పేజీలు 26-27

దానియేలు 2:45

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:34, 35
  • +ఆది 41:28; దాని 2:28

దానియేలు 2:47

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 41:39; దాని 1:17; 2:28; 4:9

దానియేలు 2:48

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:6; 5:16, 29

దానియేలు 2:49

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:7

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

దాని. 2:1దాని 4:4, 5
దాని. 2:2దాని 4:6, 7; 5:7, 8
దాని. 2:42రా 18:26; ఎజ్రా 4:7; యెష 36:11
దాని. 2:6దాని 2:48; 5:16, 29
దాని. 2:12దాని 2:24
దాని. 2:15దాని 2:9
దాని. 2:19దాని 2:28
దాని. 2:201ది 29:11; యోబు 12:13; కీర్త 147:5; యిర్మీ 32:17-19
దాని. 2:21అపొ 1:7
దాని. 2:211స 2:7, 8; కీర్త 75:7; యిర్మీ 27:5; దాని 4:17
దాని. 2:21సామె 2:6; ప్రస 2:26; యాకో 1:5
దాని. 2:22యిర్మీ 33:3; 1కొ 2:10
దాని. 2:22కీర్త 139:12; హెబ్రీ 4:13
దాని. 2:22కీర్త 36:9; 112:4
దాని. 2:23దాని 1:17; 2:28
దాని. 2:24దాని 2:12, 14
దాని. 2:25దాని 1:3, 6
దాని. 2:26దాని 1:7
దాని. 2:26ఆది 41:15
దాని. 2:27దాని 2:10, 11
దాని. 2:28ఆది 40:8; దాని 1:17
దాని. 2:30దాని 2:47
దాని. 2:32దాని 2:37, 38; 7:4
దాని. 2:32దాని 5:28; 7:5; 8:3, 20
దాని. 2:32దాని 2:39; 7:6; 8:5, 21
దాని. 2:33దాని 7:7, 19
దాని. 2:33దాని 2:40-42
దాని. 2:34దాని 2:44, 45
దాని. 2:37యిర్మీ 28:14; దాని 5:18
దాని. 2:38యిర్మీ 27:5-7
దాని. 2:38దాని 2:32; 4:20-22
దాని. 2:39యెష 45:1; యిర్మీ 51:28, 29; దాని 5:28
దాని. 2:39దాని 7:6; 8:5, 21; 11:3
దాని. 2:40దాని 2:33; 7:19, 23
దాని. 2:40దాని 7:7
దాని. 2:44ఆది 49:10; కీర్త 2:6; మత్త 6:10; లూకా 22:29; యోహా 18:36; ప్రక 11:15; 20:6
దాని. 2:442స 7:13; యెష 9:7; దాని 7:13, 14
దాని. 2:44దాని 4:17; 7:27
దాని. 2:44కీర్త 2:7-9; 110:5, 6; ప్రక 19:15
దాని. 2:44దాని 4:34; లూకా 1:31-33
దాని. 2:45దాని 2:34, 35
దాని. 2:45ఆది 41:28; దాని 2:28
దాని. 2:47ఆది 41:39; దాని 1:17; 2:28; 4:9
దాని. 2:48దాని 2:6; 5:16, 29
దాని. 2:49దాని 1:7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
దానియేలు 2:1-49

దానియేలు

2 నెబుకద్నెజరు పరిపాలన రెండో సంవత్సరంలో అతనికి కొన్ని కలలు వచ్చాయి. అప్పుడు అతను చాలా కలవరపడ్డాడు,+ దాంతో అతనికి నిద్ర పట్టలేదు. 2 కాబట్టి రాజు తాను కన్న కలల్ని తనకు తెలియజేయడానికి, ఇంద్రజాలం చేసే పూజారుల్ని, సోదె చెప్పేవాళ్లను, మంత్రగాళ్లను, కల్దీయుల్ని* పిలిపించమని ఆజ్ఞాపించాడు. వాళ్లు వచ్చి రాజు ముందు నిలబడ్డారు.+ 3 రాజు వాళ్లతో, “నాకు ఒక కల వచ్చింది, ఆ కల ఏంటో తెలుసుకోవాలని నేను ఆందోళనగా ఉన్నాను” అన్నాడు. 4 దానికి ఆ కల్దీయులు అరామిక్‌ భాషలో*+ ఇలా అన్నారు: “రాజా, నువ్వు కలకాలం జీవించాలి. నీ సేవకులమైన మాకు ఆ కల ఏంటో చెప్పు, మేము దాని భావాన్ని తెలియజేస్తాం.”

5 అప్పుడు రాజు ఆ కల్దీయులతో ఇలా అన్నాడు: “ఇదే నా నిర్ణయం: మీరు కలను, దాని భావాన్ని నాకు చెప్పకపోతే మిమ్మల్ని ముక్కలుముక్కలు చేస్తాను, మీ ఇళ్లు బహిరంగ మరుగుదొడ్లుగా* మార్చబడతాయి. 6 అయితే మీరు ఆ కలను, దాని భావాన్ని తెలియజేస్తే మీకు కానుకల్ని, బహుమానాల్ని, గొప్ప ఘనతను ఇస్తాను.+ కాబట్టి కలను, దాని భావాన్ని నాకు చెప్పండి.”

7 వాళ్లు రెండోసారి, “రాజా, ఆ కలను తమ సేవకులకు తెలియజేయి, మేము దాని భావం చెప్తాం” అన్నారు.

8 అప్పుడు రాజు ఇలా అన్నాడు: “మీరు ఇంకొంచెం సమయం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమైంది, కానీ నా నిర్ణయం ఏంటో మీకు తెలుసు. 9 మీరు ఆ కలను చెప్పకపోతే, మీ అందరికీ ఒకే శిక్ష పడుతుంది. అయితే నా మనసు మారుతుందనే ఆశతో మీరు కూడబలుక్కొని నాకు అబద్ధాలు, మోసపు మాటలు చెప్పాలనుకుంటున్నారు. కాబట్టి ఆ కల ఏంటో నాకు చెప్పండి, అప్పుడు మీరు దాని భావాన్ని వివరించగలరని నాకు తెలుస్తుంది.”

10 దానికి ఆ కల్దీయులు రాజుతో ఇలా అన్నారు: “రాజు అడిగినదాన్ని భూమ్మీద ఏ మనిషీ చేయలేడు. ఏ గొప్ప రాజూ ఏ అధిపతీ ఇలాంటి విషయాన్ని ఇంద్రజాలం చేసే పూజారిని గానీ, సోదె చెప్పేవాణ్ణి గానీ, కల్దీయుణ్ణి గానీ అడగలేదు. 11 రాజు అడుగుతున్నది చాలా కష్టమైనది, దేవుళ్లు తప్ప ఇంకెవ్వరూ దీన్ని రాజుకు చెప్పలేరు, కానీ దేవుళ్లు మనుషుల మధ్య జీవించరు కదా.”

12 దాంతో రాజుకు విపరీతమైన కోపం వచ్చి, బబులోనులో ఉన్న జ్ఞానులందర్నీ నాశనం చేయమని ఆజ్ఞాపించాడు.+ 13 ఆజ్ఞ జారీ అయ్యి, జ్ఞానులు చంపబడబోతుండగా వాళ్లు దానియేలును, అతని స్నేహితుల్ని కూడా చంపాలని వాళ్ల కోసం వెదికారు.

14 అప్పుడు దానియేలు, బబులోనులోని జ్ఞానుల్ని చంపడానికి బయల్దేరిన అర్యోకుతో నేర్పుగా, జాగ్రత్తగా మాట్లాడాడు. ఈ అర్యోకు రాజు అంగరక్షకుల అధిపతి. 15 దానియేలు, “రాజు ఇంత కఠినమైన ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు?” అని రాజు ముఖ్య అధికారైన అర్యోకును అడిగాడు. అప్పుడు అర్యోకు జరిగిన విషయం దానియేలుకు చెప్పాడు.+ 16 దాంతో దానియేలు రాజు దగ్గరికి వెళ్లి, కల భావం చెప్పడానికి సమయం ఇవ్వమని కోరాడు.

17 తర్వాత దానియేలు తన ఇంటికి వెళ్లి, తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు జరిగిన విషయం చెప్పాడు. 18 తాను, తన స్నేహితులు బబులోనులోని మిగతా జ్ఞానులతో పాటు నాశనం కాకుండా, పరలోక దేవుడు తమను కరుణించి ఆ రహస్యాన్ని తెలియజేసేలా ఆయన్ని వేడుకోమని దానియేలు వాళ్లకు చెప్పాడు.

19 అప్పుడు రాత్రిపూట ఒక దర్శనంలో ఆ రహస్యం దానియేలుకు తెలియజేయబడింది.+ కాబట్టి దానియేలు పరలోక దేవుణ్ణి స్తుతించాడు. 20 దానియేలు ఇలా అన్నాడు:

“దేవుని పేరు శాశ్వతకాలం* స్తుతించబడాలి,

ఎందుకంటే తెలివి, బలం ఆయనవే.+

21 ఆయన సమయాల్ని, కాలాల్ని మారుస్తాడు,+

రాజుల్ని దించేస్తాడు, నియమిస్తాడు,+

తెలివిగల వాళ్లకు తెలివిని, వివేచన గలవాళ్లకు జ్ఞానాన్ని ఇస్తాడు.+

22 ఆయన లోతైన విషయాల్ని, దాగివున్న సంగతుల్ని తెలియజేస్తాడు,+

చీకట్లో ఏముందో ఆయనకు తెలుసు,+

వెలుగు ఆయన దగ్గర నివసిస్తుంది.+

23 మా పూర్వీకుల దేవా, నువ్వు నాకు తెలివిని, శక్తిని ఇచ్చావు కాబట్టి

నీకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాను,

మేము నిన్ను అడిగినదాన్ని నువ్వు నాకు తెలియజేశావు;

రాజును ఆందోళన పెడుతున్న విషయాన్ని మాకు తెలియజేశావు.”+

24 తర్వాత దానియేలు, బబులోనులోని జ్ఞానుల్ని నాశనం చేయడానికి రాజు నియమించిన అర్యోకు+ దగ్గరికి వెళ్లి, “బబులోనులోని జ్ఞానులెవర్నీ నాశనం చేయొద్దు. నన్ను రాజు ముందుకు తీసుకెళ్లు. నేను ఆ కల భావాన్ని రాజుకు తెలియజేస్తాను” అన్నాడు.

25 అర్యోకు వెంటనే దానియేలును రాజు ముందుకు తీసుకెళ్లి రాజుతో, “యూదా నుండి బందీలుగా వచ్చిన వాళ్లలో నేను ఒక మనిషిని కనుగొన్నాను,+ అతను కల భావాన్ని రాజుకు తెలియజేయగలడు” అని చెప్పాడు. 26 అప్పుడు రాజు, బెల్తెషాజరు అనే పేరుగల దానియేలుతో,+ “నేను చూసిన కలను, దాని భావాన్ని నువ్వు నిజంగా నాకు తెలియజేయగలవా?” అని అడిగాడు.+ 27 దానికి దానియేలు రాజుతో ఇలా అన్నాడు: “రాజు అడిగిన రహస్యాన్ని ఏ జ్ఞాని గానీ, సోదె చెప్పేవాడు గానీ, ఇంద్రజాలం చేసే పూజారి గానీ, జ్యోతిష్యుడు గానీ తెలియజేయలేడు.+ 28 అయితే రహస్యాల్ని వెల్లడిచేసే దేవుడు+ పరలోకంలో ఉన్నాడు, చివరి రోజుల్లో ఏం జరుగుతుందో ఆయన నెబుకద్నెజరు రాజుకు తెలియజేశాడు. నీ పడక మీద పడుకుని ఉన్నప్పుడు నీకు వచ్చిన కల, నువ్వు చూసిన దర్శనాలు ఇవి:

29 “రాజా, నువ్వు నీ పడక మీద ఉండగా, నీ ఆలోచనలు భవిష్యత్తులో జరగబోయే వాటిమీదికి మళ్లాయి, రహస్యాల్ని వెల్లడిచేసే దేవుడు జరగబోయే వాటిని నీకు తెలియజేశాడు. 30 మిగతా వాళ్లందరికన్నా నాకు గొప్ప తెలివి ఉందని కాదు గానీ, నీ హృదయంలోని ఆలోచనలు నువ్వు తెలుసుకునేలా నీకు కల భావాన్ని చెప్పడానికే ఈ రహస్యం నాకు వెల్లడిచేయబడింది.+

31 “రాజా, నువ్వు చూస్తుండగా ఒక భారీ ప్రతిమ* నీకు కనిపించింది; చాలా పెద్దగా, ఎంతో ప్రకాశవంతంగా ఉన్న ఆ ప్రతిమ నీ ఎదుట నిలబడివుంది; దాని రూపం భయంకరంగా ఉంది. 32 ఆ ప్రతిమ తల మేలిమి బంగారుది;+ దాని ఛాతి భాగం, చేతులు వెండివి;+ దాని పొట్ట, తొడలు రాగివి;+ 33 దాని కాళ్లు ఇనుపవి;+ దాని పాదాలు కొంతభాగం ఇనుపవి, కొంతభాగం బంకమట్టివి.+ 34 నువ్వు చూస్తుండగా, చేతి సహాయం లేకుండా పర్వతం నుండి తీయబడిన ఒక రాయి వచ్చి ఇనుము, బంకమట్టి గల ఆ ప్రతిమ పాదాల్ని ఢీకొట్టి వాటిని నలగ్గొట్టింది.+ 35 అప్పుడు ఇనుము, బంకమట్టి, రాగి, వెండి, బంగారం అన్నీ కలిపి నలగ్గొట్టబడి ఎండాకాలం కళ్లంలో* ఉండే పొట్టులా అయ్యాయి. తర్వాత వాటి ఆనవాళ్లు కూడా లేకుండా గాలి వాటిని కొట్టుకెళ్లిపోయింది. అయితే ఆ ప్రతిమను ఢీకొట్టిన రాయి ఒక పెద్ద పర్వతమై, భూమంతా నిండిపోయింది.

