హోషేయ
1 ఉజ్జియా,+ యోతాము,+ ఆహాజు,+ హిజ్కియా+ యూదాను పరిపాలించిన+ రోజుల్లో, యోవాషు+ కుమారుడైన యరొబాము+ ఇశ్రాయేలును పరిపాలించిన రోజుల్లో బేయేరీ కుమారుడైన హోషేయ* దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం. 2 హోషేయ ద్వారా యెహోవా తన వాక్యాన్ని తెలియజేయడం మొదలుపెట్టినప్పుడు, యెహోవా హోషేయతో ఇలా అన్నాడు: “నువ్వు వెళ్లి ఒక స్త్రీని పెళ్లి చేసుకో, ఆమె ఆ తర్వాత వ్యభిచారం* చేస్తుంది, ఆమె వ్యభిచారం* వల్ల పుట్టిన పిల్లలు నీకు ఉంటారు. ఎందుకంటే, వ్యభిచారం* వల్ల దేశమంతా యెహోవాను అనుసరించడం మానేసి పూర్తిగా పక్కకు మళ్లింది.”+
3 దాంతో హోషేయ వెళ్లి దిబ్లయీము కూతురైన గోమెరును పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యి అతనికి ఒక కుమారుణ్ణి కన్నది.
4 అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నాడు: “ఆ పిల్లవాడికి యెజ్రెయేలు* అని పేరు పెట్టు. ఎందుకంటే యెజ్రెయేలులో సృష్టించిన రక్తపాతాన్ని బట్టి త్వరలోనే నేను యెహూ+ ఇంటివాళ్లను లెక్క అడుగుతాను, ఇశ్రాయేలు ఇంటివాళ్ల రాజరికానికి ముగింపు పలుకుతాను.+ 5 ఆ రోజు యెజ్రెయేలు లోయలో నేను ఇశ్రాయేలు విల్లు విరుస్తాను.”
6 ఆమె మళ్లీ గర్భవతి అయ్యి ఒక కూతుర్ని కన్నది. అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నాడు: “ఆ పాపకు లోరూహామా* అని పేరు పెట్టు. ఎందుకంటే నేను ఇశ్రాయేలు ఇంటివాళ్ల మీద ఇక ఏమాత్రం కరుణ చూపించను,+ నేను ఖచ్చితంగా వాళ్లను వెళ్లగొడతాను.+ 7 అయితే యూదా ఇంటివాళ్ల మీద నేను కరుణ చూపిస్తాను.+ నేను విల్లు ద్వారానో, ఖడ్గం ద్వారానో, యుద్ధం ద్వారానో, గుర్రాల ద్వారానో, గుర్రపురౌతుల ద్వారానో కాదుగానీ వాళ్ల దేవుడైన యెహోవా శక్తితోనే వాళ్లను కాపాడతాను.”+
8 లోరూహామా పాలు విడిచిన తర్వాత గోమెరు మళ్లీ గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. 9 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “ఆ పిల్లవాడికి లో-అమ్మీ* అని పేరు పెట్టు. ఎందుకంటే మీరు నా ప్రజలు కాదు, నేను మీకు దేవునిగా ఉండను.
10 “ఇశ్రాయేలు ప్రజల* సంఖ్య సముద్రపు ఇసుక రేణువులంత ఉంటుంది, దాన్ని ఎవరూ కొలవలేరు, లెక్కపెట్టలేరు.+ ‘మీరు నా ప్రజలు కాదు’+ అని ఎక్కడైతే వాళ్లకు చెప్పబడిందో, అక్కడే వాళ్లు ‘జీవంగల దేవుని కుమారులు’ అని పిలవబడతారు.+ 11 యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చబడి ఐక్యమౌతారు,+ వాళ్లు తమ కోసం ఒక ప్రధానుణ్ణి ఎంచుకుని ఆ దేశం నుండి బయటికి వస్తారు. అది యెజ్రెయేలుకు+ ఘనమైన రోజుగా ఉంటుంది.