కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

      • ప్రవచించే వరం, భాషలు మాట్లాడే వరం (1-25)

      • పద్ధతిగా క్రైస్తవ కూటాలు (26-40)

        • సంఘంలో స్త్రీల స్థానం (34, 35)

1 కొరింథీయులు 14:1

అధస్సూచీలు

  • *

    లేదా “ఉత్సాహంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1థె 5:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/1993, పేజీ 31

1 కొరింథీయులు 14:2

అధస్సూచీలు

  • *

    లేదా “ఎవరూ వినరు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 13:2
  • +1కొ 14:5

1 కొరింథీయులు 14:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2010, పేజీలు 24-25

1 కొరింథీయులు 14:5

అధస్సూచీలు

  • *

    లేదా “అనువదిస్తే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 12:30
  • +యోవే 2:28; అపొ 2:17; 21:8, 9

1 కొరింథీయులు 14:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 1:11, 12; 2:2
  • +1కొ 12:8

1 కొరింథీయులు 14:7

అధస్సూచీలు

  • *

    అంటే, ఫ్లూటు.

  • *

    ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

1 కొరింథీయులు 14:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2015, పేజీ 21

1 కొరింథీయులు 14:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2015, పేజీ 21

1 కొరింథీయులు 14:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 12:7; 14:4, 26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2007, పేజీలు 23-24

1 కొరింథీయులు 14:13

అధస్సూచీలు

  • *

    లేదా “అనువదించే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 12:8, 10; 14:5

1 కొరింథీయులు 14:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట, 5/15/1993, పేజీ 31

1 కొరింథీయులు 14:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:4

1 కొరింథీయులు 14:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 4:14
  • +రోమా 16:19
  • +హెబ్రీ 5:13, 14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2007, పేజీ 11

    7/15/1993, పేజీ 20

1 కొరింథీయులు 14:21

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 28:11, 12

1 కొరింథీయులు 14:22

అధస్సూచీలు

  • *

    లేదా “సూచన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 2:4, 13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 150

1 కొరింథీయులు 14:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 45:14; జెక 8:23

1 కొరింథీయులు 14:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 12:8, 10

1 కొరింథీయులు 14:27

అధస్సూచీలు

  • *

    లేదా “అనువదించాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:5

1 కొరింథీయులు 14:28

అధస్సూచీలు

  • *

    లేదా “అనువదించేవాళ్లు.”

1 కొరింథీయులు 14:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 13:1

1 కొరింథీయులు 14:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 10:24, 25

1 కొరింథీయులు 14:33

అధస్సూచీలు

  • *

    లేదా “దేవుడు శాంతికే మూలం కానీ గందరగోళానికి కాదు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:40; కొలొ 2:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 20

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీ 120

1 కొరింథీయులు 14:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1తి 2:11, 12
  • +1కొ 11:3; ఎఫె 5:22; కొలొ 3:18; తీతు 2:5; 1పే 3:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    3/1/2006, పేజీలు 28-29

1 కొరింథీయులు 14:36

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2011, పేజీ 14

1 కొరింథీయులు 14:37

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/1993, పేజీ 31

1 కొరింథీయులు 14:38

అధస్సూచీలు

  • *

    లేదా “ఎవరైనా దీన్ని గుర్తించకపోతే, వాళ్లు ఆ స్థితిలోనే ఉండిపోతారు” అయ్యుంటుంది.

1 కొరింథీయులు 14:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1థె 5:20
  • +1కొ 14:27

1 కొరింథీయులు 14:40

అధస్సూచీలు

  • *

    లేదా “క్రమంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:33; కొలొ 2:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 54

    తేజరిల్లు!,

    No. 1 2020 పేజీ 10

    “దేవుని ప్రేమ”, పేజీలు 54-55

    కావలికోట,

    8/1/1997, పేజీ 9

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 కొరిం. 14:11థె 5:20
1 కొరిం. 14:21కొ 13:2
1 కొరిం. 14:21కొ 14:5
1 కొరిం. 14:51కొ 12:30
1 కొరిం. 14:5యోవే 2:28; అపొ 2:17; 21:8, 9
1 కొరిం. 14:6గల 1:11, 12; 2:2
1 కొరిం. 14:61కొ 12:8
1 కొరిం. 14:121కొ 12:7; 14:4, 26
1 కొరిం. 14:131కొ 12:8, 10; 14:5
1 కొరిం. 14:191కొ 14:4
1 కొరిం. 14:20ఎఫె 4:14
1 కొరిం. 14:20రోమా 16:19
1 కొరిం. 14:20హెబ్రీ 5:13, 14
1 కొరిం. 14:21యెష 28:11, 12
1 కొరిం. 14:22అపొ 2:4, 13
1 కొరిం. 14:25యెష 45:14; జెక 8:23
1 కొరిం. 14:261కొ 12:8, 10
1 కొరిం. 14:271కొ 14:5
1 కొరిం. 14:29అపొ 13:1
1 కొరిం. 14:31హెబ్రీ 10:24, 25
1 కొరిం. 14:331కొ 14:40; కొలొ 2:5
1 కొరిం. 14:341తి 2:11, 12
1 కొరిం. 14:341కొ 11:3; ఎఫె 5:22; కొలొ 3:18; తీతు 2:5; 1పే 3:1
1 కొరిం. 14:391థె 5:20
1 కొరిం. 14:391కొ 14:27
1 కొరిం. 14:401కొ 14:33; కొలొ 2:5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 14:1-40

మొదటి కొరింథీయులు

14 ప్రేమ చూపించడానికి శాయశక్తులా కృషిచేస్తూ ఉండండి. పవిత్రశక్తి ఇచ్చే వరాల కోసం కూడా గట్టిగా* ప్రయత్నిస్తూ ఉండండి, ముఖ్యంగా ప్రవచించే వరం కోసం ప్రయత్నించండి.+ 2 భాషలు మాట్లాడే వ్యక్తి మనుషులతో కాదుగానీ దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే, పవిత్రశక్తి వల్ల అతను మాట్లాడే పవిత్ర రహస్యాలు+ ఎవరికీ అర్థంకావు.*+ 3 అయితే ప్రవచించే వ్యక్తి, తన మాటలతో ఇతరుల్ని బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు, ఓదారుస్తాడు. 4 భాషలు మాట్లాడే వ్యక్తి తనను తాను బలపర్చుకుంటాడు, కానీ ప్రవచించే వ్యక్తి సంఘాన్ని బలపరుస్తాడు. 5 మీరంతా భాషలు మాట్లాడాలని కోరుకుంటున్నాను;+ అయితే మీరు ప్రవచిస్తే ఇంకా మంచిది.+ నిజానికి, భాషలు మాట్లాడే వ్యక్తి సంఘం బలపడేలా అర్థం వివరిస్తే* తప్ప అతని కన్నా ప్రవచించే వ్యక్తే గొప్పవాడు. 6 సహోదరులారా, ఇప్పుడు నేను మీ దగ్గరికొచ్చి దేవుని నుండి అందుకున్న ఒక సందేశాన్నో,+ జ్ఞానాన్నో,+ ప్రవచనాన్నో, బోధనో తెలియజేస్తే తప్ప నేను భాషలు మాట్లాడితే మీకేం ప్రయోజనం?

7 పిల్లనగ్రోవి,* వీణ* వంటి జీవంలేని వస్తువుల విషయం కూడా అంతే. వాటి స్వరాల్లో తేడా లేకపోతే వాయించేది ఏ రాగమో ఎలా తెలుస్తుంది? 8 బాకా శబ్దం స్పష్టంగా లేకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు? 9 అలాగే, మీరు సులభంగా అర్థమయ్యే మాటలు మాట్లాడకపోతే మీరేం చెప్తున్నారో ఎవరికైనా ఎలా తెలుస్తుంది? నిజానికి మీరు గాలితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. 10 లోకంలో ఎన్నో భాషలు ఉన్నా, వాటిలో అర్థంలేని భాషంటూ ఏదీ లేదు. 11 మాట్లాడే వ్యక్తి భాష నాకు అర్థంకాకపోతే, నేను అతనికి విదేశీయుడిలా ఉంటాను, అతను నాకు విదేశీయుడిలా ఉంటాడు. 12 మీ విషయం కూడా అంతే. మీరు పవిత్రశక్తి ఇచ్చే వరాల్ని ఎంతో కోరుకుంటున్నారు కాబట్టి సంఘాన్ని బలపర్చే వరాల్ని పుష్కలంగా పొందడానికి ప్రయత్నించండి.+

13 కాబట్టి భాషలు మాట్లాడే వ్యక్తి, అర్థాన్ని వివరించే* సామర్థ్యం ఇవ్వమని దేవునికి ప్రార్థించాలి.+ 14 ఎందుకంటే నేను వేరే భాషలో ప్రార్థిస్తే, పవిత్రశక్తి ఇచ్చిన వరం వల్ల ప్రార్థిస్తున్నానే తప్ప నా ప్రార్థన నాకు అర్థంకాదు. 15 మరైతే ఏం చేయాలి? నేను పవిత్రశక్తి ఇచ్చిన వరంతో ప్రార్థిస్తాను, అలాగే నాకు అర్థమయ్యే భాషలో కూడా ప్రార్థిస్తాను. పవిత్రశక్తి ఇచ్చిన వరంతో స్తుతిగీతం పాడతాను, అలాగే నాకు అర్థమయ్యే భాషలో కూడా పాడతాను. 16 ఒకవేళ మీరు పవిత్రశక్తి ఇచ్చిన వరంతో దేవుణ్ణి స్తుతిస్తే, మీ మధ్య ఉన్న ఒక సామాన్య వ్యక్తికి మీరు మాట్లాడేది అర్థంకాదు కదా, మరి మీరు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు అతను, “ఆమేన్‌” అని ఎలా అంటాడు? 17 నిజమే, మీరు చక్కగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు, కానీ దానివల్ల అవతలి వ్యక్తి బలపడట్లేదు. 18 నేను మీ అందరికన్నా ఎక్కువ భాషలు మాట్లాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు. 19 అయినాసరే, సంఘంలో నేను వేరే భాషలో పదివేల మాటలు మాట్లాడే కన్నా, ఇతరులకు ఉపదేశం ఇవ్వగలిగేలా అర్థమయ్యే భాషలో ఐదు మాటలు మాట్లాడతాను.+

20 సహోదరులారా, ఆలోచించే విషయంలో చిన్నపిల్లల్లా ఉండకండి,+ చెడుతనం విషయంలో చిన్నపిల్లల్లా ఉండండి;+ కానీ ఆలోచించే విషయంలో పెద్దవాళ్లలా ఉండండి.+ 21 ధర్మశాస్త్రంలో ఇలా రాసివుంది: “‘నేను ఈ ప్రజలతో విదేశీయుల భాషల్లో, అపరిచితుల మాటలతో మాట్లాడతాను. అయినా వాళ్లు నా మాట వినరు’ అని యెహోవా* చెప్తున్నాడు.”+ 22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే గుర్తు.*+ కానీ ప్రవచనం అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు గుర్తు. 23 కాబట్టి సంఘమంతా ఒకచోట సమావేశమై అందరూ వేర్వేరు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు సామాన్య ప్రజలు గానీ, అవిశ్వాసులు గానీ లోపలికి వచ్చారనుకోండి; వాళ్లు మిమ్మల్ని చూసి మీకు పిచ్చిపట్టిందని అనుకోరా? 24 కానీ మీరంతా ప్రవచిస్తున్నప్పుడు ఒక అవిశ్వాసి గానీ, ఒక సామాన్యుడు గానీ లోపలికి వచ్చాడనుకోండి. మీ మాటలు అతన్ని సరిదిద్దుతాయి, తనను తాను పరిశీలించుకోవడానికి కావాల్సిన ప్రేరణను అతనికి ఇస్తాయి. 25 అతని హృదయంలోని రహస్యాలు అతనికి తెలుస్తాయి. దానివల్ల అతను సాష్టాంగపడి, “దేవుడు నిజంగా మీ మధ్య ఉన్నాడు”+ అంటూ దేవుణ్ణి ఆరాధిస్తాడు.

26 సహోదరులారా, మరైతే ఏమి చేయాలి? మీరు ఒకచోట సమావేశమైనప్పుడు, ఒకరు కీర్తనలు పాడతారు, ఒకరు బోధిస్తారు, ఒకరు దేవుని నుండి అందుకున్న సందేశం చెప్తారు, ఒకరు భాషలు మాట్లాడతారు, ఒకరు అర్థం వివరిస్తారు.+ అయితే ఇవన్నీ ఒకరినొకరు బలపర్చుకోవడానికే చేయండి. 27 ఒకవేళ ఎవరైనా భాషలు మాట్లాడితే ఇద్దరు, మహా అయితే ముగ్గురు మాట్లాడాలి; అది కూడా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి; ఎవరో ఒకరు దాని అర్థం వివరించాలి.*+ 28 కానీ అర్థం వివరించేవాళ్లు* ఎవరూ లేకపోతే, భాషలు మాట్లాడే వ్యక్తి సంఘంలో మౌనంగా ఉండాలి, అయితే అతను మనసులో దేవునితో మాట్లాడుకోవచ్చు. 29 అదే ప్రవక్తలైతే,+ ఇద్దరు ముగ్గురు మాట్లాడాలి, మిగతావాళ్లు ఆ మాటల అర్థాన్ని గ్రహించాలి. 30 ఒకవేళ అక్కడ కూర్చొని ఉన్నవాళ్లలో ఎవరికైనా దేవుని సందేశం అందితే, అప్పటిదాకా మాట్లాడుతున్న వ్యక్తి మాట్లాడడం ఆపేయాలి. 31 అందరూ నేర్చుకొని ప్రోత్సాహం పొందేలా,+ మీరంతా ఒకరి తర్వాత ఒకరు ప్రవచించవచ్చు. 32 ప్రవక్తలు పవిత్రశక్తి ఇచ్చిన వరాన్ని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని పద్ధతిగా ఉపయోగించాలి. 33 ఎందుకంటే దేవుడు శాంతికి మూలం, ఆయన అన్నీ క్రమపద్ధతిలో చేస్తాడు.*+

పవిత్రుల సంఘాలన్నిట్లో లాగే, 34 స్త్రీలు సంఘాల్లో మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి వాళ్లకు అనుమతి లేదు.+ వాళ్లు పురుషులకు లోబడివుండాలి,+ ధర్మశాస్త్రం కూడా అదే చెప్తోంది. 35 వాళ్లకు ఏమైనా అర్థంకాకపోతే ఇంట్లో తమ భర్తల్ని అడిగి తెలుసుకోవాలి, ఎందుకంటే స్త్రీలు సంఘంలో మాట్లాడడం అవమానకరమైన విషయం.

36 దేవుని వాక్యం మీ దగ్గరే పుట్టిందా? లేదా అది మీ వరకు మాత్రమే వచ్చిందా?

37 ఎవరైనా తాను ప్రవక్తనని అనుకుంటే లేదా పవిత్రశక్తి ఇచ్చిన వరం తనకుందని అనుకుంటే, నేను మీకు రాస్తున్న విషయాలు ప్రభువు ఆజ్ఞలని అతను గుర్తించాలి. 38 కానీ ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుడు వాళ్లను నిర్లక్ష్యం చేస్తాడు.* 39 కాబట్టి నా సహోదరులారా, ప్రవచించడానికి గట్టిగా ప్రయత్నిస్తూ ఉండండి,+ అలాగని భాషలు మాట్లాడేవాళ్లను అడ్డుకోకండి.+ 40 అయితే అన్నీ మర్యాదగా, పద్ధతి ప్రకారం* జరగనివ్వండి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి