కీర్తనలు
దావీదు ప్రార్థన.
2 నేను విశ్వసనీయంగా ఉన్నాను, నా ప్రాణం కాపాడు,
నిన్ను నమ్ముకున్న నీ సేవకుణ్ణి రక్షించు,
నువ్వే నా దేవుడివి.+
3 యెహోవా, నా మీద దయ చూపించు,
రోజంతా నీకే నేను మొరపెట్టుకుంటున్నాను.
4 నీ సేవకుణ్ణి సంతోషపెట్టు,
ఎందుకంటే యెహోవా, నీ వైపే నేను తిరుగుతున్నాను.
5 యెహోవా, నువ్వు మంచివాడివి,+ క్షమించడానికి సిద్ధంగా ఉంటావు;+
నీకు మొరపెట్టే వాళ్లందరి మీద అపారమైన విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు.
6 యెహోవా, నా ప్రార్థన విను;
సహాయం కోసం నేను చేస్తున్న విన్నపాలు ఆలకించు.
నీ పేరును మహిమపరుస్తాయి.+
11 యెహోవా, నీ మార్గాన్ని నాకు బోధించు.+
నేను నీ సత్యంలో నడుస్తాను.+
నీ పేరుకు భయపడేలా నాకు ఏక హృదయం* దయచేయి.+
12 యెహోవా, నా దేవా, నా నిండు హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాను,+
నీ పేరును నిరంతరం మహిమపరుస్తాను.
13 ఎందుకంటే, నా మీద నీకున్న విశ్వసనీయ ప్రేమ గొప్పది,
16 నా వైపు తిరిగి, నా మీద దయ చూపించు.+
నీ సేవకునికి నీ బలాన్ని ఇవ్వు,+
నీ దాసురాలి కుమారుణ్ణి కాపాడు.
యెహోవా, నాకు సహాయం చేసేది, నన్ను ఓదార్చేది నువ్వే.