కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • పాడైపోయిన నార దట్టీ (1-11)

      • ద్రాక్షారసం కూజాలు పగలగొట్ట​బడతాయి (12-14)

      • మారని యూదా చెరలోకి వెళ్తుంది (15-27)

        • “కూషీయుడు తన చర్మాన్ని మార్చు​కోగలడా?” (23)

యిర్మీయా 13:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:19; జెఫ 3:11

యిర్మీయా 13:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:15, 16
  • +యిర్మీ 6:28

యిర్మీయా 13:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:5; ద్వితీ 26:18; కీర్త 135:4
  • +యిర్మీ 33:9
  • +యిర్మీ 6:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 3/2017,

యిర్మీయా 13:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    10/2015, పేజీ 7

యిర్మీయా 13:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 29:9; 51:17; యిర్మీ 25:27

యిర్మీయా 13:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 6:21; యెహె 5:10
  • +యెహె 7:4; 24:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 258

యిర్మీయా 13:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 59:9

యిర్మీయా 13:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 9:1
  • +కీర్త 100:3

యిర్మీయా 13:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:12; యిర్మీ 22:24, 26

యిర్మీయా 13:19

అధస్సూచీలు

  • *

    లేదా “ముట్టడి వేయబడ్డాయి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:64

యిర్మీయా 13:20

అధస్సూచీలు

  • *

    బహుశా యెరూషలేము కావచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 6:22
  • +యెహె 34:8

యిర్మీయా 13:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 39:1, 2
  • +యిర్మీ 6:24; మీకా 4:9

యిర్మీయా 13:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 5:19; 16:10, 11
  • +యెహె 16:37

యిర్మీయా 13:23

అధస్సూచీలు

  • *

    లేదా “ఇతియోపీయుడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 27:22

యిర్మీయా 13:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:33; ద్వితీ 28:64

యిర్మీయా 13:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:32
  • +ద్వితీ 32:37, 38; యెష 28:15; యిర్మీ 10:14

యిర్మీయా 13:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +విలా 1:8; యెహె 16:37; 23:29

యిర్మీయా 13:27

అధస్సూచీలు

  • *

    లేదా “అవమానకరమైన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:20; యెహె 16:15
  • +యెష 65:7; యెహె 6:13
  • +యెహె 24:13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 13:9లేవీ 26:19; జెఫ 3:11
యిర్మీ. 13:102ది 36:15, 16
యిర్మీ. 13:10యిర్మీ 6:28
యిర్మీ. 13:11నిర్గ 19:5; ద్వితీ 26:18; కీర్త 135:4
యిర్మీ. 13:11యిర్మీ 33:9
యిర్మీ. 13:11యిర్మీ 6:17
యిర్మీ. 13:13యెష 29:9; 51:17; యిర్మీ 25:27
యిర్మీ. 13:14యిర్మీ 6:21; యెహె 5:10
యిర్మీ. 13:14యెహె 7:4; 24:14
యిర్మీ. 13:16యెష 59:9
యిర్మీ. 13:17యిర్మీ 9:1
యిర్మీ. 13:17కీర్త 100:3
యిర్మీ. 13:182రా 24:12; యిర్మీ 22:24, 26
యిర్మీ. 13:19ద్వితీ 28:64
యిర్మీ. 13:20యిర్మీ 6:22
యిర్మీ. 13:20యెహె 34:8
యిర్మీ. 13:21యెష 39:1, 2
యిర్మీ. 13:21యిర్మీ 6:24; మీకా 4:9
యిర్మీ. 13:22యిర్మీ 5:19; 16:10, 11
యిర్మీ. 13:22యెహె 16:37
యిర్మీ. 13:23సామె 27:22
యిర్మీ. 13:24లేవీ 26:33; ద్వితీ 28:64
యిర్మీ. 13:25యిర్మీ 2:32
యిర్మీ. 13:25ద్వితీ 32:37, 38; యెష 28:15; యిర్మీ 10:14
యిర్మీ. 13:26విలా 1:8; యెహె 16:37; 23:29
యిర్మీ. 13:27యిర్మీ 2:20; యెహె 16:15
యిర్మీ. 13:27యెష 65:7; యెహె 6:13
యిర్మీ. 13:27యెహె 24:13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 13:1-27

యిర్మీయా

13 యెహోవా నాకు ఇలా చెప్పాడు: “వెళ్లి, ఒక నార దట్టీ కొనుక్కొని, దాన్ని నీ నడుముకు కట్టుకో, కానీ దాన్ని నీళ్లలో తడపకు.” 2 దాంతో నేను యెహోవా మాట ప్రకారం ఒక దట్టీ కొనుక్కొని నడుముకు కట్టుకున్నాను. 3 రెండోసారి యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 4 “నువ్వు కొనుక్కొని నడుముకు కట్టుకున్న దట్టీ తీసుకొని, యూఫ్రటీసు దగ్గరికి వెళ్లి, అక్కడ ఒక బండ సందులో దాన్ని దాచిపెట్టు.” 5 యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టే, నేను వెళ్లి యూఫ్రటీసు దగ్గర దాన్ని దాచిపెట్టాను.

6 చాలా రోజుల తర్వాత యెహోవా నాతో, “నువ్వు లేచి, యూఫ్రటీసు దగ్గరికి వెళ్లి, దాచిపెట్టమని నేను నీకు ఆజ్ఞాపించిన దట్టీని తీసుకో” అన్నాడు. 7 అప్పుడు నేను యూఫ్రటీసు దగ్గరికి వెళ్లి, ఆ దట్టీని దాచిపెట్టిన స్థలంలో నుండి దాన్ని తవ్వి తీశాను, ఆ దట్టీ పాడైపోయి ఎందుకూ పనికిరాకుండా తయారైంది.

8 తర్వాత యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 9 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘యూదా గర్వాన్ని, యెరూషలేము మహా గర్వాన్ని నేను ఇలాగే నాశనం చేస్తాను.+ 10 నా మాటలకు లోబడడానికి ఇష్టపడకుండా,+ మొండిగా తమ హృదయాన్ని అనుసరిస్తూ,+ వేరే దేవుళ్లను అనుసరిస్తూ, వాటిని పూజిస్తూ, వాటికి వంగి నమస్కారం చేసే ఈ దుష్ట ప్రజలు కూడా ఎందుకూ పనికిరాని ఈ దట్టీలాగే తయారౌతారు.’ 11 ‘ఒక వ్యక్తి నడుముకు దట్టీ కట్టుకున్నట్టే, నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లందర్నీ, యూదా ఇంటివాళ్లందర్నీ నా నడుముకు కట్టుకున్నాను. వాళ్లు నాకు ప్రజలుగా,+ నాకు కీర్తిని,+ స్తుతిని, ఘనతను తీసుకొచ్చే వాళ్లుగా ఉండాలని అలా చేశాను. కానీ వాళ్లు లోబడలేదు’+ అని యెహోవా అంటున్నాడు.

12 “నువ్వు వాళ్లకు ఈ సందేశాన్ని కూడా చెప్పాలి: ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: “ప్రతీ పెద్ద కూజా ద్రాక్షారసంతో నింపబడాలి.” ’ అప్పుడు వాళ్లు, ‘ప్రతీ పెద్ద కూజా ద్రాక్షారసంతో నింపబడాలని మాకు తెలీదా?’ అని నీతో అంటారు. 13 అప్పుడు నువ్వు వాళ్లకిలా చెప్పు: ‘యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఈ దేశ నివాసులందర్నీ, దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుల్ని, యాజకుల్ని, ప్రవక్తల్ని, యెరూషలేము నివాసులందర్నీ మత్తులుగా చేయబోతున్నాను.+ 14 నేను వాళ్లను ఒకరి మీద ఒకర్ని పడేస్తాను, తండ్రుల్నీ కుమారుల్నీ ఒకేలా నాశనం చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+ “నేను వాళ్లమీద కనికరం చూపించను, బాధపడను, కరుణ చూపించను; వాళ్లను నాశనం చేయకుండా ఏదీ నన్ను ఆపలేదు.” ’+

15 వినండి, శ్రద్ధపెట్టండి.

అహంకారం చూపించకండి, ఎందుకంటే యెహోవా మాట్లాడాడు.

16 ఆయన చీకటిని తీసుకురాకముందే,

చీకటిపడి పర్వతాల మీద మీ పాదాలు తడబడకముందే,

మీ దేవుడైన యెహోవాను మహిమపర్చండి.

మీరు వెలుగు వస్తుందనుకుంటారు,

కానీ ఆయన చీకటిని తెస్తాడు;

దాన్ని చిమ్మచీకటిగా మారుస్తాడు.+

17 మీరు వినడానికి ఇష్టపడకపోతే,

మీ గర్వాన్ని బట్టి నేను చాటుగా ఏడుస్తాను.

కన్నీరుమున్నీరుగా విలపిస్తాను,+

ఎందుకంటే యెహోవా మంద+ చెరగా తీసుకెళ్లబడింది.

18 రాజుతో, రాజమాతతో+ ఇలా చెప్పు: ‘అవమానంతో కింద కూర్చోండి,

ఎందుకంటే, అందమైన మీ కిరీటం మీ తలమీద నుండి పడిపోతుంది.’

19 దక్షిణ దేశ నగరాలు మూయబడ్డాయి,* వాటిని తెరిచేవాళ్లు ఎవ్వరూ లేరు.

యూదా ప్రజలంతా చెరగా తీసుకెళ్లబడ్డారు.+

20 నీ* తల ఎత్తి, ఉత్తరం నుండి వస్తున్నవాళ్లను చూడు.+

నీకు ఇచ్చిన మంద, నీ అందమైన గొర్రెలు ఎక్కడ?+

21 నువ్వు మొదటి నుండి శిక్షణ ఇచ్చిన నీ సన్నిహిత స్నేహితుల ద్వారానే

నీకు శిక్ష వస్తే+ నువ్వు ఏమంటావు?

ప్రసవించే స్త్రీ లాంటి వేదన నీకు కలగదా?+

22 ‘ఇవన్నీ ఎందుకు నా మీదికి వచ్చాయి?’ అని నీకు అనిపిస్తే,+

నీ గొప్ప దోషం వల్లే నీ బట్టలు తీసేయబడ్డాయని,+

నీ మడిమెలకు ఇంత నొప్పి కలిగిందని తెలుసుకో.

23 కూషీయుడు* తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోగలదా?+

అది సాధ్యమైతే, చెడు చేయడానికి అలవాటుపడిన నువ్వు

మంచి చేయడం కూడా సాధ్యమౌతుంది.

24 కాబట్టి ఎడారి గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు నేను మిమ్మల్ని చెదరగొడతాను.+

25 నేను నీ కోసం కొలిచి ఉంచిన భాగం, నీ వంతు ఇదే” అని యెహోవా అంటున్నాడు.

“ఎందుకంటే నువ్వు నన్ను మర్చిపోయావు,+ అబద్ధాల మీద నమ్మకం పెట్టుకుంటున్నావు.+

26 కాబట్టి, నేను నీ వస్త్రాన్ని ముఖం వరకు పైకెత్తుతాను,

ప్రజలు నీ మానం చూస్తారు,+

27 నీ వ్యభిచార క్రియల్ని,+ కామంతో నువ్వు చేసే సకిలింపుల్ని,

నీచమైన* నీ వేశ్యా ప్రవర్తనను చూస్తారు.

కొండల మీద, పొలంలో

నీ అసహ్యమైన ప్రవర్తనను నేను చూశాను.+

యెరూషలేమా, నీకు శ్రమ!

ఇంకా ఎంతకాలం నువ్వు అపవిత్రంగా ఉంటావు?”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి