కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 దినవృత్తాంతాలు 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 దినవృత్తాంతాలు విషయసూచిక

      • ఆసా తెచ్చిన మార్పులు (1-19)

2 దినవృత్తాంతాలు 15:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 4:8
  • +యెష 55:6
  • +1ది 28:9; హెబ్రీ 10:38

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2012, పేజీలు 9-10

2 దినవృత్తాంతాలు 15:3

అధస్సూచీలు

  • *

    అక్ష., “చాలా రోజులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 33:8, 10; 2ది 17:8, 9; మలా 2:7

2 దినవృత్తాంతాలు 15:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 106:43, 44; యెష 55:7

2 దినవృత్తాంతాలు 15:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “బయటికి వెళ్లేవాళ్లకు గానీ లోపలికి వచ్చేవాళ్లకు గానీ ఏమాత్రం శాంతి లేదు.”

2 దినవృత్తాంతాలు 15:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:15, 48

2 దినవృత్తాంతాలు 15:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “మీ చేతుల్ని దించకండి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 1:9; 1ది 28:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2012, పేజీ 9

2 దినవృత్తాంతాలు 15:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 23:24
  • +2ది 8:12

2 దినవృత్తాంతాలు 15:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 11:16; 30:25

2 దినవృత్తాంతాలు 15:12

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:29; 2రా 23:3; నెహె 10:28, 29

2 దినవృత్తాంతాలు 15:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:20

2 దినవృత్తాంతాలు 15:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “కొమ్ములు.”

2 దినవృత్తాంతాలు 15:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 15:2
  • +సామె 16:7

2 దినవృత్తాంతాలు 15:16

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 13:6-9
  • +1రా 15:13, 14

2 దినవృత్తాంతాలు 15:17

అధస్సూచీలు

  • *

    అక్ష., “రోజులన్నిట్లో.”

  • *

    లేదా “పూర్తిగా అంకితమై.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 14:22, 23; 22:43; 2రా 14:3, 4; 23:19, 20
  • +1రా 8:61

2 దినవృత్తాంతాలు 15:18

అధస్సూచీలు

  • *

    లేదా “పవిత్రపర్చిన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 7:51; 15:15; 1ది 26:26

2 దినవృత్తాంతాలు 15:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 14:1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 దిన. 15:2యాకో 4:8
2 దిన. 15:2యెష 55:6
2 దిన. 15:21ది 28:9; హెబ్రీ 10:38
2 దిన. 15:3ద్వితీ 33:8, 10; 2ది 17:8, 9; మలా 2:7
2 దిన. 15:4కీర్త 106:43, 44; యెష 55:7
2 దిన. 15:6ద్వితీ 28:15, 48
2 దిన. 15:7యెహో 1:9; 1ది 28:20
2 దిన. 15:82రా 23:24
2 దిన. 15:82ది 8:12
2 దిన. 15:92ది 11:16; 30:25
2 దిన. 15:12ద్వితీ 4:29; 2రా 23:3; నెహె 10:28, 29
2 దిన. 15:13నిర్గ 22:20
2 దిన. 15:152ది 15:2
2 దిన. 15:15సామె 16:7
2 దిన. 15:16ద్వితీ 13:6-9
2 దిన. 15:161రా 15:13, 14
2 దిన. 15:171రా 14:22, 23; 22:43; 2రా 14:3, 4; 23:19, 20
2 దిన. 15:171రా 8:61
2 దిన. 15:181రా 7:51; 15:15; 1ది 26:26
2 దిన. 15:192ది 14:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 దినవృత్తాంతాలు 15:1-19

దినవృత్తాంతాలు రెండో గ్రంథం

15 ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దేవుని పవిత్రశక్తి వచ్చింది. 2 అతను ఆసా దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా, అందరూ నేను చెప్పేది వినండి! మీరు యెహోవాతో ఉన్నంతకాలం ఆయన మీతో ఉంటాడు;+ మీరు ఆయన్ని వెదికితే ఆయన మీకు దొరుకుతాడు,+ కానీ మీరు ఆయన్ని విడిచిపెడితే ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు.+ 3 ఇశ్రాయేలీయులు చాలాకాలంపాటు* సత్యదేవుడు గానీ, బోధించే ఒక యాజకుడు గానీ, ధర్మశాస్త్రం గానీ లేకుండా ఉన్నారు.+ 4 అయితే కష్టాలు వచ్చినప్పుడు వాళ్లు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగొచ్చి ఆయన్ని వెదికారు, ఆయన వాళ్లకు దొరికాడు.+ 5 ఆ కాలంలో ఆయా ప్రాంతాల నివాసుల మధ్య ఏమాత్రం శాంతి లేకపోవడంతో ఎవ్వరూ క్షేమంగా ప్రయాణం చేయలేకపోయేవాళ్లు.* 6 ఒక ప్రాంతం మరో ప్రాంతాన్ని, ఒక నగరం మరో నగరాన్ని నాశనం చేస్తూ ఉండేది. ఎందుకంటే వాళ్లు ఎన్నో రకాల కష్టాలతో గందరగోళంలో ఉండేలా దేవుడు చేశాడు.+ 7 కానీ మీరైతే నిబ్బరంగా ఉండండి, నిరుత్సాహపడకండి.*+ ఎందుకంటే, మీ పనికి ప్రతిఫలం దొరుకుతుంది.”

8 ఆసా అజర్యా మాటల్ని, ఓదేదు ప్రవక్త ప్రవచనాన్ని వినగానే ధైర్యం తెచ్చుకొని యూదా, బెన్యామీను ప్రాంతమంతటి నుండి, ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో అతను స్వాధీనం చేసుకున్న నగరాల్లో నుండి అసహ్యమైన విగ్రహాల్ని తీసేసి,+ యెహోవా మందిర వసారా ఎదుట ఉన్న యెహోవా బలిపీఠాన్ని+ తిరిగి కట్టించాడు. 9 అతను యూదా, బెన్యామీను వాళ్లందర్నీ, అలాగే వాళ్లమధ్య నివసిస్తున్న విదేశీయుల్ని ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను ప్రాంతాల నుండి సమకూర్చాడు.+ అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని వాళ్లు చూసినప్పుడు పెద్ద సంఖ్యలో ఇశ్రాయేలు ప్రాంతాన్ని విడిచిపెట్టి అతని దగ్గరికి వచ్చారు. 10 అలా వాళ్లు ఆసా పరిపాలనలోని 15వ సంవత్సరం, మూడో నెలలో యెరూషలేములో సమకూర్చబడ్డారు. 11 ఆ రోజున వాళ్లు తాము తీసుకొచ్చిన దోపుడుసొమ్ములో నుండి 700 ఎద్దుల్ని, 7,000 గొర్రెల్ని యెహోవాకు బలి అర్పించారు. 12 అంతేకాదు, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* వెదకాలని ఒప్పందం చేసుకున్నారు.+ 13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెదకనివాళ్లు, వాళ్లు చిన్నవాళ్లే గానీ, పెద్దవాళ్లే గానీ, పురుషులే గానీ, స్త్రీలే గానీ చంపబడతారు.+ 14 వాళ్లు పెద్ద స్వరంతో సంతోషంగా కేకలు వేస్తూ, బాకాలు, బూరలు* ఊదుతూ యెహోవాకు ప్రమాణం చేశారు. 15 యూదావాళ్లందరూ నిండు హృదయంతో ప్రమాణం చేశారు కాబట్టి వాళ్లు దాన్నిబట్టి ఉల్లసించారు; వాళ్లు ఆయన్ని ఉత్సాహంగా వెదికారు, ఆయన వాళ్లకు దొరికాడు.+ యెహోవా అన్నివైపుల నుండి వాళ్లకు విశ్రాంతినిస్తూ ఉన్నాడు.+

16 అంతేకాదు, రాజైన ఆసా తన అవ్వ మయకాను రాజమాత స్థానంలో నుండి తీసేశాడు. ఎందుకంటే, ఆమె పూజా కర్రను* పూజించడానికి ఒక అసహ్యమైన విగ్రహాన్ని చేయించుకుంది.+ అతను ఆ అసహ్యమైన విగ్రహాన్ని నరికి, ముక్కలు చేసి, దాన్ని కిద్రోను లోయలో కాల్చేశాడు.+ 17 కానీ ఇశ్రాయేలులో ఉన్నత స్థలాలు మాత్రం తీసేయబడలేదు.+ అయినా ఆసా జీవించిన కాలమంతా* అతని హృదయం దేవుని పట్ల సంపూర్ణంగా* ఉంది.+ 18 తాను, తన తండ్రి ప్రతిష్ఠించిన* వెండిబంగారాల్ని, వేర్వేరు వస్తువుల్ని ఆసా సత్యదేవుని మందిరంలోకి తీసుకొచ్చాడు.+ 19 ఆసా పరిపాలనలోని 35వ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి