యెషయా
2 మీ సొంత తప్పులే మీ దేవుని నుండి మిమ్మల్ని దూరం చేశాయి.
మీ పాపాల వల్లే ఆయన మీ నుండి తన ముఖాన్ని దాచుకున్నాడు,
ఆయన మీ ప్రార్థనలు వినడానికి ఇష్టపడట్లేదు.+
మీ పెదాలు అబద్ధాలాడతాయి,+ మీ నాలుక అవినీతిని జపిస్తుంది.
వాళ్లు బూటకమైన దానిమీద నమ్మకం పెట్టుకొని+ పనికిరాని మాటలు మాట్లాడతారు.
వాళ్లు సమస్యను గర్భం దాల్చి హానికరమైనదాన్ని కంటారు.+
ఆ గుడ్లను తినేవాళ్లు చనిపోతారు,
ఎవరైనా ఒక గుడ్డును పగలగొడితే అందులో నుండి విషసర్పం వస్తుంది.
వాళ్ల పనులు హానికరమైనవి,
వాళ్ల చేతులు దౌర్జన్యంతో నిండిపోయాయి.+
7 వాళ్ల పాదాలు చెడు చేయడానికి పరుగెత్తుతాయి,
నిర్దోషుల రక్తం చిందించడానికి వాళ్లు ఆత్రంగా పరుగులు తీస్తారు.+
వాళ్ల ఆలోచనలు హానికరమైనవి;
వాళ్ల దారుల్లో నాశనం, దుఃఖం ఉన్నాయి.+
వాళ్లు తమ త్రోవల్ని వంకరగా చేసుకుంటారు;
వాటిలో నడిచే వాళ్లెవ్వరికీ శాంతి ఉండదు.+
9 అందుకే న్యాయం మనకు చాలా దూరంలో ఉంది,
నీతి మన దగ్గరికి రావట్లేదు.
మనం వెలుగు కోసం చూస్తూ ఉన్నాం, కానీ ఇదిగో! చీకటే ఉంది;
కాంతి కోసం ఎదురుచూస్తూ ఉన్నాం, కానీ అంధకారంలోనే నడుస్తున్నాం.+
సాయంత్రం చీకట్లో తడబడినట్టు మిట్టమధ్యాహ్న వేళ తడబడుతున్నాం;
బలాఢ్యుల మధ్య మనం చచ్చినవాళ్లలా ఉన్నాం.
11 మనమంతా ఎలుగుబంట్లలా గుర్రుమంటున్నాం,
పావురాల్లా దుఃఖంతో మూల్గుతున్నాం.
మనం న్యాయం కోసం చూస్తున్నాం, కానీ అది కనిపించట్లేదు;
రక్షణ కోసం ఎదురుచూస్తున్నాం, కానీ అది మనకు చాలా దూరంలో ఉంది.
మా తిరుగుబాట్లు మా వెన్నంటే ఉన్నాయి;
మా దోషాల గురించి మాకు బాగా తెలుసు.+
13 మేము తప్పు చేశాం, యెహోవాను కాదన్నాం;
మా దేవునికి దూరంగా వెళ్లాం.
అణచివేత గురించి, తిరుగుబాటు గురించి మేము మాట్లాడుకున్నాం;+
మా హృదయాల్లో అబద్ధాలు పెట్టుకొని, వాటి గురించి గుసగుసలాడుకున్నాం.+
14 న్యాయం వెనక్కి తరిమేయబడింది,+
నీతి దూరంగా నిలబడింది;+
ఎందుకంటే సంతవీధిలో సత్యం* తడబడింది,
సరైనది అందులో అడుగు పెట్టలేకపోతోంది.
16 సహాయం చేయడానికి ఒక్క మనిషి కూడా లేకపోవడం,
వాళ్ల తరఫున మాట్లాడడానికి ఒక్కరు కూడా లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు,
అందుకే ఆయన బాహువే రక్షణను* తీసుకొచ్చింది,
ఆయన నీతే ఆయనకు ఆధారమైంది.
18 వాళ్లు చేసినదాన్ని బట్టి ఆయన వాళ్లకు ప్రతిదండన చేస్తాడు:+
తన విరోధుల మీద ఉగ్రత చూపిస్తాడు, తన శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటాడు.+
ద్వీపాలకు తగిన శాస్తి చేస్తాడు.
19 సూర్యాస్తమయం వైపు ఉన్నవాళ్లు యెహోవా పేరుకు,
సూర్యోదయం వైపు ఉన్నవాళ్లు ఆయన మహిమకు భయపడతారు,
ఎందుకంటే ఆయన వేగంగా ప్రవహించే నదిలా దూసుకొస్తాడు,
యెహోవా పవిత్రశక్తే* దాన్ని ప్రవహింపజేస్తుంది.
20 యెహోవా ఇలా అంటున్నాడు: “సీయోను దగ్గరికి,
తప్పులు చేయడం మానేసిన యాకోబు వంశస్థుల+ దగ్గరికి విమోచకుడు+ వస్తాడు.”+
21 “నా విషయానికొస్తే, వాళ్లతో నేను చేసే ఒప్పందం ఇదే”+ అని యెహోవా అంటున్నాడు. “నీ మీద నేను ఉంచిన నా పవిత్రశక్తి, నీ నోట నేను ఉంచిన మాటలు నీ నోటి నుండి గానీ, నీ పిల్లల నోటి నుండి గానీ, నీ మనవళ్ల నోటి నుండి గానీ ఎప్పటికీ తీసేయబడవు” అని యెహోవా అంటున్నాడు.