పరమగీతం
2 “యువతుల మధ్య నా ప్రియురాలు
ముళ్ల మధ్య లిల్లీ పువ్వులా ఉంది.”
3 “యువకుల మధ్య నా ప్రియుడు
అడవి చెట్ల మధ్య ఆపిల్ చెట్టులా ఉన్నాడు.
అతని నీడలో కూర్చోవాలని నేను తపిస్తున్నాను,
అతని పండ్లు నా నోటికి తియ్యగా ఉన్నాయి.
4 అతను నన్ను విందు గృహానికి తీసుకొచ్చాడు,
నా మీద ప్రేమ పతాకం ఎత్తాడు.
5 నేను విరహ వేదన పడుతున్నాను;
ఎండుద్రాక్ష రొట్టెలతో+ నన్ను తెప్పరిల్లజేయండి,
ఆపిల్ పండ్లతో నన్ను బలపర్చండి.
ప్రేమ దానంతటదే నాలో మేల్కొనే వరకు మీరు దాన్ని లేపడానికి ప్రయత్నించకండి.+
8 నా ప్రియుడు వస్తున్న శబ్దం వినిపిస్తోంది!
ఇదిగో! పర్వతాల్ని ఎక్కుతూ, కొండల మీద దూకుతూ అతను వస్తున్నాడు.
9 నా ప్రియుడు కొండజింక లాంటివాడు, పడుచు దుప్పి లాంటివాడు.+
ఇదిగో, అతను మన గోడ వెనకే ఉన్నాడు,
కిటికీల గుండా, జాలీల గుండా చూస్తున్నాడు.
10 నా ప్రియుడు నాతో ఇలా అంటున్నాడు:
‘నా ప్రియసఖీ, లే,
నా అందాలరాశీ, నాతో వచ్చేయి.
11 ఇదిగో! చలికాలం* అయిపోయింది.
వర్షాలు ఆగిపోయాయి, ఇక రావు.
12 దేశమంతటా పూలు పూశాయి,+
కొమ్మలు కత్తిరించే సమయం వచ్చింది,+
మన దేశంలో గువ్వ పిల్లల పాటలు వినిపిస్తున్నాయి.+
13 అంజూర చెట్టుకు కాసిన తొలి అంజూర పండ్లు పక్వానికి వచ్చాయి;+
ద్రాక్షతీగలు పూత వేసి గుబాళిస్తున్నాయి.
నా ప్రియసఖీ, లే,
నా అందాలరాశీ, నాతో వచ్చేయి.
14 బండ సందుల్లో, కొండచరియ చాటైన స్థలాల్లో దాక్కునే నా పావురమా,+
వచ్చి నాకు కనిపించు, నీ స్వరం వినిపించు,+
నీ స్వరం మధురమైనది, నీ రూపం మనోహరమైనది.’ ”+
15 “మన ద్రాక్షతోటలు పూత వేశాయి,
కాబట్టి ద్రాక్షతోటల్ని పాడుచేసే నక్క పిల్లల్ని, గుంటనక్కల్ని పట్టుకో.”
16 “నా ప్రియుడు నాకు సొంతం, నేను అతనికి సొంతం.+
అతను లిల్లీ పూల దగ్గర గొర్రెలు కాస్తున్నాడు.+