36 “కల ఇదే, ఇప్పుడు మేము దాని భావాన్ని రాజుకు చెప్తాం. 37 రాజా, నువ్వు రాజాధి రాజువు, పరలోక దేవుడు నీకు రాజ్యాన్ని, బలాన్ని, శక్తిని, మహిమను ఇచ్చాడు,+ 38 మనుషులు ఎక్కడ నివసిస్తున్నప్పటికీ వాళ్లందర్నీ అలాగే మైదానంలోని జంతువుల్నీ, ఆకాశంలోని పక్షుల్నీ నీకు అప్పగించాడు; ఆయన వాళ్లందరి మీద, వాటన్నిటి మీద నిన్ను పరిపాలకుణ్ణి చేశాడు;+ నువ్వే ఆ బంగారు తల.+

39 “కానీ నీ తర్వాత, నీ కన్నా తక్కువైన ఇంకో రాజ్యం లేస్తుంది;+ దాని తర్వాత మరో రాజ్యం అంటే మూడో రాజ్యం లేస్తుంది, అది రాగిది. అది భూమంతటినీ పరిపాలిస్తుంది.+

40 “నాలుగో రాజ్యం విషయానికొస్తే, అది ఇనుములా బలంగా ఉంటుంది.+ ఇనుము ప్రతీదాన్ని నలగ్గొట్టి పొడి చేసినట్టే, ఈ రాజ్యం ముందున్న ఆ రాజ్యాలన్నిటినీ నలగ్గొట్టి పూర్తిగా నాశనం చేస్తుంది.+

41 “పాదాలు, వేళ్లు కొంతభాగం బంకమట్టివిగా, కొంతభాగం ఇనుపవిగా ఉండడం నువ్వు చూసినట్టే, ఆ రాజ్యం ఐక్యంగా ఉండదు; కానీ ఇనుము మెత్తని బంకమట్టితో కలిసివుండడం నువ్వు చూసినట్టే, దానిలో ఇనుములోని గట్టిదనం కొంతవరకు ఉంటుంది. 42 పాదాల వేళ్లు కొంతభాగం ఇనుపవిగా, కొంతభాగం బంకమట్టివిగా ఉన్నట్టే, ఆ రాజ్యం ఒక విషయంలో బలంగా మరో విషయంలో బలహీనంగా ఉంటుంది. 43 ఇనుము మెత్తని బంకమట్టితో కలిసివుండడం నువ్వు చూసినట్టే, ఆ రాజ్యంలోని భాగాలు ప్రజలతో* కలిసిపోతాయి; కానీ ఇనుము బంకమట్టితో అతకనట్టు అవి ఒకదానితో ఒకటి అతకవు.

44 “ఆ రాజుల కాలాల్లో పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు,+ అది ఎప్పటికీ నాశనం కాదు.+ ఆ రాజ్యం వేరే ఏ ప్రజల చేతుల్లోకి వెళ్లదు.+ అది ఆ రాజ్యాలన్నిటినీ నలగ్గొట్టి నాశనం చేస్తుంది,+ అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది,+ 45 చేతి సహాయం లేకుండా పర్వతం నుండి రాయి తీయబడి, ఇనుమును, రాగిని, బంకమట్టిని, వెండిని, బంగారాన్ని నలగ్గొట్టడం నువ్వు చూసినట్టే అది జరుగుతుంది.+ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో గొప్ప దేవుడు రాజుకు తెలియజేశాడు.+ ఆ కల నిజం; దాని భావం నమ్మదగినది.”

46 అప్పుడు నెబుకద్నెజరు రాజు దానియేలు ముందు సాష్టాంగపడి, అతన్ని ఘనపర్చాడు. దానియేలుకు ఒక బహుమానాన్ని, ధూపాన్ని అర్పించమని రాజు ఆజ్ఞాపించాడు. 47 రాజు దానియేలుతో, “నువ్వు ఈ రహస్యాన్ని తెలియజేయగలిగావు కాబట్టి, నిజంగా నీ దేవుడు దేవుళ్లకు దేవుడు, రాజులకు ప్రభువు, రహస్యాల్ని వెల్లడిచేసేవాడు” అన్నాడు.+ 48 తర్వాత రాజు దానియేలును హెచ్చించి, శ్రేష్ఠమైన ఎన్నో బహుమానాలు ఇచ్చాడు; అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద పరిపాలకునిగా,+ బబులోనులోని జ్ఞానులందరి మీద ముఖ్య అధికారిగా నియమించాడు. 49 దానియేలు మనవి చేయడంతో రాజు షద్రకును, మేషాకును, అబేద్నెగోను+ బబులోను సంస్థానం మీద అధికారులుగా నియమించాడు, కానీ దానియేలు మాత్రం రాజు ఆస్థానంలోనే  సేవచేశాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి