పరమగీతం
3 నువ్వు రాసుకునే పరిమళ తైలం సువాసన గలది.+
నీ పేరు తలమీద పోసిన పరిమళ తైలం లాంటిది.+
అందుకే యువతులు నిన్ను ప్రేమిస్తున్నారు.
4 రాజు తన అంతఃపురం గదుల్లోకి నన్ను తీసుకొచ్చాడు!
నన్ను నీతో తీసుకెళ్లు; మనం పరుగెత్తుకుంటూ వెళ్లిపోదాం.
ఇద్దరం కలిసి సంతోషిద్దాం, ఉల్లసిద్దాం.
ద్రాక్షారసం కన్నా మధురమైన నీ ప్రేమానురాగాల గురించి మాట్లాడుకుందాం.
అందుకే కదా వాళ్లు* నిన్ను ప్రేమించేది.
సొలొమోను డేరా తెరల్లా+ అందంగా ఉంటాను.
6 నేను నల్లగా ఉన్నానని గుచ్చిగుచ్చి చూడకండి,
నేను ఎండవల్ల నల్లబడ్డాను.
నా సహోదరులకు నా మీద కోపం వచ్చింది;
వాళ్లు నన్ను ద్రాక్షతోటలకు కాపలాగా ఉంచారు,
దానివల్ల నా సొంత ద్రాక్షతోట బాగోగులు నేను చూసుకోలేకపోయాను.
నీ సహచరుల మందల మధ్య ముసుగు* వేసుకున్నదానిలా నేను ఎందుకు ఉండాలి?”
8 “అత్యంత సౌందర్యవతీ,
నీకు తెలీకపోతే, మందల అడుగుజాడలు చూసుకుంటూ వెళ్లు,
గొర్రెల కాపరుల డేరాల దగ్గర నీ మేకపిల్లల్ని మేపు.”
9 “ప్రియసఖీ, నువ్వు ఫరో రథాల్ని లాగే ఆడ గుర్రంలా* ఉన్నావు.+
10 ఆభరణాల* మధ్య నీ చెక్కిళ్లు,
హారాలతో నీ మెడ ఎంత అందంగా ఉన్నాయి!
11 మేము నీకు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు చేయిస్తాం.”
12 “రాజు తన బల్ల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు
నా పరిమళ తైలం+ గుబాళిస్తోంది.
13 నా ప్రియుడు, రాత్రంతా నా రొమ్ముల మీద ఉండి సువాసనలు వెదజల్లే బోళం+ సంచి లాంటివాడు.
14 నా ప్రియుడు ఏన్గెదీ+ ద్రాక్షతోటల మధ్య ఉన్న
గోరింట+ పూలగుత్తి లాంటివాడు.”
15 “నా ప్రియురాలా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు!
నువ్వు సౌందర్యవతివి! నీ కళ్లు పావురం కళ్లలా ఉంటాయి.”+
16 “నా ప్రియుడా, నువ్వు అందగాడివి, మనోహరుడివి.+
పచ్చగడ్డే మన పాన్పు.