కీర్తనలు
దావీదు కీర్తన.
2 నేను నీ పవిత్రమైన స్థలంలోని అత్యంత లోపలి గది వైపు నా చేతులెత్తి
సహాయం కోసం నీకు మొరపెట్టినప్పుడు+ నా విన్నపాల్ని ఆలకించు.
3 దుష్టులతో, కీడు చేసేవాళ్లతో నన్ను ఈడ్చేయకు.+
వాళ్లు తమ హృదయాల్లో చెడు ఉంచుకొని తోటివాళ్లతో శాంతిగా మాట్లాడతారు.+
4 వాళ్ల క్రియల్ని బట్టి,
వాళ్ల చెడు పనుల్ని బట్టి వాళ్లకు ప్రతిఫలం ఇవ్వు.+
వాళ్ల చేతి పనిని బట్టి,
వాళ్లు చేసినదాన్ని బట్టి వాళ్లకు ప్రతీకారం చేయి.+
5 ఎందుకంటే, వాళ్లు యెహోవా కార్యాల్ని గానీ,
ఆయన చేతి పనిని గానీ పట్టించుకోరు.+
ఆయన వాళ్లను కింద పడేస్తాడు, కానీ లేపడు.
6 యెహోవా స్తుతించబడాలి,
సహాయం కోసం నేను చేసిన ప్రార్థనల్ని ఆయన ఆలకించాడు.
నేను ఆయన సహాయాన్ని పొందాను, నా హృదయం ఉల్లసిస్తోంది,
అందుకే నా పాటతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
8 యెహోవా తన ప్రజలకు బలం;
తన అభిషిక్తునికి గొప్ప రక్షణ తీసుకొచ్చే కోట.+
9 నీ ప్రజల్ని కాపాడు, నీ స్వాస్థ్యాన్ని దీవించు.+
వాళ్ల కాపరిగా ఉండి, వాళ్లను ఎప్పటికీ నీ బాహువుల్లో మోయి.+