జెఫన్యా
2 దేవుని తీర్పు అమలు కాకముందే,
ధాన్యం పొట్టు గాలికి ఎగిరిపోయినట్టు ఆ రోజు గడిచిపోకముందే,
యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకముందే,+
యెహోవా ఉగ్రత రోజు మీ మీదికి రాకముందే,
3 భూమ్మీదున్న సాత్వికులారా,* ఆయన నీతియుక్తమైన శాసనాల్ని* పాటిస్తున్న ప్రజలారా,
మీరంతా యెహోవాను వెదకండి.+
నీతిని వెదకండి, సాత్వికాన్ని* వెదకండి.
అలాచేస్తే, యెహోవా ఉగ్రత రోజున బహుశా* మీరు దాచబడతారు.+
4 ఎందుకంటే, గాజా విడవబడిన నగరం అవుతుంది,
అష్కెలోను నిర్మానుష్యం అవుతుంది,+
5 “సముద్ర తీరాన నివసించే కెరేతీయులారా, మీకు శ్రమ!+
యెహోవా తీర్పు మీకు వ్యతిరేకంగా ఉంది.
ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నేను నిన్ను నాశనం చేస్తాను,
నీలో ఒక్క నివాసి కూడా మిగిలి ఉండడు.
6 సముద్ర తీరం మేత స్థలం అవుతుంది,
అక్కడ కాపరుల కోసం బావులు, గొర్రెల కోసం రాతిదొడ్లు ఉంటాయి.
7 ఆ ప్రదేశం యూదా ఇంటివాళ్లలో మిగిలినవాళ్లది అవుతుంది;+
అక్కడ వాళ్లు పోషించబడతారు.
సాయంత్రం వాళ్లు అష్కెలోను ఇళ్లలో పడుకుంటారు.
8 “మోయాబు వేసిన నిందల్ని,+ అమ్మోనీయులు అవమానిస్తూ మాట్లాడిన మాటల్ని+ నేను విన్నాను,
వాళ్లు నా ప్రజల్ని నిందించి, వాళ్ల ప్రాంతానికి వ్యతిరేకంగా ప్రగల్భాలు పలికారు.+
9 కాబట్టి నా జీవం తోడు” అని ఒట్టేసి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు:
“మోయాబు అచ్చం సొదొమలా అవుతుంది,+
అమ్మోనీయులు గొమొర్రాలా అవుతారు,+
వాళ్ల ప్రదేశం దురదగొండి చెట్లతో, ఉప్పు గోతులతో ఎప్పటికీ పాడుబడ్డ స్థలంగా ఉంటుంది.+
నా ప్రజల్లో మిగిలినవాళ్లు వాళ్లను కొల్లగొడతారు,
నా జనంలో మిగిలినవాళ్లు వాళ్లను ఆక్రమించుకుంటారు.
10 వాళ్ల గర్వం+ వల్ల వాళ్లు పొందబోయేది అదే,
ఎందుకంటే వాళ్లు సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రజల మీద నిందలు వేసి, వాళ్లమీద తమను తాము హెచ్చించుకున్నారు.
11 యెహోవా వాళ్లకు భయంకరుడిగా* ఉంటాడు;
ఎందుకంటే, భూమ్మీదున్న దేవుళ్లందర్నీ ఆయన నాశనం చేస్తాడు,*
జనాల దీవులన్నీ వాటివాటి స్థానాల నుండి
12 ఇతియోపీయులారా, నా ఖడ్గం మిమ్మల్ని కూడా హతం చేస్తుంది.+
13 ఆయన ఉత్తరం వైపు తన చెయ్యి చాపి అష్షూరును నాశనం చేస్తాడు,
నీనెవెను నిర్మానుష్యం చేస్తాడు,+ ఎడారిలా ఎండిపోయేలా చేస్తాడు.
14 మందలు, అన్నిరకాల అడవి జంతువులు దానిలో పడుకుంటాయి.
కూలిపోయిన దాని స్తంభాల మధ్య గూడబాతు,* ముళ్లపంది రాత్రి గడుపుతాయి.
కిటికీ దగ్గర పక్షుల* శబ్దం వినిపిస్తుంది.
గడప దగ్గర శిథిలాలు కనిపిస్తాయి;
ఎందుకంటే దేవదారుతో చేసిన దాని దూలాల్ని ఆయన బయటికి కనిపించేలా చేస్తాడు.
15 ‘నాలాంటి నగరం ఇంకొకటి లేనేలేదు’ అని తన హృదయంలో అనుకుంటూ
నిశ్చింతగా కూర్చున్న గర్విష్ఠి నగరం ఇదే.
ఇప్పుడు దాని పరిస్థితి భయంకరంగా ఉంది,
అది అడవి జంతువులు పడుకునే చోటుగా మారిపోయింది!
దాన్ని దాటి వెళ్లేవాళ్లు ఈలలు వేస్తూ, చెయ్యి చూపిస్తూ దాన్ని ఎగతాళి చేస్తారు.”+