కీర్తనలు
ל [లామెద్]
10 యెహోవా, ఎందుకు దూరంగా నిలబడివున్నావు?
కష్ట కాలాల్లో ఎందుకు దాక్కొని ఉన్నావు?+
2 దుష్టుడు గర్వంతో నిస్సహాయుణ్ణి తరుముతున్నాడు,+
కానీ అతను పన్నిన పన్నాగాల్లో అతనే చిక్కుకుపోతాడు.+
3 దుష్టుడు తన స్వార్థ కోరికల గురించి గొప్పగా చెప్పుకుంటాడు,+
అతను అత్యాశపరుణ్ణి దీవిస్తాడు;*
נ [నూన్]
అతను యెహోవాను తిరస్కరిస్తాడు.
4 దుష్టుడు గర్వం వల్ల దేవుని కోసం వెదకడు;
అతను “దేవుడు లేడు” అని ఎప్పుడూ అనుకుంటాడు.+
అతను తన శత్రువులందర్నీ హేళన చేస్తాడు.
פ [పే]
8 అతను పల్లెల దగ్గర మాటువేసి ఉంటాడు;
తాను దాక్కున్న స్థలం నుండి నిర్దోషిని చంపుతాడు.+
ע [అయిన్]
అతని కళ్లు అమాయకుని కోసం వెదుకుతున్నాయి.+
9 గుహలోని* సింహంలా అతను తాను దాక్కున్న స్థలంలో వేచివుంటాడు,+
నిస్సహాయుణ్ణి పట్టుకోవడానికి పొంచివుంటాడు.
అతను తన వలలో చిక్కుకున్నప్పుడు అతన్ని పట్టుకుంటాడు.+
10 ఆ అమాయకుడు నలిగిపోయి, కూలతాడు;
నిస్సహాయులు ఆ దుష్టుని చేతులకు* చిక్కుతారు.
11 అతను తన హృదయంలో, “దేవుడు మర్చిపోయాడు.
ఆయన తన ముఖాన్ని తిప్పేసుకున్నాడు.
ఆయన ఎప్పుడూ గమనించడు” అని అనుకుంటాడు.+
ק [ఖొఫ్]
12 యెహోవా, లే.+ దేవా, నీ చెయ్యి ఎత్తు.+
నిస్సహాయుల్ని మర్చిపోకు.+
13 దుష్టుడు ఎందుకు దేవుణ్ణి తిరస్కరించాడు?
అతను, “దేవుడు నన్ను లెక్క అడగడు” అని తన హృదయంలో అనుకుంటున్నాడు.
ר [రేష్]
14 కానీ నువ్వు కష్టాన్ని, బాధను ఖచ్చితంగా చూస్తావు.
నువ్వు గమనించి, విషయాల్ని నీ చేతుల్లోకి తీసుకుంటావు.+
నిస్సహాయుడు నీ వైపుకు తిరుగుతాడు;+
15 దుష్టుని చెయ్యి విరగ్గొట్టు,+
అతని దుష్టత్వం నీకు కనిపించకుండా పోయేవరకు
అతని దుష్టత్వాన్ని బట్టి అతన్ని శిక్షించు.
16 యెహోవా యుగయుగాలూ రాజు.+
దేశాలు భూమ్మీద లేకుండా పోయాయి.+
ת [తౌ]
17 అయితే యెహోవా, నువ్వు సాత్వికుల ప్రార్థన వింటావు.+