కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; “దూరంలో మౌనంగా ఉన్న పావురం” అనే రాగంలో పాడాలి. దావీదు కీర్తన. మిక్తాము.* ఫిలిష్తీయులు గాతులో దావీదును పట్టుకున్నప్పటిది.+
56 దేవా, నా మీద దయ చూపించు, మనుషులు నా మీద దాడిచేస్తున్నారు.
వాళ్లు రోజంతా నాతో పోరాడుతూ, నన్ను అణచివేస్తున్నారు.
2 రోజంతా నా శత్రువులు నా మీద దాడిచేస్తూ ఉన్నారు;
అహంకారంతో చాలామంది నాతో పోరాడుతున్నారు.
3 నాకు భయం వేసినప్పుడు,+ నేను నీ మీద నమ్మకం పెట్టుకుంటాను.+
4 నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయన వాక్యాన్ని స్తుతిస్తాను;
నేను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను, నేను భయపడను.
మనిషి నన్నేమి చేయగలడు?+
5 రోజంతా వాళ్లు నాకు సమస్యలు సృష్టిస్తున్నారు;
నాకు హాని చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నారు.+
7 వాళ్ల దుష్టత్వాన్ని బట్టి వాళ్లను తిరస్కరించు.
దేవా, నీ కోపంతో దేశాల్ని శిక్షించు.+
8 నేను పారిపోయి ఎక్కడెక్కడ తిరుగుతున్నానో నువ్వు చూస్తున్నావు.+
దయచేసి నా కన్నీళ్లను నీ తోలుసంచిలో ఉంచు.+
అవి నీ పుస్తకంలో రాసివున్నాయి.+
9 సహాయం కోసం నేను మొరపెట్టే రోజున నా శత్రువులు పారిపోతారు.
దేవుడు నా వైపు ఉన్నాడని నేను బలంగా నమ్ముతున్నాను.+
10 నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయన వాక్యాన్ని స్తుతిస్తాను;
నేను యెహోవాను నమ్ముకున్నాను, ఆయన వాక్యాన్ని స్తుతిస్తాను.
11 నేను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను, నేను భయపడను.+
మనిషి నన్నేమి చేయగలడు?+