కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • రోమీయులు 9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

రోమీయులు విషయసూచిక

      • ఇశ్రాయేలీయుల విషయంలో పౌలు దుఃఖం (1-5)

      • అబ్రాహాము నిజమైన సంతానం (6-13)

      • దేవుని ఎంపికను ప్రశ్నించలేం (14-26)

        • ఉగ్రతా పాత్రలు, కరుణా పాత్రలు (22, 23)

      • కేవలం కొంతమందే రక్షించబడతారు (27-29)

      • ఇశ్రాయేలీయులు తడబడ్డారు (30-33)

రోమీయులు 9:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/1997, పేజీ 4

రోమీయులు 9:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2021, పేజీ 25

    కావలికోట (అధ్యయన),

    5/2018, పేజీ 13

రోమీయులు 9:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/1993, పేజీ 31

రోమీయులు 9:4

అధస్సూచీలు

  • *

    లేదా “నిబంధనలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 4:22
  • +అపొ 3:25; 7:8
  • +నిర్గ 24:12; అపొ 26:7; హెబ్రీ 9:1
  • +రోమా 4:13

రోమీయులు 9:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 10:15; మత్త 1:17

రోమీయులు 9:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 2:28; ప్రక 2:9

రోమీయులు 9:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనం.”

  • *

    అక్ష., “విత్తనం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 8:39; గల 3:29
  • +ఆది 21:12; హెబ్రీ 11:18

రోమీయులు 9:8

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 1:12, 13
  • +గల 4:28

రోమీయులు 9:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 18:10, 14

రోమీయులు 9:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:21, 24

రోమీయులు 9:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2003, పేజీ 29

రోమీయులు 9:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2003, పేజీ 29

రోమీయులు 9:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మలా 1:2, 3; హెబ్రీ 12:16

రోమీయులు 9:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:4; యోబు 34:10

రోమీయులు 9:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 33:19

రోమీయులు 9:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “కోరుకునేవాడి మీదో, పరుగెత్తేవాడి మీదో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +తీతు 3:4, 5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1992, పేజీ 29

రోమీయులు 9:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 9:16

రోమీయులు 9:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 10:1; 14:4

రోమీయులు 9:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 40:2
  • +యెష 29:16; 45:9

రోమీయులు 9:21

అధస్సూచీలు

  • *

    లేదా “ఘనత కోసం ఒక పాత్రను, ఘనహీనత కోసం ఒక పాత్రను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 64:8; యిర్మీ 18:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2013, పేజీలు 24-26

    2/1/1999, పేజీ 10

రోమీయులు 9:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2013, పేజీ 25

    6/1/1990, పేజీ 28

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 63-65

రోమీయులు 9:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1థె 5:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 288-289

    కావలికోట,

    6/15/2013, పేజీ 25

    6/1/1990, పేజీ 28

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 63-65

రోమీయులు 9:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 11:13; ఎఫె 3:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 63-65

రోమీయులు 9:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 2:12
  • +హోషే 2:23; మత్త 21:43; 1పే 2:10

రోమీయులు 9:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 1:10; గల 3:26

రోమీయులు 9:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 1:10; రోమా 11:4, 5

రోమీయులు 9:28

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 10:22, 23

రోమీయులు 9:29

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

  • *

    అక్ష., “విత్తనాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 125

    యెషయా ప్రవచనం I, పేజీ 21

రోమీయులు 9:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 4:11; 10:20; ఫిలి 3:9

రోమీయులు 9:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 8:14; లూకా 20:17, 18; 1కొ 1:23

రోమీయులు 9:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 118:22; మత్త 21:42
  • +యెష 28:16; రోమా 10:11; 1పే 2:6

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

రోమా. 9:4నిర్గ 4:22
రోమా. 9:4అపొ 3:25; 7:8
రోమా. 9:4నిర్గ 24:12; అపొ 26:7; హెబ్రీ 9:1
రోమా. 9:4రోమా 4:13
రోమా. 9:5ద్వితీ 10:15; మత్త 1:17
రోమా. 9:6రోమా 2:28; ప్రక 2:9
రోమా. 9:7యోహా 8:39; గల 3:29
రోమా. 9:7ఆది 21:12; హెబ్రీ 11:18
రోమా. 9:8యోహా 1:12, 13
రోమా. 9:8గల 4:28
రోమా. 9:9ఆది 18:10, 14
రోమా. 9:10ఆది 25:21, 24
రోమా. 9:12ఆది 25:23
రోమా. 9:13మలా 1:2, 3; హెబ్రీ 12:16
రోమా. 9:14ద్వితీ 32:4; యోబు 34:10
రోమా. 9:15నిర్గ 33:19
రోమా. 9:16తీతు 3:4, 5
రోమా. 9:17నిర్గ 9:16
రోమా. 9:18నిర్గ 10:1; 14:4
రోమా. 9:20యోబు 40:2
రోమా. 9:20యెష 29:16; 45:9
రోమా. 9:21యెష 64:8; యిర్మీ 18:6
రోమా. 9:231థె 5:9
రోమా. 9:24రోమా 11:13; ఎఫె 3:6
రోమా. 9:25ఎఫె 2:12
రోమా. 9:25హోషే 2:23; మత్త 21:43; 1పే 2:10
రోమా. 9:26హోషే 1:10; గల 3:26
రోమా. 9:27హోషే 1:10; రోమా 11:4, 5
రోమా. 9:28యెష 10:22, 23
రోమా. 9:29యెష 1:9
రోమా. 9:30రోమా 4:11; 10:20; ఫిలి 3:9
రోమా. 9:32యెష 8:14; లూకా 20:17, 18; 1కొ 1:23
రోమా. 9:33కీర్త 118:22; మత్త 21:42
రోమా. 9:33యెష 28:16; రోమా 10:11; 1పే 2:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
రోమీయులు 9:1-33

రోమీయులు

9 క్రీస్తు శిష్యుడిగా నేను నిజమే చెప్తున్నాను; నా మనస్సాక్షి పవిత్రశక్తి ద్వారా నిర్దేశించబడుతోంది. నేను చెప్పేది అబద్ధం కాదు, 2 నా హృదయంలో ఎంతో దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. 3 నా సహోదరుల కోసం, అంటే నా బంధువుల కోసం, నేను శాపగ్రస్తుడిగా క్రీస్తు నుండి వేరుచేయబడడానికి కూడా సిద్ధమే, 4 వాళ్లే ఇశ్రాయేలీయులు. దేవుడు తన కుమారులుగా దత్తత తీసుకున్నది,+ ఘనపర్చింది, ఒప్పందాలు* చేసింది,+ ధర్మశాస్త్రాన్ని, పవిత్రసేవ చేసే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది,+ వాగ్దానాలు చేసింది+ వాళ్లకే. 5 అంతేకాదు, క్రీస్తు ఎవరి నుండైతే వచ్చాడో ఆ పూర్వీకుల వంశస్థులే వీళ్లు.+ అన్నిటిపైన అధికారం ఉన్న దేవుడు నిరంతరం స్తుతించబడాలి. ఆమేన్‌.

6 అయితే, దేవుని మాట నెరవేరకుండా పోయిందని దానర్థం కాదు. ఎందుకంటే ఇశ్రాయేలుకు పుట్టినవాళ్లంతా ఇశ్రాయేలీయులు కాదు.+ 7 అబ్రాహాము సంతానం*+ అయినంత మాత్రాన అందరూ పిల్లలు కాదు; అయితే, “ఇస్సాకు ద్వారా వచ్చేదే నీ సంతానం* అనబడుతుంది.”+ 8 అంటే, అబ్రాహాము పిల్లలందరూ దేవుని పిల్లలు కాదు,+ కానీ వాగ్దానం ద్వారా పుట్టినవాళ్లే+ అబ్రాహాము సంతానంగా* ఎంచబడతారు. 9 ఎందుకంటే, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను వస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు”+ అని దేవుడు వాగ్దానం చేశాడు. 10 అంతేకాదు, మన పూర్వీకుడైన ఇస్సాకు ద్వారా రిబ్కా గర్భవతి అయ్యి, ఆమె కడుపులో కవల పిల్లలు ఉన్నప్పుడు కూడా దేవుడు వాగ్దానం చేశాడు;+ 11 ఆ పిల్లలు ఇంకా పుట్టకముందే, వాళ్లు మంచి గానీ చెడు గానీ చేయడం మొదలుపెట్టక ముందే, తాను ఎవర్ని ఎంచుకోబోతున్నాడో దేవుడు ముందే చెప్పాడు. దేవుడు ఒక మనిషి పనుల్ని బట్టి అతన్ని ఎంచుకోడు కానీ తాను ఎవర్ని ఎంచుకోవాలనుకుంటే వాళ్లను ఎంచుకుంటాడు. 12 అందుకే దేవుడు ఆమెతో, “పెద్దవాడు చిన్నవాడికి దాసునిగా ఉంటాడు” అని చెప్పాడు.+ 13 అంతేకాదు, “నేను యాకోబును ప్రేమించాను, కానీ ఏశావును ద్వేషించాను” అని లేఖనాల్లో కూడా రాసివుంది.+

14 మరైతే ఏమనాలి? దేవుడు అన్యాయస్థుడా? కానేకాదు!+ 15 ఎందుకంటే ఆయన మోషేతో ఇలా అన్నాడు: “నేను ఎవరి మీద కరుణ చూపించాలనుకుంటానో వాళ్లమీద కరుణ చూపిస్తాను, ఎవరి మీద కనికరం చూపించాలనుకుంటానో వాళ్లమీద కనికరం చూపిస్తాను.”+ 16 కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకోవడం అనేది ఆ వ్యక్తి కోరిక మీదో, ప్రయత్నం మీదో* ఆధారపడి ఉండదు కానీ కరుణగల దేవుడి మీదే ఆధారపడి ఉంటుంది.+ 17 అందుకే దేవుడు ఫరోతో, “నీ విషయంలో నా బలాన్ని చూపించాలి, భూమంతటా నా పేరు ప్రకటించబడాలి అనే ఒక్క కారణంతోనే నిన్ను ఇంకా ప్రాణాలతో ఉండనిచ్చాను” అని అన్నాడని లేఖనాల్లో రాసివుంది.+ 18 కాబట్టి ఆయన కోరుకున్నవాళ్ల మీద కరుణ చూపిస్తాడు, ఇతరుల్ని తమ హృదయాల్ని కఠినం చేసుకోనిస్తాడు.+

19 “అలాంటప్పుడు ఆయన ఇంకా ఎందుకు తప్పులు పడుతున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు ఎదిరించగలరు?” అని మీరు నాతో అంటారు. 20 కానీ ఓ మనిషీ, దేవునికి ఎదురుచెప్పడానికి నువ్వెవరు?+ మట్టిపాత్ర తనను చేసిన వ్యక్తితో, “నన్నెందుకు ఇలా చేశావు?” అని అంటుందా?+ 21 ఒకే మట్టి ముద్ద నుండి ఒక ముఖ్యమైన పాత్రను, ఒక మామూలు పాత్రను* చేసే అధికారం కుమ్మరికి లేదా?+ 22 దేవుడు తన ఉగ్రతను ప్రదర్శించాలనీ తన శక్తిని చాటాలనీ అనుకుని, అయినాసరే నాశనానికి తగిన ఉగ్రతా పాత్రల్ని ఓర్పుతో సహిస్తే ఏంటి? 23 ఆయన అలా చేసింది, మహిమ కోసం తాను ముందే సిద్ధం చేసిన కరుణా పాత్రల మీద తన గొప్ప మహిమను చూపించడానికే అయితే,+ 24 అంటే యూదుల్లో నుండి మాత్రమే కాక అన్యజనుల్లో నుండి కూడా దేవుడు పిలిచిన మన మీద+ తన గొప్ప మహిమను చూపించడానికే అయితే అప్పుడేంటి? 25 అది హోషేయ పుస్తకంలో ఆయన అన్న ఈ మాటలకు అనుగుణంగా ఉంది: “నా ప్రజలుకాని వాళ్లను+ నేను ‘నా ప్రజలు’ అని పిలుస్తాను, ప్రియురాలు కాని స్త్రీని ‘ప్రియురాలు’ అని పిలుస్తాను;+ 26 ‘మీరు నా ప్రజలు కాదు’ అని ఎక్కడైతే వాళ్లకు చెప్పబడిందో అక్కడే వాళ్లు ‘జీవంగల దేవుని కుమారులు’ అని పిలవబడతారు.”+

27 అంతేకాదు, ఇశ్రాయేలు గురించి యెషయా ఇలా ప్రకటించాడు: “ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుక రేణువులంత ఉన్నా, వాళ్లలో కొంతమందే రక్షించబడతారు.+ 28 ఎందుకంటే భూమ్మీదున్న వాళ్లను యెహోవా* లెక్క అడుగుతాడు, ఆయన ఆ పనిని త్వరగా పూర్తి చేస్తాడు.”+ 29 అంతేకాదు యెషయా ప్రవచించినట్టే, “సైన్యాలకు అధిపతైన యెహోవా* మనకు ఒక సంతానాన్ని* మిగల్చకపోయుంటే, మనం అచ్చం సొదొమలా అవ్వాల్సిన వాళ్లం, గొమొర్రాలా ఉండేవాళ్లం.”+

30 మరైతే ఏమనాలి? అన్యజనులు నీతిమంతులవ్వాలని ప్రయత్నించకపోయినా, విశ్వాసం కారణంగా దేవుని దృష్టిలో నీతిమంతులయ్యారు;+ 31 కానీ ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతులవ్వాలని ప్రయత్నించినా, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేకపోయారు. 32 ఎందుకని? ఎందుకంటే, వాళ్లు విశ్వాసం ద్వారా కాకుండా పనుల ద్వారా నీతిమంతులవ్వాలని ప్రయత్నించారు; “అడ్డురాయి” తగిలి పడిపోయారు;+ 33 దీని గురించి లేఖనాల్లో కూడా ఇలా రాసివుంది: “ఇదిగో! నేను సీయోనులో అడ్డురాయిని,+ అడ్డుబండను పెడుతున్నాను. అయితే దానిమీద విశ్వాసం ఉంచేవాళ్లు నిరాశపడరు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి