కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 35
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • యాకోబు అన్యదేవతల విగ్రహాల్ని ​తీసిపారేయించడం (1-4)

      • యాకోబు బేతేలుకు తిరిగిరావడం (5-15)

      • బెన్యామీను పుట్టడం; రాహేలు ​చనిపోవడం (16-20)

      • ఇశ్రాయేలు 12 మంది కుమారులు (21-26)

      • ఇస్సాకు మరణం (27-29)

ఆదికాండం 35:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:19; 31:13
  • +ఆది 27:42-44

ఆదికాండం 35:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:19; ద్వితీ 5:7; యెహో 23:7; 1కొ 10:14

ఆదికాండం 35:3

అధస్సూచీలు

  • *

    లేదా “మార్గంలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:13, 15; 31:42

ఆదికాండం 35:4

అధస్సూచీలు

  • *

    లేదా “దాచిపెట్టాడు.”

ఆదికాండం 35:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:19

ఆదికాండం 35:7

అధస్సూచీలు

  • *

    “బేతేలు దేవుడు” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:20-22

ఆదికాండం 35:8

అధస్సూచీలు

  • *

    “ఏడ్పు సింధూర చెట్టు” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 24:59

ఆదికాండం 35:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:26; 27:36
  • +ఆది 32:28

ఆదికాండం 35:11

అధస్సూచీలు

  • *

    అక్ష., “నీ గర్భవాసం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:1; నిర్గ 6:3; ప్రక 15:3
  • +ఆది 48:3, 4
  • +ఆది 17:5, 6; యోహా 12:13

ఆదికాండం 35:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:18; ద్వితీ 34:4

ఆదికాండం 35:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:18

ఆదికాండం 35:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:19

ఆదికాండం 35:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:22-24

ఆదికాండం 35:18

అధస్సూచీలు

  • *

    “నా దుఃఖ పుత్రుడు” అని అర్థం.

  • *

    “కుడిచేతి పుత్రుడు” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 46:21; 49:27; ద్వితీ 33:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 71

    4/1/1999, పేజీ 16

ఆదికాండం 35:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 48:7; మీకా 5:2; మత్త 2:6

ఆదికాండం 35:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:3, 4; 1ది 5:1

ఆదికాండం 35:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:3

ఆదికాండం 35:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:17, 18
  • +ఆది 15:13; హెబ్రీ 11:9

ఆదికాండం 35:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:20, 26

ఆదికాండం 35:29

అధస్సూచీలు

  • *

    మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:30, 31

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 35:1ఆది 28:19; 31:13
ఆది. 35:1ఆది 27:42-44
ఆది. 35:2ఆది 31:19; ద్వితీ 5:7; యెహో 23:7; 1కొ 10:14
ఆది. 35:3ఆది 28:13, 15; 31:42
ఆది. 35:6ఆది 28:19
ఆది. 35:7ఆది 28:20-22
ఆది. 35:8ఆది 24:59
ఆది. 35:10ఆది 25:26; 27:36
ఆది. 35:10ఆది 32:28
ఆది. 35:11ఆది 17:1; నిర్గ 6:3; ప్రక 15:3
ఆది. 35:11ఆది 48:3, 4
ఆది. 35:11ఆది 17:5, 6; యోహా 12:13
ఆది. 35:12ఆది 15:18; ద్వితీ 34:4
ఆది. 35:14ఆది 28:18
ఆది. 35:15ఆది 28:19
ఆది. 35:17ఆది 30:22-24
ఆది. 35:18ఆది 46:21; 49:27; ద్వితీ 33:12
ఆది. 35:19ఆది 48:7; మీకా 5:2; మత్త 2:6
ఆది. 35:22ఆది 49:3, 4; 1ది 5:1
ఆది. 35:23ఆది 49:3
ఆది. 35:27ఆది 31:17, 18
ఆది. 35:27ఆది 15:13; హెబ్రీ 11:9
ఆది. 35:28ఆది 25:20, 26
ఆది. 35:29ఆది 49:30, 31
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 35:1-29

ఆదికాండం

35 తర్వాత దేవుడు యాకోబుతో ఇలా అన్నాడు: “లేచి, బేతేలుకు+ వెళ్లి అక్కడ నివసించు. నువ్వు నీ అన్న ఏశావు నుండి పారిపోతున్నప్పుడు+ నీకు కనిపించిన సత్యదేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు.”

2 అప్పుడు యాకోబు తన ఇంటివాళ్లకు, తన దగ్గరున్న వాళ్లందరికీ ఇలా చెప్పాడు: “మీ మధ్య ఉన్న అన్యదేవతల విగ్రహాల్ని తీసిపారేయండి.+ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ బట్టలు మార్చుకోండి. 3 మనం లేచి, బేతేలుకు వెళ్దాం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ప్రార్థనకు జవాబిచ్చి, నేను వెళ్లిన ప్రతీచోట* నాకు తోడుగా ఉన్న సత్యదేవునికి+ అక్కడ నేను ఒక బలిపీఠం కడతాను.” 4 కాబట్టి వాళ్లు తమ దగ్గరున్న అన్యదేవతల విగ్రహాలన్నిటినీ, తమ చెవులకు ఉన్న పోగుల్ని యాకోబుకు ఇచ్చారు. అతను వాటిని షెకెముకు దగ్గర్లో ఉన్న పెద్ద చెట్టు కింద పాతిపెట్టాడు.*

5 వాళ్లు ప్రయాణమై వెళ్తున్నప్పుడు, చుట్టుపక్కల నగరాల వాళ్లకు దేవుడు భయం పుట్టించాడు. అందువల్ల వాళ్లు యాకోబు కుమారుల్ని వెంటాడలేదు. 6 చివరికి యాకోబు, అతనితో పాటు ఉన్నవాళ్లంతా కనాను దేశంలోని లూజుకు+ అంటే బేతేలుకు చేరుకున్నారు. 7 అతను అక్కడ ఒక బలిపీఠం కట్టి, ఆ చోటుకు ఏల్‌-బేతేలు* అని పేరు పెట్టాడు. ఎందుకంటే అతను తన అన్న దగ్గర నుండి పారిపోతున్నప్పుడు అక్కడ సత్యదేవుడు తనను తాను అతనికి బయల్పర్చుకున్నాడు.+ 8 తర్వాత రిబ్కా దాది దెబోరా+ చనిపోయింది. ఆమెను బేతేలుకు దిగువన సింధూర చెట్టు కింద పాతిపెట్టారు. కాబట్టి అతను దానికి అల్లోను-బాకూత్‌* అని పేరు పెట్టాడు.

9 యాకోబు పద్దనరాము నుండి వస్తున్నప్పుడు దేవుడు అతనికి ఇంకొకసారి కనిపించి, అతన్ని దీవించాడు. 10 దేవుడు అతనితో ఇలా అన్నాడు: “నీ పేరు యాకోబు.+ ఇకమీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు.” దాంతో దేవుడు అతన్ని ఇశ్రాయేలు అని పిలవడం మొదలుపెట్టాడు.+ 11 దేవుడు అతనితో ఇంకా ఇలా అన్నాడు: “నేను సర్వశక్తిగల దేవుణ్ణి.+ నువ్వు పిల్లల్ని కని, ఎక్కువమంది అవ్వు. జనాలు, ఎన్నో గోత్రాలున్న పెద్ద సమూహం నీ నుండి వస్తాయి.+ రాజులు నీలో* నుండి వస్తారు.+ 12 నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకు, నీ తర్వాత నీ సంతానానికి* ఇస్తాను.”+ 13 తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన చోటు నుండి పైకి వెళ్లిపోయాడు.

14 కాబట్టి దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక రాయిని స్మారక చిహ్నంగా నిలబెట్టి, దానిమీద పానీయార్పణను, తైలాన్ని పోశాడు.+ 15 దేవుడు తనతో మాట్లాడిన ఆ చోటును యాకోబు మళ్లీ బేతేలు అని పిలిచాడు.+

16 తర్వాత వాళ్లు బేతేలు నుండి బయల్దేరారు. వాళ్లు ఎఫ్రాత్‌కు కాస్త దూరంలో ఉండగానే రాహేలుకు పురిటినొప్పులు మొదలయ్యాయి, ప్రసవం ఆమెకు చాలా కష్టమైంది. 17 బిడ్డను కనడానికి ఆమె కష్టపడుతుండగా, మంత్రసాని ఆమెతో, “భయపడకు, ఈ కుమారుణ్ణి కూడా నువ్వు కంటావు”+ అంది. 18 అయితే రాహేలు ప్రాణం పోతుండగా చివరి క్షణాల్లో తన పిల్లవాడికి బెనోని* అని పేరు పెట్టింది, కానీ అతని తండ్రి బెన్యామీను*+ అని పేరు పెట్టాడు. 19 చివరికి రాహేలు చనిపోయింది. ఆమెను ఎఫ్రాత్‌కు వెళ్లే దారిలో, అంటే బేత్లెహేముకు+ వెళ్లే దారిలో పాతిపెట్టారు. 20 యాకోబు ఒక రాయి తీసుకొని ఆమె సమాధి మీద స్మారక చిహ్నంగా నిలబెట్టాడు; నేటికీ అది రాహేలు సమాధికి గుర్తుగా ఉంది.

21 తర్వాత ఇశ్రాయేలు అక్కడి నుండి ప్రయాణమై వెళ్లి, ఏదెరు బురుజు అవతల కొంతదూరంలో డేరా వేసుకున్నాడు. 22 ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఒకరోజు, రూబేను వెళ్లి వాళ్ల నాన్న ఉపపత్ని బిల్హాతో పడుకున్నాడు. ఆ విషయం ఇశ్రాయేలుకు తెలిసింది.+

యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు. 23 లేయా ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: యాకోబు పెద్ద కుమారుడు రూబేను,+ తర్వాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. 24 రాహేలు ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: యోసేపు, బెన్యామీను. 25 రాహేలు సేవకురాలైన బిల్హా ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: దాను, నఫ్తాలి. 26 లేయా సేవకురాలైన జిల్పా ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: గాదు, ఆషేరు. వీళ్లంతా యాకోబుకు పద్దనరాములో పుట్టిన కుమారులు.

27 యాకోబు చివరికి మమ్రేలో వాళ్ల నాన్న ఉన్న చోటికి వచ్చాడు.+ అది కిర్యతర్బాలో అంటే హెబ్రోనులో ఉంది. అబ్రాహాము, ఇస్సాకులు పరదేశులుగా నివసించింది అక్కడే.+ 28 ఇస్సాకు మొత్తం 180 ఏళ్లు బ్రతికాడు.+ 29 అలా ఇస్సాకు చాలా ఏళ్లు బ్రతికి, మంచి వృద్ధాప్యంలో సంతృప్తితో తుదిశ్వాస విడిచాడు; తన ప్రజల దగ్గరికి చేర్చబడ్డాడు.* అతని కుమారులు ఏశావు, యాకోబు అతన్ని పాతిపెట్టారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి