కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • సమూయేలు సౌలును కలవడం (1-27)

1 సమూయేలు 9:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 14:51; 1ది 8:33; అపొ 13:21
  • +న్యా 21:17

1 సమూయేలు 9:2

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రజలందరూ అతని భుజాల వరకే ఉండేవాళ్లు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 11:15; 13:13; 15:26; 28:7; 31:4; 2స 1:23

1 సమూయేలు 9:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 10:2

1 సమూయేలు 9:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 3:19

1 సమూయేలు 9:8

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

1 సమూయేలు 9:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:19; 2స 15:27; 1ది 9:22; 29:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2005, పేజీ 22

1 సమూయేలు 9:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:19

1 సమూయేలు 9:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 3:2; 1ది 16:39; 2ది 1:3
  • +1స 7:9; 16:5

1 సమూయేలు 9:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 18:11
  • +1స 10:1; 15:1
  • +కీర్త 106:43, 44; 107:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2015, పేజీలు 5-6

1 సమూయేలు 9:17

అధస్సూచీలు

  • *

    లేదా “అదుపులో పెట్టే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 10:24; 15:17; అపొ 13:21

1 సమూయేలు 9:19

అధస్సూచీలు

  • *

    అక్ష., “నీ హృదయంలో ఉన్నవన్నీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:13, 24

1 సమూయేలు 9:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:3
  • +1స 8:5, 19; 12:13

1 సమూయేలు 9:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 20:46, 47

1 సమూయేలు 9:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:13, 19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2015, పేజీ 6

1 సమూయేలు 9:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:3, 10

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 9:11స 14:51; 1ది 8:33; అపొ 13:21
1 సమూ. 9:1న్యా 21:17
1 సమూ. 9:21స 11:15; 13:13; 15:26; 28:7; 31:4; 2స 1:23
1 సమూ. 9:51స 10:2
1 సమూ. 9:61స 3:19
1 సమూ. 9:91స 9:19; 2స 15:27; 1ది 9:22; 29:29
1 సమూ. 9:111స 9:19
1 సమూ. 9:121రా 3:2; 1ది 16:39; 2ది 1:3
1 సమూ. 9:121స 7:9; 16:5
1 సమూ. 9:16యెహో 18:11
1 సమూ. 9:161స 10:1; 15:1
1 సమూ. 9:16కీర్త 106:43, 44; 107:19
1 సమూ. 9:171స 10:24; 15:17; అపొ 13:21
1 సమూ. 9:191స 9:13, 24
1 సమూ. 9:201స 9:3
1 సమూ. 9:201స 8:5, 19; 12:13
1 సమూ. 9:21న్యా 20:46, 47
1 సమూ. 9:251స 9:13, 19
1 సమూ. 9:271స 9:3, 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 9:1-27

సమూయేలు మొదటి గ్రంథం

9 బెన్యామీను గోత్రానికి చెందిన కీషు+ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అబీయేలు కుమారుడు, అబీయేలు సెరోరు కుమారుడు, సెరోరు బెకోరతు కుమారుడు, బెకోరతు అఫియ కుమారుడు. బెన్యామీనీయుడైన+ కీషు చాలా సంపన్నుడు. 2 అతనికి సౌలు+ అనే కుమారుడు ఉన్నాడు. అతను అందమైన యువకుడు. ఇశ్రాయేలీయుల్లో అతనంత అందంగా ఎవ్వరూ లేరు. అతను ప్రజలందరి కన్నా ఎత్తుగా ఉండేవాడు.*

3 ఒకరోజు కీషుకు చెందిన గాడిదలు తప్పిపోయినప్పుడు, అతను తన కుమారుడైన సౌలుకు ఇలా చెప్పాడు: “దయచేసి సేవకుల్లో ఒకర్ని వెంటబెట్టుకొని గాడిదల్ని వెదకడానికి వెళ్లు.” 4 వాళ్లు ఎఫ్రాయిము పర్వత ప్రాంతం గుండా, షాలిషా ప్రాంతం గుండా వెళ్లారు కానీ అవి కనిపించలేదు. వాళ్లు షయలీము ప్రాంతం గుండా ప్రయాణించారు కానీ అవి అక్కడ కూడా లేవు. వాళ్లు బెన్యామీనీయుల ప్రాంతమంతా ప్రయాణించారు కానీ అవి కనిపించలేదు.

5 తర్వాత వాళ్లు సూపు ప్రాంతంలోకి వచ్చారు. అప్పుడు సౌలు తనతో ఉన్న తన సేవకునితో, “వెనక్కి వెళ్లిపోదాం పద, లేకపోతే మా నాన్న గాడిదల గురించి కాకుండా మన గురించి కంగారుపడడం మొదలుపెడతాడు” అని అన్నాడు.+ 6 అయితే ఆ సేవకుడు, “ఇదిగో, ఈ నగరంలో దేవుని సేవకుడు ఒకతను ఉన్నాడు. అతన్ని అందరూ గౌరవిస్తారు. అతను చెప్పేవన్నీ తప్పకుండా నిజమౌతాయి.+ మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. బహుశా మనం ఏ దారిలో వెళ్లాలో అతను చెప్తాడేమో” అన్నాడు. 7 అప్పుడు సౌలు తన సేవకునితో, “ఒకవేళ మనం వెళ్తే, అతని కోసం మనం ఏమి తీసుకెళ్లగలం? మన సంచుల్లో రొట్టెలే లేవు; సత్యదేవుని సేవకునికి కానుకగా తీసుకెళ్లడానికి మన దగ్గర ఏమీ లేదు, ఏమైనా ఉందా?” అన్నాడు. 8 అందుకు ఆ సేవకుడు సౌలుతో ఇలా అన్నాడు: “ఇదిగో! నా దగ్గర పావు షెకెల్‌* వెండి ఉంది. నేను దాన్ని సత్యదేవుని సేవకునికి ఇస్తాను. మనం ఏ దారిలో వెళ్లాలో అతను మనకు చెప్తాడు.” 9 (ఒకప్పుడు ఇశ్రాయేలులో, ఒక వ్యక్తి దేవుని దగ్గర విచారణ చేయడానికి వెళ్లేటప్పుడు, “పద, మనం దీర్ఘదర్శి+ దగ్గరికి వెళ్దాం” అనేవాడు. ఇప్పుడు ప్రవక్త అని పిలవబడే వ్యక్తిని గతంలో దీర్ఘదర్శి అని పిలిచేవాళ్లు.) 10 అప్పుడు సౌలు తన సేవకునితో, “నువ్వు చెప్పింది బాగుంది. మనం వెళ్దాం” అన్నాడు. వాళ్లు సత్యదేవుని సేవకుడు ఉన్న నగరానికి వెళ్లారు.

11 వాళ్లు నగరానికి ఎక్కి వెళ్తున్నప్పుడు, నీళ్లు చేదుకోవడానికి వెళ్తున్న అమ్మాయిలు వాళ్లకు కనిపించారు. వాళ్లు ఆ అమ్మాయిల్ని, “దీర్ఘదర్శి+ ఇక్కడ ఉన్నాడా?” అని అడిగారు. 12 వాళ్లు ఇలా చెప్పారు: “ఉన్నాడు. అదిగో, అతను మీకు కాస్త ముందు ఉన్నాడు. మీరు త్వరగా వెళ్లండి, ఈ రోజు ప్రజలు ఉన్నత స్థలంలో+ బలి అర్పిస్తున్నారు,+ అందుకే ఇవాళ అతను నగరానికి వచ్చాడు. 13 మీరు నగరంలోకి వెళ్లగానే అతను మీకు కనిపిస్తాడు. అతను భోజనం చేయడం కోసం ఉన్నత స్థలానికి వెళ్లకముందే త్వరగా వెళ్లండి. అతను బలిని ఆశీర్వదిస్తాడు కాబట్టి అతను వచ్చేంతవరకు ప్రజలు భోజనం చేయరు. అతను ఆశీర్వదించాకే ఆహ్వానించబడినవాళ్లు తినాలి. కాబట్టి మీరు వెంటనే వెళ్తే అతన్ని చూస్తారు.” 14 దాంతో వాళ్లు నగరానికి ఎక్కి వెళ్లారు. వాళ్లు నగరంలోకి వస్తుండగా, సమూయేలు వాళ్లకు ఎదురయ్యాడు; అతను వాళ్లను కలిసి, తనతోపాటు ఉన్నత స్థలానికి తీసుకెళ్లడానికి వస్తున్నాడు.

15 సౌలు రావడానికి ఒకరోజు ముందు యెహోవా సమూయేలుకు ఇలా చెప్పాడు: 16 “రేపు దాదాపు ఈ సమయానికి నేను బెన్యామీను ప్రాంతానికి+ చెందిన ఒక వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తాను. నువ్వు అతన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకునిగా అభిషేకించాలి.+ అతను నా ప్రజల్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షిస్తాడు. నేను నా ప్రజల బాధను చూశాను. వాళ్ల మొర నా దగ్గరికి చేరింది.”+ 17 సమూయేలు సౌలును చూసినప్పుడు, యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ ‘నా ప్రజల్ని ఏలే* వ్యక్తి’ అని నేను నీతో చెప్పింది ఇతని గురించే.”+

18 అప్పుడు సౌలు, ద్వారం దగ్గర సమూయేలును కలుసుకొని, “దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడో దయచేసి చెప్పు” అని అడిగాడు. 19 అందుకు సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు: “దీర్ఘదర్శిని నేనే. నా కన్నా ముందు ఉన్నత స్థలానికి వెళ్లు, ఈ రోజు నువ్వు నాతో కలిసి భోజనం చేస్తావు.+ నిన్ను రేపు పొద్దున్నే పంపిస్తాను, నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నవన్నీ* నేను నీకు చెప్తాను. 20 మూడు రోజుల క్రితం తప్పిపోయిన గాడిదల గురించైతే+ నువ్వు కంగారుపడకు, అవి దొరికాయి. అదీగాక, ఇశ్రాయేలులో ఉన్న విలువైనవన్నీ నీవీ, నీ తండ్రి ఇంటివాళ్లందరివీ కావా?”+ 21 దానికి సౌలు ఇలా అన్నాడు: “నేను ఇశ్రాయేలు గోత్రాల్లో అతి చిన్నదైన బెన్యామీను గోత్రానికి+ చెందినవాణ్ణి, నా కుటుంబం బెన్యామీను గోత్రంలోని కుటుంబాలన్నిట్లో చాలా తక్కువది, మరి నాతో ఎందుకలా అన్నావు?”

22 తర్వాత సమూయేలు సౌలును, అతని సేవకుణ్ణి భోజనశాలకు తీసుకెళ్లి, ఆహ్వానించబడినవాళ్లలో చాలా ముఖ్యమైన స్థానంలో కూర్చోబెట్టాడు; అక్కడ దాదాపు 30 మంది పురుషులు ఉన్నారు. 23 సమూయేలు వంటవాడితో, “నేను ‘పక్కన పెట్టు’ అని చెప్పి నీకు ఇచ్చిన భాగాన్ని తీసుకురా” అన్నాడు. 24 అప్పుడు ఆ వంటవాడు, తొడనూ దాని మీదున్న మాంసాన్నీ తీసుకొచ్చి సౌలు ముందు పెట్టాడు. అప్పుడు సమూయేలు ఇలా అన్నాడు: “ఇది, నీ కోసం ఉంచిన భాగం. ఇది నీ కోసమని ఈ సందర్భం కోసం వాళ్లు ఉంచారు కాబట్టి తిను. ఎందుకంటే, ‘నేను అతిథుల్ని ఆహ్వానించాను’ అని వాళ్లకు చెప్పాను.” ఆ రోజు సౌలు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు. 25 తర్వాత వాళ్లు ఉన్నత స్థలం+ నుండి నగరానికి దిగివెళ్లారు. సమూయేలు తన ఇంటి మిద్దె మీద సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. 26 తర్వాతి రోజు వాళ్లు పెందలాడే లేచారు, సమూయేలు తెల్లవారుజామున మిద్దె మీదున్న సౌలును పిలిచి ఇలా అన్నాడు: “తయారవ్వు, నేను నిన్ను పంపిస్తాను.” అప్పుడు సౌలు తయారయ్యాడు; అతనూ, సమూయేలూ బయటికి వెళ్లారు. 27 వాళ్లు నగర పొలిమేరల వైపు దిగి వెళ్తున్నప్పుడు సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు: “సేవకుణ్ణి+ మనకన్నా ముందు వెళ్లమని చెప్పు. నువ్వు మాత్రం ఇక్కడే నిలబడు. నేను నీకు దేవుని నుండి వచ్చిన సందేశం చెప్తాను.” దాంతో ఆ సేవకుడు ముందు వెళ్లిపోయాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి