యెషయా
56 యెహోవా ఇలా అంటున్నాడు:
“న్యాయాన్ని సమర్థించండి,+ సరైనది చేయండి,
ఎందుకంటే నా రక్షణ త్వరలోనే వస్తుంది,
నా నీతి వెల్లడి చేయబడుతుంది.+
2 వీటిని చేసే వ్యక్తి,
వీటిని గట్టిగా పట్టుకునే మనిషి,
విశ్రాంతి రోజును పాటిస్తూ దాన్ని అపవిత్రపర్చకుండా ఉండే వ్యక్తి,+
ఎలాంటి చెడూ చేయకుండా తన చేతిని బిగబట్టుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.
‘యెహోవా ఖచ్చితంగా తన ప్రజల్లో నుండి నన్ను వేరు చేస్తాడు’ అని అనుకోకూడదు.
అలాగే నపుంసకుడు,* ‘ఇదిగో! నేను ఎండిపోయిన చెట్టును’ అని అనుకోకూడదు.”
4 ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు: “నా విశ్రాంతి రోజుల్ని పాటిస్తూ, నాకు నచ్చేవాటిని ఎంచుకుంటూ, నా ఒప్పందానికి ఎప్పుడూ కట్టుబడి ఉండే నపుంసకులకు
5 నా మందిరంలో, దాని గోడల లోపల ఒక స్మారక చిహ్నాన్ని, ఒక పేరును ఇస్తాను.
అది కుమారులు, కూతుళ్ల కంటే శ్రేష్ఠమైనది.
ఎప్పటికీ నిలిచివుండే పేరును వాళ్లకు ఇస్తాను,
అది తుడిచిపెట్టుకుపోదు.
6 యెహోవాను ఆరాధిస్తూ, ఆయనకు పరిచారం చేయడానికి,
యెహోవా పేరును ప్రేమించడానికి,+
ఆయనకు సేవకులు అవ్వడానికి ముందుకొచ్చే పరదేశుల్ని,
అంటే విశ్రాంతి రోజును పాటిస్తూ దాన్ని అపవిత్రపర్చకుండా ఉండే,
నా ఒప్పందానికి ఎప్పుడూ కట్టుబడి ఉండే పరదేశులందర్నీ
నా ప్రార్థన మందిరంలో వాళ్లు సంతోషించేలా చేస్తాను.
నా బలిపీఠం మీద వాళ్లు అర్పించే సంపూర్ణ దహనబలుల్ని, బలుల్ని నేను అంగీకరిస్తాను.
ఎందుకంటే నా మందిరం అన్నిదేశాల ప్రజలకు ప్రార్థన మందిరమని పిలవబడుతుంది.”+
8 ఇశ్రాయేలు ప్రజల్లో చెదిరిపోయిన వాళ్లను సమకూరుస్తున్న సర్వోన్నత ప్రభువైన యెహోవా+ ఇలా అంటున్నాడు:
“ఇప్పటికే సమకూర్చబడినవాళ్లు కాకుండా వేరేవాళ్లను కూడా నేను అతని దగ్గరికి సమకూరుస్తాను.”+
10 అతని కావలివాళ్లు గుడ్డివాళ్లు,+ వాళ్లలో ఒక్కరు కూడా గమనించలేదు.+
వాళ్లంతా మూగ కుక్కలు, మొరగలేరు.+
వాళ్లు కూర్చొని రొప్పుతున్నారు; వాళ్లు నిద్ర ప్రియులు.
11 వాళ్లు తిండి కోసం ఎగబడే కుక్కలు;
వాళ్లు ఎన్నడూ తృప్తిపడరు.
వాళ్లు అవగాహన లేని కాపరులు.+
వాళ్లంతా ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు;
వాళ్లలో ప్రతీ ఒక్కరు అక్రమ లాభం కోసం పాకులాడుతూ ఇలా అంటారు:
రేపు కూడా ఇవాళ్టి లాగే ఉంటుంది, చెప్పాలంటే ఇంకా చాలా బాగుంటుంది!”