కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ద్వితీయోపదేశకాండం విషయసూచిక

      • ప్రతీ ఏడో సంవత్సరం అప్పు రద్దౌతుంది (1-6)

      • పేదవాళ్లకు చేయూతనివ్వడం (7-11)

      • ప్రతీ ఏడో సంవత్సరం దాసులకు విడుదల (12-18)

        • దాసుని చెవిని కదురుతో గుచ్చడం (16, 17)

      • జంతువుల మొదటి సంతానాన్ని ప్రతిష్ఠించాలి (19-23)

ద్వితీయోపదేశకాండం 15:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2021, పేజీ 2

ద్వితీయోపదేశకాండం 15:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 23:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2021, పేజీ 2

ద్వితీయోపదేశకాండం 15:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:8

ద్వితీయోపదేశకాండం 15:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 1:7, 8

ద్వితీయోపదేశకాండం 15:6

అధస్సూచీలు

  • *

    లేదా “తాకట్టు మీద అప్పు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:13; 1రా 4:24, 25

ద్వితీయోపదేశకాండం 15:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 21:13; యాకో 2:15, 16; 1యో 3:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2010, పేజీ 8

ద్వితీయోపదేశకాండం 15:8

అధస్సూచీలు

  • *

    లేదా “తాకట్టు మీద అప్పుగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 25:35; సామె 19:17; లూకా 6:34, 35; గల 2:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2010, పేజీ 8

ద్వితీయోపదేశకాండం 15:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:22, 23; ద్వితీ 24:14, 15; సామె 21:13

ద్వితీయోపదేశకాండం 15:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “నీ హృదయం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 20:35; 1తి 6:18; హెబ్రీ 13:16
  • +ద్వితీ 24:19; కీర్త 41:1

ద్వితీయోపదేశకాండం 15:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 26:11
  • +సామె 3:27; మత్త 5:42; లూకా 12:33

ద్వితీయోపదేశకాండం 15:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 21:2

ద్వితీయోపదేశకాండం 15:14

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ద్వితీయోపదేశకాండం 15:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2014, పేజీ 19

ద్వితీయోపదేశకాండం 15:19

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఎద్దుల్లో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:13; 18:15, 17

ద్వితీయోపదేశకాండం 15:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:5, 6; 14:23

ద్వితీయోపదేశకాండం 15:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:1; మలా 1:8; హెబ్రీ 9:14

ద్వితీయోపదేశకాండం 15:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:4; అపొ 15:20, 29
  • +లేవీ 17:10, 13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2000, పేజీలు 30-31

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ద్వితీ. 15:2ద్వితీ 31:10
ద్వితీ. 15:3ద్వితీ 23:20
ద్వితీ. 15:4ద్వితీ 28:8
ద్వితీ. 15:5యెహో 1:7, 8
ద్వితీ. 15:6ద్వితీ 28:13; 1రా 4:24, 25
ద్వితీ. 15:7సామె 21:13; యాకో 2:15, 16; 1యో 3:17
ద్వితీ. 15:8లేవీ 25:35; సామె 19:17; లూకా 6:34, 35; గల 2:10
ద్వితీ. 15:9నిర్గ 22:22, 23; ద్వితీ 24:14, 15; సామె 21:13
ద్వితీ. 15:10అపొ 20:35; 1తి 6:18; హెబ్రీ 13:16
ద్వితీ. 15:10ద్వితీ 24:19; కీర్త 41:1
ద్వితీ. 15:11మత్త 26:11
ద్వితీ. 15:11సామె 3:27; మత్త 5:42; లూకా 12:33
ద్వితీ. 15:12నిర్గ 21:2
ద్వితీ. 15:19సం 3:13; 18:15, 17
ద్వితీ. 15:20ద్వితీ 12:5, 6; 14:23
ద్వితీ. 15:21ద్వితీ 17:1; మలా 1:8; హెబ్రీ 9:14
ద్వితీ. 15:23ఆది 9:4; అపొ 15:20, 29
ద్వితీ. 15:23లేవీ 17:10, 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ద్వితీయోపదేశకాండం 15:1-23

