కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 38
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • యిర్మీయాను గోతిలో పడేయడం (1-6)

      • ఎబెద్మెలెకు యిర్మీయాను కాపాడడం (7-13)

      • లొంగిపొమ్మని యిర్మీయా సిద్కియాను వేడుకోవడం (14-28)

యిర్మీయా 38:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 21:1, 2
  • +యిర్మీ 37:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2006, పేజీలు 14-15

యిర్మీయా 38:2

అధస్సూచీలు

  • *

    అక్ష., “దగ్గరికి వెళ్లే.”

  • *

    లేదా “ప్రాణాలతో తప్పించుకుంటారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 27:13; 29:18; యెహె 7:15
  • +యిర్మీ 21:8-10

యిర్మీయా 38:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:1, 2; 2ది 36:17

యిర్మీయా 38:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 26:11

యిర్మీయా 38:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 33:1; 37:21; 38:28

యిర్మీయా 38:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “నపుంసకుడూ.” పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 39:16
  • +యిర్మీ 37:13

యిర్మీయా 38:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 52:6

యిర్మీయా 38:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 20:13

యిర్మీయా 38:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 37:21

యిర్మీయా 38:17

అధస్సూచీలు

  • *

    అక్ష., “దగ్గరికి వెళ్తే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 21:9; 27:12

యిర్మీయా 38:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “దగ్గరికి వెళ్లకపోతే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:8, 9
  • +2రా 25:6; యిర్మీ 39:5

యిర్మీయా 38:20

అధస్సూచీలు

  • *

    అక్ష., “స్వరానికి.”

యిర్మీయా 38:21

అధస్సూచీలు

  • *

    అక్ష., “దగ్గరికి వెళ్లడానికి.”

యిర్మీయా 38:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 39:3
  • +విలా 1:2

యిర్మీయా 38:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:7
  • +యిర్మీ 52:8, 13

యిర్మీయా 38:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 38:4

యిర్మీయా 38:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 37:15

యిర్మీయా 38:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 15:20; 32:2; 37:21; 39:13, 14
  • +2రా 25:8, 9; 2ది 36:17

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 38:1యిర్మీ 21:1, 2
యిర్మీ. 38:1యిర్మీ 37:3
యిర్మీ. 38:2యిర్మీ 27:13; 29:18; యెహె 7:15
యిర్మీ. 38:2యిర్మీ 21:8-10
యిర్మీ. 38:32రా 25:1, 2; 2ది 36:17
యిర్మీ. 38:4యిర్మీ 26:11
యిర్మీ. 38:6యిర్మీ 33:1; 37:21; 38:28
యిర్మీ. 38:7యిర్మీ 39:16
యిర్మీ. 38:7యిర్మీ 37:13
యిర్మీ. 38:9యిర్మీ 52:6
యిర్మీ. 38:112రా 20:13
యిర్మీ. 38:13యిర్మీ 37:21
యిర్మీ. 38:17యిర్మీ 21:9; 27:12
యిర్మీ. 38:182రా 25:8, 9
యిర్మీ. 38:182రా 25:6; యిర్మీ 39:5
యిర్మీ. 38:22యిర్మీ 39:3
యిర్మీ. 38:22విలా 1:2
యిర్మీ. 38:232రా 25:7
యిర్మీ. 38:23యిర్మీ 52:8, 13
యిర్మీ. 38:25యిర్మీ 38:4
యిర్మీ. 38:26యిర్మీ 37:15
యిర్మీ. 38:28యిర్మీ 15:20; 32:2; 37:21; 39:13, 14
యిర్మీ. 38:282రా 25:8, 9; 2ది 36:17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 38:1-28

యిర్మీయా

38 యిర్మీయా ప్రజలందరితో ఇలా అనడం మత్తాను కుమారుడు షెఫట్య, పషూరు+ కుమారుడు గెదల్యా, షెలెమ్యా కుమారుడు యూకలు,+ మల్కీయా కుమారుడు పషూరు విన్నారు: 2 “యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఈ నగరంలోనే ఉండిపోయే వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల చనిపోతారు.+ అయితే కల్దీయులకు లొంగిపోయే* వాళ్లు ప్రాణాలతో ఉంటారు, తమ ప్రాణాల్ని దోపుడుసొమ్ముగా దక్కించుకుంటారు,* జీవిస్తారు.’+ 3 యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఈ నగరం ఖచ్చితంగా బబులోను రాజు సైన్యానికి అప్పగించబడుతుంది, అతను దీన్ని జయిస్తాడు.’ ”+

4 ఆ అధిపతులు రాజుతో ఇలా అన్నారు: “దయచేసి అతన్ని చంపించేయి,+ ఎందుకంటే అతను ఇలాంటి మాటలు చెప్తూ నగరంలో మిగిలిన సైనికుల మనోధైర్యాన్ని, ప్రజలందరి మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు. అతను ఈ ప్రజల క్షేమాన్ని కాదుగానీ నాశనాన్నే కోరుకుంటున్నాడు.” 5 అందుకు సిద్కియా ఇలా అన్నాడు: “ఇదిగో! అతను మీ చేతుల్లో ఉన్నాడు, రాజు మిమ్మల్ని ఏ విధంగానూ ఆపలేడు.”

6 కాబట్టి వాళ్లు యిర్మీయాను పట్టుకుని కాపలాదారుల ప్రాంగణంలో ఉన్న, రాజు కుమారుడైన మల్కీయాకు చెందిన గోతిలో పడేశారు.+ వాళ్లు తాళ్లతో యిర్మీయాను ఆ గోతిలోకి దించారు. అప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది, యిర్మీయా ఆ బురదలో కూరుకుపోసాగాడు.

7 వాళ్లు యిర్మీయాను గోతిలో వేశారన్న సంగతి ఇతియోపీయుడూ రాజభవనంలో ఆస్థాన అధికారీ* అయిన ఎబెద్మెలెకు+ విన్నాడు. అప్పుడు రాజు బెన్యామీను ద్వారం+ దగ్గర కూర్చొని ఉన్నాడు, 8 ఎబెద్మెలెకు రాజభవనంలో నుండి బయటికి వెళ్లి, రాజుతో ఇలా అన్నాడు: 9 “నా ప్రభువా, రాజా, వాళ్లు యిర్మీయా ప్రవక్త విషయంలో చేసిన పని చాలా చెడ్డది! వాళ్లు అతన్ని గోతిలో పడేశారు, కరువు వల్ల అతను అక్కడే చనిపోతాడు, ఎందుకంటే నగరంలో ఇక రొట్టెలు మిగల్లేదు.”+

10 అప్పుడు రాజు ఇతియోపీయుడైన ఎబెద్మెలెకుకు ఇలా ఆజ్ఞాపించాడు: “ఇక్కడి నుండి 30 మందిని నీతోపాటు తీసుకెళ్లి, యిర్మీయా ప్రవక్త చనిపోకముందే అతన్ని గోతిలో నుండి పైకి లాగు.” 11 కాబట్టి ఎబెద్మెలెకు వాళ్లను తీసుకుని రాజభవనంలో ఖజానా+ కింద ఉన్న స్థలానికి వెళ్లాడు, వాళ్లు అక్కడి నుండి చీకిపోయిన కొన్ని గుడ్డ పీలికల్ని, గుడ్డ ముక్కల్ని తీసుకుని వాటిని గోతిలో ఉన్న యిర్మీయా దగ్గరికి తాళ్లతో దింపారు. 12 అప్పుడు ఇతియోపీయుడైన ఎబెద్మెలెకు యిర్మీయాతో, “దయచేసి ఈ గుడ్డ పీలికల్ని, గుడ్డ ముక్కల్ని నీ చంకలకు తాళ్లకు మధ్య పెట్టుకో” అన్నాడు. యిర్మీయా అలాగే పెట్టుకున్నాడు, 13 వాళ్లు ఆ తాళ్లతో యిర్మీయాను గోతిలో నుండి బయటికి లాగారు. అప్పటినుండి యిర్మీయా కాపలాదారుల ప్రాంగణంలోనే ఉండిపోయాడు.+

14 తర్వాత సిద్కియా రాజు యెహోవా మందిరంలోని మూడో ప్రవేశ ద్వారం దగ్గరికి రమ్మని యిర్మీయాకు కబురు పంపాడు. రాజు యిర్మీయాతో, “నేను నిన్ను ఒకటి అడగాలి. నా దగ్గర ఏదీ దాచకు” అన్నాడు. 15 అప్పుడు యిర్మీయా సిద్కియాతో, “ఒకవేళ నేను నీకు చెప్తే, నువ్వు నన్ను ఖచ్చితంగా చంపేస్తావు. నేను నీకు సలహా ఇచ్చినా, నువ్వు వినవు” అన్నాడు. 16 అప్పుడు సిద్కియా రాజు యిర్మీయాతో రహస్యంగా ఇలా ప్రమాణం చేశాడు: “మనకు ఈ జీవాన్ని ఇచ్చిన యెహోవా జీవం తోడు, నేను నిన్ను చంపను, నీ ప్రాణం తీయాలని చూస్తున్న వీళ్లకు నిన్ను అప్పగించను.”

17 అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాల దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు బబులోను రాజు అధిపతులకు లొంగిపోతే,* నీ ప్రాణాలు కాపాడుకుంటావు, ఈ నగరం అగ్నితో కాల్చేయబడదు, నువ్వూ నీ ఇంటివాళ్లూ బ్రతుకుతారు.+ 18 కానీ నువ్వు బబులోను రాజు అధిపతులకు లొంగిపోకపోతే,* ఈ నగరం కల్దీయులకు అప్పగించబడుతుంది, వాళ్లు దీన్ని అగ్నితో కాల్చేస్తారు,+ నువ్వు వాళ్ల చేతి నుండి తప్పించుకోలేవు.’ ”+

19 అప్పుడు సిద్కియా రాజు యిర్మీయాతో ఇలా అన్నాడు: “కల్దీయుల దగ్గరికి వెళ్లిపోయిన యూదులకు నేను భయపడుతున్నాను, నేను వాళ్ల చేతికి అప్పగించబడితే, వాళ్లు నాతో క్రూరంగా ప్రవర్తిస్తారేమో.” 20 అయితే యిర్మీయా ఇలా అన్నాడు: “నువ్వు వాళ్లకు అప్పగించబడవు. దయచేసి నేను నీకు చెప్తున్న యెహోవా మాటకు* లోబడు, అప్పుడు నీకు మంచి జరుగుతుంది, నువ్వు ప్రాణాలతో ఉంటావు. 21 అయితే నువ్వు లొంగిపోవడానికి* ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో యెహోవా నాకు తెలియజేశాడు: 22 ఇదిగో! యూదా రాజు రాజభవనంలో మిగిలిన స్త్రీలంతా బబులోను రాజు అధిపతుల+ దగ్గరికి తీసుకురాబడుతున్నారు, వాళ్లు ఇలా అంటున్నారు:

‘నువ్వు నమ్మిన మనుషులు మోసం చేసి నిన్ను గెలిచారు.+

నీ పాదం బురదలో కూరుకుపోయేలా చేశారు.

ఇప్పుడు వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు.’

23 నీ భార్యలందర్నీ, నీ కుమారులందర్నీ వాళ్లు కల్దీయుల దగ్గరికి తీసుకొస్తున్నారు, నువ్వు కూడా వాళ్ల చేతిలో నుండి తప్పించుకోలేవు, బబులోను రాజు నిన్ను పట్టుకుంటాడు,+ నీ కారణంగా ఈ నగరం అగ్నితో కాల్చబడుతుంది.”+

24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నువ్వు చావకుండా ఉండాలంటే ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియనివ్వకు. 25 నేను నీతో మాట్లాడానని తెలుసుకుని అధిపతులు నీ దగ్గరికి వచ్చి, ‘దయచేసి, నువ్వు రాజుకు ఏం చెప్పావో చెప్పు. ఏదీ దాచకు, మేము నిన్ను చంపము.+ రాజు నీతో ఏమన్నాడు?’ అని అంటే, 26 నువ్వు వాళ్లతో, ‘నేను చావకుండా ఉండేలా నన్ను మళ్లీ యెహోనాతాను ఇంటికి పంపొద్దని రాజుకు మనవి చేసుకున్నాను’ అని చెప్పాలి.”+

27 తర్వాత అధిపతులందరూ యిర్మీయా దగ్గరికి వచ్చి అతన్ని ప్రశ్నించారు. రాజు తనకు ఆజ్ఞాపించిన మాటలే అతను వాళ్లకు చెప్పాడు. కాబట్టి వాళ్లు అతనితో ఇంకేమీ అనలేదు. ఎందుకంటే రాజు, యిర్మీయా ఏం మాట్లాడుకున్నారో ఎవరూ వినలేదు. 28 యెరూషలేము పట్టబడిన రోజు వరకు యిర్మీయా కాపలాదారుల ప్రాంగణంలోనే ఉన్నాడు;+ యెరూషలేము పట్టబడినప్పుడు+ అతను ఇంకా అక్కడే ఉన్నాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి