కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 రాజులు 17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 రాజులు విషయసూచిక

      • ఏలీయా ప్రవక్త కరువు గురించి ప్రవచించడం (1)

      • కాకులు ఏలీయాకు ఆహారం తేవడం (2-7)

      • ఏలీయా సారెపతులో ఒక విధవరాలిని సందర్శించడం (8-16)

      • విధవరాలి కుమారుడు చనిపోవడం, బ్రతకడం (17-24)

1 రాజులు 17:1

అధస్సూచీలు

  • *

    “నా దేవుడు యెహోవా” అని అర్థం.

  • *

    అక్ష., “నేను ఎవరి ముందు నిలబడ్డానో ఆ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 22:9
  • +1రా 17:15, 16, 22, 24; 18:36, 38, 46; 2రా 2:8, 11; లూకా 1:17; యోహా 1:19, 21
  • +ద్వితీ 28:15, 23; యిర్మీ 14:22; లూకా 4:25; యాకో 5:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/1991, పేజీ 10

1 రాజులు 17:3

అధస్సూచీలు

  • *

    లేదా “కెరీతు వాగు.”

1 రాజులు 17:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:25; మత్త 6:11

1 రాజులు 17:5

అధస్సూచీలు

  • *

    లేదా “కెరీతు వాగు.”

1 రాజులు 17:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 11:23; న్యా 15:19

1 రాజులు 17:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 18:5

1 రాజులు 17:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 4:25, 26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీలు 13-14

1 రాజులు 17:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:32, 37

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీలు 13-14

1 రాజులు 17:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీలు 13-14

1 రాజులు 17:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 4:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీ 14

1 రాజులు 17:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీ 14

1 రాజులు 17:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 34:10; 37:17, 19; ఫిలి 4:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీ 14

1 రాజులు 17:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 10:41, 42; లూకా 4:25, 26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీలు 14-15

1 రాజులు 17:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీలు 14-15

1 రాజులు 17:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 4:19, 20

1 రాజులు 17:18

అధస్సూచీలు

  • *

    లేదా “నాతో నీకేం పని?”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 13:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీ 15

1 రాజులు 17:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 4:21, 32

1 రాజులు 17:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 99:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీ 15

1 రాజులు 17:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 5:16
  • +ద్వితీ 32:39; 1స 2:6; 2రా 4:32, 34; 13:21; లూకా 7:15; 8:54, 55; యోహా 5:28, 29; 11:44; అపొ 9:40, 41; 20:9, 10; రోమా 14:9; హెబ్రీ 11:17, 19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/1999, పేజీ 16

1 రాజులు 17:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:35

1 రాజులు 17:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 3:2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 రాజు. 17:1యెహో 22:9
1 రాజు. 17:11రా 17:15, 16, 22, 24; 18:36, 38, 46; 2రా 2:8, 11; లూకా 1:17; యోహా 1:19, 21
1 రాజు. 17:1ద్వితీ 28:15, 23; యిర్మీ 14:22; లూకా 4:25; యాకో 5:17
1 రాజు. 17:4కీర్త 37:25; మత్త 6:11
1 రాజు. 17:6సం 11:23; న్యా 15:19
1 రాజు. 17:71రా 18:5
1 రాజు. 17:9లూకా 4:25, 26
1 రాజు. 17:10హెబ్రీ 11:32, 37
1 రాజు. 17:122రా 4:2
1 రాజు. 17:14కీర్త 34:10; 37:17, 19; ఫిలి 4:19
1 రాజు. 17:15మత్త 10:41, 42; లూకా 4:25, 26
1 రాజు. 17:172రా 4:19, 20
1 రాజు. 17:18యోబు 13:26
1 రాజు. 17:192రా 4:21, 32
1 రాజు. 17:20కీర్త 99:6
1 రాజు. 17:22యాకో 5:16
1 రాజు. 17:22ద్వితీ 32:39; 1స 2:6; 2రా 4:32, 34; 13:21; లూకా 7:15; 8:54, 55; యోహా 5:28, 29; 11:44; అపొ 9:40, 41; 20:9, 10; రోమా 14:9; హెబ్రీ 11:17, 19
1 రాజు. 17:23హెబ్రీ 11:35
1 రాజు. 17:24యోహా 3:2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 రాజులు 17:1-24

రాజులు మొదటి గ్రంథం

17 గిలాదు ప్రాంతానికి+ చెందిన తిష్బీయుడైన ఏలీయా*+ అహాబుతో ఇలా అన్నాడు: “నేను సేవిస్తున్న* ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు, నేను చెప్పేంతవరకు కొన్ని సంవత్సరాల పాటు మంచుగానీ వర్షంగానీ పడదు!”+

2 యెహోవా వాక్యం ఏలీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 3 “నువ్వు ఇక్కడి నుండి తూర్పు వైపు వెళ్లి, యొర్దాను తూర్పున ఉన్న కెరీతు లోయ* దగ్గర దాక్కో. 4 నువ్వు ఆ వాగు నీళ్లు తాగాలి, అక్కడ నీకు ఆహారం అందించమని నేను కాకులకు ఆజ్ఞ ఇస్తాను.”+ 5 ఏలీయా వెంటనే వెళ్లి, యెహోవా మాట ప్రకారం యొర్దాను తూర్పున ఉన్న కెరీతు లోయ* దగ్గర నివసించాడు. 6 కాకులు అతనికి ఉదయం వేళ రొట్టెను, మాంసాన్ని అలాగే సాయంత్రం వేళ రొట్టెను, మాంసాన్ని తెస్తూ ఉన్నాయి. అతను వాగు నీళ్లు తాగుతూ ఉన్నాడు.+ 7 కానీ దేశంలో వర్షాలు లేకపోవడంతో, కొన్ని రోజులకు వాగు ఎండిపోయింది.+

8 అప్పుడు యెహోవా వాక్యం అతని దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 9 “నువ్వు లేచి, సీదోనుకు చెందిన సారెపతుకు వెళ్లి అక్కడే ఉండు. నీకు ఆహారం అందించమని అక్కడ ఒక విధవరాలికి ఆజ్ఞ ఇస్తాను.”+ 10 కాబట్టి అతను లేచి సారెపతుకు వెళ్లాడు. అతను నగర ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడ ఒక విధవరాలు పుల్లలు ఏరుకుంటూ ఉంది. అతను ఆమెను పిలిచి, “దయచేసి, నేను తాగడానికి ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకురా” అన్నాడు.+ 11 ఆమె తేవడానికి వెళ్తుండగా ఏలీయా ఆమెతో, “దయచేసి నీ చేతితో ఒక రొట్టె ముక్కను కూడా తీసుకురా” అన్నాడు. 12 అందుకు ఆమె ఇలా అంది: “నీ దేవుడైన యెహోవా జీవం తోడు, నా దగ్గర అస్సలు రొట్టెలు లేవు; పెద్ద జాడీలో పిడికెడు పిండి, చిన్న బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి.+ ఇప్పుడు నేను కొన్ని పుల్లలు ఏరుకుని, ఇంటికి వెళ్లి నా కోసం, నా కుమారుని కోసం ఏదైనా చేస్తాను. ఇదే మా చివరి భోజనం, తర్వాత మేము చనిపోతాం.”

13 అప్పుడు ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “భయపడకు. ఇంటికి వెళ్లి నువ్వు చెప్పినట్టే చేయి. ఉన్న పిండితో ముందు నా కోసం ఒక చిన్న గుండ్రటి రొట్టె చేసి తీసుకురా. తర్వాత నీ కోసం, నీ కుమారుని కోసం ఏమైనా చేసుకో. 14 ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘యెహోవా నేల మీద వర్షం కురిపించే రోజు వరకు, పెద్ద జాడీలోని పిండి అయిపోదు, చిన్న బుడ్డిలోని నూనె అయిపోదు.’ ”+ 15 ఆమె వెళ్లి ఏలీయా చెప్పినట్టే చేసింది; ఏలీయాతోపాటు ఆమె, ఆమె ఇంటివాళ్లు చాలా రోజులపాటు భోజనం చేశారు.+ 16 యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టే, పెద్ద జాడీలోని పిండి, చిన్న బుడ్డిలోని నూనె అయిపోలేదు.

17 ఇవి జరిగిన తర్వాత, ఇంటి యజమానురాలైన ఆ స్త్రీ కుమారునికి జబ్బు చేసింది, జబ్బు ముదరడంతో అతని ఊపిరి ఆగిపోయింది.+ 18 అప్పుడు ఆమె ఏలీయాను, “సత్యదేవుని సేవకుడా, నేను నీకు వ్యతిరేకంగా ఏమి చేశాను?* నా అపరాధాన్ని నాకు గుర్తు చేసి నా కుమారుణ్ణి చంపడానికే నువ్వు వచ్చావా?” అని అడిగింది.+ 19 కానీ ఏలీయా ఆమెతో, “నీ కుమారుణ్ణి ఇలా ఇవ్వు” అన్నాడు. అప్పుడు ఏలీయా ఆమె చేతుల్లో నుండి బాబును తీసుకుని, తాను ఉంటున్న మేడగదిలోకి వెళ్లాడు. ఆ అబ్బాయిని తన మంచం మీద పడుకోబెట్టాడు.+ 20 ఏలీయా యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, నా దేవా,+ నేను ఉంటున్న ఈ విధవరాలి కుమారుణ్ణి చంపి ఆమె మీదికి కూడా హాని తీసుకొస్తున్నావా?” 21 ఏలీయా మూడుసార్లు బాబు మీదికి వంగి, “యెహోవా, నా దేవా, దయచేసి ఈ అబ్బాయిని మళ్లీ బ్రతికించు” అని యెహోవాకు ప్రార్థించాడు. 22 ఏలీయా విన్నపాన్ని యెహోవా విన్నాడు,+ బాబుకి ప్రాణం తిరిగొచ్చింది, బాబు బ్రతికాడు.+ 23 ఏలీయా ఆ అబ్బాయిని మేడగదిలో నుండి ఇంట్లోకి తీసుకొచ్చి, వాళ్ల అమ్మకి ఇచ్చాడు. ఏలీయా ఇలా అన్నాడు: “ఇదిగో, నీ కుమారుడు బ్రతికాడు.”+ 24 అప్పుడు ఆ స్త్రీ ఏలీయాతో ఇలా అంది: “నువ్వు నిజంగా దేవుని సేవకుడివని, నువ్వు చెప్పిన యెహోవా మాట సత్యమని నాకు ఇప్పుడు తెలిసింది.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి