కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 39
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • పోతీఫరు ఇంట్లో యోసేపు (1-6)

      • యోసేపు పోతీఫరు భార్యకు ​అడ్డుచెప్పడం (7-20)

      • చెరసాలలో యోసేపు (21-23)

ఆదికాండం 39:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:20; 37:25
  • +కీర్త 105:17; అపొ 7:9
  • +ఆది 37:36

ఆదికాండం 39:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 8:31; హెబ్రీ 13:6

ఆదికాండం 39:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:27

ఆదికాండం 39:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 2:24; 20:3, 6; కీర్త 51:పైవిలాసం; 51:4; మార్కు 10:7, 8; హెబ్రీ 13:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2022, పేజీ 26

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 41

    కావలికోట (అధ్యయన),

    11/2018, పేజీ 26

    కావలికోట (అధ్యయన),

    9/2017, పేజీలు 4-5

    కావలికోట,

    1/1/2014, పేజీ 9

    2/15/2013, పేజీ 4

    10/15/2007, పేజీ 23

    6/15/2006, పేజీలు 28-29

    1/15/2004, పేజీ 29

    12/1/2003, పేజీ 20

    11/1/2000, పేజీలు 9-10

    9/1/1998, పేజీ 5

    10/15/1997, పేజీ 29

ఆదికాండం 39:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2015, పేజీ 16

ఆదికాండం 39:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 41

ఆదికాండం 39:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 105:17, 18

ఆదికాండం 39:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 40:2, 3; కీర్త 105:19; అపొ 7:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    5/15/2002, పేజీలు 14-17

ఆదికాండం 39:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 39:6

ఆదికాండం 39:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:22, 25; అపొ 7:9, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2023, పేజీ 16

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 39:1ఆది 17:20; 37:25
ఆది. 39:1కీర్త 105:17; అపొ 7:9
ఆది. 39:1ఆది 37:36
ఆది. 39:2రోమా 8:31; హెబ్రీ 13:6
ఆది. 39:5ఆది 30:27
ఆది. 39:9ఆది 2:24; 20:3, 6; కీర్త 51:పైవిలాసం; 51:4; మార్కు 10:7, 8; హెబ్రీ 13:4
ఆది. 39:20కీర్త 105:17, 18
ఆది. 39:21ఆది 40:2, 3; కీర్త 105:19; అపొ 7:9
ఆది. 39:22ఆది 39:6
ఆది. 39:23ఆది 49:22, 25; అపొ 7:9, 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 39:1-23

ఆదికాండం

39 ఇష్మాయేలీయులు+ యోసేపును ఐగుప్తుకు తీసుకెళ్లాక,+ పోతీఫరు+ అనే ఐగుప్తీయుడు యోసేపును వాళ్ల దగ్గర కొన్నాడు. ఇతను ఫరో ఆస్థాన అధికారి, రాజ సంరక్షకుల అధిపతి. 2 అయితే యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు.+ దానివల్ల, యోసేపు తాను చేసిన ప్రతీ పనిలో సఫలుడయ్యాడు. దాంతో అతను ఐగుప్తీయుడైన తన యజమాని ఇంటిమీద అధికారిగా నియమించబడ్డాడు. 3 యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడని, అతను చేసే ప్రతీ పనిని యెహోవా సఫలం చేస్తున్నాడని అతని యజమాని గమనించాడు.

4 యోసేపు తన యజమాని దృష్టిలో అనుగ్రహం పొందుతూ ఉన్నాడు. అలా యోసేపు అతనికి ముఖ్య సేవకుడు అయ్యాడు. అతను యోసేపును తన ఇంటిమీద, తన ఆస్తంతటి మీద అధికారిగా నియమించాడు. 5 అప్పటినుండి యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని దీవిస్తూ ఉన్నాడు. దానివల్ల అతని ఇంట్లో, పొలంలో ఉన్నవాటన్నిటి మీదికి యెహోవా దీవెనలు వచ్చాయి.+ 6 అతను మెల్లమెల్లగా తనకున్న ప్రతీదాన్ని యోసేపుకు అప్పగించాడు, కేవలం తన ఆహారం గురించి మాత్రమే అతను పట్టించుకునేవాడు. అంతేకాదు, యోసేపు ఎదిగి మంచి శరీర దారుఢ్యం ఉన్నవాడిగా, అందగాడిగా తయారయ్యాడు.

7 కొంతకాలం తర్వాత, యోసేపు యజమాని భార్య అతని మీద కన్నేసి, “నాతో పడుకో” అని అడగడం మొదలుపెట్టింది. 8 కానీ అతను ఒప్పుకోకుండా తన యజమాని భార్యతో ఇలా అనేవాడు: “నా మీద నమ్మకంతో నా యజమాని తనకున్న ప్రతీది నా చేతికి అప్పగించాడు, ఈ ఇంట్లో దేని గురించీ అతను నన్ను లెక్క అడగడు. 9 ఈ ఇంట్లో నాకన్నా పైస్థానంలో ఎవ్వరూ లేరు. అతను నాకు అన్నీ అప్పగించాడు, ఒక్క నిన్ను తప్ప. ఎందుకంటే నువ్వు అతని భార్యవు. కాబట్టి నేను ఇంత చెడ్డపని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?”+

10 అలా ఆమె రోజూ యోసేపుతో మాట్లాడేది, అతను మాత్రం ఆమెతో పడుకోవడానికి గానీ, ఆమెతో ఉండడానికి గానీ ఎన్నడూ ఒప్పుకోలేదు. 11 ఒకరోజు అతను తన పని చేసుకోవడానికి ఇంట్లోకి వెళ్లినప్పుడు, ఇంట్లో పనివాళ్లు ఎవ్వరూ లేరు. 12 అప్పుడామె అతని వస్త్రం పట్టుకొని లాగి, “నాతో పడుకో!” అంది. కానీ అతను తన వస్త్రాన్ని ఆమె చేతిలోనే వదిలేసి బయటికి పారిపోయాడు. 13 అతను తన వస్త్రాన్ని ఆమె చేతిలోనే వదిలేసి బయటికి పారిపోవడం గమనించగానే, 14 ఆమె గట్టిగా అరుస్తూ ఇంట్లోని మనుషుల్ని పిలిచి ఇలా అంది: “ఇదిగో! మా ఆయన మనల్ని నవ్వులపాలు చేయడానికి ఈ హెబ్రీయుణ్ణి మన దగ్గరికి తీసుకొచ్చాడు. వాడు నాతో పడుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. కానీ నేను బిగ్గరగా అరవడం మొదలుపెట్టాను. 15 నేను గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టేసరికి, తన వస్త్రాన్ని నా పక్కనే వదిలేసి బయటికి పారిపోయాడు.” 16 ఆ తర్వాత అతని యజమాని ఇంటికి వచ్చేవరకు ఆమె ఆ వస్త్రాన్ని తన పక్కనే  పెట్టుకుంది.

17 ఆమె తన భర్తకు కూడా అదే విషయం చెప్తూ ఇలా అంది: “నువ్వు మన దగ్గరికి తీసుకొచ్చిన ఆ హెబ్రీ సేవకుడు నన్ను నవ్వులపాలు చేయడానికి నా దగ్గరికి వచ్చాడు. 18 నేను గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టేసరికి, తన వస్త్రాన్ని నా పక్కనే వదిలేసి బయటికి పారిపోయాడు.” 19 “నీ సేవకుడు ఇలా ఇలా చేశాడు” అంటూ తన భార్య తనతో చెప్పిన మాటలు వినగానే అతనికి విపరీతమైన కోపం వచ్చింది. 20 కాబట్టి యోసేపు యజమాని అతన్ని రాజు ఖైదీలు ఉండే చెరసాలలో వేయించాడు. అలా అతను ఆ చెరసాలలోనే ఉన్నాడు.+

21 కానీ ఎప్పటిలాగే యెహోవా యోసేపుకు తోడుగా ఉండి, అతని పట్ల విశ్వసనీయ ప్రేమను చూపిస్తూ, ఆ చెరసాల ముఖ్య అధికారి దృష్టిలో యోసేపు అనుగ్రహం పొందేలా చేస్తూ ఉన్నాడు.+ 22 కాబట్టి చెరసాల ముఖ్య అధికారి చెరసాలలో ఉన్న ఖైదీలందరి మీద యోసేపును నాయకునిగా పెట్టాడు. అక్కడ జరిగే పనులన్నీ అతనే వాళ్లచేత చేయించేవాడు.+ 23 ఆ చెరసాల ముఖ్య అధికారి యోసేపుకు అప్పగించిన వాటిలో దేని గురించీ లెక్క అడిగేవాడు కాదు. ఎందుకంటే, యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు, అతను ఏ పని చేసినా యెహోవా దాన్ని సఫలం చేశాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి