కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 37
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • మందసాన్ని తయారుచేయడం (1-9)

      • బల్ల (10-16)

      • దీపస్తంభం (17-24)

      • ధూపవేదిక (25-29)

నిర్గమకాండం 37:1

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 31:2-5; 38:22
  • +నిర్గ 40:3; సం 10:33
  • +నిర్గ 25:10-15

నిర్గమకాండం 37:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 9:4

నిర్గమకాండం 37:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 5:9

నిర్గమకాండం 37:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 3:8

నిర్గమకాండం 37:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 16:2, 14; 1ది 28:11
  • +నిర్గ 25:17-20

నిర్గమకాండం 37:7

అధస్సూచీలు

  • *

    లేదా “నకిషీ పనిగా చేశాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:20
  • +ఆది 3:24

నిర్గమకాండం 37:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 9:5
  • +1స 4:4; కీర్త 80:1

నిర్గమకాండం 37:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:4
  • +నిర్గ 25:23-28

నిర్గమకాండం 37:12

అధస్సూచీలు

  • *

    దాదాపు 7.4 సెంటీమీటర్లు (2.9 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.

నిర్గమకాండం 37:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 25:29

నిర్గమకాండం 37:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:24; లేవీ 24:4; 2ది 13:11
  • +నిర్గ 25:31-39

నిర్గమకాండం 37:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 8:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీ 1832

నిర్గమకాండం 37:24

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.

నిర్గమకాండం 37:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:7; 40:5; కీర్త 141:2; ప్రక 8:3
  • +నిర్గ 30:1-5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 10/2020, పేజీలు 6-7

నిర్గమకాండం 37:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:25, 33; 40:9
  • +నిర్గ 30:34, 35; కీర్త 141:2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 37:1నిర్గ 31:2-5; 38:22
నిర్గ. 37:1నిర్గ 40:3; సం 10:33
నిర్గ. 37:1నిర్గ 25:10-15
నిర్గ. 37:2హెబ్రీ 9:4
నిర్గ. 37:42ది 5:9
నిర్గ. 37:5యెహో 3:8
నిర్గ. 37:6లేవీ 16:2, 14; 1ది 28:11
నిర్గ. 37:6నిర్గ 25:17-20
నిర్గ. 37:7నిర్గ 40:20
నిర్గ. 37:7ఆది 3:24
నిర్గ. 37:9హెబ్రీ 9:5
నిర్గ. 37:91స 4:4; కీర్త 80:1
నిర్గ. 37:10నిర్గ 40:4
నిర్గ. 37:10నిర్గ 25:23-28
నిర్గ. 37:16నిర్గ 25:29
నిర్గ. 37:17నిర్గ 40:24; లేవీ 24:4; 2ది 13:11
నిర్గ. 37:17నిర్గ 25:31-39
నిర్గ. 37:23సం 8:2
నిర్గ. 37:25నిర్గ 30:7; 40:5; కీర్త 141:2; ప్రక 8:3
నిర్గ. 37:25నిర్గ 30:1-5
నిర్గ. 37:29నిర్గ 30:25, 33; 40:9
నిర్గ. 37:29నిర్గ 30:34, 35; కీర్త 141:2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 37:1-29

నిర్గమకాండం

37 తర్వాత బెసలేలు+ తుమ్మ చెక్కతో ఒక మందసం+ చేశాడు. అది రెండున్నర మూరల* పొడవు, ఒకటిన్నర మూరల వెడల్పు, ఒకటిన్నర మూరల ఎత్తు ఉంది.+ 2 అతను దాని లోపల, బయట స్వచ్ఛమైన బంగారు రేకు తొడిగి, దాని చుట్టూ బంగారంతో అంచును చేశాడు.+ 3 తర్వాత అతను మందసం కోసం నాలుగు బంగారు ఉంగరాలు పోతపోసి, దాని నాలుగు కాళ్లకు పైన అంటించాడు; ఒకవైపు రెండు ఉంగరాలు, ఇంకోవైపు రెండు ఉంగరాలు అంటించాడు. 4 అతను తుమ్మ చెక్కతో కర్రలు చేసి, వాటికి బంగారు రేకు తొడిగాడు.+ 5 మందసాన్ని మోసుకెళ్లడం కోసం ఆ కర్రల్ని మందసం రెండు వైపుల ఉన్న ఉంగరాల్లో పెట్టాడు.+

6 ఆ మందసానికి అతను స్వచ్ఛమైన బంగారంతో ఒక మూతను చేశాడు;+ దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూరలు.+ 7 తర్వాత అతను ఆ మూత+ రెండు కొనల మీద రెండు బంగారు కెరూబుల్ని+ సుత్తితో మలిచాడు.* 8 ఈ కొన మీద ఒక కెరూబును, ఆ కొన మీద ఒక కెరూబును చేశాడు. అతను ఆ కెరూబుల్ని మూత రెండు కొనల మీద చేశాడు. 9 ఆ కెరూబుల రెండు రెక్కలు పైకి విప్పి ఉన్నాయి, అవి వాటి రెక్కలతో ఆ మూతను కప్పాయి.+ ఆ కెరూబులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి, వాటి ముఖాలు మూత వైపు తిరిగి ఉన్నాయి.+

