కీర్తనలు
115 మాకు కాదు యెహోవా, మాకు కాదు,*
నీ విశ్వసనీయ ప్రేమను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి
నీ పేరుకే మహిమ కలగాలి.+
2 “వాళ్ల దేవుడు ఎక్కడ?” అని
దేశాలు ఎందుకు అనాలి?+
3 మన దేవుడు పరలోకంలో ఉన్నాడు;
ఆయన తనకు నచ్చిందంతా చేస్తాడు.
4 వాళ్ల విగ్రహాలు వెండిబంగారాలతో చేసినవి,
అవి మనుషుల చేతిపనులు.+
5 వాటికి నోరు ఉంది, కానీ మాట్లాడలేవు;+
కళ్లు ఉన్నాయి, కానీ చూడలేవు;
6 చెవులు ఉన్నాయి, కానీ వినలేవు;
ముక్కు ఉంది, కానీ వాసన చూడలేవు;
7 చేతులు ఉన్నాయి, కానీ ముట్టుకోలేవు;
పాదాలు ఉన్నాయి, కానీ నడవలేవు;+
గొంతుతో శబ్దం చేయలేవు.+
10 అహరోను ఇంటివాళ్లారా,+ యెహోవాను నమ్ముకోండి,
ఆయనే మీ సహాయకుడు, మీ డాలు.
12 యెహోవా మనల్ని గుర్తుచేసుకుంటాడు, మనల్ని దీవిస్తాడు;
ఆయన ఇశ్రాయేలు ఇంటివాళ్లను దీవిస్తాడు;+
అహరోను ఇంటివాళ్లను దీవిస్తాడు;
13 సామాన్యులైనా, గొప్పవాళ్లయినా
తనకు భయపడేవాళ్లను యెహోవా దీవిస్తాడు.