కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • దానియేలు 1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

దానియేలు విషయసూచిక

      • బబులోనీయులు యెరూషలేమును ముట్టడించడం (1, 2)

      • బందీలుగా వచ్చిన రాజవంశం యువకులకు ప్రత్యేక శిక్షణ (3-5)

      • నలుగురు హెబ్రీయుల నమ్మకత్వం పరీక్షించబడడం (6-21)

దానియేలు 1:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:4; యిర్మీ 22:18, 19; 36:30
  • +ద్వితీ 28:49, 50; 2రా 24:1; 2ది 36:5, 6

దానియేలు 1:2

అధస్సూచీలు

  • *

    లేదా “ఆలయానికి.”

  • *

    అంటే, బాబిలోనియా.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 42:24
  • +ఆది 10:9, 10
  • +2ది 36:7; ఎజ్రా 1:7

దానియేలు 1:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 20:16, 18

దానియేలు 1:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “పిల్లలై.”

  • *

    అక్ష., “రాతను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:17, 20; 5:11, 12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1997, పేజీ 15

    2/1/1993, పేజీలు 13-14

దానియేలు 1:5

అధస్సూచీలు

  • *

    లేదా “పోషించబడి” అయ్యుంటుంది.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2005, పేజీ 27

    2/1/1993, పేజీలు 13-14

దానియేలు 1:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారులకు.”

  • *

    “దేవుడే నా న్యాయమూర్తి” అని అర్థం.

  • *

    “యెహోవా అనుగ్రహం చూపించాడు” అని అర్థం.

  • *

    బహుశా “దేవుని వంటి వాడు ఎవడు?” అనే అర్థం ఉండవచ్చు.

  • *

    “యెహోవా సహాయం చేశాడు” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:48; 5:13, 29
  • +దాని 2:17, 18

దానియేలు 1:7

అధస్సూచీలు

  • *

    అంటే, బబులోను పేర్లు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 4:8; 5:12
  • +దాని 2:49; 3:12, 28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 14

దానియేలు 1:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2023, పేజీలు 3-4

దానియేలు 1:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:49, 50; కీర్త 106:44, 46

దానియేలు 1:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “పిల్లల.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2007, పేజీ 19

దానియేలు 1:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2007, పేజీ 19

దానియేలు 1:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2007, పేజీ 18

    7/15/2005, పేజీలు 27-28

దానియేలు 1:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “పిల్లల.”

దానియేలు 1:15

అధస్సూచీలు

  • *

    అక్ష., “పిల్లలందరి.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/2007, పేజీ 18

దానియేలు 1:17

అధస్సూచీలు

  • *

    అక్ష., “పిల్లలకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:20; 4:9; 5:11, 12

దానియేలు 1:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:5

దానియేలు 1:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 1:3, 6

దానియేలు 1:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:2; 4:7; 5:8

దానియేలు 1:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 6:28; 10:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1997, పేజీ 15

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

దాని. 1:12ది 36:4; యిర్మీ 22:18, 19; 36:30
దాని. 1:1ద్వితీ 28:49, 50; 2రా 24:1; 2ది 36:5, 6
దాని. 1:2యెష 42:24
దాని. 1:2ఆది 10:9, 10
దాని. 1:22ది 36:7; ఎజ్రా 1:7
దాని. 1:32రా 20:16, 18
దాని. 1:4దాని 1:17, 20; 5:11, 12
దాని. 1:6దాని 2:48; 5:13, 29
దాని. 1:6దాని 2:17, 18
దాని. 1:7దాని 2:49; 3:12, 28
దాని. 1:7దాని 4:8; 5:12
దాని. 1:91రా 8:49, 50; కీర్త 106:44, 46
దాని. 1:17దాని 1:20; 4:9; 5:11, 12
దాని. 1:18దాని 1:5
దాని. 1:19దాని 1:3, 6
దాని. 1:20దాని 2:2; 4:7; 5:8
దాని. 1:21దాని 6:28; 10:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
దానియేలు 1:1-21

దానియేలు

1 యూదా రాజైన యెహోయాకీము+ పరిపాలనలోని మూడో సంవత్సరంలో, బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడించాడు.+ 2 యెహోవా యూదా రాజైన యెహోయాకీమును, సత్యదేవుని మందిరానికి* చెందిన కొన్ని పాత్రల్ని అతని చేతికి అప్పగించాడు;+ నెబుకద్నెజరు వాటిని షీనారు* దేశంలోని+ తన దేవుని గుడికి తీసుకెళ్లి, తన దేవుని ఖజానాలో ఉంచాడు.+

3 రాజు ఆ తర్వాత, కొంతమంది ఇశ్రాయేలీయుల్ని, ముఖ్యంగా రాజవంశానికి, ప్రముఖుల కుటుంబాలకు చెందినవాళ్లను తీసుకురమ్మని+ తన ముఖ్య ఆస్థాన అధికారైన అష్పెనజుకు ఆజ్ఞాపించాడు. 4 వాళ్లు ఎలాంటి లోపంలేని అందమైన యువకులై* ఉండాలనీ, వాళ్లకు తెలివి, జ్ఞానం, వివేచన,+ రాజభవనంలో సేవ చేయగలిగే సామర్థ్యం ఉండాలనీ చెప్పాడు. వాళ్లకు కల్దీయుల భాషను, జ్ఞానాన్ని* నేర్పించమని రాజు అష్పెనజుకు ఆజ్ఞాపించాడు. 5 అంతేకాదు, రాజు తాను తినే రుచికరమైన ఆహారపదార్థాల్లో నుండి, తాను తాగే ద్రాక్షారసం నుండి ప్రతీరోజు వాళ్లకు ఒక భాగాన్ని నియమించాడు. వాళ్లు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది,* ఆ తర్వాత రాజసేవ మొదలుపెట్టాలి.

6 అలా తీసుకొచ్చిన యువకుల్లో యూదా గోత్రానికి* చెందిన కొంతమంది ఉన్నారు. వాళ్లు ఎవరంటే: దానియేలు,*+ హనన్యా,* మిషాయేలు,* అజర్యా.*+ 7 ముఖ్య ఆస్థాన అధికారి వాళ్లకు వేరే పేర్లు* పెట్టాడు; దానియేలుకు బెల్తెషాజరు+ అని, హనన్యాకు షద్రకు అని, మిషాయేలుకు మేషాకు అని, అజర్యాకు అబేద్నెగో+ అని పేరు పెట్టాడు.

8 అయితే, రాజు తినే రుచికరమైన ఆహారపదార్థాలతో గానీ, అతను తాగే ద్రాక్షారసంతో గానీ తనను తాను అపవిత్రపర్చుకోకూడదని దానియేలు తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. కాబట్టి తనను అపవిత్రపర్చేవాటిని తినకుండా, తాగకుండా ఉండడానికి అనుమతి ఇవ్వమని దానియేలు ముఖ్య ఆస్థాన అధికారిని కోరాడు. 9 అతను దానియేలు మీద దయ, కరుణ చూపించేలా సత్యదేవుడు చేశాడు.+ 10 అయితే అతను దానియేలుతో ఇలా అన్నాడు: “మీకు ఏ ఆహారం, పానీయం ఇవ్వాలో నిర్ణయించిన నా ప్రభువైన రాజుకు నేను భయపడుతున్నాను. మీ వయసు వాళ్లయిన తోటి యువకుల* కన్నా మీరు చిక్కిపోయి ఉండడం రాజు గమనిస్తే, మీ కారణంగా నా తల తీయిస్తాడు.” 11 అప్పుడు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాల మీద ముఖ్య ఆస్థాన అధికారి నియమించిన సంరక్షకునితో దానియేలు ఇలా అన్నాడు: 12 “దయచేసి నీ సేవకులమైన మమ్మల్ని పది రోజుల పాటు పరీక్షించి చూడు, మాకు తినడానికి శాకాహారం, తాగడానికి నీళ్లు ఇవ్వు; 13 ఆ తర్వాత, రాజు తినే రుచికరమైన ఆహారపదార్థాల్ని తింటున్న యువకుల* ముఖాలతో మా ముఖాల్ని పోల్చి చూడు; నువ్వు చూసినదాన్ని బట్టి నీ సేవకులమైన మా విషయంలో నిర్ణయం తీసుకో.”

14 అతను వాళ్లు చెప్పినదానికి ఒప్పుకొని, పది రోజుల పాటు వాళ్లను పరీక్షించాడు. 15 పది రోజులు అయ్యాక, వాళ్ల ముఖాలు రాజు తినే రుచికరమైన ఆహారపదార్థాల్ని తింటున్న యువకులందరి* ముఖాలకన్నా అందంగా, ఆరోగ్యంగా కనిపించాయి. 16 కాబట్టి ఆ సంరక్షకుడు, రాజు తినే రుచికరమైన ఆహారపదార్థాల్ని, ద్రాక్షారసాన్ని తీసేసి వాళ్లకు శాకాహారం ఇచ్చాడు. 17 సత్యదేవుడు ఈ నలుగురు యువకులకు* జ్ఞానాన్ని, ప్రతీ విధమైన రాత విషయంలో లోతైన అవగాహనను, తెలివిని దయచేశాడు; దానియేలుకు అన్నిరకాల దర్శనాలు, కలలు అర్థం చేసుకునే సామర్థ్యం ఇవ్వబడింది.+

18 రాజు పెట్టిన గడువు పూర్తయినప్పుడు,+ ముఖ్య ఆస్థాన అధికారి వాళ్లను నెబుకద్నెజరు ముందుకు తీసుకొచ్చాడు. 19 రాజు వాళ్లతో మాట్లాడినప్పుడు, ఆ యువకులందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా+ లాంటివాళ్లు ఎవరూ కనిపించలేదు; వాళ్లు రాజు సముఖంలో సేవ చేస్తూ ఉన్నారు. 20 తెలివి, అవగాహన అవసరమయ్యే ప్రతీ విషయం గురించి రాజు వాళ్లను ప్రశ్నించాడు. వాళ్లు తన రాజ్యమంతటా ఉన్న ఇంద్రజాలం చేసే పూజారులందరి కన్నా, సోదె చెప్పేవాళ్ల కన్నా పది రెట్లు మెరుగ్గా ఉన్నట్టు అతను గమనించాడు.+ 21 కోరెషు రాజు పరిపాలన మొదటి సంవత్సరం వరకు దానియేలు అక్కడే ఉన్నాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి