కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • గలతీయులు 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

గలతీయులు విషయసూచిక

      • ఇక దాసులు కాదు, కుమారులు (1-7)

      • గలతీయుల మీద పౌలుకున్న శ్రద్ధ (8-20)

      • హాగరు, శారా: రెండు ఒప్పందాలు (21-31)

        • పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది, ఆమె మన తల్లి (26)

గలతీయులు 4:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 2:8, 20-22

గలతీయులు 4:4

అధస్సూచీలు

  • *

    లేదా “సమయం పూర్తయినప్పుడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 1:14; హెబ్రీ 2:14
  • +మత్త 5:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/1998, పేజీలు 13-14

గలతీయులు 4:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 7:23; గల 3:13
  • +యోహా 1:12; రోమా 8:23

గలతీయులు 4:6

అధస్సూచీలు

  • *

    ఇక్కడ “అబ్బా” అనే హీబ్రూ లేదా అరామిక్‌ పదం ఉంది. ఇది పిల్లలు తమ తండ్రిని పిలిచేటప్పుడు ఉపయోగించే పదం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 14:26; రోమా 5:5
  • +రోమా 8:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2009, పేజీ 13

గలతీయులు 4:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:17; గల 3:29; ఎఫె 1:13, 14

గలతీయులు 4:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:3; హెబ్రీ 7:18, 19
  • +కొలొ 2:20-22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    7/2018, పేజీ 8

    కావలికోట,

    3/15/2013, పేజీలు 13-14

గలతీయులు 4:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 2:16

గలతీయులు 4:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 1:14

గలతీయులు 4:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 89

గలతీయులు 4:14

అధస్సూచీలు

  • *

    లేదా “నా మీద ఉమ్మేయలేదు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    10/8/1993, పేజీ 15

గలతీయులు 4:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 23:5; గల 6:11

గలతీయులు 4:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2001, పేజీ 32

గలతీయులు 4:19

అధస్సూచీలు

  • *

    లేదా “క్రీస్తు మీలో రూపుదిద్దుకునే వరకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 4:15; 1థె 2:11; ఫిలే 10

గలతీయులు 4:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 16:15
  • +ఆది 21:2, 3

గలతీయులు 4:23

అధస్సూచీలు

  • *

    అక్ష., “శరీర ప్రకారం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 16:1, 2
  • +ఆది 17:15, 16

గలతీయులు 4:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:20; 24:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2014, పేజీ 10

గలతీయులు 4:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:18

గలతీయులు 4:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2015, పేజీలు 17-18

    ప్రకటన ముగింపు, పేజీ 178

    యెషయా ప్రవచనం II, పేజీ 216

గలతీయులు 4:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 54:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2006, పేజీ 11

    8/1/1995, పేజీ 11

గలతీయులు 4:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 9:8; గల 3:29

గలతీయులు 4:29

అధస్సూచీలు

  • *

    అక్ష., “శరీర ప్రకారం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:9
  • +గల 5:11; 2తి 3:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2006, పేజీలు 11-12

    8/15/2001, పేజీ 26

గలతీయులు 4:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:10

గలతీయులు 4:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2015, పేజీలు 17-18

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

గల. 4:3కొలొ 2:8, 20-22
గల. 4:4యోహా 1:14; హెబ్రీ 2:14
గల. 4:4మత్త 5:17
గల. 4:51కొ 7:23; గల 3:13
గల. 4:5యోహా 1:12; రోమా 8:23
గల. 4:6యోహా 14:26; రోమా 5:5
గల. 4:6రోమా 8:15
గల. 4:7రోమా 8:17; గల 3:29; ఎఫె 1:13, 14
గల. 4:9రోమా 8:3; హెబ్రీ 7:18, 19
గల. 4:9కొలొ 2:20-22
గల. 4:10కొలొ 2:16
గల. 4:12గల 1:14
గల. 4:15అపొ 23:5; గల 6:11
గల. 4:191కొ 4:15; 1థె 2:11; ఫిలే 10
గల. 4:22ఆది 16:15
గల. 4:22ఆది 21:2, 3
గల. 4:23ఆది 16:1, 2
గల. 4:23ఆది 17:15, 16
గల. 4:24నిర్గ 19:20; 24:12
గల. 4:25నిర్గ 19:18
గల. 4:27యెష 54:1
గల. 4:28రోమా 9:8; గల 3:29
గల. 4:29ఆది 21:9
గల. 4:29గల 5:11; 2తి 3:12
గల. 4:30ఆది 21:10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
గలతీయులు 4:1-31

గలతీయులు

4 నేను చెప్పేదేమిటంటే, వారసుడు అన్నిటికీ యజమానే అయినా అతను పసివాడిగా ఉన్నంతకాలం అతనికీ దాసునికీ ఏ తేడా ఉండదు. 2 తన తండ్రి నిర్ణయించిన సమయం వచ్చేవరకు అతను సంరక్షకుల, గృహనిర్వాహకుల అధీనంలో ఉంటాడు. 3 అలాగే మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు లోకంలోని ప్రాథమిక విషయాలకు+ దాసులుగా ఉండేవాళ్లం. 4 అయితే నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు* దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు, ఆ కుమారుడు ఒక స్త్రీకి పుట్టాడు,+ ధర్మశాస్త్రానికి లోబడ్డాడు.+ 5 ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్లను కొని,+ విడుదల చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఆయన్ని పంపించాడు. అలా దేవుడు మనల్ని కుమారులుగా దత్తత తీసుకోవడం సాధ్యమౌతుంది.+

6 ఇప్పుడు మీరు కుమారులు కాబట్టి, దేవుడు తన కుమారుడికి ఇచ్చిన పవిత్రశక్తినే మన హృదయాల్లోకి పంపించాడు.+ ఆ పవిత్రశక్తి వల్ల మనం “నాన్నా,* తండ్రీ!” అని పిలవగలుగుతున్నాం.+ 7 కాబట్టి మీరిక దాసులు కాదు, కుమారులు. మీరు కుమారులైతే, దేవుని ద్వారా వారసులు కూడా.+

8 అయితే మీకు దేవుడు తెలియకముందు, మీరు దేవుళ్లుకాని వాటికి దాసులుగా ఉండేవాళ్లు. 9 కానీ ఇప్పుడు మీకు దేవుడు తెలుసు, సరిగ్గా చెప్పాలంటే, మీరు దేవుడికి తెలుసు. అలాంటిది, మీరు మళ్లీ పనికిరాని,+ విలువలేని ప్రాథమిక విషయాల వైపుకు తిరిగి, ఎందుకు వాటికి దాసులు అవ్వాలనుకుంటున్నారు?+ 10 మీరు రోజుల్ని, నెలల్ని,+ కాలాల్ని, సంవత్సరాల్ని నిష్ఠగా ఆచరిస్తున్నారు. 11 మీ విషయంలో నేను పడ్డ ప్రయాస వృథా అయిపోతుందేమోనని భయపడుతున్నాను.

12 సహోదరులారా, ఇప్పుడు మీరెలా ఉన్నారో అంతకుముందు నేనూ అలాగే ఉన్నాను,+ కానీ ఇప్పుడు మారాను. కాబట్టి నాలాగే మారమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. అంతకుముందు మీరు నాతో చెడుగా వ్యవహరించలేదు. 13 అయితే నా అనారోగ్యం కారణంగా మీకు మొదటిసారి మంచివార్త ప్రకటించే అవకాశం నాకు దొరికిందని మీకు తెలుసు. 14 అప్పుడు నా ఆరోగ్య పరిస్థితి వల్ల మీకు ఇబ్బంది కలిగినా, మీరు నన్ను పట్టించుకోకుండా వదిలేయలేదు, అసహ్యించుకోలేదు;* కానీ ఒక దేవదూతను చేర్చుకున్నట్టు, యేసుక్రీస్తును చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకున్నారు. 15 ఆ సంతోషమంతా ఇప్పుడు ఏమైంది? అప్పట్లో మీరు, సాధ్యమైతే మీ కళ్లు కూడా పీకి నాకు ఇచ్చివుండేవాళ్లు+ అని మీ గురించి సాక్ష్యం చెప్తున్నాను. 16 అలాంటిది, ఇప్పుడు నేను నిజం చెప్తున్నందుకు మీకు శత్రువునయ్యానా? 17 ఆ మనుషులు మిమ్మల్ని తమవైపు లాక్కోవడానికి ఉత్సాహంగా ప్రయత్నిస్తున్నారు, కానీ అదంతా మీ మంచి కోరి కాదు. మిమ్మల్ని నాకు దూరం చేసి, తమ వెంట తిప్పుకోవాలనే వాళ్లు అలా చేస్తున్నారు. 18 అయితే, మంచి ఉద్దేశంతో మీ విషయంలో ఉత్సాహం చూపించేవాళ్లు ఉండడం మంచిదే. నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, అన్ని సమయాల్లో వాళ్లు అలా ఉండాలి. 19 నా చిన్నపిల్లలారా,+ మీరు క్రీస్తు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే వరకు,* మీకోసం మళ్లీ నాకు ఈ ప్రసవ వేదన కలుగుతూనే ఉంటుంది. 20 నాకు ఇప్పటికిప్పుడు మీ దగ్గరికి రావాలని, మీతో ఇంకోలా మాట్లాడాలని ఉంది. ఎందుకంటే, మీ విషయంలో ఏంచేయాలో నాకు అర్థం కావట్లేదు.

21 ధర్మశాస్త్రాన్ని పాటించాలనుకునే వాళ్లారా, ఒక విషయం చెప్పండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో మీరు వినట్లేదా? 22 ఉదాహరణకు, అబ్రాహాముకు ఇద్దరు కుమారులు ఉన్నారని, ఒకతను సేవకురాలికి పుట్టినవాడని,+ ఇంకొకతను స్వతంత్రురాలికి పుట్టినవాడని+ రాయబడివుంది; 23 అయితే, సేవకురాలికి పుట్టిన కుమారుడు మామూలుగా* పుట్టాడు,+ కానీ స్వతంత్రురాలికి పుట్టిన కుమారుడు వాగ్దానం ద్వారా పుట్టాడు.+ 24 ఈ విషయాలకు వేరే అర్థం ఉంది. ఆ ఇద్దరు స్త్రీలు రెండు ఒప్పందాల్ని సూచిస్తున్నారు. హాగరు సీనాయి పర్వతం+ దగ్గర జరిగిన ఒప్పందాన్ని సూచిస్తుంది, ఈ ఒప్పందం కింద ఉన్నవాళ్లు దాసులు. 25 ఇక్కడ, హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతాన్ని,+ ఇప్పటి యెరూషలేమును సూచిస్తుంది; ఎందుకంటే యెరూషలేము తన పిల్లలతోపాటు దాసత్వంలో ఉంది. 26 కానీ పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది, ఆమె మన తల్లి.

27 ఎందుకంటే లేఖనంలో ఇలా రాసివుంది: “గొడ్రాలా, పిల్లలు కననిదానా, సంతోషించు; పురిటినొప్పులు పడనిదానా, సంతోషంతో కేకలు వేయి. ఎందుకంటే, భర్త ఉన్న స్త్రీ పిల్లల కన్నా వదిలేయబడిన స్త్రీ పిల్లలే చాలా ఎక్కువమంది.”+ 28 సహోదరులారా, మీరు ఇస్సాకులా వాగ్దానం వల్ల పుట్టిన పిల్లలు.+ 29 అయితే అప్పట్లో, మామూలుగా* పుట్టినవాడు పవిత్రశక్తి ద్వారా పుట్టినవాణ్ణి హింసించడం మొదలుపెట్టాడు.+ ఇప్పుడూ అలాగే జరుగుతోంది.+ 30 కానీ, లేఖనం ఏం చెప్తోంది? “సేవకురాలిని, ఆమె కుమారుణ్ణి వెళ్లగొట్టు, ఎందుకంటే సేవకురాలి కుమారుడు ఎట్టిపరిస్థితుల్లోనూ స్వతంత్రురాలి కుమారుడితోపాటు వారసుడు అవ్వడు.”+ 31 సహోదరులారా, మనం సేవకురాలి పిల్లలం కాదు, స్వతంత్రురాలి పిల్లలం.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి