యెషయా
64 నీ ముందు పర్వతాలు కంపించేలా
నువ్వు ఆకాశాన్ని చీల్చుకొని కిందికి దిగివస్తే,
2 అగ్ని గచ్చపొదల్ని కాల్చేసి
నీళ్లను మరిగించినట్టు నువ్వు దిగివస్తే,
నీ శత్రువులకు నీ పేరు తెలుస్తుంది,
దేశాలు నీ ముందు భయంతో వణుకుతాయి!
3 మేము ఊహించడానికి కూడా భయపడే సంభ్రమాశ్చర్య కార్యాలు నువ్వు చేసినప్పుడు+
నువ్వు దిగివచ్చావు, నీ ముందు పర్వతాలు కంపించాయి.+
4 తన కోసం కనిపెట్టుకొని* ఉన్నవాళ్ల తరఫున చర్య తీసుకునే
నీలాంటి దేవుడి గురించి ప్రాచీనకాలం నుండి ఎవ్వరూ వినలేదు, గమనించలేదు,
ఏ కన్నూ అలాంటి దేవుణ్ణి చూడలేదు.+
5 నిన్ను గుర్తుపెట్టుకొని, నీ మార్గాల్ని అనుసరిస్తూ
సంతోషంగా సరైనవాటిని చేసేవాళ్లను+ కలుసుకోవడానికి నువ్వు వచ్చావు.
ఇదిగో! మేము పాపం చేస్తూ ఉన్నప్పుడు నీకు కోపమొచ్చింది,+
మేము చాలాకాలం పాటు అలా పాపాలు చేశాం.
రక్షణ పొందడానికి ఇప్పుడు మేము అర్హులమేనా?
మేమంతా ఆకులా వాడిపోతాం,
మా తప్పులు గాలిలా మమ్మల్ని కొట్టుకొనిపోతాయి.
7 నీ పేరు ఎత్తి ప్రార్థించేవాళ్లు ఎవరూ లేరు,
నిన్ను గట్టిగా పట్టుకునేలా తమను తాము పురికొల్పుకునేవాళ్లు ఎవరూ లేరు;
ఎందుకంటే, నువ్వు మా నుండి నీ ముఖాన్ని దాచుకున్నావు,+
మా తప్పుల వల్ల మేము కరిగిపోయేలా చేస్తున్నావు.
8 కానీ యెహోవా, నువ్వే మా తండ్రివి.+
దయచేసి మా వైపు చూడు, మేమంతా నీ ప్రజలమే కదా.
10 నీ పవిత్ర నగరాలు ఎడారిలా మారిపోయాయి.
సీయోను ఎడారిగా మారింది,
యెరూషలేము పాడుబడ్డ భూమిలా తయారైంది.+
11 పవిత్రమైన, మహిమాన్వితమైన* మా మందిరం,
మా పూర్వీకులు నిన్ను స్తుతించిన మందిరం,
అగ్నితో కాల్చేయబడింది,+
మాకు ప్రియమైనవన్నీ శిథిలాలుగా మిగిలాయి.
12 యెహోవా, ఇంత జరిగినా నువ్వు ఇంకా చర్య తీసుకోవా?
మౌనంగా ఉండి మమ్మల్ని ఇంతలా బాధలు పడనిస్తావా?+