10 తర్వాత అతను తుమ్మ చెక్కతో ఒక బల్లను+ చేశాడు. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూరలు.+ 11 అతను దానికి స్వచ్ఛమైన బంగారు రేకు తొడిగి, బల్ల చుట్టూ బంగారంతో అంచును చేశాడు. 12 అలాగే దాని చుట్టూ బెత్తెడు* వెడల్పు ఉండే పట్టీ చేసి, ఆ పట్టీ చుట్టూ బంగారంతో అంచును చేశాడు. 13 అంతేకాదు, అతను దానికోసం నాలుగు బంగారు ఉంగరాలు పోతపోసి, బల్లకు నాలుగు కాళ్లు అంటించిన చోట వాటిని తగిలించాడు. 14 బల్లను మోసుకెళ్లే కర్రల్ని పట్టివుంచడం కోసం ఆ ఉంగరాల్ని పట్టీకి దగ్గరగా తగిలించాడు. 15 తర్వాత అతను బల్లను మోసుకెళ్లే కర్రల్ని తుమ్మ చెక్కతో తయారుచేసి, వాటికి బంగారు రేకు తొడిగాడు. 16 అలాగే అతను బల్లమీద ఉండే పాత్రల్ని, అంటే పళ్లేలను, గిన్నెల్ని, కూజాల్ని, వాటితోపాటు పానీయార్పణ పాత్రల్ని స్వచ్ఛమైన బంగారంతో చేశాడు.+

17 తర్వాత అతను స్వచ్ఛమైన బంగారంతో ఒక దీపస్తంభాన్ని+ చేశాడు. అతను దాన్ని సుత్తితో మలిచాడు. దాని అడుగుభాగాన్ని, కాండాన్ని, కలశాల్ని, మొగ్గల్ని, పువ్వుల్ని ఒకే బంగారు ముక్కతో చేశాడు.+ 18 ఆ దీపస్తంభం కాండం నుండి ఆరు కొమ్మలు బయటికి వచ్చాయి; మూడు కొమ్మలు ఒకవైపు నుండి, మూడు కొమ్మలు ఇంకోవైపు నుండి వచ్చాయి. 19 ఒక జట్టు కొమ్మల మీద బాదం పువ్వు ఆకారంలో మూడు కలశాలు ఉన్నాయి; ఆ కలశాల మధ్య ఒక మొగ్గ, ఒక పువ్వు ఉన్నాయి. అలాగే రెండో జట్టు కొమ్మల మీద కూడా బాదం పువ్వు ఆకారంలో మూడు కలశాలు ఉన్నాయి; ఆ కలశాల మధ్య కూడా ఒక మొగ్గ, ఒక పువ్వు ఉన్నాయి. దీపస్తంభం కాండం నుండి బయటికి వచ్చిన ఆరు కొమ్మలు అలాగే ఉన్నాయి. 20 దీపస్తంభం కాండం మీద బాదం పువ్వు ఆకారంలో నాలుగు కలశాలు ఉన్నాయి; ఆ కలశాల మధ్య ఒక మొగ్గ, ఒక పువ్వు ఉన్నాయి. 21 కాండం నుండి మొదలయ్యే మొదటి రెండు కొమ్మల కింద ఒక మొగ్గ, తర్వాతి రెండు కొమ్మల కింద ఒక మొగ్గ, ఆ తర్వాతి రెండు కొమ్మల కింద ఒక మొగ్గ ఉన్నాయి. దీపస్తంభం కాండం నుండి మొదలయ్యే ఆరు కొమ్మలకు అలాగే ఉన్నాయి. 22 మొగ్గలు, కొమ్మలు, అలాగే దీపస్తంభమంతా స్వచ్ఛమైన, సాగగొట్టిన ఒకే బంగారు ముక్కతో చేయబడ్డాయి. 23 తర్వాత అతను దాని ఏడు దీపాల్ని,+ దాని పట్టుకార్లను, నిప్పు పాత్రల్ని స్వచ్ఛమైన బంగారంతో చేశాడు. 24 అతను దాన్ని, దాని పాత్రలన్నిటినీ ఒక తలాంతు* స్వచ్ఛమైన బంగారంతో చేశాడు.

25 తర్వాత అతను తుమ్మ చెక్కతో ధూపవేదికను+ చేశాడు. అది చతురస్ర ఆకారంలో ఉంది; దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు. దాని కొమ్ములు దానిలో భాగమై ఉన్నాయి.+ 26 అతను ఆ వేదిక అంతటికీ, అంటే దాని పైభాగానికి, దాని నాలుగు పక్కలకు, దాని కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకు తొడిగాడు. అలాగే దాని చుట్టూ బంగారు అంచును చేశాడు. 27 వేదికను మోయడానికి ఉపయోగించే కర్రల్ని పట్టి ఉంచడానికి ఆ అంచు కింద అటువైపు రెండు, ఇటువైపు రెండు బంగారు ఉంగరాలు చేశాడు. 28 తర్వాత అతను తుమ్మ చెక్కతో కర్రల్ని చేసి, వాటికి బంగారు రేకు తొడిగాడు. 29 అలాగే అతను, లేపనాలు తయారుచేసే వ్యక్తిలా నేర్పుగా కలుపుతూ పవిత్రమైన అభిషేక తైలాన్ని,+ స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యాన్ని+ తయారుచేశాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి