కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 రాజులు 20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 రాజులు విషయసూచిక

      • సిరియన్లు అహాబు మీద యుద్ధం (1-12)

      • అహాబు సిరియన్లను ఓడించడం (13-34)

      • అహాబుకు వ్యతిరేకంగా ప్రవచనం (35-43)

1 రాజులు 20:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 8:6; 2రా 5:2; యెష 9:12
  • +2రా 8:7
  • +ద్వితీ 28:52; 2రా 6:24; 17:5

1 రాజులు 20:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 16:29

1 రాజులు 20:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:15, 48

1 రాజులు 20:11

అధస్సూచీలు

  • *

    లేదా “యుద్ధం మొదలవ్వక ముందే దాన్ని గెలిచినట్టు గొప్పలు చెప్పుకోకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 16:18; 27:1; ప్రస 7:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2005, పేజీ 31

1 రాజులు 20:12

అధస్సూచీలు

  • *

    లేదా “పర్ణశాలల్లో.”

1 రాజులు 20:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 16:29
  • +నిర్గ 14:18; కీర్త 37:20

1 రాజులు 20:16

అధస్సూచీలు

  • *

    లేదా “పర్ణశాలల్లో.”

1 రాజులు 20:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:8; ద్వితీ 28:7

1 రాజులు 20:21

అధస్సూచీలు

  • *

    లేదా “హతం చేశాడు.”

1 రాజులు 20:22

అధస్సూచీలు

  • *

    అంటే, వచ్చే వసంతకాలంలో.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 20:13
  • +సామె 20:18
  • +2స 11:1

1 రాజులు 20:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 20:1, 16

1 రాజులు 20:25

అధస్సూచీలు

  • *

    అక్ష., “లెక్కపెట్టు.”

1 రాజులు 20:26

అధస్సూచీలు

  • *

    అంటే, వసంతకాలంలో.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 13:17

1 రాజులు 20:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 6:5, 6; 1స 13:5; 2ది 32:7

1 రాజులు 20:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:26, 27; యెహె 20:9; 36:22
  • +నిర్గ 6:7; 7:5; కీర్త 83:18; యెహె 6:14; 39:7

1 రాజులు 20:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 20:26

1 రాజులు 20:31

అధస్సూచీలు

  • *

    లేదా “విశ్వసనీయ ప్రేమ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోనా 3:8, 9

1 రాజులు 20:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2005, పేజీ 31

1 రాజులు 20:35

అధస్సూచీలు

  • *

    “ప్రవక్తల కుమారులు” అనే మాట బహుశా ప్రవక్తలకు ఉపదేశించే పాఠశాలను లేదా ప్రవక్తల సంఘాన్ని సూచిస్తుండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 2:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2022, పేజీ 9

1 రాజులు 20:36

అధస్సూచీలు

  • *

    అక్ష., “స్వరం.”

1 రాజులు 20:39

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 10:24; అపొ 12:19; 16:27

1 రాజులు 20:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 20:35

1 రాజులు 20:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:29; 1స 15:9; యిర్మీ 48:10
  • +1రా 22:31, 35; 2ది 18:33
  • +2రా 6:24; 8:12; 2ది 18:16

1 రాజులు 20:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 16:29

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 రాజు. 20:12స 8:6; 2రా 5:2; యెష 9:12
1 రాజు. 20:12రా 8:7
1 రాజు. 20:1ద్వితీ 28:52; 2రా 6:24; 17:5
1 రాజు. 20:21రా 16:29
1 రాజు. 20:4ద్వితీ 28:15, 48
1 రాజు. 20:11సామె 16:18; 27:1; ప్రస 7:8
1 రాజు. 20:131రా 16:29
1 రాజు. 20:13నిర్గ 14:18; కీర్త 37:20
1 రాజు. 20:20లేవీ 26:8; ద్వితీ 28:7
1 రాజు. 20:221రా 20:13
1 రాజు. 20:22సామె 20:18
1 రాజు. 20:222స 11:1
1 రాజు. 20:241రా 20:1, 16
1 రాజు. 20:262రా 13:17
1 రాజు. 20:27న్యా 6:5, 6; 1స 13:5; 2ది 32:7
1 రాజు. 20:28ద్వితీ 32:26, 27; యెహె 20:9; 36:22
1 రాజు. 20:28నిర్గ 6:7; 7:5; కీర్త 83:18; యెహె 6:14; 39:7
1 రాజు. 20:301రా 20:26
1 రాజు. 20:31యోనా 3:8, 9
1 రాజు. 20:352రా 2:3
1 రాజు. 20:392రా 10:24; అపొ 12:19; 16:27
1 రాజు. 20:411రా 20:35
1 రాజు. 20:42లేవీ 27:29; 1స 15:9; యిర్మీ 48:10
1 రాజు. 20:421రా 22:31, 35; 2ది 18:33
1 రాజు. 20:422రా 6:24; 8:12; 2ది 18:16
1 రాజు. 20:431రా 16:29
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 రాజులు 20:1-43

రాజులు మొదటి గ్రంథం

20 తర్వాత సిరియా+ రాజైన బెన్హదదు+ తన సైన్యమంతటినీ, 32 మంది వేరే రాజుల్ని, వాళ్ల గుర్రాల్ని, రథాల్ని సమకూర్చుకొని సమరయతో యుద్ధం చేయడానికి దాన్ని ముట్టడించాడు.+ 2 అతను నగరంలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబు+ దగ్గరికి సందేశకుల ద్వారా ఈ సందేశం పంపించాడు: “బెన్హదదు చెప్పేదేమిటంటే, 3 ‘నీ వెండిబంగారాలు నావి; నీ భార్యల్లో, కుమారుల్లో శ్రేష్ఠమైనవాళ్లు నా సొంతం.’ ” 4 దానికి ఇశ్రాయేలు రాజు ఇలా చెప్పాడు: “నా ప్రభువైన రాజా, నీ మాట ప్రకారమే నేనూ, నా దగ్గర ఉన్నవన్నీ నీ సొంతం.”+

5 తర్వాత ఆ సందేశకులు మళ్లీ వచ్చి ఇలా చెప్పారు: “బెన్హదదు చెప్పేదేమిటంటే, ‘ “నీ వెండిబంగారాల్ని, నీ భార్యల్ని, నీ కుమారుల్ని నువ్వు నాకు ఇవ్వాలి” అని నేను నీకు సందేశం పంపించాను. 6 అయితే రేపు ఈ సమయానికి నేను నా సేవకుల్ని నీ దగ్గరికి పంపిస్తాను; వాళ్లు నీ ఇంటిని, నీ సేవకుల ఇళ్లను జాగ్రత్తగా పరిశీలించి విలువైన వస్తువులన్నిటినీ స్వాధీనం చేసుకొని తీసుకెళ్లిపోతారు.’ ”

7 అప్పుడు ఇశ్రాయేలు రాజు, దేశ పెద్దలందర్నీ పిలిపించి వాళ్లతో ఇలా అన్నాడు: “ఈ మనిషి మన మీదికి ఎలా విపత్తు తీసుకురావాలని అనుకుంటున్నాడో చూడండి! అతను నా భార్యల్ని, నా కుమారుల్ని, నా వెండిబంగారాల్ని అడిగాడు, నేను దానికి అడ్డు చెప్పలేదు.” 8 దానికి పెద్దలందరూ, ప్రజలందరూ, “అతను చెప్పినట్టు చేయొద్దు, దానికి ఒప్పుకోవద్దు” అన్నారు. 9 కాబట్టి అతను బెన్హదదు సందేశకులతో ఇలా అన్నాడు: “నా ప్రభువైన రాజుతో ఇలా చెప్పండి, ‘నువ్వు నీ సేవకుణ్ణి మొదట అడిగినదంతా చేస్తాను, కానీ ఇది మాత్రం చేయలేను.’ ” దాంతో సందేశకులు వెళ్లి ఆ మాటను బెన్హదదుకు చెప్పారు.

10 అప్పుడు బెన్హదదు అతనికి ఈ సందేశాన్ని పంపించాడు: “నాతోపాటు వచ్చినవాళ్లలో ప్రతీ ఒక్కరికి పిడికెడు మట్టి ఇవ్వడానికి సరిపడా మట్టి సమరయలో మిగిలితే, దేవుళ్లు నన్ను తీవ్రంగా శిక్షించాలి!” 11 దానికి ఇశ్రాయేలు రాజు, “అతనితో ఇలా చెప్పండి: ‘కవచం వేసుకున్న వ్యక్తి, అది తీసేసిన వ్యక్తిలా గొప్పలు చెప్పుకోకూడదు’ ”*+ అన్నాడు. 12 బెన్హదదు, అతనితో ఉన్న రాజులు తమ డేరాల్లో* ద్రాక్షారసం తాగుతున్నప్పుడు అతనికి ఆ వార్త తెలిసింది; వెంటనే అతను, “దాడి చేయడానికి సిద్ధమవ్వండి!” అని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. వాళ్లు నగరం మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు.

13 అయితే ఒక ప్రవక్త ఇశ్రాయేలు రాజైన అహాబు+ దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు: “యెహోవా ఏం చెప్తున్నాడంటే, ‘ఈ పెద్ద సమూహమంతటినీ చూశావా? దాన్ని ఈ రోజు నీ చేతికి అప్పగిస్తున్నాను. అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.’ ”+ 14 దానికి అహాబు, “ఇది ఎవరి ద్వారా జరుగుతుంది?” అని అడిగాడు. అందుకు ఆ ప్రవక్త, “ ‘ప్రాంతాల అధిపతుల సహాయకుల ద్వారా’ అని యెహోవా చెప్తున్నాడు” అన్నాడు. తర్వాత అహాబు, “యుద్ధం ముందు ఎవరు మొదలుపెట్టాలి?” అని అడిగాడు, దానికి అతను, “నువ్వే!” అని చెప్పాడు.

15 అప్పుడు అహాబు ప్రాంతాల అధిపతుల సహాయకుల్ని లెక్కపెట్టాడు, వాళ్లు 232 మంది ఉన్నారు; తర్వాత అతను సైనికులందర్నీ లెక్కపెట్టాడు, వాళ్లు 7,000 మంది ఉన్నారు. 16 వాళ్లు మధ్యాహ్నం నగరం నుండి బయటికి వచ్చారు; ఆ సమయంలో బెన్హదదు తనకు సహాయంగా వచ్చిన 32 మంది రాజులతో పాటు డేరాల్లో* బాగా తాగి ఉన్నాడు. 17 ప్రాంతాల అధిపతుల సహాయకులు మొదట బయటికి వచ్చినప్పుడు, బెన్హదదు వెంటనే విషయం కనుక్కోవడానికి మనుషుల్ని పంపించాడు. వాళ్లు బెన్హదదు దగ్గరికి తిరిగొచ్చి, “సమరయ మనుషులు నగరం నుండి బయటికి వచ్చారు” అని చెప్పారు. 18 అప్పుడు అతను, “వాళ్లు సంధి చేసుకోవడానికి వస్తే, వాళ్లను ప్రాణాలతో పట్టుకోండి; ఒకవేళ వాళ్లు యుద్ధం చేయడానికే వచ్చినా వాళ్లను ప్రాణాలతో పట్టుకోండి” అన్నాడు. 19 అయితే ప్రాంతాల అధిపతుల సహాయకులు, వాళ్ల వెనక వస్తున్న సైన్యాలు నగరం నుండి బయటికి వచ్చి, 20 తమ శత్రువుల్ని చంపారు. దాంతో సిరియన్లు పారిపోయారు,+ ఇశ్రాయేలు ప్రజలు వాళ్లను తరిమారు; సిరియా రాజైన బెన్హదదు గుర్రం ఎక్కి, కొంతమంది గుర్రపురౌతులతో పాటు తప్పించుకున్నాడు. 21 అయితే ఇశ్రాయేలు రాజు బయల్దేరి గుర్రాల్ని, రథాల్ని నాశనం చేస్తూ వచ్చాడు, అతను సిరియన్లను ఘోరంగా ఓడించాడు.*

22 తర్వాత ఆ ప్రవక్త+ ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు: “వెళ్లి, నిన్ను నువ్వు బలపర్చుకో, నువ్వు ఏం చేయాలో ఆలోచించు;+ ఎందుకంటే వచ్చే సంవత్సరం ప్రారంభంలో* సిరియా రాజు మళ్లీ నీ మీదికి వస్తాడు.”+

23 సిరియా రాజు సేవకులు అతనితో ఇలా అన్నారు: “వాళ్ల దేవుడు పర్వతాల దేవుడు, అందుకే వాళ్లు మనమీద గెలిచారు. ఒకవేళ మనం మైదానంలో వాళ్లతో యుద్ధం చేస్తే, వాళ్ల మీద గెలుస్తాం. 24 నువ్వు ఇంకో పని కూడా చేయాలి, రాజులందర్నీ+ వాళ్లవాళ్ల స్థానాల్లో నుండి తీసేసి, వాళ్ల స్థానంలో అధిపతుల్ని నియమించు. 25 నువ్వు కోల్పోయినంత సైన్యాన్ని మళ్లీ పోగుచేయి,* గుర్రం స్థానంలో గుర్రాన్ని, రథం స్థానంలో రథాన్ని సిద్ధం చేయి. మనం వాళ్లతో మైదానంలో యుద్ధం చేద్దాం, అప్పుడు మనం తప్పకుండా వాళ్లను ఓడిస్తాం.” సిరియా రాజు వాళ్ల సలహా విని అలాగే చేశాడు.

26 సంవత్సరం ప్రారంభంలో* బెన్హదదు సిరియన్లను సమకూర్చి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి ఆఫెకుకు+ వచ్చాడు. 27 ఇశ్రాయేలు ప్రజలు కూడా సమకూడి, అవసరమైనవి సిద్ధం చేసుకుని సిరియన్లను ఎదుర్కోవడానికి బయల్దేరారు. వాళ్లు సిరియన్లకు ఎదురుగా మకాం వేసినప్పుడు, వాళ్లు రెండు చిన్న మేకల మందల్లా కనిపించారు, కానీ సిరియన్లు మాత్రం ఆ ప్రాంతమంతా నిండివున్నారు.+ 28 అప్పుడు సత్యదేవుని సేవకుడు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “యెహోవా ఏమి చెప్తున్నాడంటే, ‘యెహోవా పర్వతాల దేవుడే కానీ మైదానాల దేవుడు కాదని సిరియన్లు అన్నారు కాబట్టి నేను ఈ పెద్ద సమూహాన్నంతా నీ చేతికి అప్పగిస్తాను,+ అప్పుడు నేను యెహోవానని నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు.’ ”+

29 వాళ్లు ఎదురెదురుగా మకాం వేసుకుని ఏడురోజులు ఉన్నారు, ఏడో రోజు యుద్ధం మొదలైంది. ఇశ్రాయేలు ప్రజలు ఒక్క రోజే 1,00,000 మంది సిరియా సైనికుల్ని చంపారు. 30 మిగతావాళ్లు ఆఫెకు+ నగరంలోకి పారిపోయారు. అయితే ప్రాకారం కూలి మిగిలినవాళ్లలో 27,000 మంది మీద పడింది. బెన్హదదు కూడా పారిపోయి నగరంలోకి వెళ్లి ఒక లోపలి గదిలో దాక్కున్నాడు.

31 అప్పుడు బెన్హదదు సేవకులు అతనితో ఇలా అన్నారు: “ఇదిగో, ఇశ్రాయేలు రాజులు కరుణ* గలవాళ్లు అని మేము విన్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని నడుముకు గోనెపట్ట కట్టుకుని, తలకు తాళ్లు చుట్టుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్లనివ్వు. బహుశా అతను నిన్ను బ్రతకనిస్తాడేమో.”+ 32 దాంతో వాళ్లు నడుముకు గోనెపట్ట కట్టుకుని, తలకు తాళ్లు చుట్టుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి, “దయచేసి తనను బ్రతకనివ్వమని నీ సేవకుడైన బెన్హదదు వేడుకుంటున్నాడు” అని చెప్పారు. అందుకు రాజు, “అతను ఇంకా బ్రతికేవున్నాడా? అతను నా సహోదరుడు” అన్నాడు. 33 ఆ మనుషులు దాన్ని ఒక మంచి శకునంగా భావించి, రాజు తన మనసులో ఉన్నదే చెప్పాడని గ్రహించి వెంటనే, “అవును, బెన్హదదు నీ సహోదరుడు” అని అన్నారు. రాజు, “వెళ్లి అతన్ని తీసుకురండి” అన్నాడు. అప్పుడు బెన్హదదు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చాడు. రాజు అతన్ని రథం మీదికి ఎక్కించుకున్నాడు.

34 బెన్హదదు ఇశ్రాయేలు రాజుతో ఇలా అన్నాడు: “నా తండ్రి నీ తండ్రి దగ్గర నుండి తీసుకున్న నగరాల్ని నీకు తిరిగిచ్చేస్తాను, నా తండ్రి సమరయలో చేసినట్టుగా నువ్వు దమస్కులో వ్యాపార కేంద్రాల్ని స్థాపించుకోవచ్చు.”

దానికి అహాబు, “ఈ ఒప్పందం మీద నేను నిన్ను వెళ్లనిస్తాను” అని అన్నాడు.

అలా అతను బెన్హదదుతో ఒక ఒప్పందం చేసుకుని అతన్ని వెళ్లనిచ్చాడు.

35 యెహోవా ఆజ్ఞ ప్రకారం, ప్రవక్తల కుమారుల్లో*+ ఒకతను తన తోటివ్యక్తితో, “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. కానీ అతను కొట్టడానికి ఒప్పుకోలేదు. 36 కాబట్టి అతను తన తోటివ్యక్తితో, “నువ్వు యెహోవా మాట* వినలేదు కాబట్టి, నువ్వు నా దగ్గర నుండి వెళ్లిన వెంటనే ఒక సింహం నిన్ను చంపుతుంది” అని చెప్పాడు. ఆ వ్యక్తి అతని దగ్గర నుండి వెళ్లాక, ఒక సింహం వచ్చి అతన్ని చంపింది.

37 అతను మరో వ్యక్తిని చూసి, “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. ఆ వ్యక్తి అతన్ని కొట్టి గాయపర్చాడు.

38 తర్వాత ఆ ప్రవక్త వెళ్లి, తనను గుర్తుపట్టకుండా కళ్లకు ఒక పట్టీ కట్టుకుని రాజు కోసం దారి పక్కన వేచి ఉన్నాడు. 39 రాజు దారిలో వెళ్తుండగా అతను రాజుతో గట్టిగా ఇలా చెప్పాడు: “నీ సేవకుడినైన నేను యుద్ధం తీవ్రంగా జరుగుతున్న చోటికి వెళ్లాను, అక్కడ ఒకతను యుద్ధం నుండి బయటికి వస్తూ ఒక ఖైదీని నా దగ్గరికి తీసుకొచ్చి, ‘ఇతన్ని కాపలా కాయి. ఒకవేళ ఇతను తప్పించుకుంటే ఇతని ప్రాణానికి బదులు నీ ప్రాణం ఇవ్వాల్సి ఉంటుంది,+ లేదా ఒక తలాంతు* వెండి ఇవ్వాలి’ అని చెప్పాడు. 40 అయితే, నీ సేవకుడినైన నేను ఏదో పని మీద అటూఇటూ తిరుగుతుంటే, ఉన్నట్టుండి అతను కనబడకుండా పోయాడు.” అప్పుడు ఇశ్రాయేలు రాజు అతనితో ఇలా అన్నాడు: “నీకు ఆ శిక్షే పడాలి, నీకు నువ్వే తీర్పు తీర్చుకున్నావు.” 41 వెంటనే అతను కళ్లకు ఉన్న పట్టీ తీసేశాడు; అప్పుడు అతను ప్రవక్తల్లో ఒకడని+ ఇశ్రాయేలు రాజు గుర్తుపట్టాడు. 42 అతను ఇలా అన్నాడు: “యెహోవా ఏం చెప్తున్నాడంటే, ‘నాశనం చేయబడాలని నేను చెప్పిన వ్యక్తిని నువ్వు నీ చేతిలో నుండి తప్పించుకోనిచ్చావు;+ అందుకే అతనికి బదులు నువ్వు చనిపోతావు,+ అతని ప్రజలకు బదులు నీ ప్రజలు చనిపోతారు.’ ”+ 43 దాంతో ఇశ్రాయేలు రాజు ముఖం చిన్నబుచ్చుకొని, నిరాశగా సమరయలోని+ తన ఇంటికి వెళ్లాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి