కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 19
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 సమూయేలు విషయసూచిక

      • దావీదు అబ్షాలోము గురించి ఏడ్వడం (1-4)

      • యోవాబు దావీదును గద్దించడం (5-8ఎ)

      • దావీదు యెరూషలేముకు తిరిగిరావడం (8బి-15)

      • షిమీ క్షమాపణ అడగడం (16-23)

      • మెఫీబోషెతు నిర్దోషి అని రుజువైంది (24-30)

      • బర్జిల్లయిని గౌరవించడం (31-40)

      • గోత్రాల మధ్య తగాదా (41-43)

2 సమూయేలు 19:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:5, 14

2 సమూయేలు 19:2

అధస్సూచీలు

  • *

    లేదా “రక్షణ.”

2 సమూయేలు 19:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 17:24

2 సమూయేలు 19:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:33

2 సమూయేలు 19:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 3:2-5; 5:14-16
  • +2స 13:1
  • +2స 5:13; 15:16

2 సమూయేలు 19:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:17

2 సమూయేలు 19:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 17:50; 18:7; 19:5; 2స 5:25; 8:5
  • +2స 15:14

2 సమూయేలు 19:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 15:10, 12
  • +2స 18:14

2 సమూయేలు 19:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 8:17; 15:25; 1రా 1:8
  • +1స 22:20; 30:7; 2స 15:24; 1ది 15:11, 12
  • +2స 2:4

2 సమూయేలు 19:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “నా ఎముక, మాంసం.”

2 సమూయేలు 19:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “నా ఎముకవి, మాంసానివి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 17:25; 1ది 2:16, 17
  • +2స 8:16; 18:5, 14

2 సమూయేలు 19:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 5:9; 1స 11:14

2 సమూయేలు 19:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 16:5; 1రా 2:8, 9

2 సమూయేలు 19:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 9:2, 10; 16:1

2 సమూయేలు 19:18

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్లు” అయ్యుంటుంది.

2 సమూయేలు 19:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 16:5

2 సమూయేలు 19:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 2:18
  • +2స 23:18
  • +నిర్గ 22:28; 2స 16:7; 1రా 21:13

2 సమూయేలు 19:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 3:39; 16:10

2 సమూయేలు 19:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 2:8, 9

2 సమూయేలు 19:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 9:3, 6; 16:3, 4

2 సమూయేలు 19:25

అధస్సూచీలు

  • *

    లేదా “యెరూషలేము నుండి” అయ్యుంటుంది.

2 సమూయేలు 19:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 9:9
  • +2స 4:4

2 సమూయేలు 19:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:16; 2స 16:3

2 సమూయేలు 19:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 9:7-10

2 సమూయేలు 19:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 16:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2018, పేజీ 6

    కావలికోట,

    5/15/2005, పేజీ 18

2 సమూయేలు 19:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 17:27-29; 1రా 2:7

2 సమూయేలు 19:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 3:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2018, పేజీ 9

2 సమూయేలు 19:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 11:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 14

2 సమూయేలు 19:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 14

2 సమూయేలు 19:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 90:10
  • +ప్రస 2:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2018, పేజీలు 9-10

    కావలికోట (అధ్యయన),

    1/2017, పేజీ 23

    కావలికోట,

    7/15/2007, పేజీలు 14-15

2 సమూయేలు 19:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 50:13
  • +1రా 2:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీలు 14-15

2 సమూయేలు 19:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:55; 1స 20:41; అపొ 20:37

2 సమూయేలు 19:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 11:14
  • +2స 2:4

2 సమూయేలు 19:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 8:1; 12:1; 2స 19:15

2 సమూయేలు 19:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 78:68, 70

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 సమూ. 19:12స 18:5, 14
2 సమూ. 19:32స 17:24
2 సమూ. 19:42స 18:33
2 సమూ. 19:52స 3:2-5; 5:14-16
2 సమూ. 19:52స 13:1
2 సమూ. 19:52స 5:13; 15:16
2 సమూ. 19:82స 18:17
2 సమూ. 19:91స 17:50; 18:7; 19:5; 2స 5:25; 8:5
2 సమూ. 19:92స 15:14
2 సమూ. 19:102స 15:10, 12
2 సమూ. 19:102స 18:14
2 సమూ. 19:112స 8:17; 15:25; 1రా 1:8
2 సమూ. 19:111స 22:20; 30:7; 2స 15:24; 1ది 15:11, 12
2 సమూ. 19:112స 2:4
2 సమూ. 19:132స 17:25; 1ది 2:16, 17
2 సమూ. 19:132స 8:16; 18:5, 14
2 సమూ. 19:15యెహో 5:9; 1స 11:14
2 సమూ. 19:162స 16:5; 1రా 2:8, 9
2 సమూ. 19:172స 9:2, 10; 16:1
2 సమూ. 19:192స 16:5
2 సమూ. 19:212స 2:18
2 సమూ. 19:212స 23:18
2 సమూ. 19:21నిర్గ 22:28; 2స 16:7; 1రా 21:13
2 సమూ. 19:222స 3:39; 16:10
2 సమూ. 19:231రా 2:8, 9
2 సమూ. 19:242స 9:3, 6; 16:3, 4
2 సమూ. 19:262స 9:9
2 సమూ. 19:262స 4:4
2 సమూ. 19:27లేవీ 19:16; 2స 16:3
2 సమూ. 19:282స 9:7-10
2 సమూ. 19:292స 16:4
2 సమూ. 19:312స 17:27-29; 1రా 2:7
2 సమూ. 19:32సామె 3:27
2 సమూ. 19:33సామె 11:25
2 సమూ. 19:35కీర్త 90:10
2 సమూ. 19:35ప్రస 2:8
2 సమూ. 19:37ఆది 50:13
2 సమూ. 19:371రా 2:7
2 సమూ. 19:39ఆది 31:55; 1స 20:41; అపొ 20:37
2 సమూ. 19:401స 11:14
2 సమూ. 19:402స 2:4
2 సమూ. 19:41న్యా 8:1; 12:1; 2స 19:15
2 సమూ. 19:42కీర్త 78:68, 70
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 సమూయేలు 19:1-43

సమూయేలు రెండో గ్రంథం

19 “రాజు అబ్షాలోము గురించి ఏడుస్తూ, దుఃఖిస్తున్నాడు”+ అని యోవాబుకు వార్త అందింది. 2 రాజు తన కుమారుని గురించి దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ విన్నారు కాబట్టి ఆ రోజు వాళ్లు పొందిన విజయం* సంతాపంగా మారింది. 3 యుద్ధం నుండి పారిపోయినందుకు సిగ్గుపడుతున్న ప్రజల్లా ఆ రోజు వాళ్లు నిశ్శబ్దంగా నగరానికి+ తిరిగొచ్చారు. 4 రాజు తన ముఖాన్ని కప్పుకొని, “నా కుమారుడా అబ్షాలోమా! నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు.+

5 అప్పుడు యోవాబు, ఇంట్లో ఉన్న రాజు దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “నేడు నీ ప్రాణాన్ని, నీ కుమారుల,+ కూతుళ్ల,+ భార్యల, ఉపపత్నుల+ ప్రాణాల్ని రక్షించిన నీ సేవకులందర్నీ ఈ రోజు నువ్వు అవమానించావు. 6 నిన్ను ద్వేషించేవాళ్లను నువ్వు ప్రేమిస్తున్నావు, నిన్ను ప్రేమించేవాళ్లను ద్వేషిస్తున్నావు; నీకు నీ అధిపతులన్నా, సేవకులన్నా లెక్కేలేదని ఈ రోజు స్పష్టంగా చూపించావు; ఎందుకంటే, ఈ రోజు అబ్షాలోము బ్రతికుండి, మేమందరం చనిపోయుంటే నీకు బాగుండేదని నాకు ఖచ్చితంగా తెలుసు. 7 ఇప్పుడు నువ్వు లేచి, వెళ్లి నీ సేవకులకు ధైర్యం చెప్పు. ఎందుకంటే యెహోవా పేరున ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు గనుక బయటికి వెళ్లకపోతే ఈ రోజు రాత్రి ఒక్క మనిషి కూడా నీతో ఉండడు. చిన్నప్పటి నుండి ఇప్పటివరకు నీకు వచ్చిన కష్టాలతో పోలిస్తే అది చాలా ఘోరంగా ఉంటుంది.” 8 దాంతో రాజు లేచి నగర ద్వారం దగ్గర కూర్చున్నాడు. “రాజు ఇప్పుడు ద్వారం దగ్గర కూర్చున్నాడు” అనే వార్త ప్రజలందరికీ తెలియజేయబడింది. అప్పుడు ప్రజలందరూ రాజు ముందుకు వచ్చారు.

కానీ ఇశ్రాయేలు ప్రజలు వాళ్లవాళ్ల ఇళ్లకు పారిపోయారు.+ 9 ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో ఉన్న ప్రజలందరూ ఇలా వాదించుకున్నారు: “రాజు మన శత్రువుల నుండి మనల్ని రక్షించాడు.+ ఫిలిష్తీయుల నుండి మనల్ని కాపాడాడు; కానీ అతను అబ్షాలోము కారణంగా దేశాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది.+ 10 మనం రాజుగా అభిషేకించిన అబ్షాలోము+ యుద్ధంలో చనిపోయాడు.+ కాబట్టి, రాజును వెనక్కి తీసుకురావడానికి మీరెందుకు ఇప్పుడు ఏమీ చేయట్లేదు?”

11 దావీదు రాజు యాజకులైన సాదోకుకు,+ అబ్యాతారుకు+ ఈ సందేశం పంపించాడు: “యూదా పెద్దలతో+ ఇలా చెప్పండి: ‘⁠ఇశ్రాయేలీయులందరి మాట ఇంట్లో ఉన్న రాజుకు చేరింది, అలాంటిది రాజును వెనక్కి తన రాజభవనానికి తీసుకురావడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? 12 మీరు నా సహోదరులు; మీరు నా రక్తసంబంధులు.* మరి రాజును వెనక్కి తీసుకురావడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?’ 13 అంతేకాదు మీరు అమాశాతో+ ఇలా చెప్పండి: ‘నువ్వు నా రక్తసంబంధివి* కావా? ఇప్పటినుండి యోవాబుకు+ బదులు నువ్వు నా సైన్యాధిపతిగా ఉంటావు, అలా కాకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించాలి.’ ”

14 అలా దావీదు యూదా వాళ్లందర్నీ ఒప్పించగలిగాడు, దాంతో వాళ్లు రాజుకు, “నువ్వూ, నీ సేవకులందరూ వెనక్కి రండి” అని కబురు పంపించారు.

15 రాజు వెనక్కి బయల్దేరి యొర్దానుకు చేరుకున్నాడు, యూదావాళ్లు రాజును కలుసుకొని, అతన్ని యొర్దాను నది దాటించడానికి గిల్గాలుకు+ వచ్చారు. 16 బహూరీము నుండి గెరా కుమారుడూ బెన్యామీనీయుడూ అయిన షిమీ+ కూడా దావీదు రాజును కలవడానికి యూదావాళ్లతో పాటు త్వరత్వరగా వచ్చాడు, 17 అతనితోపాటు 1,000 మంది బెన్యామీనీయులు ఉన్నారు. సౌలు కుటుంబానికి చెందిన సీబా+ అనే సేవకుడు కూడా తన 15 మంది కుమారులతో, 20 మంది సేవకులతో వచ్చాడు. అతను త్వరత్వరగా రాజు కన్నా ముందే యొర్దాను నది దగ్గరికి వచ్చాడు. 18 అతను* రాజు కుటుంబాన్ని నది దాటించడానికి, రాజు ఇష్టప్రకారం చేయడానికి రేవు దాటాడు. అయితే, దావీదు యొర్దాను దాటబోతుండగా గెరా కుమారుడైన షిమీ దావీదు రాజు ముందు సాష్టాంగపడ్డాడు. 19 అతను రాజుతో ఇలా అన్నాడు: “నా ప్రభూ, నన్ను అపరాధిగా ఎంచొద్దు, నా ప్రభువైన రాజు యెరూషలేము నుండి వెళ్లిపోతున్న రోజు నీ సేవకుడు చేసిన తప్పును+ గుర్తుపెట్టుకోవద్దు. రాజు దాన్ని మనసులో ఉంచుకోవద్దు, 20 నేను పాపం చేశానని నీ సేవకుడినైన నాకు బాగా తెలుసు; అందుకే ఈ రోజు నా ప్రభువైన రాజును కలవడానికి యోసేపు కుటుంబమంతటిలో నేనే ముందుగా వచ్చాను.”

21 వెంటనే సెరూయా కుమారుడైన+ అబీషై,+ “యెహోవా అభిషేకించిన వ్యక్తిని శపించినందుకు షిమీని చంపొద్దా?”+ అన్నాడు. 22 కానీ దావీదు, “సెరూయా కుమారులారా, ఈ విషయంతో మీకేం సంబంధం?+ ఈ రోజు మీరు నాకు వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నేడు ఇశ్రాయేలులో ఎవరైనా చంపబడవచ్చా? నేను ఈ రోజు మళ్లీ ఇశ్రాయేలు మీద రాజును కాదా?” అని అన్నాడు. 23 అప్పుడు రాజు షిమీతో, “నిన్ను చంపను” అని ఒట్టేశాడు.+

24 సౌలు మనవడైన మెఫీబోషెతు+ కూడా రాజును కలవడానికి వచ్చాడు. రాజు వెళ్లిన రోజు నుండి అతను క్షేమంగా తిరిగొచ్చేంత వరకు మెఫీబోషెతు తన కాళ్లు కడుక్కోలేదు, తన మీసాల్ని కత్తిరించుకోలేదు, బట్టల్ని ఉతుక్కోలేదు. 25 అతను రాజును కలవడానికి యెరూషలేముకు* వచ్చినప్పుడు రాజు అతన్ని, “మెఫీబోషెతూ, నువ్వు ఎందుకు నాతో రాలేదు?” అని అడిగాడు. 26 దానికి అతను ఇలా అన్నాడు: “నా ప్రభువా, రాజా, నా సేవకుడు+ నన్ను మోసం చేశాడు. నేను కుంటివాణ్ణి+ కాబట్టి, ‘నేను గాడిద ఎక్కి రాజుతోపాటు వెళ్లేలా గాడిదకు జీను వేయి’ అని అన్నాను. 27 కానీ అతను నీ సేవకుని గురించి నా ప్రభువైన రాజు దగ్గర లేనిపోనివి కల్పించి చెప్పాడు.+ అయితే నా ప్రభువైన రాజు సత్యదేవుని దూత లాంటివాడు. కాబట్టి నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి. 28 నా ప్రభువైన రాజు చేత నా తండ్రి ఇంటివాళ్లందరూ చంపబడివుండేవాళ్లు. కానీ నువ్వు నీ సేవకుడినైన నన్ను నీ బల్ల దగ్గర భోజనం చేసేవాళ్లతోపాటు కూర్చోబెట్టావు.+ కాబట్టి రాజుకు ఇంకా మొరపెట్టుకోవడానికి నాకు ఏ హక్కు ఉంది?”

29 అయితే, రాజు అతనితో, “దీని గురించి నువ్వు ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వూ, సీబా కలిసి పొలాన్ని పంచుకోవాలని నేను నిర్ణయించాను” అన్నాడు.+ 30 దానికి మెఫీబోషెతు రాజుతో, “నా ప్రభువైన రాజు తన ఇంటికి క్షేమంగా వచ్చాడు కాబట్టి మొత్తం అతన్నే తీసుకోనివ్వు” అన్నాడు.

31 తర్వాత గిలాదీయుడైన బర్జిల్లయి+ రాజును యొర్దాను నది దగ్గరికి తీసుకెళ్లడానికి రోగెలీము నుండి వచ్చాడు. 32 బర్జిల్లయి చాలా ముసలివాడు, అతనికి 80 ఏళ్లు. అతను ఎంతో ధనవంతుడు కాబట్టి రాజు మహనయీములో ఉన్నప్పుడు అతనికి ఆహారం పంపిస్తూ వచ్చాడు.+ 33 కాబట్టి రాజు బర్జిల్లయితో, “నువ్వు నాతోపాటు నది దాటు, నువ్వు యెరూషలేములో నా బల్ల దగ్గర భోజనం చేస్తావు” అన్నాడు.+ 34 కానీ బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు: “నేను రాజుతోపాటు యెరూషలేముకు వెళ్లడానికి నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతాను? 35 నాకు ఇప్పుడు 80 ఏళ్లు.+ నేను మంచిచెడుల మధ్య తేడాను గుర్తుపట్టగలనా? నీ సేవకుడినైన నాకు తినేవాటి, తాగేవాటి రుచి తెలుస్తుందా? నేను ఇప్పటికీ గాయనీ గాయకుల పాటల్ని వినగలనా?+ మరి నీ సేవకుడు నా ప్రభువైన రాజుకు ఎందుకు భారమవ్వాలి? 36 నీ సేవకుడు రాజును యొర్దాను దగ్గరికి తీసుకురాగలిగాడు, అది చాలు. రాజు నాకు ఈ ప్రతిఫలం ఇవ్వడం దేనికి? 37 దయచేసి నీ సేవకుడినైన నన్ను వెనక్కి వెళ్లనివ్వు. నేను నా నగరంలో నా తల్లిదండ్రుల సమాధికి దగ్గర్లో చనిపోతాను.+ ఇదిగో నీ సేవకుడైన కింహాము ఇక్కడ ఉన్నాడు.+ నా ప్రభువైన రాజుతోపాటు అతన్ని నది దాటనివ్వు. నీకు ఏది మంచిదనిపిస్తే అది అతనికి చేయి.”

38 అప్పుడు రాజు ఇలా అన్నాడు: “కింహాము నాతోపాటు నది దాటుతాడు. నీకు ఏది మంచిదనిపిస్తే అది అతనికి చేస్తాను; నువ్వు నన్ను ఏమి అడిగినా అది నీకు చేస్తాను.” 39 అప్పుడు ప్రజలందరూ యొర్దాను దాటడం మొదలుపెట్టారు. రాజు నది దాటుతున్నప్పుడు అతను బర్జిల్లయిని ముద్దుపెట్టుకొని+ ఆశీర్వదించాడు; బర్జిల్లయి తన ఇంటికి వెళ్లిపోయాడు. 40 రాజు నది దాటి గిల్గాలుకు+ వెళ్లినప్పుడు, కింహాము అతనితోపాటు వెళ్లాడు. యూదా ప్రజలందరూ, అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో సగంమంది రాజును నది దాటించారు.+

41 తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ రాజు దగ్గరికి వచ్చి, “నిన్నూ, నీ ఇంటివాళ్లనూ, నీతో ఉన్న వాళ్లందర్నీ యొర్దాను మీదుగా తీసుకురావడానికి మా సహోదరులైన యూదావాళ్లు నిన్ను ఎందుకు రహస్యంగా తీసుకెళ్లారు?” అని అడిగారు.+ 42 అప్పుడు యూదావాళ్లందరూ ఇశ్రాయేలు ప్రజలతో, “రాజు మాకు బంధువు.+ దీని గురించి ఎందుకు కోప్పడుతున్నారు? రాజు ఖర్చుతో మేము ఏమైనా తిన్నామా? లేదా మాకు ఏమైనా బహుమానం ఇచ్చారా?” అన్నారు.

43 అయితే, ఇశ్రాయేలు ప్రజలు యూదావాళ్లతో, “రాజ్యంలో మాకు పది భాగాలు ఉన్నాయి కాబట్టి దావీదు విషయంలో మీకన్నా మాకు ఎక్కువ హక్కు ఉంది. అలాంటిది మీరు మమ్మల్ని ఎందుకు చిన్నచూపు చూశారు? మన రాజును వెనక్కి తీసుకురావడంలో ముందుండాల్సింది మేమే కదా?” అని అన్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజల మాట మీద యూదావాళ్ల మాటే నెగ్గింది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి