మీకా
యెహోవా మందిర పర్వతం+
పర్వత శిఖరాల పైన దృఢంగా స్థాపించబడుతుంది,
కొండల కన్నా ఎత్తుగా ఎత్తబడుతుంది,
దేశదేశాల ప్రజలు ప్రవాహంలా అక్కడికి వస్తారు.+
2 ఎన్నో దేశాల ప్రజలు వచ్చి ఇలా చెప్పుకుంటారు:
“రండి, మనం యెహోవా పర్వతం మీదికి,
యాకోబు దేవుని మందిరానికి వెళ్దాం.+
ఆయన తన మార్గాల గురించి మనకు బోధిస్తాడు,
మనం ఆయన త్రోవల్లో నడుద్దాం.”
ఎందుకంటే, సీయోనులో నుండి ధర్మశాస్త్రం,*
యెరూషలేములో నుండి యెహోవా వాక్యం బయల్దేరతాయి.
3 ఆయన అనేక దేశాల ప్రజల మధ్య న్యాయం తీరుస్తాడు,+
దూరాన ఉన్న బలమైన దేశాలకు సంబంధించిన విషయాల్ని చక్కదిద్దుతాడు.*
దేశం మీదికి దేశం ఖడ్గం ఎత్తదు,
వాళ్లిక యుద్ధం చేయడం నేర్చుకోరు.+
4 వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ ద్రాక్షచెట్టు కింద, తమ అంజూర చెట్టు కింద కూర్చుంటారు,*+
ఎవ్వరూ వాళ్లను భయపెట్టరు,+
ఎందుకంటే సైన్యాలకు అధిపతైన యెహోవాయే ఈ మాట చెప్పాడు.
6 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ రోజున,
నేను గాయపర్చిన ప్రజలతో సహా
కుంటుతున్న వాళ్లను* సమకూరుస్తాను,+
చెదిరిపోయిన వాళ్లను* పోగుచేస్తాను.
7 కుంటుతున్న వాళ్లను ఒక శేషంగా చేస్తాను,+
దూరంగా వెళ్లగొట్టబడిన వాళ్లను బలమైన జనంగా చేస్తాను;+
అప్పుడు యెహోవా సీయోను పర్వతం నుండి
యుగయుగాలు వాళ్ల మీద రాజుగా పరిపాలిస్తాడు.
9 ఇప్పుడు నువ్వు ఎందుకు గట్టిగా అరుస్తున్నావు?
10 సీయోను కూతురా,
ప్రసవించే స్త్రీలా నొప్పితో మూల్గుతూ మెలికలు తిరుగు;
ఎందుకంటే, ఇప్పుడు నువ్వు నగరం నుండి బయటికి వెళ్లి అక్కడ నివసిస్తావు.
నువ్వు బబులోను దాకా వెళ్తావు,+
అక్కడ నువ్వు రక్షించబడతావు;+
అక్కడ యెహోవా నిన్ను నీ శత్రువుల చేతుల్లో నుండి తిరిగి కొంటాడు.+
11 చాలా దేశాలు నీకు వ్యతిరేకంగా పోగుచేయబడతాయి;
వాళ్లు, ‘సీయోను అపవిత్రం కావాలి,
అది మనం కళ్లారా చూడాలి’ అని అంటారు.
12 కానీ వాళ్లకు యెహోవా ఆలోచనలు తెలియవు,
ఆయన సంకల్పాన్ని* వాళ్లు అర్థం చేసుకోరు;
ఎందుకంటే, కొత్త ధాన్యపు పనల్ని కళ్లంలో* పోగుచేసినట్టు ఆయన వాళ్లను పోగుచేస్తాడు.
13 సీయోను కూతురా, లేచి నూర్చు;+
నేను నీ కొమ్ముల్ని ఇనుపవిగా,
నీ డెక్కల్ని* రాగివిగా చేస్తాను,
నువ్వు దేశదేశాల ప్రజల్ని నలగ్గొడతావు.+
వాళ్ల అక్రమ లాభాన్ని యెహోవాకు సమర్పిస్తావు,
వాళ్ల వనరుల్ని సమస్త భూమికి నిజమైన ప్రభువు అయిన దేవునికి అర్పిస్తావు.”+