ద్వితీయోపదేశకాండం

15 “ప్రతీ ఏడు సంవత్సరాల చివర్లో నువ్వు విడుదల దయచేయాలి. 2 నువ్వు విడుదల చేయాల్సిన పద్ధతి ఇది: అప్పు ఇచ్చిన ప్రతీ వ్యక్తి, తన పొరుగువాడు తనకు అప్పుపడిన దాన్నుండి అతన్ని విడుదల చేయాలి. డబ్బు చెల్లించమని ఆ వ్యక్తి తన పొరుగువాణ్ణి గానీ తన సహోదరుణ్ణి గానీ అడగకూడదు. ఎందుకంటే అది యెహోవా కోసం దయచేసే విడుదల.+ 3 నీకు అప్పుపడిన దాన్ని చెల్లించమని నువ్వు ఒక పరదేశిని అడగొచ్చు,+ కానీ నీ సహోదరుడు నీకు ఏమి అప్పుపడినా దాన్ని చెల్లించమని అతన్ని అడగకూడదు. 4 నువ్వు స్వాధీనం చేసుకోవడానికి నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోయే దేశంలో యెహోవా నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు,+ కాబట్టి నీ మధ్య పేదవాళ్లు ఎవ్వరూ ఉండరు. 5 అయితే నువ్వు నీ దేవుడైన యెహోవా స్వరానికి పూర్తిగా లోబడుతూ, నేడు నేను నీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటిస్తేనే ఆయన నిన్ను అలా దీవిస్తాడు.+ 6 నీ దేవుడైన యెహోవా నీకు వాగ్దానం చేసినట్టే ఆయన నిన్ను దీవిస్తాడు, నువ్వు అనేక జనాలకు అప్పు* ఇస్తావు కానీ నీకు మాత్రం అప్పు తీసుకోవాల్సిన అవసరం రాదు; నువ్వు అనేక జనాల మీద అధికారం చెలాయిస్తావు కానీ వాళ్లు నీ మీద అధికారం చెలాయించరు.+

7 “నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చే దేశంలోని ఒక నగరంలో నీ మధ్య నివసిస్తున్న నీ సహోదరుల్లో ఒకడు పేదవాడైతే, పేదవాడైన నీ సహోదరుడి విషయంలో నువ్వు నీ హృదయాన్ని కఠినపర్చుకోకూడదు, నీ చేతిని బిగబట్టుకోకూడదు.+ 8 నువ్వు నీ సహోదరుని విషయంలో నీ చెయ్యి చాపి ఉదారంగా ఇవ్వాలి,+ అతనికి కావాల్సింది ఏదైనాసరే, అతనికి కొదువగా ఉన్నది ఏదైనాసరే నువ్వు ఖచ్చితంగా అతనికి అప్పుగా* ఇవ్వాలి. 9 ‘విడుదల చేయాల్సిన ఏడో సంవత్సరం దగ్గర్లో ఉంది’ అనే చెడ్డ ఆలోచన నీ హృదయంలో పెరగకుండా జాగ్రత్తపడు. ఆ చెడ్డ ఆలోచన వల్ల నువ్వు పేదవాడైన నీ సహోదరుని పట్ల ఉదారత చూపించకుండా, అతనికి ఏమీ ఇవ్వకుండా ఉండకూడదు. ఒకవేళ అతను నీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడితే, నువ్వు ఆయన దృష్టిలో పాపం చేసినవాడివౌతావు.+ 10 నువ్వు అతనికి ఉదారంగా ఇవ్వాలి,+ కానీ నువ్వు* సణుగుకుంటూ ఇవ్వకూడదు. అప్పుడే నీ దేవుడైన యెహోవా నువ్వు చేసే ప్రతీ కష్టంలో, ప్రతీ పనిలో నిన్ను దీవిస్తాడు.+ 11 దేశంలో పేదవాళ్లు ఎప్పుడూ ఉంటారు.+ అందుకే, ‘కష్టాల్లో ఉన్న పేదవాడైన నీ సహోదరుడికి నీ చెయ్యి చాపి ఉదారంగా ఇవ్వాలి’ అని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను.+

12 “హెబ్రీయులైన నీ సహోదరుల మధ్య ఒక పురుషుడే గానీ స్త్రీయే గానీ నీకు అమ్మబడి, ఆరు సంవత్సరాలు సేవచేస్తే, ఏడో సంవత్సరంలో నువ్వు అతన్ని లేదా ఆమెను విడుదల చేయాలి.+ 13 అయితే నువ్వు అతన్ని విడుదల చేసేటప్పుడు అతన్ని వట్టి చేతులతో పంపించకూడదు. 14 నువ్వు నీ మంద నుండి, కళ్లం* నుండి, నూనె గానుగ నుండి, ద్రాక్ష గానుగ నుండి కొంత అతనికి ఉదారంగా ఇవ్వాలి. నీ దేవుడైన యెహోవా నిన్ను దీవించిన దాని ప్రకారం నువ్వు అతనికి ఇవ్వాలి. 15 నువ్వు ఐగుప్తు దేశంలో బానిసగా ఉండేవాడివని, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించాడని గుర్తుంచుకో. అందుకే నువ్వు ఇలా చేయాలని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను.

16 “కానీ అతను నీ దగ్గర ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండడంవల్ల అతను నీ మీద, నీ ఇంటివాళ్ల మీద ప్రేమతో, ‘నేను నిన్ను విడిచి వెళ్లను!’ అని అంటే, 17 నువ్వు అతన్ని తలుపు దగ్గరికి తీసుకెళ్లి, ఒక కదురుతో అతని చెవిని గుచ్చాలి. అప్పుడతను జీవితాంతం నీకు దాసుడౌతాడు. నీ దాసురాలి విషయంలో కూడా నువ్వు అలాగే చేయాలి. 18 నువ్వు అతన్ని విడుదల చేసినప్పుడు అతను వెళ్లిపోతే, నువ్వు దాన్ని నష్టంగా పరిగణించకూడదు. ఎందుకంటే, ఆ ఆరు సంవత్సరాల్లో అతను ఒక కూలివాడు చేసే సేవకు రెండింతల సేవ నీకు చేశాడు, ప్రతీ పనిలో నీ దేవుడైన యెహోవా నిన్ను దీవించాడు.

19 “నువ్వు నీ పశువుల్లోని, మందలోని మొదటి మగ సంతానాన్ని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించాలి.+ నీ పశువుల్లో* మొదటి సంతానాన్ని ఉపయోగించి ఏ పనీ చేయకూడదు, నీ మందలో మొదటి సంతానం బొచ్చు కత్తిరించకూడదు. 20 యెహోవా ఎంచుకునే చోట నువ్వు, నీ ఇంటివాళ్లు ప్రతీ సంవత్సరం నీ దేవుడైన యెహోవా ముందు దాన్ని తినాలి.+ 21 కానీ అది కుంటిది గానీ, గుడ్డిది గానీ, ఇంకేదైనా తీవ్రమైన లోపం ఉన్నది గానీ అయితే, దాన్ని నీ దేవుడైన యెహోవాకు అర్పించకూడదు.+ 22 నువ్వు దాన్ని నీ నగరాల లోపల తినాలి; ఒక కొండజింకనో, జింకనో తిన్నట్టు అపవిత్రులు, పవిత్రులు దాన్ని తినొచ్చు. 23 కానీ దాని రక్తాన్ని నువ్వు తినకూడదు;+ దాన్ని నీళ్లలా నేలమీద పారబోయాలి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి